బ్రిటిష్ శునకం అరుదైన రికార్డు | UK pet dog gets crew card after flying 80,000 km | Sakshi
Sakshi News home page

బ్రిటిష్ శునకం అరుదైన రికార్డు

Published Tue, May 6 2014 1:15 PM | Last Updated on Sun, Sep 2 2018 3:30 PM

బ్రిటిష్ శునకం అరుదైన రికార్డు - Sakshi

బ్రిటిష్ శునకం అరుదైన రికార్డు

ఇంగ్లండ్లోని ఓ లాబ్రడార్ శునకం అరుదైన రికార్డు సాధించింది. 250 గంటలకు పైగా విమానంలో పయనించి, క్రూ కార్డు పొందిన మొట్టమొదటి శునకంగా పేరొందింది. కాలీ అనే ఈ శునకం తన యజమాని గ్రాహమ్ మౌంట్ఫోర్డ్తో కలిసి బ్రిటన్ మొత్తం తిరిగేసింది. దానికి 12 వారాల వయసు ఉన్నప్పటి నుంచి మౌంట్ఫోర్డ్ దాన్ని తీసుకుని విమాన ప్రయాణాలు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఇప్పటికది దాదాపు 80,467 కిలోమీటర్లు ప్రయాణించింది. చిన్న చిన్న ఎయిర్స్ట్రిప్లు మొదలుపెట్టి అంతర్జాతీయ విమానాశ్రయాల వరకు అన్నింటిలోనూ ఇది దిగింది.

ఇప్పుడు కాలీకి క్రూకార్డు రావడంతో, కేవలం విమాన సిబ్బంది మాత్రమే తిరిగేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో కూడా తిరిగేందుకు దానికి అనుమతి లభించినట్లయింది. బ్రిటన్లో ఈ హోదా పొందిన ఏకైక శునకం కాలీ మాత్రమే. విమానాల యజమానులు, పైలట్ల సంఘం దానికి ఈ గుర్తింపు ఇచ్చింది. మౌంట్ఫోర్డ్కు సొంతంగా ఉన్న ఆరు సీట్ల సెస్నా విమానంలోని కో పైలట్ కుర్చీలో కూడా దీన్ని కూర్చోబెట్టడానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement