ముంబైలోని క్రూయిజ్ షిప్‌లో జరిగిన పార్టీకి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (23)కు బాలీవుడ్ ప్రముఖులు సపోర్టుగా నిలిచిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, పూజా భట్ వంటి సెలబ్రీటీలు ఆర్యన్‌కి మద్దతు తెలపగా.. తాజాగా మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ అతనికి సపోర్టు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
అందులో.. ‘నువ్వు (ఆర్యన్) నాకు చిన్న పిల్లాడిగా, పెద్దవాడిగా తెలుసు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న అన్ని ఈ పరిస్థితులని అర్థం చేసుకో. ఈ అనుభవాలు నీకు ఉపయోగపడతాయి. నన్ను నమ్ము ఇవి నీకు కచ్చితంగా మంచే చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న కోపం, అయోమయం, నిస్సహాయ సిట్యువేషన్స్ నీలోని హీరోని బయటికి తీసుకువస్తాయి. దేవుడు ఎప్పుడు బలమైన వారికే ఎక్కువ కష్టాలను ఇస్తాడు. నువ్వు భవిష్యత్తులో మంచి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నావు’ అంటూ రాసుకొచ్చాడు ఈ ఇండియన్ సూపర్ హీరో. ఆర్యన్‌కు సపోర్టుగా పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇంతకుముందే హ్యాండ్సమ్ హీరో భార్య సుసానే ఖాన్ సైతం షారుక్ కుటుంబానికి మద్దతు తెలిపింది.
అయితే హృతిక్ రోషన్ ‘క్రిష్’ సినిమాల సిరీస్‌తో ఇండియన్ తొలి సూపర్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన ప్రస్తుతం దీపిక పదుకోనే కలిసి‘ఫైటర్’లో నటిస్తుండగా, మరికొన్ని సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నాయి.
చదవండి: సోషల్ మీడియాని ఊపేస్తున్న #WeStandWithSRK
Comments
Please login to add a commentAdd a comment