కపిల్ శర్మ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: తనను బెదిరించి డబ్బులు వసూలు చేద్దామని చూస్తున్నారని బాలీవుడ్ నటుడు, కమెడియన్ కపిల్ శర్మ ఆరోపించారు. ఈ మేరకు స్పాట్ బాయ్ ఎడిటర్ విక్కీ లాల్వాణీ, గతంలో తన వద్ద మేనేజర్లుగా పనిచేసిన ప్రీతి సిమోస్, నీతి సిమోస్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే నిందారోపణలు చేస్తున్నారంటూ ట్విటర్ వేదికగా వారిపై బూతు పురాణం మొదలు పెట్టారు. మీడియాపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
స్పాట్ బాయ్ డిజిటల్ మీడియాలో తన కెరీర్‌పై, ఆర్థికాంశాలపై, ఇతరులతో ఉన్న సంబంధాలపై అనుచిత విమర్శలు చేసి మానసికంగా కుంగదీశారని కపిల్ తన ఫిర్యాదులో వాపోయారు. ప్రీతి సిమోస్, నీతి సిమోస్‌లతో కలిసి డిజిటల్ మీడియా వేదికగా లాల్వాణీ తన గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు కాపీని కపిల్ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.
ఎవరికీ భయపడను..
‘కొందరు మూర్ఖులు మన పేరుని మసకబార్చి డబ్బులు నొక్కేయడానికి ప్రయత్నిస్తారు. లేనిపోని ఆరోపణలు చేస్తారు. కానీ, ఒక్క విషయం. అబద్ధాన్ని నిజమని నమ్మించానికి కొన్ని యుగాలైనా సరిపోవు’ అంటూ కపిల్ ట్వీటాడు. కపిల్ చేసిన అసభ్యకర ట్వీట్లను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అయితే కొద్ సేపటికే వాటన్నింటిని తొలగించారు. తర్వాత తన ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ గురైందనీ.. తిట్లతో కూడిన ట్వీట్లు తనవి కావని కపిల్ మరో ట్వీట్ చేశారు.
అందరికీ హాయ్..! నా అకౌంట్ హ్యాకింగ్ గురికాలేదు. నేను పెట్టిన ట్వీట్లను నా సహచరుల ఒత్తిడి మేరకు తొలగించాను.. అంటూ కపిల్ చెప్పుకొచ్చారు. ఇలాంటి కుక్కల మాటలకు నేను భయపడను. చిల్లర కోసం ఎంతకైనా దిగజారే చెత్తగాళ్లు.. అంటూ లాల్వాణిని ఉద్దేశించి కపిల్ మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కపిల్ శర్మ బుల్లితెరపై మొదలుపెట్టిన ‘ఫ్యామిలీ టైం విత్ కపిల్ శర్మ’ ప్రోగ్రాం ఎంటర్‌టైన్‌మెంట్‌ను కాకుండా పుకార్లను బాగా ప్రసారం చేస్తోందనే విమర్శల కారణంగా అది ఫ్లాప్ షో గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment