Hansal Mehta
-
వందేళ్ల వయసులో కన్నుమూసిన హీరోయిన్.. అద్దె ఇంట్లో ఉంటూ!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ సీనియర్ నటి, స్మృతి బిస్వాస్ కన్నుమూశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వందో పుట్టినరోజు జరుపుకున్న బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత హన్సల్ మెహతా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. స్మృతి బిస్వాస్ మహారాష్ట్రలోని నాసిక్‌లోని తన నివాసంలో మరణించారు. ప్రస్తుతం ఆమె నాసిక్ రోడ్ ప్రాంతంలో ఒక గదిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది.కాగా.. స్వాతంత్య్రానికి ముందే సినిమాల్లోకి వచ్చిన ఆమె హిందీ, మరాఠీ, బెంగాలీ చిత్రాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన స్మృతి బిస్వాస్.. గురుదత్, వి శాంతారామ్, మృణాల్ సేన్, బిమల్ రాయ్, బీఆర్ చోప్రా, రాజ్ కపూర్ లాంటి నిర్మాతలతో సినిమాలు చేసింది. అంతే కాకుండా స్మృతి దేవ్ ఆనంద్, కిషోర్ కుమార్, బాల్ రాజ్ సాహ్ని లాంటి అగ్ర నటుల సరసన నటించింది.కాగా.. స్మృతి బిస్వాస్ మొదట బెంగాలీ చిత్రం సంధ్య (1930)తో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. చివరిసారిగా మోడల్ గర్ల్ (1960) చిత్రంలో కనిపించిన నటి.. బాప్ రే బాప్, చాందినీ చౌక్, ఢిల్లీకా థగ్, జాగ్తే రహో, సైలాబ్, అబే హయాత్ లాంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినీ నిర్మాత ఎస్డి నారంగ్‌ని పెళ్లి చేసుకున్న ఆమె.. అనంతరం నటనకు స్వస్తి చెప్పింది. భర్త చనిపోవడంతో నాసిక్‌కు వెళ్లిపోయిన స్మృతి బిస్వాస్‌కు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. View this post on Instagram A post shared by Hansal Mehta (@hansalmehta) -
ఈ వీడియోలో ఉన్న చెత్త ఎవరు?.. బాలకృష్ణపై స్టార్ డైరెక్టర్ ఫైర్!
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణపై విమర్శలు ఆగడం లేదు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ అంజలిని పక్కకు నెట్టడంతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తోటి మహిళా నటి పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా ఈ వీడియో చూసిన బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా.. అసలు ఆయన ఎవరంటూ కామెంట్స్ చేశారు. ఎవరీ చెత్త అంటూ ఆ వీడియోను చూసి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా..హన్సల్ మెహతా ప్రస్తుతం కరీనా కపూర్ ప్రధాన పాత్రలో ది బకింగ్‌హామ్ మర్డర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. అంతే కాకుండా ప్రతిక్ గాంధీ లీడ్ రోల్లో దేద్ బిఘా జమీన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మే 31 న విడుదల కానుంది. ఇటీవలే స్కామ్ 2010: ది సుబ్రతా రాయ్ చిత్రం కూడా ప్రకటించారు. ఇది తమల్ బందోపాధ్యాయ రచించిన సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ అనే పుస్తకం ఆధారంగా రూపొందించనున్నారు. Who is this scumbag? https://t.co/KUVZjMZY2M— Hansal Mehta (@mehtahansal) May 29, 2024 -
ఆ నటుడు పిచ్చోడిలా ప్రవర్తించాడు.. అందరూ పారిపోయారు!
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ సెట్స్‌లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించేవాడంటున్నాడు ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా. 'దిల్ పే మత్ లె యార్' సినిమా సెట్స్‌లో మనోజ్‌ను చూసి ఇతరులు భయపడేవారని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ.. 'దిల్ పే మత్ లె యార్ సినిమా 2000వ సంవత్సరంలో రిలీజైంది. ఆ సినిమా షూటింగ్లో మనోజ్ చాలా వింతగా ప్రవర్తించేవాడు. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. తనకు చాలా మూడ్ స్వింగ్స్ ఉండేవి. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలిసేది కాదు. చెప్పాలంటే ఆ సమయంలో అతడు మాకు తలనొప్పిలా మారాడు. అలా అని చెడ్డవాడు కాదు! అలా అని అతడు చెడ్డవాడు కూడా కాదు. మంచివాడు. కానీ ఊరికే చికాకు తెప్పించేవాడు. ఒకసారి నాకు కోపమొచ్చి ఎందుకిలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నావని అడిగేశా. అప్పుడు అతడు ఏం సమాధానమివ్వకుండా తన పాత్ర డైలాగ్స్‌కు సంబంధించి పేపర్ తీసుకుని ప్రిపేర్ అయ్యాడు. అతడు చేయాల్సిన రోల్ ఇలా ఇరిటేటింగ్‌గా ఉండాలని ఎవరు చెప్పకపోయినా అలాగే ప్రవర్తించేవాడు. అందరి మీదా అరిచేవాడు. చాలామంది అతడికి దూరంగా పారిపోయేవాళ్లు. కిల్లర్ సూప్‌లో మనోజ్ సౌరభ్ శుక్లా అయితే.. నేను తనతో మాట్లాడటానికి ప్రయత్నించా.. నిజంగా పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు.. అసలేం జరుగుతోంది అని జుట్టు పీక్కునేవాడు. అలా మనోజ్ సెట్స్‌లో అందరినీ ఆగం చేశాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్, సౌరభ్ శుక్ల 'సత్య' సినిమాలో కలిసి పని చేశారు. అలాగే డైరెక్టర్ హన్సల్తో కలిసి అలీఘర్ సినిమాకు పని చేశాడు. ఇకపోతే మనోజ్ ప్రస్తుతం కిల్లర్ సూప్ అనే కామెడీ సిరీస్‌లో నటించాడు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 11న రిలీజ్ కానుంది. అలాగే హన్సల్ మెహతా తెరకెక్కించిన ద బకింగ్‌హామ్ మర్డర్స్ విడుదలకు రెడీ అవుతోంది. చదవండి: అమ్మ జీవితంలో చాలా మిస్సయింది.. రెండో పెళ్లి.. మేము ఏమంటామోనని.. -
'స్కామ్-2003' పార్ట్-2 వచ్చేస్తోంది.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
2003లో సంచలనం సృష్టించిన స్టాంప్ పేపర్ కుంభకోణం ఆధారంగా తుషార్ హీరానందని తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ'. హిట్ సిరీస్ ‘స్కామ్ 1992’ని తెరకెక్కించిన హన్సల్ మెహతా నిర్మించారు. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ జీవితం ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. గతనెలలో ఓటీటీలో రిలీజైన పార్ట్-1 హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న 29 సినిమాలు) ఈ నేపథ్యంలో పార్ట్-2 ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పార్ట్-2 రిలీజ్‌పై సోనీలివ్ ట్వీట్ చేసింది. స్కామ్ 2003 పార్ట్-2 నవంబరు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలిపింది. తొలిభాగంలో ఈ సిరీస్‌ను ఐదు ఎపిసోడ్స్‌లో చూపించారు. రెండో భాగంలో కూడా దాదాపు ఐదు ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. Sabki zubaan pe tha Telgi ka naam, par Telgi ki zubaan pe kiska? Find out on 3rd November! Scam 2003-The Telgi Story, all episodes, streaming on 3rd November, only on Sony LIV #Scam2003OnSonyLIV #Scam2003 Thanking @BajpayeeManoj for lending his incredible voice ✨ pic.twitter.com/wLz04HZLcW — Sony LIV (@SonyLIV) October 18, 2023 -
'డైరెక్టర్ గారూ.. ఫెదరర్‌కు, బాలీవుడ్ నటుడికి తేడా తెలియదా?'
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో జరగనున్న లెవర్ కప్ టోర్నీ ఫెదరర్‌కు ఆఖరిది కానుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత ఫెదరర్ పూర్తిగా ఆటకు దూరమవ్వనున్నాడు. ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించిన వేళ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అతనిపై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫెడ్డీ ఫోటోలు తప్ప ఇంకేం కనిపించలేదు. ఫెదరర్ రిటైర్మెంట్పై స్పందించిన బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా కన్ఫూజ్ అయ్యాడు. ఫెదరర్‌కు విషెస్ చెబుతూ అతనికి బదులు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు.. నటుడు అర్బాజ్ ఖాన్ ఫోటో షేర్ చేశాడు. ''వి మిస్ యూ ఫెదరర్.. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే హన్సల్ మెహతా కన్ఫూజ్ కావడానికి ఒక కారణం ఉంది. దూరం నుంచి చూస్తే ఫెదరర్, అర్బాజ్ ఖాన్లు ఒకేలా కనిపిస్తారు. దాదాపు ఇద్దరి ముఖాలు ఒకేలా కనిపిస్తాయి. అందుకే హన్సల్ మెహతా కన్ఫూజ్ అయినట్లు తెలుస్తోంది. ఇక హన్సల్ మెహతా ట్వీట్‌పై అభిమానులు వినూత్న కామెంట్స్ చేశారు. ''నాకు తెలిసి ఫెదరర్ గురించి ఇదే బెస్ట్ ట్వీట్.. ఫెదరర్‌కు, అర్బాజ్ ఖాన్‌కు తేడా తెలియడం లేదా.. '' అంటూ పేర్కొన్నారు. దర్శకుడు హన్స్ల్ మెహతా గురించి పరిచయం అక్కర్లేదు. స్కామ్ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసింది ఈయనే. ఈ వెబ్ సిరీస్‌లో హర్షద్ మెహతా జీవిత చరిత్ర, షేర్ మార్కెట్లో లొసుగలు, మ్యాజిక్, జిమ్మిక్కులను హన్సల్ మెహతా తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. Going to miss you champion. #RogerFederer. pic.twitter.com/ZNmQaNROaD — Hansal Mehta (@mehtahansal) September 16, 2022 చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ' -
‘ధూమ్ 2’ నటుడు మృతి.. హన్సల్ మెహతా ఎమోషనల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు, వెలరన్ యాక్టర్ యూసుఫ్ హుస్సేన్ అక్టోబర్ 30న మృతి చెందాడు. 73 ఏళ్ల వయస్సులో కరోనా కారణంగా లీలావతి హాస్పిటల్లో కన్నుమూశాడు. ఆయన ‘ధూమ్ 2’, ‘రాయిస్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. ఈ నటుడికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళి తెలిపారు. యూసుఫ్ అల్లుడు ‘స్కామ్ 1992’ ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా ట్వీట్ చేసి నివాళి అర్పించాడు. ఆయన నాకు మామ కాదు నాన్నలాంటి వాడని ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా ‘ధూమ్ 2’ మూవీలో ఆయనతో నటించిన అభిషేక్ బచ్చన్, ‘ఫ్యామీలీ మ్యాన్’ స్టార్ మనోజ్ బాజ్‌పాయ్, నటి పూజా భట్ సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ మృతి, సినీ ప్రముఖుల నివాళి RIP Yusuf Husain. pic.twitter.com/laP0b1U732 — Hansal Mehta (@mehtahansal) October 29, 2021 #RIP Yusuf ji. We worked together in several films starting with Kuch na kaho and lastly on Bob Biswas. He was gentle, kind and full of warmth. Condolences to his family. 🙏🏽 pic.twitter.com/6TwVnU0K8y — Abhishek Bachchan (@juniorbachchan) October 30, 2021 Sad News!!! Condolences to @safeenahusain @mehtahansal & the entire family!!! Rest in peace Yusuf saab🙏 https://t.co/q7CFbbEo95 — manoj bajpayee (@BajpayeeManoj) October 30, 2021 This brought tears to my eyes Hansal. Can’t begin to imagine what you’ll are feeling. My deepest condolences to all! 🙏 — Pooja Bhatt (@PoojaB1972) October 30, 2021 -
నిర్మాతగా మారిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఓ వైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు 'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కరీనా..'హన్సల్ మెహతా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు. ఏక్తా కపూర్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. యూకేలో షూటింగ్ జరగనున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం కరీనా అమిర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. -
మా ఇంట్లో ఆరుగురికి కరోనా: నటుడు
‘దిల్ పే మత్ లే యార్’, ‘సిటీలైట్స్’, ‘సిమ్రాన్’ చిత్రాలతో పాటు ఇటీవల ‘స్కామ్ 1992’ (వెబ్ సిరీస్) కూడా తీసిన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా కరోనా బారిన పడ్డారు. ‘‘నాతో పాటు మా ఇంట్లో ఆరుగురికి కరోనా సోకింది. కరోనా సోకిన తర్వాత నా కుమారుడి పరిస్థితి ఓ సందర్భంలో కలవరపెట్టింది. మా ఆరోగ్యాలు కూడా బాగోలేకపోవడంతో మా కుమారుడి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడంలో మేం నిస్సహాయులుగా ఉండిపోవాల్సి వచ్చింది' 'కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. మేం కోలుకునే స్థితిలోకి వచ్చాం. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. మేం సేఫ్‌గా ఫీలయ్యేలా చేసింది. దయచేసి కరోనా జాగ్రత్తలు పాటించండి. మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యాక్సిన్ వేయించుకోండి. అలాగే మీలో ఏ మాత్రం కరోనా లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించండి’’ అని పేర్కొన్నారు హన్సల్. చదవండి: 19 ఏళ్లకే సెలబ్రిటీ, నెలకు రూ.6 లక్షల సంపాదన! రెమిడెసివిర్ అడిగిన ప్రముఖ దర్శకుడు: ఊహించని స్పందన -
రెమిడెసివిర్ అడిగిన ప్రముఖ దర్శకుడు: ఊహించని స్పందన
సాక్షి, ముంబై: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రకంపనలు మామూలుగా లేవు. ఒకవైపు రోజురోజుకు రికార్డు స్తాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మరోవైపు కోవిడ్-19 రోగులకు ఆసుపత్రులలో మందుల కొరత, సరిపడినన్ని బెడ్లు లేక, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక దేశవ్యాప్తంగా అనేకమంది రోగులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అటు రాజకీయవేత్తల నుంచి ఇటు సామాన్యుల దాకా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిఇలా ఉంటే కరోనా చికిత్సలో కీలకమైన రెమిడెసివిర్ ఔషధం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు హన్సాల్ మెహతా కరోనా బారిన పడిన తన కుమారుడి చికిత్సకోసం రెమిడెసివిర్ మందు దొరకడం లేదని సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో వేడుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే ఈ పోస్ట్‌కు ఆయన అభిమానులు, ఇతర నెటిజనుల నుంచి అపూర్వ స్పందన రావడం విశేషం. పలువురు నెటిజన్లు ఈ ఔషధం లభ్యత తదితర వివరాలతో మెహతాకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. (ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌కు కరోనా: పరిస్థితి విషమం) ‘కోవిడ్‌తో బాధపడుతున్న నా కుమారుడు పల్లవ కోసం రెమిడెసివిర్ ఔషధం కావాలి. ఎక్కడ దొరుకుతుంది..సాయం చేయగలరు’ అంటూ ట్వీట్ చేశారు. ముంబైలోని అంధేరి ఈస్ట్‌లోని క్రిటికేర్ హాస్పిటల్లో ఉన్నాడని పేర్కొన్నారు. దీంతో నెటిజనుల నుంచి అనూహ్య స్పందన లభించింది. కేవలం ఒక గంట వ్యవధిలో దర్శకుడికి కావలసిన మెడిసిన్ లభించింది. దీంతో తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పల్లవకు సాయం చేయడానికి ఇంతమంది నుంచి అద్భుత స్పందన రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు. పల్లవకోసం ప్రే చేయండి అంటూ పాత ట్వీట్‌ను తొలగించారు.. కాగా, భారతదేశంలో కోవిడ్-19 పరిస్థితి పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉందా లేదా అధ్వాన్నంగా ఉందా అంటూ హన్సల్ మెహతా ట్విటర్లో వ్యంగ్యంగా అడగడం వివాదాన్ని రేపింది. పాకిస్తాన్లో బావుందని భావిస్తే శాశ్వతంగా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ కొంతమంది ఘాటుగా స్పందించారు. ఏకంగా ఒక నెటిజన్ దుబాయ్ ద్వారా పాకిస్తాన్‌కు వన్-వే టికెట్‌ను కూడా పంపారు. Am overwhelmed that so many wonderful people reached out to help Pallava. Have deleted the tweet as his requirement is being met. Thank you so much for all the love. Keep him in your prayers. Love. — Hansal Mehta (@mehtahansal) April 20, 2021 KK Pharma 9892869090 it is in Andheri. Try it out Sir. — Dev Mehta (@Dev73513666) April 20, 2021 -
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కన్నుమూత
ముంబై: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, రచయిత సాగర్ సర్హాది (87) ముంబైలో సోమవారం ఉదయం మరణించారు. నూరి, బజార్, కబీ కబీ, సిల్సిలా, చాందిని, దీవానా, కహో నా ప్యార్ హై చిత్రాలలో పనిచేసినందుకు ఆయన మంచి పేరును తెచ్చుకున్నారు. ఉర్దూ నాటక రచయితగా ఇప్పటికీ చాలా మంది అభిమానిస్తారు. సాగర్ సర్హాది 1976లో హిట్ అయిన కబీ కబీ కి డైలాగ్స్ రాసిన తరువాత భారీగా ప్రజాదరణ పొందారు. అతడు చేసిన కృషికిగాను ఉత్తమ డైలాగ్ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. కబీ కబీ చిత్రంలో అమితాబ్ బచ్చన్, శశి కపూర్, రాఖీ, వహీదా రెహ్మాన్, దివంగత నటుడు రిషి కపూర్, నీతు సింగ్ నటించారు. దీనికి యశ్ చోప్రా దర్శకత్వం వహించారు. కబీ కబీ చిత్రం తరువాత , సాగర్ సర్హాది నూరి(1979), చాందిని(1989), సిల్సిలా(1981) సినిమాలకు డైలాగ్స్ రాశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సాగర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నటుడు జాకీ ష్రాఫ్ సంతాపం తెలుపుతూ... "విల్ మిస్ యు ... రిప్ సాగర్’ అంటూ..తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బ్లాక్ అండ్ ఫోటోను పోస్ట్ చేశారు. సర్హాది స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు, అంతేకాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Jackie Shroff (@apnabhidu) (చదవండి: కోవిడ్ టీకా వేయించుకున్న బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర! ) -
వికాస్ దూబే జీవితం ఆధారంగా వెబ్‌సిరీస్
ముంబై: ఇటీవలే ఉత్తర ప్రదేశ్ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే జీవితం ఆధారం ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. థ్రీల్లర్ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌కు బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నాడు. అత్యంత కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే నిజ జీవిత కథ ఆధారంగా చిత్రీకరిస్తున్నందున ఈ సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాత శైలేష్ ఆర్ సింగ్ అధికారిక అనుమతులు కూడా పొందినట్లు తెలుస్తోంది. (చదవండి: ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైన దూబే?!) దీనిపై దర్శకుడు హన్సల్ మెహతా మాట్లాడుతూ... తాము తీయబోయే ఈ థ్రీల్లర్ వెబ్ సిరీస్ అంత్యంత ఆసక్తికరంగా ఉండబోతుందన్నారు. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఉదంతంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్ ఉందని, దానిని మేము ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పాడు. అది అందరికి ఆశ్చర్యం కలిగిస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు ఇది ప్రస్తుత సమాజాన్ని కూడా చూపిస్తుందన్నాడు. ఇటీవల యూపీ పోలీసుల చేతిలో హతమైన వికాస్ దూబే ఎన్కౌంటర్ వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన రోజుల వ్యవధిలోనే పోలీసుల తూటాకు వికాస్ దూబే బలయ్యాడు. (చదవండి: ‘జీపులో ఉన్న అందరిని చంపుతాను’) -
‘రేపు మీ పిల్లల విషయంలో ఏం చేస్తారు’
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణంతో సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన బంధుప్రీతి, లాబీయింగ్, అభిమానవాదం వంటి అంశాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. సుశాంత్ మరణం తరువాత చాలా మంది నటులు, దర్శకులు, రచయితలు, ఇతర వర్ధమాన నటులు బాలీవుడ్లో తాము ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు కరణ్ జోహార్, ఆలియా భట్, సోనమ్ కపూర్, సల్మాన్ ఖాన్‌లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ట్రోలర్స్ బాధ తట్టుకోలేక కరణ్, ఆలియా, కరీనా కపూర్ ఖాన్ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో కామెంట్ సెక్షన్లో లిమిట్ సెట్ చేసుకున్నారు. సుశాంత్ మరణం తర్వాత అభిమానులు బాలీవుడ్లో బంధుప్రీతిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక కరణ్, అలియా వంటి స్టార్లను అన్‌ఫాలో చేయడం ప్రారంభించారు. దాంతో వీరి సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఆలియా భట్‌పై వస్తున్న విమర్శలపై ఆమె తల్లి సోని రజ్దాన్ స్పందించారు. ఈ రోజు బంధుప్రీతి గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారు.. రేపు తమ పిల్లలు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మాత్రం వారికి తప్పక మద్దతిస్తారని ఎద్దేవా చేశారు. దర్శకుడు హన్సాల్ మెహతా చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ సోని ఇలా కామెంట్ చేయడం గమనార్హం. (ముసుగులు తొలగించండి) హన్సాల్ మెహతా ‘ఈ బంధుప్రీతిపై చర్చను విస్తృతం చేయాలి. ఎక్కువ మంది దీని గురించి మాట్లాడాలి. నా వల్ల నా కొడుకుకు ఇండస్ట్రీలో త్వరగా అవకాశం లభించిన మాట వాస్తవం. కాకపోతే తను చాలా కష్టపడి పని చేస్తాడు. ప్రతిభావంతుడు, క్రమశిక్షణ గలవాడు. నాలానే విలువలు పాటిస్తాడు. అందువల్లే అతడికి అవకాశాలు వస్తాయి తప్ప నా కొడుకు అని అవకాశాలు ఇవ్వరు’ అన్నారు. అంతేకాక ‘నా కుమారుడు సినిమాలు తీస్తాడు.. కానీ వాటిని నేను నిర్మించలేదు. ఆ సినిమాలు చేయడానికి అతడు అర్హుడు కాబట్టి అతడికి అవకాశం లభించింది. ఇక్కడ నిలదొక్కుకోగలిగితేనే అతనికి కెరీర్ ఉంటుంది. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే తన కెరీర్‌ను నేను నిర్మించలేను’ అంటూ హన్సాల్ మెహతా ట్వీట్ చేశారు. (నెపోటిజం: ఆ ఆవార్డును బైకాట్ చేశాను) దీనిపై సోని రజ్దాన్ స్పందిస్తూ.. ‘ఫలానా వారి కొడుకు, కుమార్తె అంటే ప్రేక్షకులకు వారి మీద చాలా అంచానాలు ఉంటాయి. ఈ రోజు బంధుప్రీతి గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వీరు ఏదో ఒక రోజు తమ సొంత బిడ్డల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. తమ పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తామంటే.. ఏం చేస్తారు.. వారిని ఆపగల్గుతారా’ అని సోని రజ్దాన్ ప్రశ్నించారు. The expectation that people have because of whose son or daughter you are is much more. Also thise who r ranting about nepotism today and who have made it on their own will also have kids one day. And what if they want to join the industry? Will they stop them from doing so ? — Soni Razdan (@Soni_Razdan) June 23, 2020 -
శ్రీదేవిలా తెరపై వెలుగుతారా?
సాక్షి, చెన్నై: బయోపిక్ చిత్రాలు తెరకెక్కించడం అంత సులభం కాదు. ఎవరిని పడితే వారి బయోపిక్‌లను వెండితెరపై ఎక్కించనూలేరు. అందుకో అర్హత ఉండాలి. అందుకు తగ్గ చరిత్ర ఉండాలి. అలా మహానటి సావిత్రి జీవిత చరిత్ర నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య భారత క్రికెట్ కెప్టెన్ ఎంఎస్.ధోని జీవిత చరిత్రతో రూపొందిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంతకు ముందు సంచలన శృంగారతార సిల్క్‌స్మిత్ బయోపిక్ ది దర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కింది. అందులో స్మిత పాత్రలో నటించిన నటి విద్యాబాలన్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. తాజాగా అతిలోకసుందరి శ్రీదేవి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళనాట పుట్టి, తమిళ చిత్రసీమలోకి బాలతారగా అడుగిడి, అటుపై తెలుగు, కన్నడం అంటూ పసివయసులోనే బహుభాషా బాలతారగా గుర్తింపు పొందిన నటి శ్రీదేవి. కథానాయకిగానూ భారతీయ సినీపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు, ప్రఖ్యాతులను పొందిన శ్రీదేవి అన్ని భాషల్లోనూ 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఇటీవల దుబాయ్‌లో మరణించిన శ్రీదేవిపై ఆయన భర్త బోనీకపూర్‌నే చిత్రం చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఆ విషయంలో క్లారిటీ లేకపోయినా, బెంగళూర్‌కు చెందిన అతిలోకసుందరి శ్రీదేవి అభిమానులు ఆమె బయోపిక్‌ని డాక్యుమెంటరీ చిత్రంగా రూపొందిస్తున్నారు. తాజాగా హిందీ దర్శకుడు హన్సల్ మెహ్తా శ్రీదేవి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయం గురించి ఆయన తెలుపుతూ ఇంతకు ముందు శ్రీదేవిని తన చిత్రం లో నటింపజేయాలనుకున్నారు. ఇంతలోనే ఆమె అకస్మాత్తుగా మరణించడంతో తన కోరిక నెరవేరకుండా పోయిందని అన్నారు. అందుకే శ్రీదేవి జీవితచరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి తమిళ చిత్రాల నుంచి హిందీ చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగారని, ఆమె జీవితంలో ఆర్థిక సమస్యలు, వైద్యుల శస్త్ర చికిత్స తప్పిదంతో తల్లి మరణం, ఆ ఆస్పత్రి నిర్వాకంపై కోర్టు కేసు వేయడం, దుబాయిలో మరణం వరకూ శ్రీ దేవి జీవిత అంశాలు ఈ చిత్రం లో చోటు చేసుకుంటాయని తెలిపారు. ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటి విద్యాబాలన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరగుతున్నాయని తెలిపారు. శ్రీదేవితో కలిసి నటించిన రజనీ కాంత్, కమల్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, మిథున్చక్రవర్తి లాంటి పాత్రలు కూడా ఈ చిత్రంలో చోటు చేసుకుంటా యని, వారి ఎంపిక జరుగుతోందని చిత్ర దర్శకుడు హన్సల్‌మెహ్తా తెలిపారు. -
ప్చ్... శ్రీదేవితో సినిమా తీయలేకపోయా!
సాక్షి, సినిమా : తన కెరీర్లో లెజెండరీ తార శ్రీదేవితో సినిమా తీయలేకపోయానని బాలీవుడ్ సీనియర్ దర్శక-నిర్మాత హన్సల్ మెహతా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బయోపిక్ తీసేందుకు ఆయన సిద్ధమైపోయారు. ‘శ్రీదేవి హఠాన్మరణం నన్ను ఎంతగానో బాధించింది. ఆమెతో సినిమా తీయాలని ఎంతగానో ప్రయత్నించా. కానీ, నా కోరిక తీరలేదు. అందుకే ఆమె బయోపిక్ అయినా తీయాలని నిర్ణయించుకున్నా. ఈ చిత్రం కోసం నటి విద్యాబాలన్‌ను సంప్రదిస్తున్నా’ అని అని మీడియాకు తెలిపారు. ఇక ఇండస్ట్రీలో మరో శ్రీదేవి అన్నది ఊహించుకోవటమే కష్టమంటూ ట్వీట్ చేసిన ఆయన.. బయోపిక్ ద్వారా ఆమె జీవితంలో తెలియని కొత్త కోణాలు చూపించే యత్నం చేస్తానని హన్సల్ చెప్పుకొచ్చారు. కాగా, హన్సల్ మెహతా.. ఖానా-ఖజానా, దూరియాన్, దస్ కహానియాన్, సిటీలైట్స్, అలీఘడ్ లాంటి చిత్రాలతోపాటు ఈ మధ్యే బోస్ : డెడ్/ఎలైవ్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నారు. -
సిమ్రన్‌గా కంగనా
బాలీవుడ్ తెర మీద నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆధరణ లభిస్తోంది. దీంతో ఎంతో మంది దర్శకనిర్మాతలు ఈ తరహా సినిమాలను తెరకెక్కించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటిగా మూడు సార్లు అవార్డు అందుకున్న బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్, ఈ తరహా సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. సిమ్రన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా, ఓ గుజరాతి ఎన్నారై నర్సు పాత్రలో కనిపిస్తోంది. గ్లామర్ షోకు ఏ మాత్రం వెనకాడని ఈ బ్యూటి.., సిమ్రన్ సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా డీగ్లామర్స్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబందించిన కంగనా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆధర్శ్ తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు. జాతీయ అవార్డ్ దర్శకుడు హన్సల్ మెహతా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, భూషణ్ కుమార్ శైలేష్ సింగ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. First look of Kangna Ranaut in #Simran, directed by Hansal Mehta. Produced by Bhushan Kumar and Shailesh Singh. pic.twitter.com/DUEuZvWJvm — taran adarsh (@taran_adarsh) 7 July 2016 -
సెక్షన్ 377పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా సెక్షన్ 377పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సెక్షన్ ప్రకారం తాను కూడా నేరస్తుడినేనని, తాను ఓరల్ సెక్స్ చేశానంటూ వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కుల అంశంలో ఢిల్లీ కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో హన్సల్ మెహతా స్పందించారు. ఎల్జీబీటీ వర్గం ఈ సెక్షన్ ను రద్దు చేయాలంటూ సాగిస్తున్న ఉద్యమానికి ఆయన తన మద్దతు తెలిపారు. ఈ చట్టం కొనసాగితే తాను కూడా ఓ క్రిమినలే అని ... సెక్షన్ 377 రద్దు చేయాలని అభిప్రాయపడిన ఆయన ముఖరతి ఓరల్ సెక్స్‌కు పాల్పడిన తాను మాత్రమే కాకుండా..భారత్‌లో అత్యధికులు చట్టం దృష్టిలో నేరస్థులుగా మిగిలిపోతారన్నారు. ఈ చట్టం రద్దుకోసం పోరాడుతున్న నాజ్ ఫౌండేషన్ ను మెహతా అభినందించారు. అత్యధికుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న సెక్షన్ 377ను రద్దు కోసం వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అలాంటి చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫౌండేషన్ చేస్తున్న పోరాటం ఫలించి ఆ దుర్మార్గపు చట్టం తొలగిపోవాలని ఆయన ఆశించారు. 2012లో షాహిద్ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకొన్న హన్సల్ మెహత్ స్వలింగ సంపర్కం కథాంశంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ' అలీగఢ్' పేరుతో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. కాగా ఐపీసీ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం కిందికి వస్తుందని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఈ మంగళవారం విచారించింది. ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా ఎల్జీబీటీ వర్గాలు సంతోషంతో సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. -
వన్సపాన్ ఏ టైమ్..!
అప్పుడొద్దన్నవారే ఇప్పుడెందుకు కావాలని అంటున్నారో తెలుసుకొని కాస్త అప్సెట్ అయినట్టుంది క్యూటీ కత్రినా. ఇన్నేళ్లకు మనసులో మాట బయటపెట్టింది. ‘తొమ్మిదేళ్ల కిందట చాలామంది నటులు నన్ను వద్దన్నారు. నేనున్న సినిమాలో నటించనని తెగేసి చెప్పినవారూ ఉన్నారు. అయితే ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి గానీ, బాధపడకూడదు. బహుశా ఈ పరిస్థితి ప్రతి యాక్టర్‌కీ అనుభవమే అనుకుంటా. అయితే వేరేవాళ్లు వద్దన్నప్పుడు మనలోనూ నటుడున్నాడని గుర్తించి, ప్రోత్సహించినవాళ్లే నిజమైన మనుషులు’ అంటూ వేదాంతం చెప్పిందీ సుందరి. ఆస్కార్‌కు లయర్స్ డైస్ మెగాఫోన్ చేతపట్టిన మలయాళీ నటి గీతు మోహన్‌దాస్ రూపొందించిన ‘లయర్స్ డైస్’ చిత్రం ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో భారత్ తరఫున ఈ చిత్రం పోటీ పడుతోంది. భారత్ నుంచి ఈసారి ‘ఆస్కార్’ నామినేషన్ కోసం వికాస్బెహల్ రూపొందించిన ‘క్వీన్’, హన్సల్ మెహతా రూపొందించిన ‘షహీద్’ వంటి చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురైనా, ‘లయర్స్ డైస్’ వాటిని అధిగమించింది. డేర్ అండ్ డెవిల్ ‘చాలెంజ్’ల సీజన్‌ను టైమ్లీగా క్యాచ్ చేశాడు సూపర్‌స్టార్ హృతిక్ రోషన్. తన చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ను ప్రమోట్ చేసుకోవడానికి జీనియస్ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ చాలెంజ్ పేరు ‘బ్యాంగ్ బ్యాంగ్ డేర్’. ట్విట్టర్లో సహ నటులకు సవాల్ విసురుతున్నాడు.తాజాగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌కు ‘ధైర్యం ఉంటే ఎయిట్ ప్యాక్ కోసం నువ్వు చేసిన వర్కవుట్స్ పిక్చర్ పంపు’ అంటూ చాలెంజ్ చేశాడు.స్పందించిన షారూఖ్ ఏకంగా వర్కవుట్ వీడియోనే పంపించి డేర్ అండ్ డెవిల్ అన్పించుకున్నాడు. -
శ్వేతాబసుకు ఊహించని ఆఫర్!
ముంబై: కొత్త బంగారులోకం సినిమా నటి, వ్యభిచారం కేసులో అరెస్టయి కష్టాల్లో ఉన్నశ్వేతాబసు ప్రసాద్‌కు ఊహించని అవకాశం రానుంది. బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా తన తరువాతి చిత్రంలో శ్వేతాబసుకు ఆఫర్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. హన్సల్ ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు. 'నా తరువాతి చిత్రంలో శ్వేతాబసుకు ఆఫర్ ఇవ్వాలని భావిస్తున్నాను. మక్దీ చిత్రంలో ఆమె బాగా నటించారు' అని మెహతా ట్వీట్ చేశారు. వ్యభిచారం కేసుకు సంబంధించి ఆమెను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని సూచించారు. ఆమె ఫొటోలను ప్రచురించడం ఆపాలని ట్వీట్ చేశారు. సహచర నటులు అదితి రావు, ఉపేన్ పటేల్ శ్వేతాబసుకు మద్దతుగా ట్వీట్లు చేశారు. హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో శ్వేతాబసు వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని రెస్య్కూ హోంలో ఉంటోంది. తనకు సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, మరో మార్గం లేక డబ్బుల కోసం వ్యభిచార వృత్తిలోకి దిగానని శ్వేతాబసు పోలీసులకు చెప్పింది. -
ఎంతో కష్టపడ్డా
తన మాదిరే కూతురు కూడా చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా పనిచేసి పేరు తెచ్చుకోవాలని తండ్రి కోరుకున్నా, పత్రలేఖ మాత్రం సినిమాలపై దృష్టి పెట్టింది. హన్సల్ మెహతా తాజాగా తీస్తున్న సిటీ ఆఫ్ లైట్స్ ద్వారా ఈమె బాలీవుడ్లో అడుగుపెడుతోంది. బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ అందగత్తె సినిమాల్లో అవకాశం సంపాదించుకోవడానికి ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. ‘నేను సీఏ చదవాలని మా నాన్న కోరుకునేవారు. నేనేమో సినీ లోకాల్లో విహరించేదాన్ని. నా కలను సాకారం చేసుకోవడానికి నటనా శిక్షణ తరగతులకు వెళ్లేదాన్ని. వర్క్‌షాప్‌లలోనూ పాల్గొనేదాన్ని. చాలా ఆడిషన్లకూ వెళ్లాను’ అని చెప్పిన పత్రలేఖ... షిల్లాంగ్‌లో పుట్టినా ముంబైలోనే డిగ్రీ పూర్తి చేసింది. ఇక సిటీ ఆఫ్ లైట్స్‌లో హీరో రాజ్‌కుమార్ రావుకు జోడీగా ఈమె కనిపిస్తోంది. వీళ్లిద్దరూ ఇందులో రాజస్థాన్ గ్రామీణ దంపతులుగా కనిపిస్తారు. బ్రిటిష్ సినిమా మెట్రో మనీలా ఆధారంగా దీనిని తీస్తున్నారు. ‘ఇది ఒక సామాన్యుడి గురించి వివరించే సినిమా. నేను అలాంటి దానినే. రాజస్థాన్ నాకు పూర్తిగా కొత్త కాబట్టి అక్కడి పరిస్థితులకు అలవాటుపడేందుకు చాలా కష్టపడ్డా. షూటింగ్ కోసం అక్కడ మూడు వారాలు ఉన్నాం. స్థానికులతో మాట్లాడి వాళ్ల పద్ధతులు, భాష, ఆహార అలవాట్ల గురించి తెలుసుకున్నాను. రాజస్థానీ సంప్రదాయ ఆహారం దాల్ బటీ చుర్మా నాకు చాలా ఇష్టం’ అని ఈమె వివరించింది. మెట్రో నగరాల్లో గ్రామీణ ప్రాంతాల వలస ప్రజలు దోపిడీ గురికావడాన్ని హృద్యంగా వివరించే సిటీ లైట్స్ ఈ నెల 30న థియేటర్లకు రానుంది. ‘పొట్టకూటి కోసం వేలాదిమంది నగరాలకు వస్తున్నారు. ఇలాంటి వాళ్లకు మెట్రో నగరాల్లో ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో ఈ సినిమా చూపిస్తుంది. ఇది పూర్తిగా ఆధునిక భారత సినిమా’ అని పత్రలేఖ చెప్పింది. అన్నట్టు ఈ బ్యూటీ ‘డకేర్ షాజ్’ అనే బెంగాలీ సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది.