
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంపై ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై మరో బాలీవుడ్ సినీయర్ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించాడు. ఈ కేసు ఆర్యన్ టార్గెట్ అవ్వడానికి కారణం షారుక్ ఖానే అని తెలిపాడు.
శత్రుఘ్న సిన్హా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలో ఈ విషయంపై పోరాడటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది వేరొకరి సమస్య వారే దీన్ని పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. ఇండియాలోనే మీడియా లాగానే ఇక్కడి వ్యక్తులు సైతం భయపడుతున్నారు. అయితే ఆర్యన్‌ను లక్ష్యంగా మారడానికి అతని మతమే కారణమని అందరూ అభిప్రాయపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా అతను భారతీయుడే’ అని తెలిపాడు.
ఈ కేసు విషయంలో మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్ వంటి వారున్నా ఆర్యన్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి మాత్రం కచ్చితంగా బాద్‌షా సెలబ్రిటీ కావడమే కారణమని చెప్పాడు. ఇంతకుముందు ఓ కేసులో సైతం ఇలాగే దీపిక పదుకొనే పైన మాత్రమే మీడియా ఎక్కువగా ఫోకస్ పెట్టిందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇలాంటి కేసుల్లో జరిగే మూత్ర, రక్త పరీక్షలు ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు.
చదవండి: జాకీ చాన్ అలా చేశాడంటూ.. షారుక్ ఖాన్‌ని టార్గెట్ చేసిన ఫైర్ బ్రాండ్
Comments
Please login to add a commentAdd a comment