వన్సపాన్ ఏ టైమ్..! | Katrina Kaif: There are a lot of actors who said no to me nine years back | Sakshi
Sakshi News home page

వన్సపాన్ ఏ టైమ్..!

Published Thu, Sep 25 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

వన్సపాన్ ఏ టైమ్..!

వన్సపాన్ ఏ టైమ్..!

అప్పుడొద్దన్నవారే ఇప్పుడెందుకు కావాలని అంటున్నారో తెలుసుకొని కాస్త అప్‌సెట్ అయినట్టుంది క్యూటీ కత్రినా. ఇన్నేళ్లకు మనసులో మాట బయటపెట్టింది. ‘తొమ్మిదేళ్ల కిందట చాలామంది నటులు నన్ను వద్దన్నారు. నేనున్న సినిమాలో నటించనని తెగేసి చెప్పినవారూ ఉన్నారు. అయితే ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి గానీ, బాధపడకూడదు. బహుశా ఈ పరిస్థితి ప్రతి యాక్టర్‌కీ అనుభవమే అనుకుంటా. అయితే వేరేవాళ్లు వద్దన్నప్పుడు మనలోనూ నటుడున్నాడని గుర్తించి, ప్రోత్సహించినవాళ్లే నిజమైన మనుషులు’ అంటూ వేదాంతం చెప్పిందీ సుందరి.
 
ఆస్కార్‌కు లయర్స్ డైస్
మెగాఫోన్ చేతపట్టిన మలయాళీ నటి గీతు మోహన్‌దాస్ రూపొందించిన ‘లయర్స్ డైస్’ చిత్రం ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో భారత్ తరఫున ఈ చిత్రం పోటీ పడుతోంది. భారత్ నుంచి ఈసారి ‘ఆస్కార్’ నామినేషన్ కోసం వికాస్‌బెహల్ రూపొందించిన ‘క్వీన్’, హన్సల్ మెహతా రూపొందించిన ‘షహీద్’ వంటి చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురైనా, ‘లయర్స్ డైస్’ వాటిని అధిగమించింది.
 
 డేర్ అండ్ డెవిల్
 ‘చాలెంజ్’ల సీజన్‌ను టైమ్లీగా క్యాచ్ చేశాడు సూపర్‌స్టార్ హృతిక్ రోషన్. తన చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ను ప్రమోట్ చేసుకోవడానికి జీనియస్ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ చాలెంజ్ పేరు ‘బ్యాంగ్ బ్యాంగ్ డేర్’. ట్విట్టర్‌లో సహ నటులకు సవాల్ విసురుతున్నాడు.తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌కు ‘ధైర్యం ఉంటే ఎయిట్ ప్యాక్ కోసం నువ్వు చేసిన వర్కవుట్స్ పిక్చర్ పంపు’ అంటూ చాలెంజ్ చేశాడు.స్పందించిన షారూఖ్ ఏకంగా వర్కవుట్ వీడియోనే పంపించి డేర్ అండ్ డెవిల్ అన్పించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement