dulqur salman
-
ఆలస్యం అవుతున్న మణి సినిమా
వరుస ఫ్లాప్‌ల తరువాత 'ఓకే బంగారం' సినిమాతో మంచి విజయం సాధించిన మణిరత్నం, తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న మణిరత్నం తన నెక్ట్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని భావిస్తున్నాడు. కార్తీ, దుల్కర్ సల్మాన్‌లు హీరోలుగా ఓ సినిమా చేస్తున్నట్టుగా మణిరత్నం ఇప్పటికే ప్రకటించాడు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తన గత సినిమాల మాదిరిగానే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలని భావించాడు. అయితే బిజినెస్ పరంగా తెలుగు హీరోలు నటిస్తే ఇంకా మంచి కలెక్షన్లు సాధిస్తుందని భావించిన యూనిట్. ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. తెలుగు వర్షన్లో నటించే హీరోలు ఇంకా ఫైనల్ కాకపోవటంతో సినిమాను వాయిదా వేశారు. త్వరలోనే తెలుగు నటీనటులనును ఎంపిక చేసి సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండు వర్షన్లలోనూ నిత్యా మీనన్, కీర్తీ సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. -
ఇప్పట్లో ఆ ఆలోచన లేదు
తన కూతురు జాహ్నవి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందంటూ వస్తున్న వార్తలను సీనియర్ నటి శ్రీదేవి ఖండించింది. కొద్ది రోజులుగా జాహ్నవి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో జాహ్నవి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని, ఆ సినిమాను బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ సినిమాల కథా రచయిత విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేయనున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను శ్రీదేవి ఖండించింది. ఇటీవల గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన జాహ్నవి, ప్రస్తుతానికి చదువు మీదే దృష్టిపెట్టిందని ఇప్పట్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని తెలిపింది. ఇప్పటి వరకు తన కూతుళ్ల ఎంట్రీ పై ఆలోచన చేయలేదన్న శ్రీదేవి, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంది. శ్రీదేవి లీడ్ రోల్ లో నటించిన సౌత్ సినిమా పులి అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు.