ఆ దేవుడు నన్ను హర్ట్ చేయలేదు! | Seeing my daddy suffer in his last days, I prayed to God to take him | Sakshi
Sakshi News home page

ఆ దేవుడు నన్ను హర్ట్ చేయలేదు!

Published Sun, Aug 10 2014 2:17 PM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

ఆ దేవుడు నన్ను హర్ట్ చేయలేదు!

ఆ దేవుడు నన్ను హర్ట్ చేయలేదు!

ముంబై: నాన్న విషయంలో తనను ఆ దేవుడు హర్ట్ చేయలేదని అంటున్నాడు కపిల్ శర్మ.  'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంతో స్టార్ హోదాను సంపాదించుకున్న కపిల్.. తన తండ్రి చివరి క్షణాలు చాలా బాధను మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 'నా తండ్రితో నేను గడిపిన సమయం చాలా తక్కువ. ఆయన ఆఖరి రోజుల్లో మాత్రం నాన్నతోనే ఉన్నా. నాన్న కేన్సర్ బారిన పడ్డాక ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్ల్లే వాణ్ని. ఆ సమయంలో ఆయన బాధను నేను చూడలేక పోయేవాణ్ని.  ఆ క్రమంలోనే నాన్నను ఆ దేవుడు తీసుకువెళ్లిపోవాలని ప్రార్ధించే వాణ్ని. ఆ దేవుడు నామొర ఆలకించాడు. నాన్నను తొందరగానే ఈ లోకం నుంచి తీసుకుపోయాడు. ఈ విషయంలో దేవుడు నన్ను హర్ట్ చేయలేదు' అని కపిల్ తెలిపాడు.

'ప్రతీ ఒక్కరి తల్లి దండ్రులు బిడ్డల నుంచి ఏదో ఒకటి ఆశిస్తారని.. నా పేరెంట్స్ మాత్రం నన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదన్నాడు. వారు ఏ రోజూ కూడా నా నుంచి ఏమీ ఆశించలేదని' కపిల్ అన్నాడు.  నాన్నకు జబ్బు చేసిన సమయంలో అద్దె ఇంట్లో ఉంటున్న మా వద్ద ఆయనకు కనీసం వైద్యం చేయడానికి కూడా డబ్పులు ఉండేవు కావన్నాడు. నాన్న జీతంతోనే నెల్లో కొన్నిరోజులు ఆయన్న సంతోషం ఉంచేవాళ్లమని, ఇప్పుడు తాను సంపాదిస్తున్నా నాన్న మాత్రం మా నుంచి దూరమైయ్యారని తన మనసులోని మాటలను వెల్లడించాడు.  దేవుడి ఏది చేసినా అది మన మంచికే చేస్తాడని భావించాలని కపిల్ స్పష్టం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement