కపిల్ శర్మ సంపాదన ఎంతో తెలుసా?
కపిల్ శర్మ సంపాదన ఎంతో తెలుసా?
Published Thu, Dec 8 2016 11:50 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
కపిల్ శర్మ అనగానే కామెడీ నైట్స్ షో గుర్తుకొస్తుంది. దాంతో బాగా పాపులర్ అయిన కపిల్.. బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాడు. దేశంలోనే అతిపెద్ద స్టాండప్ కమెడియన్‌గా పేరుపొందాడు. అలాంటి కపిల్‌ను ఎవరు మాత్రం వదులుకుంటారు, అందుకే సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 2017 సంవత్సరానికి అతడితో కొత్త కాంట్రాక్టు కుదుర్చుకుంటోంది. దాని ప్రకారం వచ్చే సంవత్సరంలో అతడి మొత్తం సంపాదన దాదాపు రూ. 110 కోట్లు ఉంటుందట! ఒక్క ఎపిసోడ్‌కే అతడు దాదాపు 60-80 లక్షలు తీసుకుంటున్నాడు. దాంతో బాలీవుడ్‌లో అత్యధికంగా సంపాదించే తారల సరసన కపిల్ కూడా నిలిచాడు.
ఇంతకుముందు కూడా అతడు కలర్స్ చానల్‌లో నిర్వహించిన కామెడీ నైట్స్ విత్ కపిల్ షో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మంచి లాభదాయకంగా నిలిచింది. ప్రధానంగా వారాంతాల్లో టీవీలు అంతగా చూడరు అనుకునే సమయంలో కూడా జనాన్ని టీవీల ముందు కట్టి పడేయడం కపిల్ షోకే సాధ్యమైంది. షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్దపెద్ద స్టార్లు కూడా ఈ షోకు వస్తుంటారు. ఇక హీరోయిన్లతో కపిల్ చేసే రొమాంటిక్ కామెడీ చూస్తే విపరీతంగా నవ్వుకోవాల్సిందే. దీపికా పదుకొనే, శిల్పాశెట్టి లాంటి పొడవైన తారల విషయంలో అయితే ముద్దుపెట్టుకోవాలంటే నిచ్చెన తెచ్చుకోవాల్సి ఉంటుందని తరచు అంటుంటాడు.
ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌కు వెళ్లి క్వాంటికో సిరీస్ చేస్తే, ఆ సిరీస్ మొత్తానికి కలిపి ఆమెకు 11 మిలియన్ డాలర్లు ఇచ్చారు. ఇప్పుడు కపిల్ శర్మ తీసుకుంటున్నది 14.7 మిలియన్ డాలర్లు అవుతుంది. అంటే, హాలీవుడ్ సంపాదన కంటే కూడా మనోడు ఎక్కువ సంపాదిస్తున్నాడన్నమాట.
Advertisement
Advertisement