లండన్: తప్పిపోయిన కుక్క కోసం దాని యజమాని డిటెక్టివ్ అవతారం ఎత్తాడు. ఎంతో శ్రమపడి తన పెంపుడు కుక్కను దాచిన స్థావరానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి భారీ షాక్ తగిలింది. తన పెంపుడు కుక్క కోసం వెళ్తే అతడికి అక్కడ మరో 70 కుక్కలు కనిపించాయి. వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. ఇంతకు ఈ కుక్కలన్ని ఎవరు దొంగిలించారు.. ఎందుకు అనే వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే..
లండన్‌లో నివాసం ఉంటున్న టోని క్రోనిన్ అనే వ్యక్తి స్వానియల్స్ జాతికి చెందిన కుక్కలను పెంచుకుంటుండేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అతడి పెంపెడు కుక్కలను ఎవరో దొంగిలించారు. మొత్తం ఏడు కుక్కలు చోరికి గురవ్వగా.. వీటిలో ఐదు కుక్క పిల్లలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కుక్కలను దొంగిలించిన వారి గురించి.. వాటిని ఎక్కడ దాచారనే విషయాల గురించి టోనికి కొద్దిగా సమాచారం తెలిసింది. అలా తన పెంపుడు కుక్కలను వెతక్కుంటూ అతడు కార్మర్‌థైన్‌షైర్‌కు వెళ్లాడు. అక్కడ తన కుక్కలతో పాటు మరో 70 కుక్కలను కూడా చూసి షాకయ్యాడు. వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపాడు.
ఈ సందర్భంగా టోని మాట్లాడుతూ.. ‘‘నా పెంపుడు కుక్కలను వెతుకుతూ వెళ్లిన నాకు అక్కడ మరో 70 కుక్కలు కనిపించాయి. వీటిలో లాబ్రడార్స్, వెస్టీస్, పగ్స్ వంటి వేర్వేరు జాతుల కుక్కలు ఉన్నాయి. వీటి మధ్యలో నా పెంపుడు కుక్క ఉంది. మమ్మల్ని చూడగానే అవి భయంతో అరిచాయి. నా పెంపుడు కుక్క నన్ను గుర్తు పట్టింది. నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. పాపం దానికి భయం ఇంకా పోలేదు. నా కాళ్ల మధ్య దూరింది’’ అని తెలిపాడు.
వీటన్నింటిని వారు ఎందుకు దొంగిలించారో అర్థం కావడం లేదన్నాడు టోని. ఇక వీటిలో 22 కుక్కలను వాటి యజమానులకు అప్పగించారు. మిగిలిన వాటిని సంరక్షిస్తున్నామని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: అదృష్టం అంటే ఈ కుక్కదే.. రూ.36 కోట్ల ఆస్తి
పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్
Comments
Please login to add a commentAdd a comment