
హన్సల్ మెహతా.. శ్రీదేవి (ఫైల్ ఫోటోలు)
సాక్షి, సినిమా : తన కెరీర్‌లో లెజెండరీ తార శ్రీదేవితో సినిమా తీయలేకపోయానని బాలీవుడ్ సీనియర్ దర్శక-నిర్మాత హన్సల్ మెహతా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బయోపిక్ తీసేందుకు ఆయన సిద్ధమైపోయారు.
‘శ్రీదేవి హఠాన్మరణం నన్ను ఎంతగానో బాధించింది. ఆమెతో సినిమా తీయాలని ఎంతగానో ప్రయత్నించా. కానీ, నా కోరిక తీరలేదు. అందుకే ఆమె బయోపిక్ అయినా తీయాలని నిర్ణయించుకున్నా. ఈ చిత్రం కోసం నటి విద్యాబాలన్‌ను సంప్రదిస్తున్నా’ అని అని మీడియాకు తెలిపారు.
ఇక ఇండస్ట్రీలో మరో శ్రీదేవి అన్నది ఊహించుకోవటమే కష్టమంటూ ట్వీట్ చేసిన ఆయన.. బయోపిక్ ద్వారా ఆమె జీవితంలో తెలియని కొత్త కోణాలు చూపించే యత్నం చేస్తానని హన్సల్ చెప్పుకొచ్చారు. కాగా, హన్సల్ మెహతా.. ఖానా-ఖజానా, దూరియాన్, దస్ కహానియాన్, సిటీలైట్స్, అలీఘడ్ లాంటి చిత్రాలతోపాటు ఈ మధ్యే బోస్ : డెడ్/ఎలైవ్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment