Aryan Drug's Case: ముంబై డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరో ఏడుగురిని ఎన్సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు, షారుక్ అభిమానులు ఆయన కుటుంబానికి మద్దతుగా నిలిచారు. అయితే గత శుక్రవారం జరిగిన బెయిల్ పిటిషన్‌ని కొట్టి వేసిన కోర్టు అందరిని ఆర్థర్ రోడ్‌కి తరలించింది.
ఈ కేసులో నిందితుల బెయిల్ విషయమై ఎన్సీబీ ఇచ్చిన అప్లికేషన్లను సోమవారం జరిగిన విచారణలో కోర్టు తోసిపుచ్చింది. బుధవారంలోపు డిపార్ట్‌మెంట్ రెస్పాన్స్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్సీబీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. కేవలం ఆర్యన్‌ఖాన్ విషయంలోనే తమ వాదన వినిపిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో ఆర్యన్ మరో మూడు రోజులు జైలులోనే ఉండనున్నాడు.
చదవండి: ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణలో లాయర్ వాదన సాగిందిలా..
Comments
Please login to add a commentAdd a comment