కష్టాలు ఎదుర్కోడానికి రెడీ | Dhadak has a different charm, says Janhvi Kapoor | Sakshi
Sakshi News home page

కష్టాలు ఎదుర్కోడానికి రెడీ

Published Mon, Jul 9 2018 12:30 AM | Last Updated on Mon, Jul 9 2018 12:30 AM

Dhadak has a different charm, says Janhvi Kapoor - Sakshi

జాన్వీ కపూర్‌

కెరీర్‌లో తొలి సినిమా రిలీజ్‌కు టైమ్‌ దగ్గర పడుతోంది. రిలీజ్‌ దగ్గర పడుతున్న కొద్దీ ఏ కొత్త యాక్టర్‌కైనా కాస్త టెన్షన్‌ పెరుగుతుంటుంది. ప్రజెంట్‌ ఆ ఒత్తిడినే ఫీల్‌ అవుతున్నారట శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌. శశాంక్‌ కేతన్‌ దర్శకత్వంలో ఇషాన్‌ కట్టర్, జాన్వీ కపూర్‌ జంటగా ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మించిన ‘ధడక్‌’ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. మరాఠీ చిత్రం ‘సైరాట్‌’కు రీమేక్‌ ఇది. ఈ సందర్భంగా ‘మీరు యాక్టర్‌ అవుతా అన్నప్పుడు మీ ఇంట్లో ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది? అన్న ప్రశ్నను జాన్వీ ముందు ఉంచితే...‘‘అమ్మానాన్నలు (శ్రీదేవి, బోనీకపూర్‌) నన్ను చాలా ప్రొటెక్టివ్‌గా పెంచారు.

ఒక సందర్భంలో నేను నటిని కావాలనుకుంటున్న నిర్ణయాన్ని అమ్మకు చెప్పాను. నా నిర్ణయాన్ని మళ్లీ ఆలోచించుకోమన్నారు. అలాగే యాక్టింగ్‌ అంటే గ్లామరస్‌గా కనిపించడమో, లేక ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదవడమో కాదని కూడా పరోక్షంగా హెచ్చరించారు. కానీ ఆ తర్వాత సినిమాపై నాకు ఉన్న కమిట్‌మెంట్, యాక్టింగ్‌పై నా ప్యాషన్, కాన్ఫిడెన్స్‌ చూసి ఓకే అన్నారు’’ అని పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ –‘‘అమ్మ ఎంతో కష్టపడి మాకు ఈజీ లైఫ్‌ను అందిచాలనుకున్నారు. కానీ సినిమా లైఫ్‌లో అమ్మ ఫేస్‌ చేసిన గుడ్‌ అండ్‌ బ్యాడ్‌ ఎక్స్‌పీరియ్స్‌తో పాటు ఆ స్ట్రగుల్స్‌ను కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement