![Sridevi and daughter Jhanvi Kapoor to star together in Mr India remake? - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/2/mister-india.jpg.webp?itok=NWs_rH6_)
సీమ... జగదేక సుందరి శ్రీదేవి చేసిన మంచి పాత్రల్లో ఇదొకటి. శ్రీదేవి సినిమాలను ఫాలో అయినవాళ్లకు ‘మిస్టర్ ఇండియా’లో ఆమె చేసిన సీమ పాత్ర గుర్తుండే ఉంటుంది. ఇప్పుడా పాత్రను జాన్వీ... డాటరాఫ్ శ్రీదేవి చేయనున్నారట! ఆశ్చర్యంగా ఉందా? శ్రీదేవి భర్త బోనీకపూర్ ‘మిస్టర్ ఇండియా’ను రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. శ్రీదేవి ‘మామ్’ సినిమాకి దర్శకత్వం వహించిన రవి ఉద్యవర్ ఈ రీమేక్‌ని తెరకెక్కిస్తారట.
ఇందులో కథానాయికగా జాన్వీని, గెస్ట్ రోల్‌లో శ్రీదేవిని అనుకుంటున్నారట. ఈ సినిమా ద్వారానే జాన్వీ హీరోయిన్‌గా పరిచయమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్. అప్పట్లో సీమ పాత్రను శ్రీదేవి అద్భుతంగా చేశారు. మరి.. ఇదే పాత్రను జాన్వీ చేస్తే? కచ్చితంగా కంపేర్ చేస్తారు. అయినా పులి కడుపున పులే పుడుతుందన్నట్లు... మంచి నటి కడుపున మంచి నటే పుడుతుందనొచ్చు. సో... సీమగా జాన్వీ అలరిస్తారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment