శ్రీదేవి పాత్రలో విద్యాబాలన్ | Sridevi in the role of Vidya | Sakshi
Sakshi News home page

శ్రీదేవి పాత్రలో విద్యాబాలన్

Published Fri, Feb 19 2016 10:15 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

శ్రీదేవి పాత్రలో  విద్యాబాలన్

శ్రీదేవి పాత్రలో విద్యాబాలన్

తెలుగులో ‘వసంత కోకిల’, తమిళంలో ‘మూండ్రమ్ పిరై’, హిందీలో ‘సద్మా’... పేర్లు ఏవైనా కథానాయిక శ్రీదేవి కెరీర్‌ను ఓ పీక్ స్టేజ్‌లోకి తీసుకెళ్లిన చిత్రాలివి. కమల్‌హాసన్, శ్రీదేవి జంటగా 1982లో తెలుగు, తమిళ భాషల్లో విజయదుందుభి మోగించిన ఈ చిత్రం తర్వాత హిందీలో రీమేక్ అయి, అక్కడా మంచి సక్సెస్‌ను నమోదు చేసుకుంది. మానసిక స్థితి సరిగ్గా లేని అమ్మాయిగా శ్రీదేవి పాత్రను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు బాలూ మహేంద్ర. ఇప్పటికీ ఈ తరహా పాత్రలంటే కొంతమంది తారలు శ్రీదేవి నటనను స్ఫూర్తిగా తీసుకుంటారు.

ఈ చిత్రం విడుదలై 33 ఏళ్లకు పైగా అవుతున్న తరుణంలో దీన్ని రీమేక్ చేయడానికి యాడ్ ఫిలిం మేకర్ లోయడ్ బాప్తిస్తా సన్నాహాలు చేస్తున్నారు. శ్రీదేవి పాత్రలో విద్యాబాలన్‌ను తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ రీమేక్ గురించి విద్యాబాలన్‌తో చర్చలు జరిపారు లోయడ్. కానీ ఆ సినిమాలో శ్రీదేవి కనబర్చిన స్థాయిలో తాను నటించగలుగుతానా? అనే ఆలోచనలో విద్యాబాలన్ పడ్డారట. ఈ విషయం గురించి తన సన్నిహితుల సలహా అడుగుతున్నారట. చివరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదో చూడాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement