labrador
-
ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!
సినిమా కోసం నటీనటులు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడూ ఉండేదే. కానీ తొలిసారి ఓ కుక్కతో డబ్బింగ్ చెప్పించారు! నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజం. 'నను మత్తు గుండా 2' అనే కన్నడ మూవీ కోసం ఇదంతా జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని దర్శకుడే బయటపెట్టాడు. కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇంతకీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే?(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!)రీసెంట్ టైంలో కన్నడ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చకుంటోంది. కేజీఎఫ్, చార్లీ తదితర చిత్రాలు నేషనల్ వైడ్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి కన్నడ ఇండస్ట్రీ వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఓ సినిమా కోసం కుక్క పాత్రకు డబ్బింగ్ చెప్పించడం. 2020లో థియేటర్లలో రిలీజైన 'నాను మత్తు గుండా' మూవీ హిట్‌గా నిలిచింది. ఆటో డ్రైవర్, గుండా అనే అనాథ కుక్కని పెంచుకోవడం అనే కాన్సెప్ట్‌తో తీశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే సినీ చరిత్రలోనే తొలిసారి కుక్క పాత్ర దానితోనే డబ్బింగ్ చెప్పించారట. లాబ్రాడర్ జాతికి చెందిన సింబా అనే శునకం కీలక పాత్ర పోషించిందని, నేచురాలిటీ కోసం సదరు కుక్కతోనే డబ్బింగ్ చెప్పించామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారట. ఈ సీక్వెల్ మూవీకి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సంగీతమందించడం విశేషం.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ) -
ఇదేం పోయే కాలం.. ఇలాంటి దొంగతనమా
లండన్: తప్పిపోయిన కుక్క కోసం దాని యజమాని డిటెక్టివ్ అవతారం ఎత్తాడు. ఎంతో శ్రమపడి తన పెంపుడు కుక్కను దాచిన స్థావరానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి భారీ షాక్ తగిలింది. తన పెంపుడు కుక్క కోసం వెళ్తే అతడికి అక్కడ మరో 70 కుక్కలు కనిపించాయి. వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. ఇంతకు ఈ కుక్కలన్ని ఎవరు దొంగిలించారు.. ఎందుకు అనే వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. లండన్‌లో నివాసం ఉంటున్న టోని క్రోనిన్ అనే వ్యక్తి స్వానియల్స్ జాతికి చెందిన కుక్కలను పెంచుకుంటుండేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అతడి పెంపెడు కుక్కలను ఎవరో దొంగిలించారు. మొత్తం ఏడు కుక్కలు చోరికి గురవ్వగా.. వీటిలో ఐదు కుక్క పిల్లలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కుక్కలను దొంగిలించిన వారి గురించి.. వాటిని ఎక్కడ దాచారనే విషయాల గురించి టోనికి కొద్దిగా సమాచారం తెలిసింది. అలా తన పెంపుడు కుక్కలను వెతక్కుంటూ అతడు కార్మర్థైన్షైర్కు వెళ్లాడు. అక్కడ తన కుక్కలతో పాటు మరో 70 కుక్కలను కూడా చూసి షాకయ్యాడు. వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపాడు. ఈ సందర్భంగా టోని మాట్లాడుతూ.. ‘‘నా పెంపుడు కుక్కలను వెతుకుతూ వెళ్లిన నాకు అక్కడ మరో 70 కుక్కలు కనిపించాయి. వీటిలో లాబ్రడార్స్, వెస్టీస్, పగ్స్ వంటి వేర్వేరు జాతుల కుక్కలు ఉన్నాయి. వీటి మధ్యలో నా పెంపుడు కుక్క ఉంది. మమ్మల్ని చూడగానే అవి భయంతో అరిచాయి. నా పెంపుడు కుక్క నన్ను గుర్తు పట్టింది. నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. పాపం దానికి భయం ఇంకా పోలేదు. నా కాళ్ల మధ్య దూరింది’’ అని తెలిపాడు. వీటన్నింటిని వారు ఎందుకు దొంగిలించారో అర్థం కావడం లేదన్నాడు టోని. ఇక వీటిలో 22 కుక్కలను వాటి యజమానులకు అప్పగించారు. మిగిలిన వాటిని సంరక్షిస్తున్నామని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: అదృష్టం అంటే ఈ కుక్కదే.. రూ.36 కోట్ల ఆస్తి పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్ -
నాదంటే నాదే.. కుక్కకు డీఎన్ఏ టెస్ట్
భోపాల్ : భారత్‌లో డీఎన్ఏ టెస్ట్ అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే చేస్తుంటారు. వారసత్వం విషయంలో కుటుంబ పరమైన విభేదాలు వచ్చిప్పుడు అసలైన వారసుడు ఎవరో తెలుసుకోవాడనికి ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుంటారు. అతడు నా తండ్రే కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేసుకోండి అంటూ కొందరు మీడియా ముందుకు వచ్చిన సందర్భాలనూ చూశాం. కానీ ఆశ్చర్యకరంగా ఓ పెట్‌డాగ్ (పెంపుడు కుక్కకు) డీఎన్ఏ టెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన అరుదైన కేసు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌కు చెందిన ఇద్దరి వ్యక్తుల మధ్య కుక్క విషయంపై వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం చివరికి డీఎన్ఏ టెస్ట్ చేయాల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముంటున్న సాహెబ్ ఖాన్ అనే వ్యక్తి తమ కుక్క గత కొన్నిరోజులుగా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కార్తీక్ శివ్‌హారే అనే ఏబీవీపీ నేత సైతం ఇదే తరహా ఫిర్యాదు చేశారు. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు.. కుక్క కోసం వెతకడం ప్రారంభించగా అచూకీ లభించింది. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చిపడింది. ఆ కుక్కను ఎవరికి అప్పగించాలి అనేది తలనొప్పిగా మారింది. దీనిపై ఇరు వర్గాలను పిలిపించగా.. ఆ కుక్క తమదంటే.. తమదేఅంటూ వాదించడం ప్రారంభించారు. మొదట ఫిర్యాదు చేసిన సాహెబ్ ఖాన్ ఆ కుక్క వివరాలను వెల్లడిస్తూ.. మూడు నెలల క్రితం ఆ కుక్కను ఫలానా వ్యక్తి దగ్గర కొనుగోలు చేశానని, దాని పేరు కోకోగా పెట్టుకున్నాని వివరించారు. ఆ కుక్క తల్లి వివరాలను కూడా వెల్లడించాడు. మరోవైపు కార్తీక్ కూడా ఈ కుక్క తనదేఅని గట్టిగా చెప్పారు. నాలుగు నెలల కిత్రం ఓ వ్యక్తి వద్ద కొన్నానని, దాని పేరు టైగర్ అని చెప్పారు. ఆ కుక్క తల్లి వివరాలను కూడా వెల్లడించారు. అయితే ఆ కుక్క మాత్రం కోకా అని పిలిచినా, టైగర్ అని పిలిచినా స్పందించడం పోలీసులతో పాటు ఇద్దరు యజమానులను ఆశ్యర్యానికి గురిచేసింది. ఇక చేసేదేమీ లేక.. చివరికి పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. కుక్కకు డీఎన్ఏ టెస్ట్ చేసి దాని తల్లి వివరాలు తెలుసుకుంటే అసలైన యజమాని ఎవరనేది తెలుసుకోవడం సులభమవుతుందని భావించారు. దీనిపై స్థానిక ఎస్పీ మాట్లాడుతూ. కుక్కపై తాము బాధ్యతగా ఉన్నామని, పరీక్ష అనంతరం అసలైన యజమానికి అప్పగిస్తామన్నారు. అయితే ఈ కుక్క చివరికి ఎవరికి దక్కుతుందన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మరోవైపు ఈ కేసుపై జంతు హక్కుల పరిరక్షణ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూగజంతువుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని, వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని గుర్తించింది..
షోపియాన్: ఒత్తిడుల నుంచి కాపాడే గొప్ప నేస్తాలు శునకాలు. కశ్మీర్‌లోని సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న 44 రాష్ట్రీయ రైఫిల్స్(ఆర్ఆర్)కు సేవలందిస్తున్న ‘రోష్’విషయంలో ఇది అక్షరాలా సత్యం. రెండేళ్ల వయస్సున్న ఈ లాబ్రడార్ జాగిలం ఆ కంపెనీలోని సైనికులందరికీ ఆప్తమిత్రుడు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, మందుపాతరల గుర్తింపు, చొరబాటుదార్ల ఏరివేత వంటి వాటి కోసం 44వ ఆర్ఆర్ యూనిట్ దక్షిణ కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తోంది. ఇందులోనే రోష్, తపి, క్లైడ్ అనే శునకాలతో కెనైన్ స్క్వాడ్ ఉంది. ‘మా సెలిబ్రిటీల్లో రోష్ కూడా ఒకటి. గత ఏడాది ద్రగార్ వద్ద జరిగిన ఎన్కౌంటర్ సందర్భంగా సుజ్జు మగ్రే అనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తప్పించుకుపోయాడు. (చదవండి: ఎల్ఏసీ వద్ద పాకిస్తాన్ సైనికులు!) సంఘటన ప్రాంతం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని చెట్ల పొదల్లో దాక్కుని ఉండగా అతడిని రోష్ గుర్తించింది’ అని 44 ఆర్ఆర్ చీఫ్ కల్నల్ ఏకే సింగ్ తెలిపారు. ‘నాతోపాటు మా యూనిట్ సభ్యులందరికీ రోష్ అంటే ఇష్టం. ఏదైనా మంచి పనిచేసినప్పుడు అందరూ రోష్‌ను ప్రేమగా తట్టడం, పలకరించడం, ఆడుకోవడం, బిస్కెట్లు వంటి తినిపించడం చేస్తుంటారు’అని రోష్‌ను నిమురుతూ ఆయన గర్వంగా చెప్పారు. ఈ ఏడాది ఆర్మీ డే సందర్భంగా ఈ ప్రాంత ఆర్మీ చీఫ్ నుంచి కమెండేషన్ కార్డు కూడా పొందిందన్నారు. -
దొంగలకు కుక్కపిల్ల ఝలక్!
మెల్బోర్న్ : ఎనిమిది నెలల ఓ కుక్కపిల్ల దొంగలకు ముచ్చెమటలు పట్టించింది. యజమాని ఇంట్లో జరిగిన చోరీలో దొంగలు ల్యాప్‌టాప్, ఐపాడ్ సహా పప్పీని ఎత్తుకెళ్లగా మూడు రోజుల తర్వాత దొంగల కళ్లుగప్పి తప్పించుకుంది. తన ఫ్రెండ్ పప్పీ లేదని బెంగపెట్టుకున్న నాలుగేళ్ల చిన్నారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.. ఓ కుటుంబం గత సోమవారం బయటకు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడ్డారు. ఆభరణాలు, ల్యాప్‌టాప్, ఐపాడ్, లాబ్రడార్ జాతికి చెందిన ఓ కుక్కపిల్ల (సాశా), ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇంటికి రాగానే బాధిత కుటుంబానికి విషయం అర్థమైంది. ఐతే తనఫ్రెండ్ సాశా(కుక్కపిల్ల) ను దొంగలు తీసుకెళ్లారని నాలుగేళ్ల ఓనర్ కూతురు తిండి మానేసి బెంగపెట్టుకుంది. దొంగల్ని పట్టుకుని తమ కుక్కపిల్లను ఇప్పించాలని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన విక్టోరియా పోలీసులు ఓ ట్వీట్ చేశారు. 8నెలల పప్పీ అనే కుక్కపిల్ల కిడ్నాప్ అయిందని, డిటెక్టివ్స్ దర్యాప్తు చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. కుక్కపిల్ల మూడ్రోజుల తర్వాత ఇంటికి వచ్చేసింది. పప్పీ కారణంగా దొరికిపోతామని భయాందోళనకు గురైన దొంగలు ఆ కుక్కపిల్లను ఇంటిదగ్గర వదివెళ్లుంటారని పోలీసులు భావిస్తున్నారు. 'దొంగల నిజాయితీ ఎవడికి కావాలి.. మా పప్పీనే దొంగల కళ్లుగప్పి వచ్చేసింది. దొంగల్ని అరెస్ట్‌చేసి ఇతర విలువైన వస్తువులు తమకు వచ్చేలా చూడాలని' బాధిత కుటుంబం మరోసారి పోలీసులను కోరింది. -
ఆ దేవుడు నన్ను హర్ట్ చేయలేదు!
ముంబై: నాన్న విషయంలో తనను ఆ దేవుడు హర్ట్ చేయలేదని అంటున్నాడు కపిల్ శర్మ. 'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంతో స్టార్ హోదాను సంపాదించుకున్న కపిల్.. తన తండ్రి చివరి క్షణాలు చాలా బాధను మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 'నా తండ్రితో నేను గడిపిన సమయం చాలా తక్కువ. ఆయన ఆఖరి రోజుల్లో మాత్రం నాన్నతోనే ఉన్నా. నాన్న కేన్సర్ బారిన పడ్డాక ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్ల్లే వాణ్ని. ఆ సమయంలో ఆయన బాధను నేను చూడలేక పోయేవాణ్ని. ఆ క్రమంలోనే నాన్నను ఆ దేవుడు తీసుకువెళ్లిపోవాలని ప్రార్ధించే వాణ్ని. ఆ దేవుడు నామొర ఆలకించాడు. నాన్నను తొందరగానే ఈ లోకం నుంచి తీసుకుపోయాడు. ఈ విషయంలో దేవుడు నన్ను హర్ట్ చేయలేదు' అని కపిల్ తెలిపాడు. 'ప్రతీ ఒక్కరి తల్లి దండ్రులు బిడ్డల నుంచి ఏదో ఒకటి ఆశిస్తారని.. నా పేరెంట్స్ మాత్రం నన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదన్నాడు. వారు ఏ రోజూ కూడా నా నుంచి ఏమీ ఆశించలేదని' కపిల్ అన్నాడు. నాన్నకు జబ్బు చేసిన సమయంలో అద్దె ఇంట్లో ఉంటున్న మా వద్ద ఆయనకు కనీసం వైద్యం చేయడానికి కూడా డబ్పులు ఉండేవు కావన్నాడు. నాన్న జీతంతోనే నెల్లో కొన్నిరోజులు ఆయన్న సంతోషం ఉంచేవాళ్లమని, ఇప్పుడు తాను సంపాదిస్తున్నా నాన్న మాత్రం మా నుంచి దూరమైయ్యారని తన మనసులోని మాటలను వెల్లడించాడు. దేవుడి ఏది చేసినా అది మన మంచికే చేస్తాడని భావించాలని కపిల్ స్పష్టం చేశాడు. -
జంజీర్ ను దత్తత తీసుకున్న కపిల్ శర్మ!
'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంతో స్టార్ హోదాను సంపాదించుకున్న కపిల్ శర్మ రిటైరైన పోలీస్ కుక్కను దత్తత తీసుకున్నారు. పలు సంవత్సరాలుగా పోలీసు విభాగానికి సేవలందించిన లాబ్రడార్ జాతికి చెందిన కుక్కను జంతు సంరక్షణ సంస్థ నుంచి దత్తత తీసుకున్నారు. కపిల్ దత్తత తీసుకున్న కుక్క పేరు జంజీర్ అని ట్విటర్ లో పోటోలతోపాటు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. నా కుటుంబంలో ఓ కొత్త భాగస్వామి చేరింది. ముంబై పోలీసులకు సేవలందించింది. జంజీర్ గురించి మరిన్ని విషయాలు త్వరలో మీతో పంచుకుంటాను అని కపిల్ ట్వీట్ చేశారు. జంతువుల సంరక్షణ పట్ల ఉన్న కపిల్ అభిరుచిని ప్రశంసిస్తున్నారు. కపిల్, ఆయన సతీమణి ప్రీతిలకు కేవలం కృతజ్క్షతలు మాత్రమే చెప్పలేమని.. జంతు ప్రేమికులను తమ సంస్థ ఎల్లప్పుడు గౌరవించడానికి సంస్థ సిద్దంగా ఉంటుందని నిర్వహకులు తెలిపారు. -
బ్రిటిష్ శునకం అరుదైన రికార్డు
ఇంగ్లండ్‌లోని ఓ లాబ్రడార్ శునకం అరుదైన రికార్డు సాధించింది. 250 గంటలకు పైగా విమానంలో పయనించి, క్రూ కార్డు పొందిన మొట్టమొదటి శునకంగా పేరొందింది. కాలీ అనే ఈ శునకం తన యజమాని గ్రాహమ్ మౌంట్ఫోర్డ్తో కలిసి బ్రిటన్ మొత్తం తిరిగేసింది. దానికి 12 వారాల వయసు ఉన్నప్పటి నుంచి మౌంట్‌ఫోర్డ్ దాన్ని తీసుకుని విమాన ప్రయాణాలు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఇప్పటికది దాదాపు 80,467 కిలోమీటర్లు ప్రయాణించింది. చిన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లు మొదలుపెట్టి అంతర్జాతీయ విమానాశ్రయాల వరకు అన్నింటిలోనూ ఇది దిగింది. ఇప్పుడు కాలీకి క్రూకార్డు రావడంతో, కేవలం విమాన సిబ్బంది మాత్రమే తిరిగేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో కూడా తిరిగేందుకు దానికి అనుమతి లభించినట్లయింది. బ్రిటన్‌లో ఈ హోదా పొందిన ఏకైక శునకం కాలీ మాత్రమే. విమానాల యజమానులు, పైలట్ల సంఘం దానికి ఈ గుర్తింపు ఇచ్చింది. మౌంట్ఫోర్డ్కు సొంతంగా ఉన్న ఆరు సీట్ల సెస్నా విమానంలోని కో పైలట్ కుర్చీలో కూడా దీన్ని కూర్చోబెట్టడానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదు.