సినిమా కోసం నటీనటులు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడూ ఉండేదే. కానీ తొలిసారి ఓ కుక్కతో డబ్బింగ్ చెప్పించారు! నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజం. 'నను మత్తు గుండా 2' అనే కన్నడ మూవీ కోసం ఇదంతా జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని దర్శకుడే బయటపెట్టాడు. కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇంతకీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే?
(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!)
రీసెంట్ టైంలో కన్నడ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చకుంటోంది. కేజీఎఫ్, చార్లీ తదితర చిత్రాలు నేషనల్ వైడ్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి కన్నడ ఇండస్ట్రీ వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఓ సినిమా కోసం కుక్క పాత్రకు డబ్బింగ్ చెప్పించడం. 2020లో థియేటర్లలో రిలీజైన 'నాను మత్తు గుండా' మూవీ హిట్‌గా నిలిచింది. ఆటో డ్రైవర్, గుండా అనే అనాథ కుక్కని పెంచుకోవడం అనే కాన్సెప్ట్‌తో తీశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే సినీ చరిత్రలోనే తొలిసారి కుక్క పాత్ర దానితోనే డబ్బింగ్ చెప్పించారట. లాబ్రాడర్ జాతికి చెందిన సింబా అనే శునకం కీలక పాత్ర పోషించిందని, నేచురాలిటీ కోసం సదరు కుక్కతోనే డబ్బింగ్ చెప్పించామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారట. ఈ సీక్వెల్ మూవీకి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సంగీతమందించడం విశేషం.
(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)
Comments
Please login to add a commentAdd a comment