UK Man Take His Pet Dog For Pregnant Treatment To Hospital, See What Happened Next - Sakshi
Sakshi News home page

Strange Pregnancy: కుక్క గర్భవతి అనుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు... ఆశ్చర్యపోయిన వైద్యులు

Published Wed, Feb 16 2022 9:04 PM | Last Updated on Thu, Feb 17 2022 9:37 AM

The Owner Took The Dog To The Doctor As A Pregnant - Sakshi

Owner Felt The Dog Had Become Pregnant: చాలా రకాల సంఘటనలు గురించి విన్నప్పుడూ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మనకు ఆనందాన్ని ఇస్తే మరికొన్ని మాత్రం మనకు భయాన్ని కలుగజేస్తాయి కూడా. అచ్చం అలాంటి సంఘటనే యూకేలో చోటు చేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే...యూకేకి చెందిన నీల్ టేలర్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క ఆల్ఫీ కొన్ని రోజులుగా వాంతులు చేసుకుంటూ నీరసంగా ఉంది. పైగా ఆ కుక్క పొట్ట ఉబ్బి ఉంది. దీంతో నీల్‌ కుక్క కడుపుతో ఉందనుకుని ఆనందంగా బ్లైత్‌మ్యాన్ పార్ట్‌నర్స్ వెటర్నరీ ప్రాక్టీస్ క్లినిక్‌కి తీసుకెళ్లాడు. అయితే అక్కడ డాక్టర్లు ఆ కుక్కని పరీక్షించి ఎక్క్‌రే తీశారు. అంతే వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

వైద్యులు అసలు విషయం నీల్‌కి వివరించారు. కుక్క కడుపులో చాలా గోల్ఫ్‌ బంతులు ఉన్నాయని వైద్యులు చెప్పారు. దీంతో ఆ కుక్కకి వైద్యులు సర్జరీ చేసి ఏకంగా 25 గోల్ఫ్‌ బంతులను కడుపులోంచి తీశారు. ఇన్ని గోల్ఫ్‌ బంతులు కుక్క కడుపులోకి ఎలా ఉంచాయో తెలియదని టేలర్‌ చెప్పాడు. అయితే కొద్ది రోజుల క్రితం  నీల్ టేలర్.. ఆల్ఫీ(కుక్క)తో కలిసి గోల్ఫ్ కోర్టుకు వెళ్లినట్లు చెప్పాడు.

అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆల్ఫీ పరిస్థితి విషమించడం ప్రారంభించిందని అన్నాడు. పైగా ఆకస్మాత్తుగా ఆల్ఫీకి వాంతులు అవ్వడం, నీరసంగా మారిపోవడం జరిగిందని వాపోయాడు. కానీ ఆల్ఫీ ఇన్ని బంతులు మింగినట్లు తాను గమనించలేదని చెప్పుకొచ్చాడు. అయితే నీల్‌కి ఆ ఆసుపత్రి సర్జరీ కోసం సుమారు రూ. 2 లక్షల 37 వేల బిల్లు వేశారు. నీల్‌ మాత్రం తన కుక్క  ప్రాణాలతో సురక్షితంగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నాడు.

(చదవండి: మోడల్‌గా మారిన 60 ఏళ్ల కూలీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement