'నా ఫస్ట్ మూవీపై దిగులే లేదు' | I'm not nervous about 'Kis Kisko Pyaar Karoon', says Kapil Sharma | Sakshi
Sakshi News home page

'నా ఫస్ట్ మూవీపై దిగులే లేదు'

Published Fri, Sep 11 2015 7:49 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'నా ఫస్ట్ మూవీపై దిగులే లేదు' - Sakshi

'నా ఫస్ట్ మూవీపై దిగులే లేదు'

న్యూఢిల్లీ : తన తొలి మూవీ 'కిస్ కిస్కో ప్యార్ కరూ' గురించి దిగులు లేదని, ఎలాంటి ఆందోళన చెందడం లేదని బాలీవుడ్ వర్ధమాన కమెడియన్ కపిల్ శర్మ అన్నాడు.  ఈ మూవీ తనకు మంచి కెరీర్ ఇస్తుందని, బాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రయాణం చాలా కాలం పాటు కొనసాగేలా చేస్తుందంటూ ఆశలు పెట్టుకున్నాడు. 'కమెడీ నైట్స్ విత్ కపిల్' అనే హిందీ టీవీ ప్రోగ్రాం ద్వారా తనకంటూ అభిమానులను సంపాదించకున్నాడు కపిల్. దీంతో తన అదృష్టాన్ని బాలీవుడ్లో పరీక్షించుకోవాలని ఉబలాట పడుతున్నాడు. అబ్బాస్-మస్తాన్ల ద్వారా సిల్వర్ స్క్రీన్కు పరిచయం కాబోతున్నాడు.

ఈ మూవీ పాటలు, ట్రైలర్ లకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నాడు. కమెడీ కాంపిటీషన్ 2007, 2013లలో విజేతగా నిలిచి తనకంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని, ఆ తర్వాత తన సొంత బ్యానర్ k9 లో కామెడీ నైట్స్ విత్ కమిల్ అనే టీవీ షో రూపొందించాడు. అయితే మూవీలలో నటిస్తున్నప్పటికీ టీవీ షోలకు దూరంగా ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. తన తొలి మూవీ 'కిస్ కిస్కో ప్యార్ కరూ' ఈ నెల 25న విడుదల అవుతుందని చెప్పుకొచ్చాడు ఈ టీవీ స్టార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement