jhanvi
-
నాని, ఝాన్వి కలిసి పని చేస్తారా లేక ఇది పుకార్లేనా?!
-
బీటెక్ విద్యార్థినికి ప్రాణం నిలిపిన సీఎం జగన్
కోడుమూరు రూరల్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీటెక్ విద్యార్థిని ప్రాణం నిలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన గుర్రం క్రిష్ణయ్య 108లో డ్రైవర్, ఆయన భార్య నాగలక్ష్మమ్మ అంగన్వాడీ టీచర్. వీరి కుమార్తె జాన్వీకౌసిక్ ఒంగోలులోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాలికి గడ్డ ఏర్పడి.. అది క్రమంగా క్యాన్సర్‌గా మారింది. తల్లిదండ్రులు కర్నూలు, తిరుపతి, విజయవాడలో చూపించగా.. వైద్యులు ఆరు నెలలకు మించి ఆమె బతకదని, హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆశతో అక్కడికి వెళ్లగా రూ.7 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసేందుకు కూడా పరిమితి దాటిందని చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టి చూపించే స్థోమత లేక వెనుదిరిగారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడంతో ఆయన ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతో, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చూశారు. దీంతో విద్యార్థినికి మార్చి నెలలో బసవతారకం ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఆగస్టులో విద్యార్థిని క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోనుండటంతో ఆ తల్లిదండ్రుల సంతోషం అంతా ఇంతా కాదు. ఎన్నో ఆస్పత్రులు తిరిగి పాప ప్రాణం దక్కదని ఆశలు వదులుకున్న దశలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రూపంలో సీఎం జగన్ తమ బిడ్డ ప్రాణాలు కాపాడారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు రుణపడి ఉంటామని చెబుతున్నారు. జగనన్న వల్లే తాను కోలుకుంటున్నానని విద్యార్థిని జాన్వీకౌసిక్ చెప్పింది. -
ఐపీఎల్ వేలంలో అందాల భామ.. ఎవరా బ్యూటీ గర్ల్ ?
రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగావేలం విజయవంతమైంది. కొందరు ఆటగాళ్లు జాక్‌పాట్ దక్కించుకుంటే.. మరికొందరికి నిరాశే మిగిలింది. ఎక్కువ మొత్తం దక్కించుకుంటారనుకున్న ప్లేయర్లకు భంగపాటు ఎదురైంది. అయితే ఈసారి వేలంలో ఆటగాళ్లతో పాటు ఒక 19 ఏళ్ల అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన చురుకుదనంతో చూపు తిప్పుకోకుండా చేసింది. తన చార్మింగ్ లుక్‌తో వేలంలో అందరి దృష్టి తనవైపు ఉండేలా చేసుకుంది. ఎవరా బ్యూటీ గర్ల్ అంటూ టీవీల్లో ఆమెను చూసిన వారంతా ముచ్చటపడ్డారు. కొందరు గుర్తుపట్టారు కూడా. ఆమే.. జాహ్నవి మెహతా. కోల్‌కతా టీం సహా యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా కూతురు. కోల్‌కతా తరఫున షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్, కుమార్తె సుహానాలతో కలిసి వేలంలో పాల్గొన్నారు జూహీ చావ్లా తనయురాలు జాహ్నవి మెహతా. ఆమె ఆకర్షణీయ రూపం... ఆ కళ్లలో మేజిక్ అందరినీ ఆకర్షించింది. రెండేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ వేలంలోనూ ఆమె పార్టిసిపేట్ చేసింది. ఇది సెంకడ్ టైమ్. తల్లి జూహ్లీ చావ్లా తోడు లేకుండానే.. కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో యాక్టివ్‌గా వ్యవహరించడం విశేషం. ఆమె ఛార్మింగ్‌తో కెమెరాలన్నీ అటువైపే ఫోకస్ చేశాయి. జాహ్నవి విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసివచ్చి.. ప్రస్తుతం కేకేఆర్ వ్యవహారాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. -
ఐపీఎల్ వేలంలో ఆ ఇద్దరిపై అందరి దృష్టి!
సాక్షి, బెంగళూరు: దేశంలో అత్యంత సంపన్న లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలంపాట ఇటీవల అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. టాప్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లే కాదు.. వేలంపాటలో పాల్గొన్న సంపన్నుల పిల్లలు కూడా పలువురి దృష్టిని ఆకర్షించారు. ఈ వేలంపాటలో ముంబై ఇండియన్స్ టేబుల్ వద్ద ఆ జట్టు యాజమాని ముఖేశ్ అంబానీ సతీమణి నీతతోపాటు వారి తనయుడు ఆకాశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆటగాళ్ల బిడ్డింగ్‌లో కీలక పాత్ర పోషిస్తూ.. పెడెల్ను రైజ్ చేయడంలో ఆకాశ్ ముందంజలో కనిపించాడు. ఇక, 17 ఏళ్ల ఝాన్వీ కూడా ఆటగాళ్ల వేలంపాటలో అందరి దృష్టి ఆకర్షించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు సహ యాజమానులైన నటి జుహీ చావ్లా, నిర్మాత జయ్ మెహతాల కూతురు ఝాన్వీ. కేకేఆర్ ఫ్రాంచైజీ వ్యూహరచనలోనూ పాలుపంచుకుంటున్న ఝాన్వీ ఆటగాళ్ల బిడ్డింగ్‌లోనూ చురుగ్గా పాల్గొని.. స్పెషల్ ఆట్రాక్షన్‌గా నిలిచింది. సహజంగా రిటైర్డ్ క్రికెట్ దిగ్గజాలు పాల్గొనే ఈ వేలంపాటలో ఈ యంగ్‌స్టర్స్ పాల్గొనడం ఆసక్తి రేకెత్తించింది. -
మదర్ రోల్లో డాటర్!
సీమ... జగదేక సుందరి శ్రీదేవి చేసిన మంచి పాత్రల్లో ఇదొకటి. శ్రీదేవి సినిమాలను ఫాలో అయినవాళ్లకు ‘మిస్టర్ ఇండియా’లో ఆమె చేసిన సీమ పాత్ర గుర్తుండే ఉంటుంది. ఇప్పుడా పాత్రను జాన్వీ... డాటరాఫ్ శ్రీదేవి చేయనున్నారట! ఆశ్చర్యంగా ఉందా? శ్రీదేవి భర్త బోనీకపూర్ ‘మిస్టర్ ఇండియా’ను రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. శ్రీదేవి ‘మామ్’ సినిమాకి దర్శకత్వం వహించిన రవి ఉద్యవర్ ఈ రీమేక్‌ని తెరకెక్కిస్తారట. ఇందులో కథానాయికగా జాన్వీని, గెస్ట్ రోల్లో శ్రీదేవిని అనుకుంటున్నారట. ఈ సినిమా ద్వారానే జాన్వీ హీరోయిన్గా పరిచయమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్. అప్పట్లో సీమ పాత్రను శ్రీదేవి అద్భుతంగా చేశారు. మరి.. ఇదే పాత్రను జాన్వీ చేస్తే? కచ్చితంగా కంపేర్ చేస్తారు. అయినా పులి కడుపున పులే పుడుతుందన్నట్లు... మంచి నటి కడుపున మంచి నటే పుడుతుందనొచ్చు. సో... సీమగా జాన్వీ అలరిస్తారని ఊహించవచ్చు. -
శ్రీదేవి ఒప్పేసుకున్నారా?
శ్రీదేవి, బోనీ కపూర్ దంపతుల పిల్లలు జాన్వి కపూర్, ఖుషీ కపూర్‌కు స్టార్ కిడ్స్‌గా బాలీవుడ్లో చాలామంచి పేరుంది. ఇప్పుడిప్పుడు యుక్తవయస్సుకు వస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ పోస్టుల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. అయితే, ఇటీవల శ్రీదేవి కూతురు జాన్వి వార్తల్లో నిలిచింది. జాన్వి తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరు లిప్ టు లిప్ కిస్ చేసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే మనవడు అయిన శిఖర్‌తో తన కూతురు డేటింగ్ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదని కథనాలు కూడా వచ్చాయి. తాజాగా షారుఖ్ ఖాన్, అలియా భట్ లు నటించిన 'డియర్ జిందగీ' స్క్రీనింగ్ కు శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులతో పాటు జాన్వి, శిఖర్ లు కలిసి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో శ్రీదేవి, బోనీ కపూర్లు జాన్వి, శిఖర్ ల రిలేషన్ షిప్ ను అంగీకరించారనే వార్తలు కూడా వస్తున్నాయి. -
మహేష్‌కు నో చెప్పిన శ్రీదేవి కూతురు
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు వర్థమాన తారలు. సార్కున్న క్రేజ్ అలాంటిది మరి. కానీ మహేష్ సినిమాకు 'నో' చెప్పి అందరినీ ఆశ్చర్యపరచింది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి. తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్.. మహేష్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సినిమా చిత్రీకరణ కూడా మొదలుపెట్టేశారు. అయితే మహేష్ హీరోయిన్ కోసం మురుగదాస్ చాలామంది పేర్లనే పరిశీలించాడు. శ్రీదేవి కూతురు జాన్విని ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ప్రయత్నం కూడా చేశాడట. ఆ ప్రయత్నంలోనే మురగదాస్.. శ్రీదేవి, బోనీ కపూర్ లను సంప్రదించాడు. శ్రీదేవి దంపతులు కూడా మురుగదాస్ ప్రపోజల్‌కి సుముఖత వ్యక్తం చేశారు. అయితే జాన్వివి మాత్రం నో అనేసిందట. తను అప్పుడే సినిమాల్లోకి రావాలని అనుకోవడంలేదని, దానికి ఇంకాస్త ప్రిపరేషన్ కావాలని చెప్పిందట. తను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని, డ్యాన్స్‌లో మెళకువలు నేర్చుకునే పనిలో ఉన్నానని సెలవిచ్చిందట. ప్రస్తుతం జాన్వి లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతోంది. పూర్తిగా శిక్షణ తీసుకున్న తరువాతే తెరంగేట్రం చేయాలనేది అమ్మడి ఆలోచన.. అది కూడా బాలీవుడ్ సినిమా ద్వారానే తొలిసారి తెర మీద కనిపించాలనేది జాన్వి కోరిక. దాంతో చేసేదేమీలేక మురుగదాస్ వెనక్కి రావాల్సి వచ్చింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగుంటే ఈ వారం మహేష్‌తో కలిసి జాన్వి షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం రకుల్ అదే పనిలో బిజీగా ఉంది. -
ఇప్పట్లో ఆ ఆలోచన లేదు
తన కూతురు జాహ్నవి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందంటూ వస్తున్న వార్తలను సీనియర్ నటి శ్రీదేవి ఖండించింది. కొద్ది రోజులుగా జాహ్నవి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో జాహ్నవి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని, ఆ సినిమాను బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ సినిమాల కథా రచయిత విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేయనున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను శ్రీదేవి ఖండించింది. ఇటీవల గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన జాహ్నవి, ప్రస్తుతానికి చదువు మీదే దృష్టిపెట్టిందని ఇప్పట్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని తెలిపింది. ఇప్పటి వరకు తన కూతుళ్ల ఎంట్రీ పై ఆలోచన చేయలేదన్న శ్రీదేవి, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంది. శ్రీదేవి లీడ్ రోల్ లో నటించిన సౌత్ సినిమా పులి అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు. -
మమ్ముట్టి కొడుకుతో శ్రీదేవి కూతురు
మమ్ముట్టి కొడుకు శ్రీదేవి కూతురు ఇదేదో సినిమా టైటిల్‌గా బాగుండేటట్లుంది కదూ... అయితే ఇది సినిమా పేరు కాదు. ఒక క్రేజీ చిత్రం కోసం సూపర్స్టార్ల వారసులు హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారన్న తాజా వార్త. అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు తెరంగేట్రం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వారసుడు అఖిల్ తొలి చిత్రంలో శ్రీదేవి వారసురాలు జాన్వీని నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. కారణాలేమైనా ఆ చిత్రంతో జాన్వీ రంగ ప్రవేశం జరగలేదు. అంతకు ముందు తమిళంలో విజయకాంత్ కొడుకు షణ్ముగపాండియన్‌కు జోడీగా పరిచయం కానున్నట్లు ప్రచారం జరిగింది. అదీ వార్తలకే పరిమితం అయ్యింది. అలాంటిది కథానాయికగా జాన్వీ ప్రవేశానికి ఇప్పుడు రంగం సిద్ధం అయ్యిందన్నది తాజా సమాచారం. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్‌కు జంటగా జాన్వీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే మలయాళంలో సక్సెస్ఫుల్ హీరోగా వెలుగొందుతున్నారు. ఓ కాదల్‌కణ్మణి చిత్రంతో తమిళంలోనూ దాని అనువాదంగా రూపొందిన ఓకే బంగారం చిత్రంతో తెలుగులోనూ పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రేజీ జంటతో ఒక బ్రహ్మాండమైన చిత్రం చెయ్యడానికి ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. ఈయన ఇటీవల అద్భుతాలు సృష్టించిన బాహుబలి చిత్ర కథకుడు. ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తండ్రి అన్న విషయం గమనార్హం. విజయేంద్రప్రసాద్ నటి శ్రీదేవితో చర్చించి ఆమెకు కథను వినిపించినట్లు, కథ నచ్చడంతో ఆమె తన కూతుర్ని అందులో నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మొదలగు నాలుగు భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
సంతానం లేనివారి పనేనా?
న్యూఢిల్లీ: సంతానం లేని జంటే చిన్నారి జాహ్నవి అపహరణకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై అదనపు పోలీస్ కమిషనర్ ఎస్.బి.త్యాగి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘సంతానం లేని ఏదో జంట అపహరణకు పాల్పడి ఉండొచ్చు. పాపను ఎవరూ గుర్తించకుండా చేసేందుకుగాను వెంట్రుకలను కత్తిరించారు. అయినప్పటికీ పాపను ఎంతో బాగా చూసుకున్నారు. అయితే పాప గల్లంతుపై వార్తలు మీడియాలో పుంఖానుపుంఖాలుగా రావడంతో వారు భయపడిపోయి ఉంటారు. ఈ కారణంగానే వదిలేసి పోయారు’అని అన్నారు. జాహ్నవిని అపహరించినప్పటికీ నిందితులు డబ్బు కోసం ఎందుకు బెదిరించలేదనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలోకూడా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తనను అపహరించి తీసుకుపోయినవారు అమ్మా... నాన్నా.. అని పిలవాలంటూ బలవంతం చేశారని జాహ్నవి పోలీసులకు చె ప్పినప్పటికీ అంతకుమించి ఎటువంటి వివరాలూ తెలియజేయలేదు. ఇదిలాఉంచితే తమ చిన్నారి తిరిగి తమ గూటికి రావడానికి సహకరించినసామాజిక మీడియాకు జాహ్నవి కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఫేస్బుక్, వాట్సప్‌లలో పెయిడ్ క్యాంపయిన్లను చేపడదామని అనుకున్నాం. అలా చేస్తే పాప తప్పిపోయిందనే విషయం అనేకమంది దృష్టికి వస్తుందనేది మా భావన’అని జాహ్నవి మేనమామ తరుణ్ గ్రోవర్ మీడియాకు తెలియజేశారు. తామంతా పది బృందాలుగా ఏర్పడ్డామని, పనిని విభజించుకున్నామని చెప్పారు. వృత్తిపరంగా పెట్టుబడిదారుడైన తరుణ్... సామాజిక మీడియాకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించారు. కాగా అటు పోలీసు శాఖ అధికారులతోపాటు కుటుంబసభ్యులను తీవ్ర గందరగోళానికి గురిచేసిన చిన్నారి జాహ్నవి ఆహుజా ఆదివారం సామంత్రం రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న సంగతి విదితమే. జాతీయ రాజధాని నడిబొడ్డునగల ఇండియా గేట్ వద్ద జాహ్నవి వారం క్రితం తప్పిపోయిన సంగతి విదితమే. జాహ్నవిని వెంటబెట్టుకుని ఆదివారం సాయంత్రం సరదాగా కుటుంబసభ్యులంతా ఇండియాగేట్ వద్దకు వచ్చారు. అయితే రాత్రి తొమ్మిది గంటల సమయంలో జాహ్నవి కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు తిలక్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అనంతరం నగర పోలీసు విభాగం సిబ్బందితోపాటు క్రైంబ్రాంచ్, స్పెషల్ సెల్‌కుచెందిన బృందాలు జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపట్టిన సంగతి విదితమే. ఇండియాగేట్ వద్ద తప్పిపోయిన మూడేళ్ల పసిపాప జాహ్నవి ఆచూకీ కనుగొన్నవారికి రూ. 50 వేల నగదు బహుమతిని అందజేస్తామంటూ నగర పోలీస్ కమిషనర్ భీంసేన్ బసి ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కాగా ఆదివారం సాయంత్రం జాహ్నవి నగరంలోని మాయాపురి పోలీస్‌స్టేషన్ సమీపంలో ధీరేందర్ అనే ఓ కళాశాల విద్యార్థి కంటపడింది. ఆ సమయంలో పాప మెడలో ఆమె పేరుతోపాటు ఓ ఫోన్ నంబర్ ఉండడాన్ని గమనించిన ఆ విద్యార్థి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు జాహ్నవిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. ఇదిలాఉంచితే జాహ్నవిని అపహరించిన వ్యక్తులు ఇప్పటి కీ పరారీలోనే ఉన్నారు. వారి ఆచూకీ ఇప్పటికీ దొరలేదు. అపహరణ అనంతర పరిణామాల క్రమాన్ని గుర్తించేందుకు యత్నిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. తనను కొంతమంది తీసుకుపోయారని, వారిలో ఓ మహిళ కూడా ఉందని జాహ్నవి తమకు తెలిపిందన్నారు. అయితే వయసులో బాగా చిన్నదైనందువల్ల జాహ్నవి వారిని గుర్తించలేకపోవచ్చన్నారు. -
లక్ష వాట్సప్ మెసేజిలు.. ఓ పాప ఆచూకీ
ఝాన్వి.. ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యింది. ఆమె ఫొటో కూడా విస్తృతంగా షేర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో సెలబ్రిటీ అనుకుంటున్నారా.. కాదు. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద తన అమ్మానాన్నలతో కలిసి వెళ్లి.. సెప్టెంబర్ 28వ తేదీన తప్పిపోయిన మూడేళ్ల పాప. ఆమె ఆచూకీని తెలుసుకోడానికి ఉపయోగపడిన ఏకైక సాధనం.. సోషల్ మీడియా. చిన్నారి ఝాన్వి ఫొటోను పంపి.. ఈమె ఎక్కడైనా కనపడితే ఫలానా నెంబరుకు ఫోన్ చేయించాలన్న మెసేజి వాట్సప్‌లో లక్ష సార్లు షేర్ అయ్యింది. ఫేస్బుక్లో ఆమె ఆచూకీ కనుక్కొనేందుకు ఒక ప్రత్యేక పేజీ ప్రారంభించారు. దాంతో దాదాపు వారం రోజుల తర్వాత అక్టోబర్ 5వ తేదీన ఆమె ఢిల్లీలోని జనక్‌పురి ప్రాంతంలో కనిపించింది. అప్పటికి ఆమెకు గుండు చేసి, మెడలో ఆమె పేరుతో ఒక ప్లకార్డు వేలాడుతూ ఉంది. ఝాన్వి మేనమామ తరుణ్ గ్రోవర్ ఈ వెతుకులాట గురించి వివరించారు. తాము మొత్తం పది మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లం ఉన్నామని, అంతా బృందాలుగా విడిపోయి వెతికామని అన్నారు. హోం మంత్రి దగ్గర నుంచి అందరినీ కలిశామని, పోలీసులతో కూడా సమన్వయం చేసుకున్నామని తెలిపారు. చివరకు సోషల్ మీడియాను ఆశ్రయించామన్నారు. అయితే ఎవరికి వాళ్లు షేర్ చేయాలంటే కష్టం కాబట్టి ఫేస్బుక్, వాట్సప్‌లకు తాము డబ్బు చెల్లించి ప్రకటనలా ఈ మెసేజి పంపామని, వాట్సప్‌లో అయితే లక్ష మెసెజిలు వెళ్లాయని ఆయన వివరించారు. అయితే మరీ ఇంతలా ప్రచారం చేస్తే పాపకు ఏదైనా అపాయం తలపెట్టే అవకాశం ఉందని కూడా పోలీసులు ఓ సమయంలో భయపడ్డారు. అయితే, ఝాన్విని ఎత్తుకెళ్లినవాళ్లు డబ్బు మాత్రం డిమాండు చేయలేదు. బహుశా పిల్లలు లేనివాళ్లు తీసుకెళ్లి ఉంటారని, ఆమెను గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేశారేమోనని పోలీసులు భావిస్తున్నారు. అయితే అన్ని మీడియాల్లో పాప ఫొటో బాగా ప్రచారం కావడంతో భయపడి వదిలేసి ఉంటారని అదనపు కమిషనర్ త్యాగి చెప్పారు. -
ఆచూకీ లభించిన జహ్నవి
-
శిఖరంపై చిన్నారి
పన్నెండేళ్ల ప్రాయుంలో... 20,080 అడుగుల ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించి అబ్బురపరచింది హైదరాబాద్ చిన్నారి జాహ్నవి. లడఖ్‌లోని స్టాక్‌ఖంద్రి శిఖరంపైకి ఎక్కి రికార్డు సృష్టించింది. అల్వాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో జాహ్నవి తండ్రి డాక్టర్ కృష్ణారావు వివరాలు వెల్లడించారు. ‘లడఖ్‌లో ఈ నెల 13న జాహ్నవి ట్రెక్కింగ్ ప్రారంభించింది. 14 అర్ధరాత్రి స్టాక్‌ఖంద్రి శిఖరాన్ని అధిరోహించింది. 20,080 అడుగుల ఎత్తులో ఉంటుందా శిఖరం. అక్కడ జాతీయు పతాకాన్ని ఎగురవేసింది. ఇప్పటి వరకు జాహ్నవి 5 జాతీయు, 25 స్థానిక శిఖరాలను అధిరోహించింది. ప్రపంచంలోని ఏడు ఎత్తరుున శిఖరాలపై తన వుుద్ర వేయూలనేది ఆమె లక్ష్యం. త్వరలో దక్షిణాఫ్రికాలోని కిలువుంజారో అధిరోహించేందుకు సన్నద్ధవువుతోంది’ అని కృష్ణారావు చెప్పారు. వూనసిక వైద్యుడైన కృష్ణారావుకు కూడా ట్రెక్కింగ్‌లో అనుభవం ఉంది. దీంతో చిన్ననాటి నుంచే జాహ్నవికి ఇందులో శిక్షణ ఇచ్చారు. అల్వాల్‌లో నివాసవుుండే జాహ్నవి ప్రస్తుతం సెరుుంట్ మైకేల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. -
ఎవరెస్టు అధిరోహించనున్న విశాఖ బాలిక
విశాఖపట్నం: పిన్న వయసులోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికి సంకల్పించింది విశాఖపట్నానికి చెందిన 12 ఏళ్ల జాహ్నవి. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని (8,848 మీటర్లు) అధిరోహించడంతో పాటు మిగతా ఆరు శిఖరాలనూ ఎక్కేందుకు సాధన చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 2న హిమాచల్‌ప్రదేశ్ లడఖ్ ప్రాంతంలోని లే మౌంటైన్ (20,080 అడుగులు) ఎక్కడంతో పాటు ప్రపంచంలో ఏడు శిఖరాలపైనా పాదం మోపేందుకు అక్కడ 15 రోజులు శిక్షణ పొందనుంది. అనంతరం ప్రపంచంలో ఎత్తయిన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారో (5,895 మీటర్లు) సెప్టెంబర్‌లో తొలిసారిగా అధిరోహించనుంది. తరువాత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించనుంది. ఈ వివరాలను ఆమె తండ్రి డాక్టర్ కృష్ణారావు సోమవారం విశాఖపట్నంలో విలేకరులకు చెప్పారు. -
తెరపైకి శ్రీదేవి కూతురు!
హీరోయిన్ల కుమార్తెలు హీరోయిన్లు అవడంలో ఆశ్చర్యమేమీలేదు. ఇటీవల ఈ సంఖ్య అధికమవుతోంది. అయితే తన కుమార్తెలను సినిమా వాతావరణానికి దూరంగా పెంచుతున్నానని శ్రీదేవి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం ఆమె తన పెద్ద కూతురు జాహ్నవిని హీరోయిన్గా తెరంగేట్రం చేయించనున్నట్లు తెలిసింది. రెండేళ్ల క్రితమే జాహ్నవిని హీరోయిన్గా నటింపజేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అప్పుడు తన పిల్లలు చదువుకుంటున్నారని, వారికి నటించాలనే ఆలోచన లేదని శ్రీదేవి పేర్కొన్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన ఒక సినిమా కార్యక్రమానికి శ్రీదేవి తన కూతురు జాహ్నవితో కలసి హాజరయ్యారు. అక్కడ అందరి దృష్టి జాహ్నవి మీదే పడింది. ఆమెకు హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఈ క్రమంలో జాహ్నవి సినీ రంగ ప్రవేశానికి శ్రీదేవి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. పలువురు దర్శకుల వద్ద శ్రీదేవి కథలు వింటున్నట్లు సమాచారం.