తన కూతురు జాహ్నవి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందంటూ వస్తున్న వార్తలను సీనియర్ నటి శ్రీదేవి ఖండించింది. కొద్ది రోజులుగా జాహ్నవి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో జాహ్నవి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని, ఆ సినిమాను బాహుబలి, భజరంగీ భాయ్జాన్ సినిమాల కథా రచయిత విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేయనున్నాడంటూ వార్తలు వచ్చాయి.
ఈ వార్తలను శ్రీదేవి ఖండించింది. ఇటీవల గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన జాహ్నవి, ప్రస్తుతానికి చదువు మీదే దృష్టిపెట్టిందని ఇప్పట్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని తెలిపింది. ఇప్పటి వరకు తన కూతుళ్ల ఎంట్రీ పై ఆలోచన చేయలేదన్న శ్రీదేవి, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంది. శ్రీదేవి లీడ్ రోల్ లో నటించిన సౌత్ సినిమా పులి అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు.
ఇప్పట్లో ఆ ఆలోచన లేదు
Published Wed, Sep 23 2015 1:04 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM
Advertisement
Advertisement