హాలీవుడ్ సినిమాకు షారూఖ్ ఫ్యామిలీ మాట సాయం | Shah Rukh Khan And His Children Dubbed For Hindi Version Of Mufasa The Lion King Movie | Sakshi
Sakshi News home page

Mufasa Shah Rukh Khan: షారూఖ్ కొడుకులు.. డబ్బింగ్‌తో మొదలుపెట్టారు!

Published Mon, Aug 12 2024 3:47 PM | Last Updated on Mon, Aug 12 2024 4:53 PM

Shah Rukh Khan And His Children Dubbed For Mufasa Movie

హాలీవుడ్‌లో అప్పుడప్పుడు కార్టూన్ సినిమాలు వస్తుంటాయి. ఇందులో పాత్రలకు ఏ భాషకు ఆ భాషలో ఫేమస్ నటీనటులు డబ్బింగ్ చెబుతుంటారు. గతంలో రానా, మహేశ్ కూతురు సితార.. ఇలా తమ గాత్రాన్ని అందించారు. ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తన కొడుకులతో కలిసి మాట సాయం చేశాడు.

(ఇదీ చదవండి: ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!)

అడవి బ్యాక్ డ్రాప్‌ కథతో తీసిన 'ద లయన్ కింగ్' సినిమా చాన్నాళ్ల క్రితమే వచ్చింది. ఇందులోనే ముఫాసా అనే పాత్ర కాస్త ఫేమస్. ఇప్పుడు దీన్ని మెయిన్ లీడ్‌గా తీసుకుని ముఫాసా చిన్నప్పుడు ఏం జరిగింది? ఎలా రాజుగా ఎదిగింది అనే స్టోరీతో ఓ మూవీ తీశారు. ఈ ఏడాది డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

రీసెంట్‌గా 'ముఫాసా' ట్రైలర్ రిలీజ్ చేయగా.. బాగానే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హిందీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో పెద్ద ముఫాసా పాత్రకు షారూఖ్, చిన్నప్పటి ముఫాసా పాత్రకు షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్, సింబా పాత్రకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. దీని వల్ల హిందీ మార్కెట్‌లో వసూళ్లు బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

(ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement