జంజీర్ ను దత్తత తీసుకున్న కపిల్ శర్మ! | Comedian Kapil Sharma adopts retired police dog | Sakshi
Sakshi News home page

జంజీర్ ను దత్తత తీసుకున్న కపిల్ శర్మ!

Published Wed, Jul 16 2014 1:38 PM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

జంజీర్ ను దత్తత తీసుకున్న కపిల్ శర్మ!

జంజీర్ ను దత్తత తీసుకున్న కపిల్ శర్మ!

'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంతో స్టార్ హోదాను సంపాదించుకున్న కపిల్ శర్మ రిటైరైన పోలీస్ కుక్కను దత్తత తీసుకున్నారు. పలు సంవత్సరాలుగా పోలీసు విభాగానికి సేవలందించిన లాబ్రడార్ జాతికి చెందిన కుక్కను జంతు సంరక్షణ సంస్థ నుంచి దత్తత తీసుకున్నారు. కపిల్ దత్తత తీసుకున్న కుక్క పేరు జంజీర్ అని ట్విటర్ లో పోటోలతోపాటు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
 
నా కుటుంబంలో ఓ కొత్త భాగస్వామి చేరింది. ముంబై పోలీసులకు సేవలందించింది. జంజీర్ గురించి మరిన్ని విషయాలు త్వరలో మీతో పంచుకుంటాను అని కపిల్ ట్వీట్ చేశారు. జంతువుల సంరక్షణ పట్ల ఉన్న  కపిల్  అభిరుచిని ప్రశంసిస్తున్నారు. కపిల్, ఆయన సతీమణి ప్రీతిలకు కేవలం కృతజ్క్షతలు మాత్రమే చెప్పలేమని.. జంతు ప్రేమికులను తమ సంస్థ ఎల్లప్పుడు గౌరవించడానికి సంస్థ సిద్దంగా ఉంటుందని నిర్వహకులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement