
అతడితో డ్యాన్స్ పెద్ద సవాల్!
క్యూటీ కత్రినాకైఫ్... బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్‌ను కూడా ఇంతలా పొగడ్డం చూడలేదెప్పుడూ! అమ్మాయిల రాకుమారుడు హృతిక్ రోషన్‌ను మాత్రం ఆకాశానికెత్తేసిందీ అమ్మ డు. హృతిక్‌తో కలసి ‘బ్యాంగ్ బ్యాంగ్’లో నటిస్తోందీ మిల్కీ బ్యూటీ. ‘హృతిక్‌తో డ్యాన్స్ చేయడం పెద్ద చాలెంజ్. మూమెంట్స్, బాడీ ఫ్లెక్సిబిలిటీ అమోఘం. అతనితో స్టెప్స్ వేయడానికి నేను తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రిహార్సల్స్‌కు హృతిక్ రానంతవరకూ నేనే సూపర్. అతడు వచ్చిన తరువాత... బెస్ట్ ఎవరో ఇంక చెప్పక్కర్లేదు’ అంటూ నవ్వేసిందీ స్వీటీ.