Hruthik roshan
-
Bollywood: మల్టీస్టార్స్.. బాక్సాఫీస్‌పై వార్!
ఒక్కోసారి ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో మల్టీస్టారర్ ట్రెండ్ కనిపిస్తోంది. గతంలో కూడా బాలీవుడ్ తెరపై మల్టీస్టారర్ ట్రెండ్ ఉంది. కానీ ఇప్పుడు ఈ తరహా చిత్రాలు చాలానే నిర్మాణంలో ఉన్నాయి. ఇలా మల్టీస్టార్స్‌తో బాక్సాఫీస్‌పై వార్‌కు రెడీ అవుతున్న చిత్రాల గురించి, ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం. పోలీస్ పవర్ఓ సినిమాలో ఇద్దరు స్టార్ యాక్టర్స్ కనిపిస్తే మల్టీస్టారర్ అనేస్తుంటారు సినీ అభిమానులు. అలాంటిది ఏడుగురు స్టార్స్ కలిసి ఓ సినిమా చేస్తే... అది బడా మల్టీస్టారర్ అన్నమాట. ఈ ప్రస్తావన ‘సింగమ్ ఎగైన్’ సినిమా గురించే. బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో ఒకటైన ‘సింగమ్’ సిరీస్ నుంచి ‘సింగమ్ ఎగైన్’ రానుంది. అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. అర్జున్ కపూర్ విలన్‌గా నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్, జ్యోతి దేశ్ పాండే ఈ ‘సింగమ్ ఎగైన్’ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నారు... కానీ వాయిదా వేశారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని బీ టౌన్ టాక్. ఇక హీరో అజయ్ దేవగన్, దర్శకుడు రోహిత్ శెట్టిల కాంబినేషన్లో ‘సింగమ్’ సిరీస్‌లో ఇప్పటికే వచ్చిన ‘సింగమ్’ (2011), ‘సింగమ్ రిటర్న్స్’ (2014) సినిమాలు హిట్స్‌గా నిలవడంతో ‘సింగమ్ ఎగైన్’పై బాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అక్షయ్ కుమార్‌తో రోహిత్‌శెట్టి ‘సూర్యవన్షీ’, రణ్వీర్ సింగ్‌తో ‘సింబ’ వంటి పోలీస్ యాక్షన్ సినిమాలను తీసి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు అజయ్ దేవగన్, ఈ ఇద్దరూ, మరికొందరు స్టార్స్‌తో కలిసి రోహిత్ శెట్టి అందించనున్న ఈ ‘సింగమ్ ఎగైన్’ ఏ రేంజ్లో వసూళ్లు కొల్లగొడుతుందో చూడాలి. స్పై వార్వెండితెరపై హృతిక్ రోషన్‌తో స్పై వార్ చేస్తున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొంది, 2019లో విడుదలై బాక్ల్బస్టర్గా నిలిచిన చిత్రం ‘వార్’. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది.‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. ఇక ‘వార్ 2’ సినిమాను తొలుత 2025 జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్‌ను 2025 ఆగస్టు 14కు వాయిదా వేశారు. ఎన్టీఆర్ హిందీలో చేస్తున్న తొలి స్ట్రయిట్ ఫిల్మ్ కూడా ‘వార్ 2’ కావడం విశేషం.ఢీ అంటే ఢీ‘కింగ్’తో ఢీ అంటున్నారు అభిషేక్ బచ్చన్. షారుక్ ఖాన్, ఆయన తనయ సుహానా ఖాన్ లీడ్ రోల్స్‌లో ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రూపొందనుంది. సుజోయ్ ఘోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నిజ జీవితంలో తండ్రీకూతుళ్లు అయిన షారుక్ ఖాన్, సుహానా ఈ సినిమాలో గురు శిష్యులుగా కనిపిస్తారట. అలాగే ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నారు. ‘కింగ్’ సినిమాలో తాను విలన్‌గా నటించనున్న విషయాన్ని ఇటీవల సోషల్ మీడియాలో పరోక్షంగా కన్ఫార్మ్ చేశారు అభిషేక్ బచ్చన్. గతంలో ‘కబీ అల్విదా నా కెహనా (2006)’, ‘హ్యాపీ న్యూ ఇయర్ ’(2014) వంటి సినిమాల్లో షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్ కలిసి నటించారు. కానీ ఈ చిత్రాల్లో ఈ ఇద్దరు హీరో తరహా పాత్రల్లో నటించారు. ఇప్పుడు ‘కింగ్’ సినిమా కోసం షారుక్ ఖాన్, అభిషేక్ ఒకరితో ఒకరు ఢీ అంటే ఢీ అంటూ తలపడనుండటం విశేషం. ప్రస్తుతం ‘కింగ్’ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ΄్లాన్ చేస్తున్నారట.సైనికుల పోరాటంసన్నీ డియోల్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘బోర్డర్’ (1997). 1971లో జరిగిన ఇండియా–΄ాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చిత్రం విడుదలై ఇరవయ్యేడేళ్లయిన సందర్భంగా ఇటీవల ‘బోర్డర్’కు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ చిత్రాన్ని ప్రకటించారు. కాగా ‘బోర్డర్ 2’ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా మరో లీడ్ రోల్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఆయుష్మాన్ ఖురానా కూడా మరో లీడ్ రోల్లో కనిపించనున్నారట. అయితే ‘బోర్డర్’కు జేపీ దత్తా దర్శకత్వం వహించగా, సీక్వెల్‌కు మాత్రం అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. 2026 జనవరి 23న ‘బోర్డర్ 2’ను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.ట్రయాంగిల్ లవ్స్టోరీలవ్ అండ్ వార్ అంటున్నారు ఆలియా భట్. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లీడ్ రోల్లో నటించనున్న హిందీ చిత్రం ‘లవ్ అండ్ వార్’. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. కానీ చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. సెప్టెంబరు చివర్లో లేదా అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నారని బాలీవుడ్ టాక్. ఈ సినిమా ముక్కోణపు ప్రేమకథగా సాగుతుందట. మరి.. రణ్‌బీర్ కపూర్–ఆలియాల ప్రేమకు మధ్యలో విక్కీ కౌశల్ వస్తారా? లేక ఆలియా భట్– విక్కీ కౌశల్‌ల మధ్యలోకి రణ్‌బీర్ కపూర్ వస్తారా? అనే చర్చ బాలీవుడ్లో జరుగుతోంది. పైగా వివాహం చేసుకున్న తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి చేయనున్న సినిమా కూడా ఇదే కావడంతో ‘లవ్ అండ్ వార్’పై బాలీవుడ్లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది. హౌస్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాలీవుడ్‌లోని హిట్ ఫ్రాంచైజీలో ‘హౌస్‌ఫుల్’ ఒకటి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి నాలుగు సినిమాలు రావడం, ప్రేక్షకుల్లో ఈ ఫ్రాంచైజీకి ఉన్న ఆదరణను స్పష్టం చేసింది. తాజాగా ‘హౌస్‌ఫుల్ 5’ కూడా రెడీ అవుతోంది. సంజయ్ దత్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్, కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో నటిస్తున్నారు. తరుణ్ మన్సుఖాని దర్శకుడు. ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీని తొలుత ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత 2025 జూన్ 6న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రమే కాకుండా అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘వెల్కమ్ టు ది జంగిల్’, ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమాల కూడా మల్టీ స్టారర్ మూవీసే! ఈ చిత్రాలు కూడా 2025లోనే విడుదల కానున్నాయని బాలీవుడ్ సమాచారం.ఈ చిత్రాలే కాదు.. కార్తీక్ ఆర్యన్, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ జంటగా నటిస్తున్న ‘భూల్ భూలయ్యా 3’లో మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ‘రేస్ 4’ మూవీలో సైఫ్ అలీఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్ రోల్స్‌లో కనిపిస్తారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇలా మరికొన్ని మల్టీస్టారర్ మూవీస్ బాలీవుడ్లో ఉన్నాయి.– ముసిమి శివాంజనేయులు -
Hrithik Roshan: ఈ బాలీవుడ్ యాక్టర్ ముద్దు పేరు వింటే షాకే..!
ఒక్కొక్కరికి ఒక్కో ముద్దుపేరు ఉండటం సహజం. వారి ప్రవర్తనతో గానీ, అలవాట్లు.. ఇష్టాలతోగానీ, కనిపించే తీరుతోగానీ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా రకాలుగా మారుపేర్లు, ముద్దుపేర్లు వస్తూంటాయి. కొన్ని ముద్దు పేర్లు మాత్రం స్థిరపడిపోతాయి కూడా. ఇలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి హృతిక్ రోషన్‌కి కూడా ఓ చిన్న కథ ఉంది. అదేంటో చూద్దామా! బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ పెట్ నేమ్ దుగ్గూ. ఈ ముద్దు పేరుకీ.. హృతిక్ వాళ్ల నాన్న.. బాలీవుడ్ ఒకప్పటి అందాల హీరో రాకేశ్ రోషన్ పెట్ నేమ్కీ ఏదో కనెక్షన్ ఉండే ఉంటదని బాలీవుడ్ వర్గాలు.. తన పేరునే కాస్త తిరగేసే కొడుకును పిలుచుకుంటున్నాడా ఏంటీ అని హృతిక్ ఫ్యాన్స్ డౌట్ పడతారట. ఇంతకీ రాకేశ్ రోషన్ ముద్దు పేరేంటంటే.. గుడ్డూ! ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
యంగ్ టైగర్ న్యూ లుక్..హృతిక్ తో ఫైట్ కోసమేనా..?
-
అయ్యో.. ఈ సీన్ ఎప్పుడు జరిగిందంటూ మళ్లీ హృతిక్ పేరు.. మళ్లీ రచ్చ!
బాలీవుడ్ వివాదాస్పద క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ లైమ్‌లైట్‌లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగనా తన బ్లాగ్‌లో ఏదో ఒకటి రాస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు తన కోపాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కుతుంది. తాజాగా కంగనా పేరు మరోసారి వైరల్ అవుతుంది. ఈసారి 2014లో రిలీజ్ అయిన 'రివాల్వర్ రాణి'లోని తన ముద్దు సీన్‌ను తెరపైకి తెస్తూ.. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ పేరును మరోసారి తెరపైకి తీసుకురావడంతో బాలీవుడ్లో మళ్లీ రచ్చ మొదలైంది. (ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ ఎంతకు కొన్నదో తెలిస్తే) ఇటీవల ఓ వార్తా సంస్థ కంగనా - వీర్ దాస్ జంటగా నటించిన 'రివాల్వర్ రాణి' సినిమాలోని ముద్దు సన్నివేశం గురించి ఓ వార్తను ప్రచురించింది. ఆ సినిమాలో హీరో వీర్ దాస్‌ను కంగనా ముద్దు పెట్టుకున్న సీన్ గురించి కథనం వచ్చింది. అంత వరకు బాగానే ఉన్నా.. ఆ సన్నివేశంలో వీర్ దాస్ పెదవుల నుంచి రక్తం వచ్చేలా కంగనా రనౌత్ ముద్దుపెట్టిందంటూ ఆ వార్త కథనంలో పేర్కొన్నారు. ఇంకేముంది అది చూసిన కంగనా వెంటనే ఆ వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కామెంట్ కూడా ఇలా చేసింది. 'హృతిక్ రోషన్ తర్వాత నేను దాడి చేసింది ఈ పూర్ 'వీర్ దాస్' పైనా..! అయ్యో ఇది ఎప్పుడు జరిగిపోయింది..?' అంటూ ఫన్నీ ఎమోజీలను కూడా అక్కడ జత చేసింది. హృతిక్ రోషన్‌తో కంగనా గొడవ ఆ ముద్దు సీన్ పక్కన పెడితే ఆ సినిమాకు ఎలాంటి సంబంధం లేని హృతిక్ రోషన్ పేరు ఎందుకు తెచ్చిందనే కదా సందేహం... కంగనా- హృతిక్ రోషన్ జంటగా 2010లో వచ్చిన క్రిష్ 3 చిత్రంలో నటించారు. తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేశారని టాక్ నడిచింది. 2016 సమయంలో ఇదే విషయం స్పందిస్తూ.. హృతిక్‌తో డేటింగ్ చేశానని కంగనా బహిరంగంగానే చెప్పడం కూడా జరిగింది. అప్పట్లో ఈ విషయంపై బాలీవుడ్లో పెద్ద దుమారమే చెలరేగింది. కంగనా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని హృతిక్ రోషన్ ఖండించాడు. ఇదే విషయంపై ఆయన కోర్టుకు వెళ్లాడు. ఆమెపై పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశాడు. ఇలా ఆ సమయంలో వారి మధ్య మాటల యుద్దం కొన్నాళ్ల పాటు సాగింది. తాజాగా మళ్లీ ఇలాంటి వ్యవహారంలో హృతిక్ రోషన్ పేరును కంగనా లాగడంతో బాలీవుడ్లో మళ్లీ చర్చనీయాంశమైంది. మరి హృతిక్ రోషన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) (ఇదీ చదవండి: యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్) -
ఎన్టీఆర్ డాన్స్ తో పోటీపడుతున్న హృతిక్
-
వార్ 2 కోసం కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్
-
వార్ 2 వెనుక టాప్ సీక్రెట్
-
ఐటెల్ బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్
ముంబై: ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ మొబైల్ ఇండియా కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నటుడైన హృతిక్‌తో భాగస్వామ్యం.. టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్యానికి తోడ్పడగలదని ట్రాన్షన్ (ఐటెల్) ఇండియా సీఈవో అరిజిత్ తాళపత్ర తెలిపారు. రూ. 8,000 లోపు ఫోన్ల సెగ్మెంట్లో ఇప్పటికే ఫేవరెట్‌గా ఉన్న తమ బ్రాండ్ స్థానా న్ని మరింత పటిష్టపర్చుకోగలమని చెప్పారు. అత్యుత్తమ మొబైల్స్‌ను అందుబాటు ధరల్లో ఐటెల్ అందిస్తోందని హృతిక్ తెలిపారు. -
ఆర్యన్‌ఖాన్‌కు మద్దతుగా మరో హీరో.. హృతిక్ పోస్ట్ వైరల్
ముంబైలోని క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీకి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (23)కు బాలీవుడ్ ప్రముఖులు సపోర్టుగా నిలిచిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, పూజా భట్ వంటి సెలబ్రీటీలు ఆర్యన్‌కి మద్దతు తెలపగా.. తాజాగా మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ అతనికి సపోర్టు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందులో.. ‘నువ్వు (ఆర్యన్) నాకు చిన్న పిల్లాడిగా, పెద్దవాడిగా తెలుసు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న అన్ని ఈ పరిస్థితులని అర్థం చేసుకో. ఈ అనుభవాలు నీకు ఉపయోగపడతాయి. నన్ను నమ్ము ఇవి నీకు కచ్చితంగా మంచే చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న కోపం, అయోమయం, నిస్సహాయ సిట్యువేషన్స్ నీలోని హీరోని బయటికి తీసుకువస్తాయి. దేవుడు ఎప్పుడు బలమైన వారికే ఎక్కువ కష్టాలను ఇస్తాడు. నువ్వు భవిష్యత్తులో మంచి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నావు’ అంటూ రాసుకొచ్చాడు ఈ ఇండియన్ సూపర్ హీరో. ఆర్యన్‌కు సపోర్టుగా పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇంతకుముందే హ్యాండ్సమ్ హీరో భార్య సుసానే ఖాన్ సైతం షారుక్ కుటుంబానికి మద్దతు తెలిపింది. అయితే హృతిక్ రోషన్ ‘క్రిష్’ సినిమాల సిరీస్‌తో ఇండియన్ తొలి సూపర్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన ప్రస్తుతం దీపిక పదుకోనే కలిసి‘ఫైటర్’లో నటిస్తుండగా, మరికొన్ని సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నాయి. చదవండి: సోషల్ మీడియాని ఊపేస్తున్న #WeStandWithSRK View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
జనవరిలో స్టార్ట్
ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగినట్లయితే ఈ ఏడాది క్రిస్మస్ పండగకి హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ చిత్రం థియేటర్లోకి రావాల్సింది. కానీ ‘క్రిష్’ ఫ్రాంచైజీ దర్శకుడు రాకేశ్ రోషన్ (హృతిక్ రోషన్ తండ్రి) క్యాన్సర్ బారిన పడి, కోలుకోవడానికి కొంత సమయం పట్టడంతో ‘క్రిష్ 4’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారట రాకేశ్ రోషన్. ఇందుకు తగ్గట్లుగానే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని బాలీవుడ్ సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారని టాక్. అప్పటికి కరోనా పరిస్థితులు ఓ కొలిక్కి వస్తాయని, ఫారిన్ షూటింగ్స్‌కు పెద్ద సమస్యలు ఉండవని భావిస్తోందట చిత్రబృందం. -
‘దీపికా’ రాజకీయవేత్త అని మీకు తెలుసా?
హిందీలో ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి విశేష ఆదరణ పొందారు దీపికా చిఖలియా. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. తాజాగా స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ ‘సరోజిని’లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గురువారం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా హిందీ రామాయణ్‌ను దూరదర్శన్‌లో పునఃప్రసారం చేస్తున్నారు. దీంతో దీపిక క్రేజ్ మరోసారి అమాంతం పెరిగిపోయింది. అయితే నటిగా మంచి గుర్తింపు పొందిన దీపిక రాజకీయ రంగప్రవేశం చేశారని చాలా కొంతమందికే తెలుసు. అయితే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి సీత ఇప్పటి సరోజిని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘రామాయణం సినిమాగా తెరకెక్కించాలనే డిమాండ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయంది. అయితే ఈ సినిమాలో నటించాలన్నా, తెరకెక్కించాలన్న రామాయణం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఒక వేళ రామాయణాన్ని సినిమాగా తెరకెక్కిస్తే సీతారాముల పాత్రలకు హృతిక్ రోషన్, అలియాభట్‌లు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. అంతేకాకుండా అజయ్ దేవ్‌గణ్ రావణుడు, వరుణ్ ధావన్ లక్ష్మణుడి పాత్రలు చేస్తే బాగుంటుంది. ఇక రామయణ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో పలు మ్యాగజైన్స్ ఫోటో షూట్‌కు పిలిచారు. అందుకు భారీ మొత్తం కూడా ఆఫర్ చేశారు. కానీ ఓ వైపు సీత పాత్ర పోషిస్తూ ఫోటో షూట్లో పాల్గొనడం భావ్యం కాదని సున్నితంగా తిరస్కరించాను. 1991లో భారతీయ జనతా పార్టీలో చేరాను. దివంగత నాయకులు అటల్ బిహార్ వాజ్‌పేయ్ స్పూర్థితో రాజకీయం రంగ ప్రవేశం చేశాను. మా తాత ఆరెస్సెస్ కార్యకర్త. దీంతో నాలో చిన్నప్పట్నుంచే ఆరెస్సెస్ భావాలు ఉండేవి. ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్, నరేంద్ర మోదీ తదితరులు నా రాజకీయ సహచరులు. గుజరాత్‌లోని బరోడా లోని లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచాను. ఇప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడు నా వంతు సహాయం, సలహాలు అందిస్తుంటాను’అంటూ దీపికా చిఖలియా పేర్కొన్నారు. ఈ నటి తెలుగులో కూడా యమపాశం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించారు. చదవండి: ‘సాహో ఎన్టీఆర్.. నీకు సెల్యూట్’ ‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్’ -
కరోనా దగ్గర చేసింది!
‘సామాజిక దూరం పాటించండి... కరోనాని నియత్రించండి’ అనే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇలా కరోనా అందరినీ విడదీస్తోంది. కానీ విడివిడిగా ఉంటున్న హృతిక్ రోషన్, ఆయన భార్య సుజానే ఖాన్ని ఒకే ఇంట్లో ఉండేలా చేసింది. విషయం ఏంటంటే... హృతిక్, సుజానే విడిపోయి ఆరేళ్లు పైనే అయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి దగ్గర కొన్నాళ్లు, తండ్రి దగ్గర కొన్నాళ్లు పిల్లలు ఉంటారు. పండగలు, పార్టీలను భార్యాభర్తలిద్దరూ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు హృతిక్ దగ్గరే పిల్లలు ఉన్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ వల్ల పిల్లలు, హృతిక్ బయటకు వెళ్లడంలేదు. దాంతో పిల్లలను సుజానే మిస్ అవుతున్నారు. ఈ సమయాన్ని పిల్లలతో గడపాలనుకున్న ఆమె సూట్‌కేస్ సర్దుకుని మాజీ భర్త హృతిక్ ఇంటికి వెళ్లిపోయారు. ‘‘పిల్లలతో గడపాలని నా మాజీ భార్య మా ఇంటికి వచ్చేసింది. ఈ టైమ్‌లో పిల్లలతో పాటు తను ఉండటం చాలా అవసరం. థ్యాంక్యూ సుజానే’’ అని పేర్కొన్నారు హృతిక్. -
క్రిష్ కలిపింది ఇద్దర్నీ
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ ఇప్పటి వరకూ కలసి నటించలేదు. అయితే త్వరలోనే ఈ ఇద్దర్నీ జంటగా స్క్రీన్ మీద చూసే అవకాశం ఉందట. హృతిక్ రోషన్ నటించిన సూపర్ హీరో చిత్రం ‘క్రిష్’ సిరీస్‌లో నాలుగో భాగం షూటింగ్ పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకోన్ నటిస్తారని బాలీవుడ్ టాక్. ‘హృతిక్‌తో కలసి నటించాలనుంది’ అని పలు సందర్భాల్లో దీపికా తన ఆసక్తిని తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా దాదాపు ఫైనల్ అట. అదే నిజమైతే ‘క్రిష్’ కలిపింది ఇద్దర్నీ అనుకోవాలి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
గంగూలీ బయోపిక్?
బాలీవుడ్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్‌ను స్క్రీన్ మీదకు తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు దర్శక–నిర్మాతలు. గతంలో ధోనీ బయోపిక్ తీశారు. ప్రస్తుతం 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా ‘83’ తెరకెక్కింది. తాజాగా మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. కరణ్ జోహార్ ఈ బయోపిక్ నిర్మించే సన్నాహాలు చేస్తున్నారట. దీని కోసం గంగూలీతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట కరణ్. గంగూలీ పాత్ర కోసం హృతిక్ రోషన్ పేరును పరిశీలిస్తున్నారట. మైదానంలో చూపించిన దూకుడు స్వభావం, కెప్టెన్‌గా సాధించిన విజయాలు వంటి చాలా అంశాలు గంగూలీ కెరీర్లో ఉన్నాయి. అందుకే అతని కథ పక్కా కమర్షియల్ సినిమాకు సరిపడేలా ఉంటుందని గంగూలీ ఫ్యాన్స్ హర్షిస్తున్నారు. -
బాక్సాఫీస్ వసూళ్లు: సైరా వర్సెస్ వార్
ఈసారి గాంధీ జయంతి సందర్భంగా రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు ఒకేసారి, ఒకేరోజు విడుదల అయ్యాయి. వరుస సెలవులను క్యాష్ చేసుకోవడానికి పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఆ సినిమాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో భారీ మల్టీస్టారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా ‘వార్’ సినిమా ప్రేక్షకుల ముందుకురాగా.. సౌత్‌లో చారిత్రక సినిమాగా భారీ బడ్జెట్‌తో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలైంది. ఈ రెండు సినిమాలూ భారీ అంచనాల మధ్యే ప్రేక్షకులను పలుకరించాయి. చారిత్రక నేపథ్యంలో దాదాపు రూ. 300 కోట్ల ఖర్చుతో రేనాటి సూర్యుడు సైరా నరసింహారెడ్డి జీవిత కథతో సైరా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేశారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కోసం అన్ని భాషల్లోనూ భారీఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. అటు బాలీవుడ్ బడా స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు తొలిసారి కలిసి నటించిన మల్టీస్టార్ సినిమా వార్ కూడా భారీ అంచనాలతో గత బుధవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమాలో హృతిక్ కబీర్‌గా, టైగర్ ఖలీద్‌గా.. గురుశిష్యులుగా నటించడం.. ఒళ్లు గగుర్పొడిచే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ ఏడాది అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రమోట్ చేశారు. దుమ్మురేపిన కలెక్షన్లు.. భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’... మెగాస్టార్ స్టామినాను చాటుతూ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అయితే, ఈ సినిమా ప్రధాన మార్కెట్ అయిన ఏపీ, తెలంగాణలోనే జోరుగా దూసుకుపోతుంది. సౌత్‌లోని ఇతర రాష్ట్రాల్లో ఓ మోస్తరు వసూళ్లు రాబడుతున్నా.. హిందీలో మాత్రం అనుకున్నంతగా రాణించలేకపోయింది. హిందీలో తొలిరోజు రూ. 2.6 కోట్లు సాధించి.. పర్వా లేదనిపించిన సైరా.. ఆ తర్వాత పుంజుకోలేక చతికిలపడింది. ఓవర్సీస్లోనూ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద గట్టిగా సత్తా చాటుతున్న ఈ సినిమా తొలి మూడురోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ. 100 కోట్లకు పైగా సాధించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే ఈ సినిమా రూ. 32 కోట్లు రాబట్టినట్టుసమాచారం. దసరా సెలవులు కావడం.. పాజిటివ్ టాక్ ఉండటం తెలుగు రాష్ట్రాల్లో సైరాకు కలిసివస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 14.62 కోట్లు రాబట్టింది. ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. నైజాంలో మూడురోజుల కలెక్షన్ వివరాలు (తొలిరోజు రూ. 8.10 కోట్లు, రెండోరోజు రూ. 3.98 కోట్లు, మూడో రోజు రూ. 2.54 కోట్లు) రివీల్ చేశారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ సైరా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ. 1.5 మిలియన్ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని రమేశ్ బాలా మరో ట్వీట్లో వెల్లడించారు. రికార్డుల సృష్టిస్తున్న వార్ భారీ యాక్షన్ థ్రిల్లర్ అయిన వార్ మూవీ ఊహించినరీతిలో భారీ వసూళ్లే రాబడుతోంది. తొలిరోజు ఏకంగా రూ. 53.35 కోట్లు రాబట్టి.. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. అదేవిధంగా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. హిందీపరంగా విస్తారమైన మార్కెట్ ఉండటంతో వార్.. దసరా పండుగ సీజన్లో అత్యంత భారీ వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. హిందీ వెర్షన్లో తొలిరోజు రూ. 51 కోట్లు, రెండోరోజు గురువారం రూ. 23.10 కోట్లు, మూడో రోజు శుక్రవారం రూ. 21.25 కోట్లు సాధించిన వార్.. . తొలి మూడు రోజుల్లోనే రూ. 96 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక, తెలుగు, తమిళ వెర్షన్లలో రూ. 4.15 కోట్లు సాధించి.. మొత్తంగా రూ. 100.15 కోట్లు వార్ తన ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వార్ జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరింత వసూళ్లు సాధించి.. రికార్డులు బద్దలుకొట్టే అవకాశం కనిపిస్తోంది. గురువారం, శుక్రవారం సాధారణ వర్కింగ్ డేస్ అయినప్పటికీ.. వార్ వసూళ్లు తిరుగులేని రీతిలో ఉండటం ఇందుకు తార్కాణం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు సాధించిన ఐదో యశ్‌రాజ్ ఫిలిమ్స్ సినిమాగా వార్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇంతకుముందు ధూమ్-3, సుల్తాన్, టైగర్ జిందా హై, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలు తొలి మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులో చేరాయి. మొత్తానికి చూసుకుంటే.. తమకు గట్టి పట్టున్న మార్కెట్లో బాక్సాఫీస్ వద్ద సైరా, వార్ పోటాపోటీగా కలెక్షన్లు రాబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. -
రాముడు – రావణుడు?
రామాయణ ఇతిహాసాన్ని భారీ బడ్జెట్‌తో స్క్రీన్ మీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మా తలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్ర. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నితేష్ తివారి (‘దంగల్’ ఫేమ్), రవి ఉడయార్ (‘మామ్’ ఫేమ్) దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించేవారిలో రాముడిగా హృతిక్ రోషన్, సీత పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రావణ బ్రహ్మ పాత్రను ప్రభాస్ చేస్తే బావుంటుందని చిత్రబృందం భావిస్తోందని ముంబై సమాచారం. రావణుడి పాత్రకు ప్రభాస్ ఫిజిక్ సరిగ్గా సూట్ అవుతుందని, ఆల్రెడీ ‘బాహుబలి’ లాంటి పీరియాడిక్ సినిమా చేసి ఉండటం, ప్యాన్ ఇండియా సూపర్‌స్టార్ అపీల్ ఉండటం.. ఇలా అన్ని విషయాల్లో ప్రభాసే పర్ఫెక్ట్ అని చిత్రబృందం ఆలోచన చేస్తోందట. మరి ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్ ఓకే అంటారా? వేచి చూడాలి. -
శ్రీ రాముడిగా?
‘సూపర్ 30’ సక్సెస్‌తో సూపర్ ఎనర్జీలో ఉన్నారు హృతిక్ రోషన్. ఇప్పుడు వరుసగా సినిమాలను సైన్ చేస్తున్నారు. ఫర్హాన్ ఖాన్‌తో ‘సత్తే పే సత్తే’, ఆ తర్వాత ‘క్రిష్ 4’ ఉంటుందని ప్రకటించారు. లేటెస్ట్గా అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ్’ సినిమాలో హృతిక్ హీరోగా నటించనున్నారని బాలీవుడ్ టాక్. ఇందులో శ్రీరాముడిగా హృతిక్ నటించనున్నారట. లైవ్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాను ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారి, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూడు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రం బడ్జెట్ సుమారు 1500 కోట్లు. -
గన్‌దరగోళం
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ను ఢీ కొట్టడానికి టైగర్ ప్రపంచంలోనే పవర్ఫుల్ మెషీన్‌గన్ ‘గాట్లింగ్’తో వాడబోతున్నారని తెలిసింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ‘వార్’. యశ్ చోప్రా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. యాక్షన్ చిత్రాల ప్రేమికులకు కనువిందులా ఉండేందుకు అద్భుతమైన లొకేషన్స్‌లో యాక్షన్ సీన్లు చిత్రీకరించారు. ఓ సన్నివేశంలో ఈ మెషీన్గన్తో సిటీని ధ్వంసం చేస్తూ గన్‌దరగోళం సృష్టిస్తారట టైగర్. ఈ సీన్స్ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తాయట. వాణీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
విదేశాల్లో వార్
భూమి, సముద్రం, మంచుపై మాత్రమే కాదు గాలిలో కూడా ఫైట్ చేస్తున్నారట హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్. ఈ పవర్ఫుల్ ఫైట్స్‌ని పావెల్ జెన్నింగ్స్, ఫ్రాంజ్ స్పిల్హాస్, సా యంగ్ ఓహ్, పర్వేజ్ షేక్ ఈ నలుగురు హాలీవుడ్ స్టంట్‌మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ‘వార్’. ఇందులో వాణీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉన్నాయి టీజర్లో. ఇటీవల ఫిన్ల్యాండ్లోని ఆర్కిటిక్ సర్కిల్లో ఓ భారీ కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ పావెల్ జెన్నింగ్స్ డిజైన్ చేశారు. ఇంతకు ముందు డార్క్ నైట్, జాక్ రేచర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి చిత్రాలకు వర్క్ చేశారు పావెల్. ఈ సీన్ కోసం హృతిక్, టైగర్ ముందుగా బాగా ప్రాక్టీస్ చేశారట. ఫిన్ల్యాండ్లోని ఆర్కిటిక్ సర్కిల్లో యాక్షన్ సీన్‌ను తెరకెక్కించిన తొలి బాలీవుడ్ మూవీ ఇదేనట. ఇండియా లొకేషన్స్‌తో పాటుగా ఆస్ట్రేలియా, పోర్చుగల్, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పీడన్ దేశాల్లోని పదిహేను ముఖ్యనగరాల్లో ఈ సినిమా చిత్రీకరణను టీమ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ‘వార్’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. -
యుద్ధానికి సిద్ధం
బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్. ప్రస్తుతం ఈ ఇద్దరూ స్క్రీన్‌మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. మరి వీళ్ల ఫైట్ దేనికోసమో తెలియాలి. హృతిక్, టైగర్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్’. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వాణీకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. బైక్ స్టంట్స్, గన్ ఫైరింగ్, చేజ్లు, ఫైట్స్‌తో నిండిన ఈ టీజర్ భారీ యాక్షన్ చిత్రాన్ని అందించనున్నాం అనే ప్రామిస్ చేస్తోంది. హిందీ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్ 2న ‘వార్’ సినిమా విడుదల కానుంది. -
అమితాబ్‌గా హృతిక్?
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన తాజాచిత్రం ‘సూపర్ 30’. బీహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. దీంతో హృతిక్ నెక్ట్స్ సినిమా ఏంటి? అనే ప్రశ్న బీటౌన్‌లో మొదలైంది. 1982లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సత్తే పే సత్తా’ (1982) రీమేక్‌లో హృతిక్ రోషన్ నటించబోతున్నారని ఖబర్. ఈ సినిమాకు ఫర్హా ఖాన్ దర్శకత్వం వహిస్తారట. దర్శకుడు రోహిత్ శెట్టి ఈ సినిమాను నిర్మిస్తారట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సినిమాలో హృతిక్ సరసన దీపికా పదుకోన్ హీరోయిన్గా నటించనున్నారని టాక్. -
అప్పడాలమ్మా అప్పడాలు
.... అని రోడ్డుపై అమ్ముతున్నారు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్‌రోషన్. హీరో అప్పడాలు అమ్మాడంటే అది కచ్చితంగా ఏదో సినిమాకే అయ్యుంటుంది. అవును... ‘సూపర్ 30’ కోసం హృతిక్ అప్పడాలు అమ్మారు. బీహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ 30’. ఆనంద్ పాత్రలో హృతిక్ నటించారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలోని హృతిక్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఆనంద్‌కుమార్ జీవితంలో ఇలా అప్పడాలు అమ్మే నాటి పరిస్థితులు ఎంతో ఉద్వేగంతో కూడుకున్నవి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఆయన కష్టపడి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని హృతిక్ పేర్కొన్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూలై 12న విడుదల కానుంది. -
రెండోసారి...
హృతిక్ రోషన్ కెరీర్లో పెద్ద హిట్స్‌లో ఒకటైన ‘అగ్నిపథ్’ చిత్రం అదే పేరుతో చేసిన అమితాబ్ బచ్చన్ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. తాజాగా మరో అమితాబ్ సినిమా రీమేక్‌లో హృతిక్ నటించబోతున్నాడని బాలీవుడ్ సమాచారం. అమితాబ్ హీరోగా 1982లో వచ్చిన ‘సట్టే పే సట్టా’ చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఫరాఖాన్ రీమేక్ చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. ఈ సినిమాలో నటించడానికి హృతిక్ అంగీకారాన్ని తెలిపారని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుంది. రోహిత్‌శెట్టితో కలసి ఫరాఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
సమాజంలో అలాంటివారిని చూశా!
బాలీవుడ్లో నటుడు హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్‌ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాల నుంచి సినిమాల రిలీజ్‌ల వరకు వీరి మధ్య పరస్పర ఆరోపణలు మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కంగనా, హృతిక్ పరోక్షంగా మాటల బాణాలు విసురుకున్నారు. హృతిక్ ‘సూపర్ 30’, కంగనా ‘మెంటల్ హై క్యా’ సినిమాలు ఒకేరోజు (జూలై 26) విడుదలవుతుండమే ఇందుకు కారణం. ముందుగా ‘సూపర్ 30’ సినిమాను హృతిక్ రిలీజ్ రెడీ చేశారని, కంగనా తన సినిమా విడుదల వాయిదా వేయాలని హృతిక్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. కంగనా ప్రయత్నించినప్పటికీ కుదర్లేదట. ఇంతలోనే..‘కంగనా చేతిలో నీ పనైపోవడం ఖాయం’ అని హృతిక్‌ను ఉద్దేశిస్తూ కంగనా సోదరి రంగోలి అన్నారు. దీనిపై అనవసరంగా మరో వివాదాన్ని తెరపైకి తీసుకురావడం ఎందుకు అనుకున్నారేమో కానీ హృతిక్ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. ‘‘సూపర్ 30’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మీడియా సర్కస్‌లో నా సినిమా వివాదం నలగకుండా ఉండటంతో పాటుగా, నా మానసిక ప్రశాంతత కోసం ‘సూపర్ 30’ సినిమా విడుదలను వాయిదా వేయమని మా సినిమా నిర్మాతలను కోరాను. సరైన తేదీలో వీలైనంత తొందరగా విడుదలకు ప్లాన్ చేయమని చెప్పాను. ఒకరు ఒకర్ని పరోక్షంగా బాధపెడుతుంటే బాధపడుతున్న వారిని చూసి ఆనందపడేవారిని కొందర్ని ఈ సమాజంలో చూశాను. సమాజం పట్ల నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలపై అందరికీ అవగాహన కలగాలి. దీని కోసం ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి పరిస్థితులకు ముగింపు పలకాలి’’ అని హృతిక్ అన్నారు. ఈ విషయంపై కంగనా రనౌత్ స్పందించారు. ‘‘హృతిక్ రోషన్ ఆ విషాదకరమైన స్టోరీ ఎందుకు రాశారో నాకు తెలియదు. కానీ, మా ‘మెంటల్ హై క్యా’ సోలోగా రిలీజ్‌కు రెడీ అవడం హ్యాపీగా ఉంది. ఈ పురుషాధిక్య ఇండస్ట్రీలో సోలో రిలీజ్‌కు కృషి చేసిన మహిళా నిర్మాత ఏక్తా కపూర్ నిజంగా గ్రేట్. ఆమె పవర్‌ను మెచ్చుకోవాలి’’ అన్నారు. గతంలోనూ ఇలాగే...! నిజానికి గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది రిపబ్లిక్ డేకి ‘సూపర్ 30’ సినిమాను తొలుత వాయిదా వేశారు హృతిక్ రోషన్. ఆ తర్వాత సడన్‌గా రిపబ్లిక్ డే వీకెండ్లో కంగనా రనౌత్ ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం అయ్యింది. అప్పట్లో కూడా కంగనా వర్సెస్ హృతిక్ అని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కొన్ని అనుకోని కారణావల్ల ‘సూపర్ 30’ సినిమాను జూలై 26కి పోస్ట్‌పోన్ చేశారు టీమ్. దీంతో కంగనా ‘మణికర్ణిక: ది క్వీన్ఆఫ్ ఝాన్సీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా కంగనా నటించిన ‘మెంటల్ హై క్యా’ సినిమానే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. -
పండగ ఎవరికి?
వచ్చే ఏడాది క్రిస్మస్కు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ టాప్ హీరోలు ఆమిర్‌ఖాన్, హృతిక్ రోషన్. గత ఏడాది డిసెంబర్లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆమిర్ ఖాన్. ఈ చిత్రం అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో తర్వాతి సినిమాకు కాస్త టైమ్ తీసుకున్న ఆమిర్ ఖాన్ ఆస్కార్ అవార్డ్ సాధించిన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ‘లాల్‌సింగ్ చద్దా’లో నటించనున్నట్లు ఇటీవల తన పుట్టినరోజు నాడు వెల్లడించాడు. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిందని బాలీవుడ్ సమాచారం. ‘క్రిష్’ ఫ్రాంచైజీలో రానున్న ‘క్రిష్ 4’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కే విడుదల చేయనున్నట్లు హృతిక్ రోషన్ తెలిపారు. సో.. ఇలా వచ్చే ఏడాది క్రిస్మస్కు ఇద్దరు టాప్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. మరి.. బాక్సాఫీస్ వద్ద ఎవరి పంట పండుతుందో, సినిమా విజయంతో ఎవరు పండగ చేసుకుంటారో చూడాలి. అయితే ఇంకా ‘క్రిష్ 4’ సెట్స్ పైకి వెళ్లలేదు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కేన్సర్ బారిన పడి, చికిత్స తీసుకుని ప్రస్తుతం బాగానే ఉన్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. -
మా ఇద్దరి మధ్య ఏమీ లేదు
వినోద ప్రపంచంలో ఎక్కువగా ఆకర్షించేవి సినిమా, క్రీడలు. అది కూడా స్పోర్ట్స్‌లో క్రికెట్‌ది ప్రత్యేక స్థానం. సినిమా, క్రీడలను కలిపేది యాడ్స్. క్రికెటర్స్, మూవీ స్టార్స్ కలసి యాడ్ ఫిల్మ్స్‌లో కనిపించడం చాలాసార్లు చూశాం. 2012లో క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ తమన్నా ఓ యాడ్ ఫిల్మ్ కోసం కలిశారు. ఆ స్మార్ట్‌ఫోన్ యాడ్ చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ దగ్గరయ్యారని, డేటింగ్ చేశారని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ ఈ ఇద్దరిలో ఎవరూ ఆ వార్తలకు సమాధానం చెప్పలేదు. చాలా కాలం తర్వాత ఆ విషయం మీద ఓ షోలో మాట్లాడారు తమన్నా. ‘‘యాడ్ షూట్ సమయంలో నేను, విరాట్ గట్టిగా నాలుగు మాటలు కూడా మాట్లాడుకోలేదు’ అని పేర్కొన్నారు తమన్నా. ‘‘ఆ యాడ్ తర్వాత మేమిద్దరం మళ్లీ కలవలేదు, మాట్లాడుకోనూ లేదు. కానీ నేను యాక్ట్ చేసిన చాలామంది యాక్టర్స్ కంటే కూడా విరాట్ చాలా బెటర్ యాక్టర్’’ అని ప్రశంసించారు. ప్రస్తుతానికి ఎవరితో రిలేషన్షిప్లో లేనన్నారామె. హృతిక్ ఒక్కరే మినహాయింపు ఇదే షోలో మరికొన్ని విశేషాలు చెబుతూ – ‘‘సాధారణంగా సినిమాల్లో లిప్‌కిస్ సన్నివేశాలను చేయను నేను. ఏదైనా సినిమాకు సంతకం చేసేటప్పుడు నా కాంట్రాక్ట్‌లో ఆ నియమం కచ్చితంగా ఉంటుంది. కానీ హృతిక్‌తో కలసి నటిస్తే మాత్రం ఆ రూల్‌ని బ్రేక్ చేస్తానని సరదాగా ఫ్రెండ్స్‌తో జోక్ చేస్తుంటాను’’ అని పేర్కొన్నారామె. -
సముద్ర జీవిగా?
క్రిష్ సముద్ర జీవిగా మారబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. శంకర్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి బీటౌన్‌లో మరో వార్త పుట్టుకొచ్చింది. అదేంటంటే... ఈ సినిమాను అండర్ వాటర్‌లో షూట్ చేస్తారట. అద్భుతమైన శక్తులు ఉండే సముద్ర జీవిగా హృతిక్ కనిపిస్తారట. అంటే క్రిష్‌గా గాల్లో విన్యాసాలు చేసిన హృతిక్ ఇప్పుడు నీటిలో అద్భుతాలు చేస్తారన్నమాట. ఆల్రెడీ శంకర్ ఈ కథను హృతిక్‌కు చెప్పడం, హృతిక్ ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయట. ‘క్రిష్ 4’ చిత్రాన్ని హృతిక్, ‘ఇండియన్ 2’ చిత్రాన్ని శంకర్ పూరి ్తచేసుకున్న తర్వాత ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతారట. అంటే ఇంకా బోలెడు టైమ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. హృతిక్ రోషన్ నటించిన తాజా చిత్రం ‘సూపర్ 30’ని జూలై 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకుముందు ఈ చిత్రం విడుదలను గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి 25కి మార్చారు. ఇప్పుడు జూలైకి వాయిదా వేశారు. అంటే... కంగనా రనౌత్‌కు, హృతిక్ రోషన్‌కు బాక్సాఫీస్ పోటీ లేనట్లే. ఎందుకంటే కంగనా నటించిన ‘మణికర్ణిక: ఝాన్సీ రాణి’ చిత్రం ఈ నెల 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
2 కోట్ల సెట్... 2 నిమిషాలే!
‘2.0’ రిలీజ్ టైమ్‌కే దర్శకుడు శంకర్ తన నెక్ట్స్ చిత్రం ‘ఇండియన్ 2’ సినిమా పనులతో బిజీ అయిపోయారు. గతేడాది డిసెంబర్ 14న ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని ప్లాన్ కూడా చేశారు. కానీ ‘భారతీయుడు’ రెగ్యులర్ షూటింగ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభం కానుందట. కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996 వచ్చిన చిత్రం ‘భారతీయుడు’. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ సీక్వెల్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జనవరి 18న మొదలు కానుందని కోలీవుడ్ టాక్. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ కేరళ మార్షల్ ఆర్ట్ కలరి పయ్యట్టు నేర్చుకోనున్నారు. కమల్ కనిపించనున్న పాత్రల్లో తాత పాత్ర ఒకటి. దీని కోసం కమల్‌హాసన్ బరువు తగ్గారు కూడా. ఈ సినిమా బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదని దర్శకుడు శంకర్ ఫిక్స్ అయినట్టున్నారు. ఈ సినిమాలో ఓ సెట్ కోసం సుమారు 2 కోట్లు వరకూ వెచ్చించారట. గోల్డ్ సెట్ అని పిలిచే దీని తయారీకు కావాల్సిన వస్తువులను ప్రత్యేకంగా చైనా నుంచి తెప్పించారు. 2 కోట్లతో వేయించిన ఈ సెట్ సినిమాలో 2 నిమిషాలు కూడా కనిపించదట. సెట్స్ వర్క్‌తో పాటు నేచురల్ లొకేషన్స్‌లోనూ పలు సీన్స్ ప్లాన్ చేశారు. ముఖ్యంగా కీలక సన్నివేశాలను ఉక్రెయిన్ దేశంలో షూట్ చేయనున్నారట. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, శింబు కూడా కీలక పాత్రలు పోషించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీత దర్శకుడు. 2020లో రిలీజ్ కానుంది. హృతిక్‌తో శంకర్? ‘భారతీయుడు 2’ తర్వాత దర్శకుడు శంకర్ చేయబోయే ప్రాజెక్ట్‌లో హీరోగా హృతిక్ రోషన్ కనిపించనున్నారని బాలీవుడ్ టాక్. సైన్స్ ఫిక్షన్ జానర్లో ఈ చిత్రకథ ఉండబోతోందట. ఆల్రెడీ శంకర్ వినిపించిన ఐడియా హృతిక్‌కు నచ్చిందని, ‘భారతీయుడు 2’ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని భోగట్టా. -
అతనితో పని చేయొద్దు
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని బాలీవుడ్ మీడియాకు తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా హృతిక్‌పై మాటల తూటాలు పేల్చుతూనే ఉంటారు కంగనా. తాజాగా ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా మాట్లాడుతూ హృతిక్‌తో ఎవ్వరూ పని చేయకూడదు అని సంచలన వాఖ్యలు చేశారామె. ‘‘దర్శకుడు వికాస్ బాల్ విషయంలో వస్తున్న ఆరోపణలన్నీ నిజమే. మన ఇండస్ట్రీలో స్త్రీలతో సరిగ్గా ప్రవర్తించనివాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లందర్నీ శిక్షించాలి. తమ భార్యలను పతకాలుగా ఉంచుకొని యవ్వనంలో ఉన్న స్త్రీలను గర్ల్‌ఫ్రెండ్‌గా భావించేవాళ్లను కూడా శిక్షించాలి’’ అన్నారు. మీరు ఎవర్ని ఉద్దేశించి అంటున్నారు అని అడగ్గా ‘‘నేను హృతిక్ రోషన్ గురించే మాట్లాడుతున్నాను. అతనితో కలసి పని చేయడం మానేయాలి’’ అన్నారు. -
హక్కుదారుడే రాజు
‘రాజు కుమారుడు రాజు అవుతాడన్నది పాత మాట. ఎవరికి హక్కు ఉంటుందో వారే రాజు అవుతాడు’ అన్నది కొత్త మాట అంటున్నారు హృతిక్ రోషన్. ఈ డైలాగ్ కొట్టింది ‘సూపర్ 30’ సినిమా కోసమే అని తెలిసే ఉంటుంది. బీహార్ లెక్కల మాంత్రికుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ‘సూపర్ 30’ తెరకెక్కుతోంది. హృతిక్‌రోషన్ టైటిల్ రోల్లో వికాస్బాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. లెక్కల జీనియస్ ఆనంద్ కుమార్లా మారిపోయిన హృతిక్ లుక్ సూపర్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది. -
డేటింగ్ రూమర్స్‌పై హృతిక్ క్లారిటీ
‘‘సినిమాలో అవకాశం కావాలంటే నాతో డేటింగ్‌కు రావాలి’ అంటూ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని అగ్ర హీరో హృతిక్ రోషన్ బెదిరించాడు. ఇదే విషయమై వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. కంగనా రనౌత్‌ని వేధించినట్టే దిశాని కూడా వేధిస్తున్నాడు’’ అంటూ బాలీవుడ్‌లోని కొన్ని పత్రికల్లో వార్తలు అచ్చయ్యాయి. ఈ వార్తలకు అటు హృతిక్, ఇటు దిశా మండిపడ్డారు. హృతిక్ రోషన్, దిశా పటానీ జంటగా ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ నేపథ్యంలో వీరి గురించి పై విధంగా వార్తలొచ్చాయి. ఈ వార్తలకు హృతిక్ రోషన్ స్పందిస్తూ– ‘‘మీకు పాపులారిటీ కావాలంటే నన్నే నేరుగా అడిగితే ఏమైనా చేసి ఉండేవాణ్ణి కదా? ఇలాంటి అసభ్య, అవాస్తవ వార్తలు ప్రచురించడం ఎందుకు? నిజం ఏంటో తెలుసుకోండి’’ అని సదరు పత్రికలపై మండిపడ్డారు. దిశా పటానీ కూడా స్పందిస్తూ– ‘‘హృతిక్ సార్, నా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిరాధారమైన వార్తలు ఎందుకు రాస్తున్నారు?. హృతిక్ సార్‌ని నేను కలిసినప్పుడు ఎంతో మర్యాదగా మాట్లాడారు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి వస్తున్న వార్తలను ఖండించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆయనతో కలిసి నటిస్తున్న సినిమా నుంచి నేను తప్పుకోవడంలేదు’’ అని స్పష్టం చేశారు. -
కంగనా వర్సెస్ హృతిక్!
స్వాతంత్య్ర సమరయోధుల్లో ఝాన్సీ లక్ష్మిభాయ్ ముఖ్యులు. ఆమె జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘మణికర్ణిక’. ‘ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ అనేది ట్యాగ్‌లైన్. కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేశారు. క్రిష్ దర్శకత్వం వహించారు. దేశభక్తికి సంబంధించిన చిత్రం కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ కానుందన్న వార్తలు వచ్చాయి. కానీ ‘మణికర్ణిక’ సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారన్నది తాజా ఖబర్. ఇదే రోజున హృతిక్ రోషన్ తొలిసారి నటిస్తోన్న బయోపిక్ ‘సూపర్ 30’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. వికాశ్ బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మరి.. ‘మణికర్ణిక, సూపర్ 30’ సినిమాలు ఒకే రోజున థియేటర్స్‌లోకి వస్తాయా? లేక ఏదో ఒక చిత్రం వాయిదా పడుతుందా అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. -
అంతకు మించి
ఇండియన్ సూపర్ హీరో ‘క్రిష్’ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేశాడు. అందుకే వరుసగా సీక్వెల్స్ రూపొందిస్తున్నారు దర్శక–నిర్మాత రాకేష్ రోషన్. ఆల్రెడీ ‘క్రిష్ 4’ని 2020 క్రిస్మస్ స్పెషల్‌గా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు హృతిక్ బర్త్ డే (జనవరి 10) రోజున అనౌన్స్ చేశారు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్. ఇప్పుడు ‘క్రిష్ 5’ కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్ టాక్. క్రిష్ 4, 5 సినిమాలను ఒకేసారి షూట్ చేసి, ఎడిట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట చిత్రబృందం. ఈ రెండు సీక్వెల్స్‌కు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారట. గత పార్ట్స్‌ని మించి గ్రాండ్ విజువల్స్‌తో భారీగా ఉంటాయని సమాచారం. గత సినిమాల్లో ప్రీతీ జింటా, ప్రియాంకా చోప్రా హీరోయిన్లుగా కనిపించారు. ఈ కొత్త సీక్వెల్స్‌లో కొత్త కాంబినేషన్ సెట్ అవ్వొచ్చట. మరి.. ఈ సూపర్ హీరోని మళ్లీ స్క్రీన్ మీద చూడాలంటే మరో రెండు మూడేళ్లు వేచి చూడక తప్పదు. అన్నట్లు ఒకేసారి షూట్ చేయబోతున్నారు కాబట్టి ఒకేసారి రిలీజ్ చేస్తారేమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అది జరగనే జరగదు. ముందు ఫోర్త్ పార్ట్ రిలీజ్ చేస్తారు. ఫిఫ్త్ పార్ట్ టెక్నికల్‌గా ఇంకా భారీగా ఉండటంతో ముందు షూట్ చేయాలనుకున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ టైమ్ పడుతుందని సమాచారం. -
అప్పడాలమ్మా.. అప్పడాలు!
కావాలనుకుంటే కాళ్ల ముందుకొచ్చి ఆగుతాయి కార్లు. అనుకుంటే అకాశయానం ఈజీ. ఫిక్స్ అయితే చార్టెడ్ ఫ్లైట్‌లో సింగిల్‌గా ఫ్లై అవ్వగలడు. కానీ.. గల్లీ గల్లీ తిరిగి అప్పడాలు అమ్ముతున్నారు హృతిక్ రోషన్. డబ్బులు కోసం ఎండను కూడా లెక్క చేయకుండా చెప్పులరిగేలా సైకిల్ సవారీ చేస్తున్నారు బస్‌స్టాండ్‌లో. అతనికెందుకంత కష్టం? అంటే కాదు ఇష్టం. యాక్టింగ్ అంటే ప్యాషన్. బిహారీ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా హిందీలో దర్శకుడు వికాశ్ బాల్ రూపొందిస్తున్న చిత్రం ‘సూపర్ 30’. ఆనంద్‌కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. నిజజీవితంలో ఆనంద్‌కుమార్ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అప్పడాలు అమ్మారు. ఆ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా. హృతిక్ అప్పడాలు అమ్మింది సినిమా కోసమని. ఆరడగుల అందగాడు హృతిక్ రోషన్ ఫొటోలో చూస్తున్నట్లుగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడం ఇదే తొలిసారి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన హృతిక్ రియల్ లైఫ్‌లో కూడా ఇలా కనిపించలేదు. సో.. ఈ గెటప్‌లో ఆకట్టుకోవడంతో పాటు నటనతో మెస్మరైజ్ చేస్తారని ఊహించవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయాలనుకుంటున్నారు. -
హాలీవుడ్ పిలుపొచ్చింది!
గత పదేళ్లుగా హాలీవుడ్‌కు ఇండియన్ మార్కెట్లో క్రేజ్ బాగా పెరిగింది. మరోపక్క ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టామినా కూడా రెట్టింపయింది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్‌కు మరింత దగ్గరవ్వాలని హాలీవుడ్ పెద్ద స్టూడియోలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడి స్టార్స్‌తో హాలీవుడ్ సినిమాలు నిర్మించాలన్న ఆలోచనలు చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇక్కడ ముందు వరుసలో ఉంటున్నాడు. హృతిక్ ఆరడుగులు ఉంటాడు. సిక్స్‌ప్యాక్ బాడీ. చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడని పేరు. ఆ పేరుకు తగ్గట్టే ఆయన చేసిన ‘క్రిష్’ తరహా సూపర్ హీరో సినిమాలు కూడా హాలీవుడ్‌ను తలపిస్తాయి. ఇంకేం! హృతిక్ హాలీవుడ్ హీరో అయిపోవచ్చని చాలామంది బాలీవుడ్ నిర్మాతలు అనేసుకున్నారు. హాలీవుడ్ నిర్మాతల వరకూ చేరింది ఈ మాట. దీంతో ఇప్పటికి హృతిక్‌కు రెండు, మూడు హాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. కాకపోతే అవన్నీ సెకండ్ లీడ్ అట. హాలీవుడ్లో అయితే ఫుల్ లెంగ్త్ హీరోగానే చేయాలనుకుంటున్న హృతిక్, ఈ ఆఫర్లు ప్రస్తుతానికి రిజెక్ట్ చేశాడట. మరి ఆ ఫుల్ లెంగ్త్ రోల్ ఎప్పుడొస్తుందో చూడాలి! -
క్లాస్‌కి వేళాయెరా
బుక్స్ ముందు పెట్టుకుని మ్యాథ్స్ థియరమ్స్తో కుస్తీ పడుతున్నాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. అంతలోనే బెల్ మోగింది. ఇంకేముంది? చేతికున్న గడియారంవైపు ఓ లుక్కేసి క్లాస్‌కి బయలుదేరాడు. బీహార్ గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్‌కుమార్ బయోపిక్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సూపర్ 30’. విశాల్బాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను సోమవారం స్టార్ట్ చేశారు. ‘‘పవిత్రమైన వసంత పంచమి రోజున సరస్వతి పూజతో ‘సూపర్ 30’ సినిమా జర్నీని స్టార్ట్ చేశాం. మొదటిసారిగా టీచర్ పాత్ర చేస్తున్నాను. నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి ఆ దేవత ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాను’’ అని హృతిక్ రోషన్ పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
లెక్కలు చెప్తా
...అంటున్నారు హృతిక్ రోషన్. ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారేమోనని పొరపాటు పడకండి. ఎందుకంటే ఆయన బీహార్‌కు చెందిన ఆనంద్‌కుమార్ బయోపిక్‌లో నటించబోతున్నారు. ఆనంద్‌కుమార్ ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదూ! ‘సూపర్30’ ప్రోగ్రామ్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ప్రముఖ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) సంస్థల్లో ఆడ్మిషన్ పొందేలా కృషి చేస్తున్న మ్యాథమ్యాటిషియన్ ఆనంద్‌కుమార్. రీల్‌పై ఆనంద్కుమార్గా కనిపించడానికి రెడీ అయ్యారు హృతిక్. హిందీలో ‘క్వీన్’, ‘షాందార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన వికాస్ బాల్ ‘సూపర్ 30’ టైటిల్‌తోనే ఈ సినిమా రూపొందించనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ 23న సినిమాను విడుదల చేయన్నట్లు ప్రకటించారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
హీరోలు.. హీరోయిన్స్‌కి అభిమానులుండటం కామన్. వీలైతే వారిని కలవాలని, కుదిరితే ఓ ఫొటో దిగాలని ఫ్యాన్స్ ఆరాట పడుతుంటారు. కానీ, ఓ హీరోకి మరో హీరోయిన్ అభిమాని అయితే.. తనని కలిసే అవకాశం కోసం ఎన్నో ఏళ్ల నుంచో వేచి చూస్తుంటే.. ఆ అవకాశం రానే వస్తే? ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా అదే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారట. ఈ సంతోషం అంతా తన ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్‌ని కలిసినందుకే. ఆరడుగుల అందగాడితో ఈ మిల్కీ బ్యూటీ ఫొటో దిగారు కూడా. ‘‘నా సినిమా కెరీర్ బిగినింగ్ నుంచి హృతిక్‌ను కలవాలనుకుంటున్నా. నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల్లో హృతిక్ ఒకరు. ఇన్నేళ్ల తర్వాత నా అభిమాన హీరోని కలవడం, మాట్లాడటం సో హ్యాపీ. హృతిక్‌ని కలిసిన ఆ క్షణం, కలిసి తీయించుకున్న ఫొటో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ మధురమైన జ్ఞాపకాన్ని నాకు మిగిల్చినందుకు థ్యాంక్స్’’ అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు తమన్నా.. ‘‘నిన్ను కలిసినందుకు నాకూ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యూ తమన్నా’’ అని హృతిక్ బదులిచ్చారు. -
బాక్సాఫీస్ ‘బ్యాంగ్’
టాక్ పాజిటివ్‌గా లేకపోయినా... బాలీవుడ్ డ్రీమ్ బాయ్ హృతిక్ రోషన్, సెక్సీ తార కత్రినాకైఫ్‌ల తాజా చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ బాక్సాఫీసు బద్దలు కొడుతోంది. నాలుగు రోజుల్లోనే 94.13 కోట్లు వసూలు చేసి సెంచరీ వైపు పరుగెడుతోంది. ఈ ఏడాది హయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన ఏడో చిత్రంగా రికార్డులకెక్కింది. వసూళ్లలో ఇప్పటికే అక్షయ్‌కుమార్ ‘ఎంటర్టైన్మెంట్’, అలియాభట్, వరుణ్‌ధావన్‌ల ‘హంప్టీ శర్మాకీ దుల్హనియా, ప్రియాంక చోప్రా, అర్జున్ కపూర్ ‘గూండే’ చిత్రాలను అధిగమించినట్టు కోయిమోయి డాట్ కామ్ కథనం. -
అతడే నా ఫేవరెట్!
ఖాన్ల త్రయం, హృతిక్ రోషన్... ఎందరో స్టార్లకు డ్యాన్స్ సీక్వెన్స్‌లు చేసిన ఫరాఖాన్‌కు వీళ్లలో ఎవరూ నచ్చలేదట. ఎంతమంది ఎన్ని ‘మెలికలు’ తిరిగినా... కామెడీ స్టార్ గోవింద డ్యాన్స్ చూసినంత కిక్కు రాదట. బాలీవుడ్లో సిసలైన డ్యాన్స్ కింగ్ అంటే అతడే అంటోందీ డెరైక్టర్‌గా మారిన కొరియోగ్రాఫర్. ‘గోవిందా డ్యాన్స్ చేస్తుంటే నేను ఎంతో హ్యాపీగా ఫీలవుతా’ అంటోంది. పైగా... ‘డ్యాన్స్ కమ్స్ దిల్ సే. స్టెప్స్ కమ్ ఫ్రమ్ ది మైండ్’ అంటూ కొత్త కొత్తగా ఏదేదో చెప్పేసింది తాజాగా ఓ డ్యాన్స్ రియాల్టీ షో లాంచింగ్‌లో! -
బ్యాంగ్ బ్యాంగ్ డేర్...
హృతిక్ రోషన్ జీనియస్ ఐడియా ‘బ్యాంగ్ బ్యాంగ్ డేర్’ తన సినిమాకు మాంచి పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. బీ-టౌన్ స్టార్ ఫ్రెండ్స్‌ను చిత్రవిచిత్రమైన స్టైల్లో ఈ డ్రీమ్ బాయ్ చాలెంజ్ చేస్తున్నాడు. వాళ్లూ అంతే ‘డేర్’గా స్పందిస్తున్నారు. దమ్ముంటే తలకిందులగా నిలుచో అని ప్రియాంకా చోప్రాను సవాల్ చేస్తే... అసలే మేరికోమ్ ట్రైనింగ్‌లో రాటుదేలిందేమో... క్షణం ఆలస్యం లేకుండా చేసి చూపింది. ప్రియాంకతో మొదలైన ఈ చాలెంజ్ షారూఖ్, ఫరాఅక్తర్, నర్గీస్ ఫక్రీ ఇలా సాగుతూనే ఉంది. రణబీర్ కపూర్ డిశ్చార్జ్... పుట్టిన రోజునాడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కోలుకున్నాడు. మైనర్ సర్జరీ అనంతరం ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుంచి బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యాడు. ‘ఎడినాయిడ్ టాన్సిల్’తో బాధపడుతున్న రణబీర్ గత నెల 28న ఆసుపత్రిలో చేరాడు. దీంతో కొంత కాలంగా అతను బాధపడుతున్నాడని సమాచారం. అయితే ఇది మైనర్ సర్జరీ మాత్రమేనని, ఇందులో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆసుపత్రి వర్గాల తెలిపాయి. -
వన్సపాన్ ఏ టైమ్..!
అప్పుడొద్దన్నవారే ఇప్పుడెందుకు కావాలని అంటున్నారో తెలుసుకొని కాస్త అప్సెట్ అయినట్టుంది క్యూటీ కత్రినా. ఇన్నేళ్లకు మనసులో మాట బయటపెట్టింది. ‘తొమ్మిదేళ్ల కిందట చాలామంది నటులు నన్ను వద్దన్నారు. నేనున్న సినిమాలో నటించనని తెగేసి చెప్పినవారూ ఉన్నారు. అయితే ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి గానీ, బాధపడకూడదు. బహుశా ఈ పరిస్థితి ప్రతి యాక్టర్‌కీ అనుభవమే అనుకుంటా. అయితే వేరేవాళ్లు వద్దన్నప్పుడు మనలోనూ నటుడున్నాడని గుర్తించి, ప్రోత్సహించినవాళ్లే నిజమైన మనుషులు’ అంటూ వేదాంతం చెప్పిందీ సుందరి. ఆస్కార్‌కు లయర్స్ డైస్ మెగాఫోన్ చేతపట్టిన మలయాళీ నటి గీతు మోహన్‌దాస్ రూపొందించిన ‘లయర్స్ డైస్’ చిత్రం ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో భారత్ తరఫున ఈ చిత్రం పోటీ పడుతోంది. భారత్ నుంచి ఈసారి ‘ఆస్కార్’ నామినేషన్ కోసం వికాస్బెహల్ రూపొందించిన ‘క్వీన్’, హన్సల్ మెహతా రూపొందించిన ‘షహీద్’ వంటి చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురైనా, ‘లయర్స్ డైస్’ వాటిని అధిగమించింది. డేర్ అండ్ డెవిల్ ‘చాలెంజ్’ల సీజన్‌ను టైమ్లీగా క్యాచ్ చేశాడు సూపర్‌స్టార్ హృతిక్ రోషన్. తన చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ను ప్రమోట్ చేసుకోవడానికి జీనియస్ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ చాలెంజ్ పేరు ‘బ్యాంగ్ బ్యాంగ్ డేర్’. ట్విట్టర్లో సహ నటులకు సవాల్ విసురుతున్నాడు.తాజాగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌కు ‘ధైర్యం ఉంటే ఎయిట్ ప్యాక్ కోసం నువ్వు చేసిన వర్కవుట్స్ పిక్చర్ పంపు’ అంటూ చాలెంజ్ చేశాడు.స్పందించిన షారూఖ్ ఏకంగా వర్కవుట్ వీడియోనే పంపించి డేర్ అండ్ డెవిల్ అన్పించుకున్నాడు. -
అతడితో డ్యాన్స్ పెద్ద సవాల్!
క్యూటీ కత్రినాకైఫ్... బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్‌ను కూడా ఇంతలా పొగడ్డం చూడలేదెప్పుడూ! అమ్మాయిల రాకుమారుడు హృతిక్ రోషన్‌ను మాత్రం ఆకాశానికెత్తేసిందీ అమ్మ డు. హృతిక్‌తో కలసి ‘బ్యాంగ్ బ్యాంగ్’లో నటిస్తోందీ మిల్కీ బ్యూటీ. ‘హృతిక్‌తో డ్యాన్స్ చేయడం పెద్ద చాలెంజ్. మూమెంట్స్, బాడీ ఫ్లెక్సిబిలిటీ అమోఘం. అతనితో స్టెప్స్ వేయడానికి నేను తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రిహార్సల్స్‌కు హృతిక్ రానంతవరకూ నేనే సూపర్. అతడు వచ్చిన తరువాత... బెస్ట్ ఎవరో ఇంక చెప్పక్కర్లేదు’ అంటూ నవ్వేసిందీ స్వీటీ. -
హృతిక్‌కు ‘లవ్ ఎటాక్’!
సల్మాన్ షర్ట్ తీసి కండలు చూపిస్తున్నా... షారూఖ్ కొత్తగా ఎయిట్ ప్యాక్‌తో అలరిస్తున్నా... అమ్మాయిలు మాత్రం స్వీట్ బాయ్ హృతిక్ రోషన్ వెంటే పడుతున్నారు. ‘జీబీ’ల కొద్దీ ప్రేమ లేఖలతో అతగాడి హార్డ్ డిస్క్‌ను నింపేస్తున్నారు. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ‘హాటెస్ట్ మ్యాన్’ సీటు హృతిక్‌దే. ఈ తాకిడి ఇప్పుడు భారీగా పెరిగింది. ‘ఐ లవ్ యుూ’ అంటూ రికార్డు స్థాయిలో లేఖలు వెల్లువెత్తిస్తున్నారు. మరికొంత మంది అమ్మాయిలైతే... ఇంకాస్త ముందుకెళ్లి ఏవేవో రాసేస్తున్నారట. ఈ దెబ్బకు హృతిక్ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నాడని అతని సన్నిహితుల మాట. ‘ఐస్’ ఎఫెక్ట్... ఫోన్ లాస్! ఆరేసుకోబోరుు పారేసుకోవడవుంటే ఇదేనేమో! భర్త బెన్ అఫ్లెక్ ఐస్ బకెట్ చాలెంజ్‌కు సాయుం చేయుబోరుు సెల్‌ఫోన్ పోగొట్టుకుంది బాలీవుడ్ తార జెన్నీఫర్ గార్నర్. తనపై ఐస్ బకెట్ గువ్మురించిన జెన్నీఫర్‌ను పట్టుకుని పక్కనే ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేశాడు బెన్. ఈ ‘ఎఫెక్ట్’కు పూల్‌లో వుునిగి తేలిన తరువాత గానీ కోలుకోలేదు జెన్నీఫర్. బయుటకు రాగానే వురో షాక్. పాకెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్ తడిసి వుుద్దరుు్య పనిచేయుడం వూనేసింది. కాస్త అప్సెట్ అరుునా... ‘ఫోన్ లేని ఓ రోజు’ను పూర్తిగా ఆస్వాదించానని చెప్పిందీ బ్యూటీ క్వీన్. ఆదాశర్మ రింగా.. రింగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ‘రింగా రింగా’ సాంగ్‌కు బాలీవుడ్ భావు ఆదాశర్మ ఫిదా అరుుపోరుుంది. అర్జున్ డ్యాన్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోరుుందట. అంతేకాదు... తాను వులేిసియూలో ఇవ్వబోతున్న స్టేజి షోలో ఈ పాటకే డ్యాన్స్ చేస్తుందట. అర్జున్‌కు పెద్ద ఫ్యాన్ కూడా అరుున ఆదాశర్మ... ‘ఆ వుూమెంట్స్ చేయూలంటే వూస్టర్ అరుువుండాలి. అర్జున్... అసలు అంతలా స్టెప్పులు ఎలా అదరగొట్టగలిగావు’ అంటూ ట్వీట్ చేసింది. అన్నట్టు అర్జున్‌తో ఓ తెలుగు సినివూ చేయుబోతోందీ తార. ఉన్నట్టుండి అంతలా అర్జున్ను ఆకాశానికెత్తేయుడానికి అసలు కారణం ఇదేనని టీ-టౌన్ గుసగుస.