Shatrughan Sinha
-
ప్రధాని మోదీ మిత్రుడంటూ.. ‘ఆప్’కు టీఎంసీ ఎంపీ ప్రచారం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు(సోమవారం) సాయంత్రం ఐదు గంటలతో వివిధ పార్టీల ప్రచారపర్వం ముగియనుంది. గత నెల 20 నుంచి సాగుతున్న ఈ ప్రచారంలో పలు వింతలు విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, నటులు ప్రచారాలు సాగిస్తున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆదివారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ తరపున ప్రచారం సాగించారు. ప్రధాని మోదీని తన స్నేహితుడని అంటూనే ఆయనను ‘ప్రచార మంత్రి’అని అభివర్ణించారు. ఆయన(ప్రధాని) రోజూ 10 నుండి 12 గంటలు ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించారు. నటుడి నుండి రాజకీయ నేతగా మారిన సిన్హా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి ఆతిశీకి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీలు ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్’ (ఐఎన్ఐ)లో భాగస్వాములు. శత్రుఘ్న సిన్హా తన ప్రసంగంలో ప్రధాని మోదీని విమర్శిస్తూ ‘మా గౌరవనీయ ప్రచార మంత్రి అంటే..ప్రధానమంత్రి అంటూ.. ఆయన నాకు స్నేహితుడు.. మనకి ప్రధానమంత్రి కూడా.. అని వ్యంగ్యోక్తి విసిరారు. ఆయన 18 గంటలు పనిచేస్తానని చెబుతారని, అయితే ఆయన ఆ 18 గంటల్లో 10 నుండి 12 గంటలు ప్రచారానికే కేటాయిస్తారని, కౌన్సిలర్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, పార్లమెంటరీ ఎన్నికలైనా.. ఎక్కడికైనా మన గౌరవనీయ ప్రధానమంత్రి ఖచ్చితంగా అక్కడికి వెళతారు’అని సిన్హా విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ. కోటి మొదలైన హామీలను ఇచ్చిన మోదీ వాటిని నెరవేర్చలేదని సిన్హా అన్నారు.ఇది కూడా చదవండి: మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ -
'సోనాక్షి రియాక్షన్ ఆశ్చర్యం కలిగించింది'.. హీరోయిన్‌పై ముకేశ్ ఖన్నా సెటైర్లు
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదానికి దారితీసింది. ప్రముఖ శక్తిమాన్ ఫేమ్, నటుడు ముకేశ్ ఖన్నాను ఉద్దేశించి ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. మీ మాటలు చూస్తుంటే కావాలనే నన్ను టార్గెట్ చేసినట్లు ఉందని రాసుకొచ్చింది. నా తండ్రి శతృఘ్న సిన్హా పెంపకంపై మీరు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. నాతో పాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారని సోనాక్షి గుర్తు చేశారు.అసలేం జరిగిందంటే..గతంలో అంటే 2019లో సోనాక్షి సిన్హా కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్లో ప్రత్యేక అతిథిగా పాల్గొంది. ఆ సమయంలో రామాయణం గురించి ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడని సోనాక్షిని హోస్ట్ ప్రశ్నించాడు. దీనికి ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయింది. సోనాక్షి మాత్రమేకాదు.. అక్కడే ఉన్న మరో ఇద్దరు సైతం ఆన్సర్ చేయలేకపోయారు. ఇది చూసిన ముకేశ్ ఖన్నా.. కూతురిని సరిగా పెంచలేదంటూ శతృఘ్న సిన్హాను ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది కాస్తా వైరల్ కావడంతో తాజాగా సోనాక్షి ఆయనకు కౌంటర్‌గా పోస్ట్ పెట్టింది.అయితే తాజాగా సోనాక్షి పోస్ట్‌పై శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా స్పందించారు. ఈ విషయంపై సోనాక్షి చాలా ఆలస్యంగా స్పందించిందని అన్నారు. తన పెంపకాన్ని ప్రశ్నించడం పట్ల తనకు ఎలాంటి దురుద్దేశం తెలిపారు. ఆమె తండ్రి చేసిన తప్పువల్లే సోనాక్షి సమాధానం చెప్పలేకపోయిందన్నారు. అయితే ఇంత ఆలస్యంగా రియాక్ట్ కావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ముకేశ్ అన్నారు.ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ.. 'తను రియాక్ట్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఈ విషయంలో నాకు ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ విషయంలో ఆమెను, అలాగే ఆమె తండ్రిని కించపరిచే ఉద్దేశ్యం నాకు లేదు. అతనితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి' అని తెలిపారు. -
హీరోయిన్ చెప్పులు మోసిన భర్త.. ఇలాగే ఉంటుంది మరి!
ప్రేమకు అర్థం ఏదంటే.. నిన్ను, నన్నే చూపిస్తానంటోంది హీరోయిన్ సోనాక్షి సిన్హ. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ సుందరి భర్త గురించే ఈ పాట పాడుతోంది. ప్రియుడు జహీర్ ఇక్బాల్ భర్తగా మారినా తనపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదంటోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో సోనాక్షి హీల్స్ (చెప్పులు)ను ఇక్బాల్ తన చేతులతో పట్టుకుని ముందు నడుస్తున్నాడు. పెళ్లిపై ట్రోలింగ్భార్యపై చిరాకు పడకుండా నవ్వుతూనే చెప్పులు మోశాడు. కరెక్ట్ పర్సన్‌ను పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని హీరోయిన్ రాసుకొచ్చింది. ఇకపోతే సోనాక్షి- ఇక్బాల్ పెళ్లిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇద్దరూ విభిన్న వర్గానికి చెందినవారు కావడంతో ఈ జంటపై నెటిజన్లు విషం చిమ్మారు. కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి అనరాని మాటలు అన్నారు.సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హఆస్పత్రిలో తండ్రిమరోవైపు హీరోయిన్ పెళ్లి జరిగిన రెండు రోజులకే తండ్రి, నటుడు శత్రుఘ్న సిన్హా ఆస్పత్రిపాలయ్యాడు. సర్జరీ చేయించుకోబోతున్నాడని రూమర్లు రాగా వాటిని ఆయన కుమారుడు లవ్ సిన్హ కొట్టిపారేశాడు. తీవ్ర జ్వరం కారణంగానే ఆస్పత్రిలో చేరాడని, సర్జరీ వంటిదేమీ లేదని స్పష్టం చేశాడు.చదవండి: ప్రభాస్ 'కల్కి' రేర్ రికార్డ్.. ఇది కదా అసలైన మాస్ అంటే -
పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది?
పెళ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఇంతలోనే హీరోయిన్ సోనాక్షి సిన్హా ఆస్పత్రిలో కనిపించింది. దీంతో లేనిపోని పుకార్లు మొదలయ్యాయి. అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చేసిందని అంటున్నారు. దీంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరీ ఇంత తొందరగానా అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: 'పుష్ప' విలన్‌పై సుమోటో కేసు.. అసలేం జరిగిందంటే?)బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. 'దబంగ్' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత వరసగా పలు హిందీ చిత్రాల్లో నటించింది. రీసెంట్ టైంలో ఈమెకు సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఇండస్ట్రీకే చెందిన జహీర్ ఇక్బాల్ అనే నటుడిని ప్రేమించి.. ఈ మధ్యనే జూన్ 23న పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది.అయితే పెళ్లయి ఐదురోజులకే ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి సోనాక్షి-జహీర్ వస్తూ కనిపించారు. దీంతో ఈమె ప్రెగ్నెన్సీ వచ్చిందనే రూమర్స్ వచ్చాయి. అయితే ఇది అబద్ధమని తేలింది. శత్రుఘ్ని సిన్హా రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్లో ఉన్నారని, తండ్రిని కలిసేందుకు ఇలా ఆస్పత్రికి వచ్చి వెళ్లడంతో పుకార్లు వచ్చాయి తప్పితే ఇంకేం లేదని తెలుస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్)बिना प्रेगनेंट हुए ये लोग ब्याह नहीं करती है 😷खैर इसका तो निकाह हुआ है 🤪#SonakshiSinha जाहिल इकबाल pic.twitter.com/46SEIfiBOh— साधना सक्सेना (@Bharatdarshan22) June 29, 2024 -
ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్‌కు కౌంటరిచ్చిన హీరోయిన్!
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టింది. సోనాక్షి, జహీర్ వేర్వేరు వర్గానికి చెందినవారు కావడంతో నెటిజన్లు ఈ జంటను దుమ్మెత్తిపోస్తున్నారు. కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి పెళ్లైన మరుక్షణం నుంచే విమర్శల బాణాలు ఎక్కుపెట్టి సూటిపోటి మాటలతో చిత్రవధ చేస్తున్నారు. ఈ వ్యతిరేకత తారా స్థాయిలో ఉండటంతో సోనాక్షి, ఇక్బాల్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కామెంట్ సెక్షన్‌ను సైతం ఆఫ్ చేశారు. కరెక్ట్‌గా చెప్పావ్అయినప్పటికీ సోషల్ మీడియాలో కొత్త జంటపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రసాద్ భట్ అనే ఆర్టిస్టు సోనాక్షి- ఇక్బాల్ దంపతుల గ్రాఫిక్ పిక్‌ను డిజైన్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలాడు. అన్నింటికంటే ప్రేమ అనే మతమే గొప్పది అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన సోనాక్షి.. చాలా కరెక్ట్‌గా చెప్పావు అని రిప్లై ఇచ్చింది. ఈ కామెంట్‌తో ఆమె ట్రోలర్స్‌కు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది.నా కూతురు ఏ తప్పూ చేయలేదుమరోవైపు తన కూతురిని ట్రోల్ చేస్తున్నవారిపై సోనాక్షి తండ్రి, నటుడు శతృఘ్న సిగ్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఉద్యోగం సద్యోగం ఏదీ లేకుండా ఉన్నవాళ్లందరూ ఇలా అవతలివారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. నా కూతురు ఏ తప్పూ చేయలేదు. పెళ్లి అనేది ఇద్దరు మనుషుల ఇష్టం. అందులో తలదూర్చే హక్కు ఎవరికీ లేదు. విమర్శించేవాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ముందు వెళ్లి మీ జీవితాన్ని చక్కబెట్టుకోండి. ఏదైనా పనికొచ్చే పని చేయండి' అని మండిపడ్డాడు. View this post on Instagram A post shared by Prasad Bhat (Graphicurry) (@prasadbhatart)చదవండి: హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే? -
అతనితో పెళ్లి అనగానే కుటుంబంలో గొడవలు: సోనాక్షి సిన్హా తండ్రి కామెంట్స్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా.. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోనుంది. ఈ నెల 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమైంది. ముంబయిలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లికి సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరు అవుతున్నట్లు వెల్లడించారు. అయితే పెళ్లికి ముందు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పిన ఆయన.. ఆ తర్వాత నా ఏకైక కుమార్తె సోనాక్షినే అని చెప్పుకొచ్చాడు. ఈ రోజుల్లో పెళ్లికి పిల్లలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోరని.. వారి నిర్ణయాన్ని మాత్రమే తెలియజేస్తారని ఆయన అన్నారు.పెళ్లికి ముందు విభేదాలుసోనాక్షి తన ప్రియుడు ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోనుందని తెలియగానే మా కుటుంబంలో విభేదాలు వచ్చాయని శతృఘ్న సిన్హా తెలిపారు. పెళ్లి అనేది అందరి ఇళ్లలో జరుగుతుందని.. వివాహనికి ముందు గొడవలు కూడా మామూలే అని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం అంతా బాగానే ఉందని వెల్లడించారు. సోనాక్షి, జహీర్ రిసెప్షన్‌కు తమ కుటుంబం హాజరవుతుందని శతృఘ్న తెలిపారు. కాగా.. పెళ్లికి ముందు సోనాక్షి, జహీర్ స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. -
నా ఏకైక కుమార్తె పెళ్లి.. మీకు అనవసరం: హీరోయిన్ తండ్రి
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవల హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెళ్లికి రెడీ అయిపోయింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడనుంది. ఈనెల 23 ముంబయిలోని బాస్టియన్‌లో ఈ జంట ఒక్కటి కానుంది. చాలా ఏళ్లుగా వీరిద్దరు సీక్రెట్‌గా డేటింగ్లో ఉన్నారు. అయితే గతంలోనే సోనాక్షి పెళ్లి గురించి తమకేలాంటి సమాచారం లేదని ఆమె తండ్రి శతృఘ్న సిన్హా అన్నారు. దీంతో ఆయన కూతురి పెళ్లికి వెళ్లడం లేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఆయన తనపై వచ్చిన వార్తలను ఖండించారు. తన కూతురి వివాహానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఇది మీకు సంబంధం లేని విషయం.. మీ పని మీరు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.శతృఘ్న సిన్హా మాట్లాడుతూ..' సోనాక్షి నా ఏకైక కుమార్తె. ఆమె అంటే నాకు పిచ్చి ప్రేమ. నేనే తన బలం అని చాలాసార్లు చెప్పింది. తప్పకుండా తన పెళ్లికి వెళ్తాను' అని అన్నారు. అయతే మరోవైపు ఆమె తల్లి పూనమ్ సిన్హా, ఆమె సోదరుడు లవ్ సిన్హా ఈ పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాలోను సోనాక్షి సన్హాను అన్ ఫాలో చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా.. ప్రస్తుతం సోనాక్షి.. తన కాబోయే భర్త కుటుంబంతోనే ఉంది. -
‘‘నా పెళ్లి, నా ఇష్టం..మీకెందుకబ్బా!’’ సోనాక్షి రియాక్షన్, వీడని సస్పెన్స్!
సినీ నటి సోనాక్షి సిన్హా పెళ్లి పుకారు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడ బోతోందంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ నెల 23న దక్షిణ ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సోనాక్షి- జహీర్ పెళ్లాడబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై సోనాక్షి ఘాటుగా సమాధాన మిచ్చింది. ‘ ..ఇది నా పెళ్లి.. ఇది ఎవరికి సంబంధించిన విషయం కాదు. ఇక రెండోది నా పెళ్, నా ఇష్టం. జనాలకు ఎందుకింత ఆందోళన అంటూ మండిపడింది. అలాగే తన పెళ్లి గురించి అడగాల్సింది తనను గానీ, తన తల్లిదండ్రులను కాదంటూ చురకలేసింది. ఎపుడూ తన పెళ్లి గురించి అడుగుతూ ఉంటారని అయితే దీన్ని తాను పెద్దగా పట్టించుకోనని వ్యాఖ్యానించింది.అటు సోనాక్షి తండ్రి, బాలీవుడ్ హీరో, నేత శత్రుఘ్న సిన్హా కూడా స్పందించారు. తన కుమార్తె పెళ్లి గురించి తనకు తెలియదని సోనాక్షి పెళ్లి గురించి ప్రశ్నించిన మీడియాతో చెప్పారు. ‘‘ ఎన్నికల ఫలితాలు తరువాత ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. సోనాక్షి వెడ్డింగ్ ప్లాన్స్ గురించి నాకేమీ తెలియదు. నాకేమీచెప్పలేదు నేనూ ఎవరితోనూ మాట్లాడలేదు’’ అంటూ సమాధానమిచ్చారు.అంతేకాదు ఈ విషయంలో ప్రధానమీడియాకు ఎంత తెలుసో, తనకూ అంతే తెలుసుననీ, ఈ రోజుల్లో, పిల్లలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోరు.. జస్ట్ వారు సమాచారం ఇస్తున్నారు.. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం అంటూ ముగించారు. దీంతో సోనాక్షి-జహార్ పెళ్లి సందడిపై సస్పెన్స్ మరింత ముదిరింది.కాగా సోనాక్షి, జహీర్ ఇద్దరూ సల్మాన్‌ఖాన్ సినిమాలతోనే బాలీవుడ్లో అడుగుపెట్టారు. సోనాక్షి 2010లో దబాంగ్ సినిమాలో నటించగా, సల్మాన్ నిర్మించిన నోట్‌బుక్ సినిమాతో 2019లో జహీర్ బాలీవుడ్లో అరంగేట్రం చేశాడు. ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో జూన్ 23న సోనాక్షి, జహీర్ వివాహం జరుగు తుందని, ఆ తర్వాత రాత్రి రిసెప్షన్ కూడా ఉంటుందనేది మీడియా నివేదికల సారాంశం వీరిద్దరూ చాలా కాలంగా తమ పెళ్లికి ప్లాన్ చేస్తున్నప్పటికీ, సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఇప్పటిదాకా వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. -
నా కూతురి పెళ్లి గురించి తెలియదు: సోనాక్షి తండ్రి కామెంట్స్ వైరల్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. తన ప్రియుడు, నటుడైన జహీర్ ఇక్బాల్‌తో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ముంబయిలో జరిగనున్న వీరి వివాహానికి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. సోనాక్షి పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి, నటుడు శత్రుఘ్న సిన్హా చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. తన కూతురు సోనాక్షి పెళ్లి గురించి తనకు ఎలాంటి విషయం తెలియదని పేర్కొన్నారు. సోనాక్షి, జహీర్‌ల వివాహం గురించి తనకు తెలియదని.. అయితే వారి బంధానికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. పెళ్లి విషయం నాకు తెలిసినప్పుడు ఆ జంటను ఆశీర్వదిస్తానని శత్రుఘ్న సిన్హా అన్నారు.శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.."నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా. నా కుమార్తె పెళ్లి గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. తన పెళ్లి గురించి నాతో ఏం చెప్పలేదు. నేను కూడా మీడియాలో చదివి మాత్రమే తెలుసుకున్నా. ఒకవేళ తాను మాకు చెబితే నేను, నా భార్య ఆశీస్సులు అందిస్తాం. మేము కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం. తనకు స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది. ఈ రోజుల్లో చాలామంది పెళ్లికి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం లేదు.' అని చెప్పారు.కాగా.. సోనాక్షి, జహీర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు తమ రిలేషన్ గురించి సోషల్ మీడియా ద్వారా ఎప్పుటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. కాగా.. సోనాక్షి ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సోనాక్షి, జహీర్ 2022లో వచ్చిన డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో కలిసి నటించారు. -
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
ఆసన్సోల్. పశ్చిమ బెంగాల్లో కీలక లోక్‌సభ స్థానం. గత ఉప ఎన్నికలో బీజేపీని ఓడించిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ‘షాట్‌గన్’, ‘బిహారీ బాబు’గా ప్రసిద్ధుడైన బాలీవుడ్ దిగ్గజం, సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్న సిన్హా టీఎంసీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. సీనియర్ నేత సురేంద్రజీత్‌సింగ్ అహ్లువాలియాను బీజేపీ బరిలో నిలిపింది. ఈ హాట్ సీట్లో నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది... ఆసన్సోల్లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ హై ప్రొఫైల్ లోక్‌సభ స్థానమైన ఆసన్సోల్లో హిందీ మాట్లాడేవారు ఎక్కువ. జార్ఖండ్ సరిహద్దు కావడమే అందుకు కారణం. ఇక్కడ పరిశ్రమలు అధికం. రాణిగంజ్, పాండవేశ్వర్, జమురియాల్లో బొగ్గు గనులున్నాయి. దాంతో బిహార్, యూపీ వలస కారి్మకులు ఎక్కువ. తాగునీటి ఎద్దడి, అక్రమ మైనింగ్ ఇక్కడి ప్రధాన సమస్యలు. ఒకప్పుడు సీపీఎం కంచుకోట. 2014లో దానికి బీటలు వారాయి. బీజేపీ నుంచి బాబుల్ సుప్రియో బరాల్ గెలుపొందారు. 2019లోనూ ఆ పరంపరను కొనసాగించారు. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సుప్రియో తృణమూల్‌లో చేరడంతో ఉప ఎన్నిక జరిగింది. టీఎంసీ నుంచి శత్రుఘ్న సిన్హా గెలుపొందారు. అహ్లూవాలియాపైనే బీజేపీ ఆశలు... ఈసారి బీజేపీ తమ తొలి జాబితాలోనే భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్‌కు ఆసన్సోల్ టికెటిచ్చింది. తన పాటల్లో మహిళలను అగౌరవపరిచే వ్యక్తికి టికెటిచ్చారంటూ టీఎంసీ తదితర పక్షాలు విమర్శలు గుప్పించాయి. దాంతో పవన్ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అనంతరం ‘సర్దార్జీ’గా పిలుచుకునే ఎస్.ఎస్. అహ్లువాలియాకు బీజేపీ టికెట్ దక్కింది. ఆయన రాజ్యసభ మాజీ సభ్యుడు. 2014లో డార్జిలింగ్, 2019లో బర్ధమాన్–దుర్గాపూర్ లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందారు. ఆయన కచి్చతంగా నెగ్గుతారని బీజేపీ అంటోంది. ఎంపీగా పార్లమెంటు ముఖమే చూడని వ్యక్తి ప్రజా సమస్యలను ఏం పట్టించుకుంటారన్న టీఎంసీ విమర్శలను అహ్లూవాలియా తిప్పికొడుతున్నారు. ‘‘నేను సర్దార్‌ను. ఆసన్సోల్ బిడ్డను. ఇక్కడే పుట్టి పెరిగా. నా మూలాలిక్కడే ఉన్నాయి. నా ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షే నన్నిక్కడికి నడిపించింది’’ అంటున్నారు.భారీ మెజారిటీపై శత్రుఘ్న కన్ను శత్రుఘ్న సిన్హా పూర్వాశ్రమంలో బీజేపీ నాయకుడే కావడం విశేషం! పట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. 2022లో టీఎంసీకి మారారు. అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తన బలమంటున్నారాయన. ‘‘ఎంపీగా రెండేళ్లలో చేసిన కృషే నా తరఫున మాట్లాడుతుంది. పైగా ఆసన్సోల్లో యూపీ, బిహార్ కారి్మకుల సంఖ్య చాలా ఎక్కువ. ఈసారి మరింత భారీ మెజారిటీతో గెలుస్తా’’ అని ధీమాగా చెబుతున్నారు. సీపీఎం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జహనారా ఖాన్ బరిలో ఉన్నారు. లోక్‌సభకు పోటీ చేయడం ఆమెకిదే తొలిసారి. 55 ఏళ్ల జహనారాది దిగువ మధ్యతరగతి నేపథ్యం. రెండుసార్లు జమురియా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ‘‘ఆసన్సోల్ పదేళ్లుగా ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ సుప్రియోలు, సిన్హాలు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదు. గ్రామీణ గిరిజనులు, మైనారిటీలు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. పదేళ్లలో ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ కేబుల్స్ సహా ఎన్నో కర్మాగారాలు మూతపడ్డాయి’’ అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక్క భార్య చాలు, ఇంకొకరిని పోషించడం నావల్ల కాదు: నటుడు
సినిమాల్లో సత్తా చాటిన శత్రుఘ్న సిన్హ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనేంటో నిరూపించుకున్నాడు. పాలిటిక్స్‌తో బిజీగా మారిన ఆయన ఓ ఇంటర్వ్యూలో వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్క భార్య ముద్దు.. మరో పెళ్లి చేసుకుని రెండో భార్యను తెచ్చుకోవద్దని మాట్లాడాడు. 'నాకు ఒక్కరు చాలు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఆమెను నేను పోషించలేను. కొందరు ఆడవాళ్లు నాదగ్గరకు వచ్చి నాపై ఆసక్తి చూపించేవారు. మన చుట్టూ ఎంత నీళ్లున్నా సరే వాటిలో నుంచి చుక్క నీటిని కూడా మనం తాగలేము అన్న వాక్యం గుర్తొచ్చేది. అయినా పెళ్లనేది ఒక్కరోజు తతంగం కాదు. అది మీరు ఎదగడానికి ఉపయోగపడాలి. వైవాహిక బంధంలో నిజాయితీ ఉండాలి, గౌరవం, ప్రేమ ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకర్నొకరు అర్థం చేసుకుని నమ్మకంగా మెదలాలి. ప్రేమతో పాటు చిన్నచిన్న గొడవలు కూడా ఉంటాయి. అందరూ సింగిల్ లైఫే బాగుంటుందంటారు, కానీ పెళ్లి తర్వాత బాగుందనో, పెళ్లి జీవితం సంతోషంగా ఉందనో చెప్పరు. నా విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా నా భార్య సంతోషంగా ఉంది. మా ఇద్దరిలో నా భార్యే ఎక్కువ నిజాయితీగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఈజీగా పెళ్లి పెటాకులు చేసుకుంటున్నారు. ఈ విడాకుల వల్ల వారి కుటుంబంపై, పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో గ్రహించలేకపోతున్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా శత్రుఘ్న సిన్హ, పూనమ్‌లు 1980లో పెళ్లి చేసుకున్నారు. వీరికి సోనాక్షి సిన్హ, లవ్, కుష్ సిన్హలు సంతానం. చదవండి: పెళ్లిపీటలెక్కిన హీరోయిన్, ఫోటోలు వైరల్ స్టార్ ఇంట్లో అద్దెకు దిగిన యంగ్ హీరో -
రాహుల్ గాంధీకి ఆ సత్తా ఉంది: టీఎంసీ నేత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రపై ప్రశంసలు కురిపించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్రుఘ్న సిన్హా. ఇది చారిత్రక, విప్లవ యాత్రగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ యూత్ ఐకాన్‌గా ఎదిగారని కొనియాడారు. గతంతో పోలిస్తే ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయిందన్నారు. కొందరు ఆయన ఇమేజ్ను దెబ్బతీయాలను చూస్తున్నారని, కానీ దేశంలోనే అత్యంత పట్టుదల నాయకుడిగా ఎదిగారాని పేర్కొన్నారు. ‘రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే సత్తా ఉంది. ఆయన కుటుంబం నుంచి పలువురు ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. దేశ అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేశారు. సంఖ్యాపరంగా చూసుకుంటే 2024లో మమతా బెనర్జీ గేమ్ ఛేంజర్‌గా మారనున్నారు. మమతా బెనర్జీ ఒక ఉక్కు మహిళ, ప్రస్తుతం ఆమెను ఎవరూ తేలికగా తీసుకోలేరు.’అని పేర్కొన్నారు సిన్హా. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ చేపట్టిన రథ యాత్ర, మాజీ ప్రధాని చంద్రశేఖరన్ చేపట్టిన యాత్రలతో భారత్ జోడో యాత్రను పోల్చారు శత్రుఘ్న సిన్హా. 2024 ఎన్నికలపై భారత్ జోడో యాత్ర కచ్చితంగా ప్రభావం చూపిస్తుందన్నారు. ప్రధాని ఎవరనేది దేశ ప్రజలు నిర్ణయిస్తారని, విభిన్న రాజకీయ పార్టీల ప్రజలంతా ఏకతాటిపైకి వస్తారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: 75 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి విద్యుత్తు కనెక్షన్.. సంతోషంలో ప్రజలు -
చేతబడి చేసి నా కన్యత్వాన్ని వ్యాపారం చేశారు
బిగ్‌బాస్ ఫేమ్ పూజా మిశ్ర నటుడు, టీఎమ్సీ నాయకుడు శత్రుఘ్న సిన్హ, అతడి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసింది. తనపై చేతబడి చేసి స్పృహ లేని సమయంలో తన కన్యత్వాన్ని వ్యాపారం చేశారని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. '17 ఏళ్లుగా శత్రుఘ్న సిన్హ, అతడి కుటుంబం నన్ను వేధిస్తూనే ఉంది. మా నాన్న అతడికి కోట్లాది రూపాయలు ఇచ్చి సహాయం చేస్తే తను మాత్రం నా కెరీర్‌ను నాశనం చేశాడు. నేనెక్కడ పాపులర్ అవుతానో అని భయపడ్డాడు. ఓసారి నేను శత్రుఘ్న సిన్హాకు బర్త్‌డే విషెస్ చెప్దామని వెళ్లాను. అప్పుడు అతడి భార్య పూనమ్ నాకు చేతబడి చేసిన పదార్థాన్ని తినిపించింది. అలా నా శరీరం నా కంట్రోల్లో లేని సమయంలో సెక్స్ స్కామ్‌లో పాల్గొనేలా చేశారు. నా కన్యత్వాన్ని అమ్మి ఫ్యాషన్ డిజైనర్ కావాల్సిన తన కూతురు సోనాక్షి సిన్హను స్టార్‌ను చేశాడు. 2007 నుంచి 2014 వరకు నేను లోఖండ్‌వాలాలోని ఫ్యామిలీ అపార్ట్మెంట్లోనే నివసించాను. సిన్హ కుటుంబం పై పోర్షన్లో ఉండేవారు. నేను సింగపూర్‌కు షాపింగ్‌కు వెళ్లి తిరిగొచ్చే సమయానికి గదిలో నా వస్తువులు కనిపించకుండా పోయేవి. వాటిని ఫొటోషూట్లలో వాడుకోమని సోనాక్షి సిన్హాకు అప్పగించేవారు. కేవలం అతడి వల్లే నేనింకా పెళ్లి చేసుకోలేదు. నాకు డ్రగ్స్ ఇచ్చి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకునేవాడు. నా కెరీర్ నాశనమైందంటే అది కేవలం శత్రుఘ్న సిన్హా వల్లే!' అని ఆరోపించింది పూజా. చదవండి: లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ? ఈ ఆరోపణలపై శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హ స్పందించాడు. ఆమెకు వృత్తిపరంగా సహాయం కావాలనుకుంటా. నా కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నప్పుడే ఆమె మానసిక స్థితి సరిగా లేదని అర్థమవుతోంది. సాధారణంగా ఇలాంటి చెత్త కథనాలపై స్పందించి సమయం వృథా చేసుకోను. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా మా కుటుంబ గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి కథనాలు రాసేవాళ్ల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాను ట్వీట్ చేశాడు. ఏదేమైనా పూజా మిశ్ర ఆరోపణలు మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎవరీ పూజా మిశ్ర పూజా మిశ్ర వీడియో జాకీ, నటి, మోడల్. హిందీ బిగ్‌బాస్ ఐదో సీజన్లోనూ పూజా పాల్గొంది. అమ్మ, డ్రీమ్స్: ద మూవీ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది. That woman needs professional help. To make such accusations against my family proves that she is unstable. I normally don’t waste my time responding to such trash published on the internet but I think the irresponsible editor — Luv S Sinha (@LuvSinha) May 4, 2022 చదవండి: సమంతతో పోల్చుకున్న ఉర్ఫీ, ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం -
బై ఎలక్షన్లలో బీజేపీకి షాక్
కోల్‌కతా/కొల్హాపూర్: దేశవ్యాప్తంగా శనివారం వెల్లడైన ఒక లోక్‌సభ, 4 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాకిచ్చాయి. అన్ని చోట్లా పార్టీ ఓటమి చవిచూసింది. పశ్చిమబెంగాల్లో అసన్సోల్ లోక్‌సభ, బాలీగుంగే అసెంబ్లీ సీట్లను అధికార తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అసన్సోల్లో టీఎంసీ అభ్యర్థి, ప్రముఖ సినీనటుడు ‘షాట్‌గన్’ శత్రుఘ్న సిన్హా బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌పై ఏకంగా 3,03,209 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బీజేపీ నుంచి ఇటీవలే తృణమూల్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో బాలీగుంగేలో 20,228 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ కేవలం 13,220 ఓట్లతో సరిపెట్టుకుంది.మహారాష్ట్రలో కొల్హాపూర్ నార్త్, చత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్, బిహార్‌లో బొచాహన్ అసెంబ్లీ స్థానాన్ని ఆర్జేడీ దక్కించుకున్నాయి. -
Shatrughan Sinha: బీహారీ బాబు.. చారిత్రక విజయం
అలనాటి బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా .. భారీ విజయం అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా 2 లక్షలకు పైచిలుకు ఓట్లతో ఆయన ఘన విజయం సాధించినట్లు సమాచారం. విశేషం ఏంటంటే.. అసన్సోల్ లోక్‌సభ స్థానాన్ని టీఎంసీ దక్కించుకోవడం ఇదే తొలిసారి. ► పాట్నాలో పుట్టి, పెరిగి.. రాజకీయాల్లో బీహారీ బాబుగా పేరు ముద్రపడ్డ 76 ఏళ్ల సిన్హా.. రాజకీయ జీవితం కూడా సంచలనమే!. ► అలనాటి బాలీవుడ్ హీరో శత్రుఘ్న సిన్హా.. 80వ దశకంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ► వాజ్‌పేయి-అద్వానీల కాలంలో.. స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీకి ఆయన ప్రచారం చేశారు. ► ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. పాట్నా సాహిబ్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయి కేబినెట్లో శత్రుఘ్న సిన్హా కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ► అయితే పార్టీతో విభేధాలతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ► 2019 సార్వత్రిక ఎన్నికల్లో.. పాట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. రవి శంకర్ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ► అభిమానులు ముద్దుగా షాట్‌గన్ అని పిలుచుకునే శతృఘ్నసిన్హాకు.. రాజకీయాల్లోనూ రెబల్ స్టార్‌గా గుర్తింపు ఉంది. బీజేపీ ఎంపీగా ఉన్న రోజుల్లోనే ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించిన సందర్భాలు ఎన్నో. ► ఎంపీగా ఉన్న.. బాబుల్ సుప్రియో బీజేపీని వీడి టీఎంసీలో చేరడంతో అసన్సోల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ► ఎన్నికల ప్రచారంలో బీజేపీ.. టీఎంసీ అభ్యర్థి శతృఘ్నసిన్హాను బయటి వ్యక్తిగా ప్రచారం చేసింది. అయితే బెంగాలీలకు ఏమాత్రం వ్యక్తిని తాను అని గట్టిగానే ప్రచారం చేసుకున్నారాయన. ► అసన్సోల్ బరిలో బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌ను చిత్తుగా ఓడించారు శతృఘ్నసిన్హా. ► శత్రుఘ్న సిన్హాపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అలాగే తనదైన శైలిలో గాంభీర్యమైన ప్రసంగాలతో జనాలను ఆకట్టుకోగలిగారు శత్రుఘ్న సిన్హా. :::సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రశాంత్ కిషోర్ వల్లే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పా..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎన్నికల్లో ఓటముల పరంపర కొనసాగుతుండటంతో ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడిన సంగతి తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడటంపై తృణముల్ కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాల కీలక పాత్ర ఉందని అన్నారు. ఈ సందర్భంగానే టీఎంసీ పార్టీలో చేరడం మర్యాదగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా టీఎంసీపైనే ఉందన్నారు. అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ సంక్షోభం ముంగిట్లో ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఆ పార్టీపై విమర్శలు చేయడం ఇష్టం లేదన్నారు. అలాగే, కాంగ్రెస్‌లో తప్పులు ఎక్కడ జరిగాయో.. తాను ఎందుకు బయటకు వచ్చానో త్వరలో చెబుతానని అన్నారు. మరోవైపు.. బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ టీఎంసీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హాను బరిలోకి దింపుతున్నామని ప్రకటించారు. మరో ఉప ఎన్నిక బాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా జరుగుతుండటంతో కేంద్ర మాజీ మంత్రి, సింగర్ బబుల్ సుప్రియోను బాలిగంజ్ నుంచి రంగంలోకి దింపుతున్నట్టు మమతా బెనర్జీ ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. -
మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..
సమకాలీన రాజకీయాల్లో నరేంద్ర మోదీకి దీటుగా దూసుకుపోతున్న నాయకురాలు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థులను ప్రకటించి మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు దీదీ. సినిమా రంగంలో అగ్రతార వెలుగొంది రాజకీయాల్లోకి వచ్చిన ‘రెబల్ స్టార్’ శత్రుఘ్న సిన్హాను అనూహ్యంగా మళ్లీ రాజకీయ తెర మీదకు తెచ్చారు. కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయనకు పిలిచి మరీ ఎంపీ సీటు ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బెంగాల్లో ఖాళీగా ఉన్న అసన్సోల్ లోక్‌సభ స్థానం, బాలేగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఈ రెండు స్థానాలకు మమతా బెనర్జీ అభ్యర్థులను ప్రకటించారు. అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా, బాలేగంజ్లో బాబుల్ సుప్రియోలు తమ పార్టీ తరపున పోటీ చేస్తారని ఆమె ప్రకటించారు. అయితే బాబుల్ సుప్రియో రాజీనామాతో ఖాళీ అయిన అసన్సోల్ లోక్‌సభ స్థానాన్ని శత్రుఘ్న సిన్హాకు కేటాయించడం విశేషం. సిన్హాకే ఎందుకు? బిహార్‌లోని పట్నా లోక్‌సభ నియోజక వర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిచిన శత్రుఘ్న సిన్హా కేంద్రంలోని వాజపేయి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే తర్వాత కాలంలో మోదీ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టిక్కెట్ దక్కలేదు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతుగా బెంగాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ కారణం వల్లే ఆయనకు అసన్సోల్ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం దీదీ కల్పించినట్టు తెలుస్తోంది. అసన్సోల్ to బాలేగంజ్ గాయకుడు, నటుడైన బాబుల్ సుప్రియో.. అసన్సోల్ లోక్‌సభ స్థానం నుండి రెండుసార్లు బీజేపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించి కేంద్ర కేబినెట్లోనూ స్థానం సంపాందించారు. 2021, మార్చి-ఏప్రిల్‌లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆయనను టోలీగంజ్ నియోజకవర్గం నుంచి పోటీకి దించింది. అయితే ఆయన ఘోర పరాజయం పాలవడంతో పాటు కేంద్ర కేబినెట్లోనూ స్థానం కోల్పోయారు. తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో బీజేపీని వీడి గతేడాది సెప్టెంబర్‌లో టీఎంసీలో చేరారు. తర్వాత నెలలో లోక్‌సభ సభ్యత్వాన్ని అధికారికంగా వదులుకున్నారు. తాజాగా ఆయన బాలేగంజ్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. (UP Election 2022: పార్టీల వారీగా సీట్లు, ఓట్ల శాతం..) ఇద్దరూ ఇద్దరే! శత్రుఘ్న సిన్హా, బాబుల్ సుప్రియోలకు చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. బీజేపీని వ్యతిరేకించి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. ఉప ఎన్నికల్లో వీరు విజయం సాధిస్తారా.. మమతా బెనర్జీ వ్యూహం ఏమేరకు ఫలిస్తోందో వేచి చూడాలి. అసన్సోల్, బాలేగంజ్ స్థానాలకు ఏప్రిల్ 12న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 16న ఫలితాలు వెలువడతాయి. (క్లిక్: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ) -
ఆర్యన్ టార్గెట్ అవ్వడానికి కారణం షారుకే : నటుడు
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంపై ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై మరో బాలీవుడ్ సినీయర్ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించాడు. ఈ కేసు ఆర్యన్ టార్గెట్ అవ్వడానికి కారణం షారుక్ ఖానే అని తెలిపాడు. శత్రుఘ్న సిన్హా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలో ఈ విషయంపై పోరాడటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది వేరొకరి సమస్య వారే దీన్ని పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. ఇండియాలోనే మీడియా లాగానే ఇక్కడి వ్యక్తులు సైతం భయపడుతున్నారు. అయితే ఆర్యన్‌ను లక్ష్యంగా మారడానికి అతని మతమే కారణమని అందరూ అభిప్రాయపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా అతను భారతీయుడే’ అని తెలిపాడు. ఈ కేసు విషయంలో మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్ వంటి వారున్నా ఆర్యన్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి మాత్రం కచ్చితంగా బాద్షా సెలబ్రిటీ కావడమే కారణమని చెప్పాడు. ఇంతకుముందు ఓ కేసులో సైతం ఇలాగే దీపిక పదుకొనే పైన మాత్రమే మీడియా ఎక్కువగా ఫోకస్ పెట్టిందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇలాంటి కేసుల్లో జరిగే మూత్ర, రక్త పరీక్షలు ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. చదవండి: జాకీ చాన్ అలా చేశాడంటూ.. షారుక్ ఖాన్ని టార్గెట్ చేసిన ఫైర్ బ్రాండ్ -
Photo Feature: యాదాద్రి వైభవం.. తాజ్ పునఃప్రారంభం
తెలంగాణలోని యాదాద్రి పుణ్యక్షేత్రంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపి వేయాలని తెలంగాణ సర్కారును డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు పర్యాటకులను బుధవారం నుంచి అనుమతిస్తున్నారు. -
విజనరీ సీఎం వైఎస్ జగన్: శతృఘ్నసిన్హా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా ప్రశంసించారు. సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు కూడా దీనిని అమలు చేయాలంటూ ట్వీట్ చేశారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో కరోనా చికిత్సను ఉచితంగా అందిస్తున్నారని, ఇది సరైన సమయంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని ఆయన అభివర్ణించారు. నిజంగా ఇది అవసరమైన వారికి ఎంతో ఉపయోగపడే నిర్ణయమన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఇతరులు కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ బాటను అనుసరిస్తారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. -
శత్రుఘ్న్ వెడ్స్ పూనమ్
శత్రుఘ్న్ సిన్హా... భిన్నమైన డైలాగ్ డెలివరీతో డెబ్బై, ఎనభైలనాటి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో! రీనా రాయ్.. అందం, అభినయంతో అలరించిన అభినేత్రి! పోషించిన పాత్రలతో ఎంత ఫేమస్ అయ్యారో తమ ప్రేమ కథతో అంతే పాపులర్ అయ్యారిద్దరూ! ఈ లవ్‌స్టోరీ ట్రయాంగిల్‌గా మారింది పూనమ్ సిన్హాతో. ఆమే నటే. కాని శత్రుఘ్న్ సిన్హా భార్యగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఒక ముక్కోణపు ప్రేమ కథను తలపించే రియల్ లైఫ్ ఇది.. రీనా రాయ్‌కు తొలి హిట్‌ను ఇచ్చిన సినిమా ‘కాలీచరణ్’. అందులో హీరో శత్రుఘ్న్ సిన్హా. ఈ జోడీతోనే వచ్చిన తదుపరి చిత్రం ‘విశ్వనాథ్’. అదీ హిట్టే. దాంతో బాలీవుడ్లో ఈ జంటకు హిట్ పెయిర్ అనే ముద్ర పడిపోయింది. ఈ ఇద్దరి జీవితాల్లో కూడా కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. ‘కాలీచరణ్’ సెట్స్‌లో రీనా రాయ్‌తో మొదలైన శత్రుఘ్న్ సిన్హా స్నేహం ‘విశ్వనాథ్’ సెట్స్ మీదకు వచ్చేసరికి ప్రేమగా మారిపోయింది. ఎంతలా అంటే వాళ్ల సినిమాలతో సమంగా వాళ్ల మధ్య ఉన్న ప్రేమ గురించి చర్చించుకునేంతగా. ఈ వ్యవహారం రీనా తల్లి వరకూ చేరింది. సినిమాల పట్ల శ్రద్ధ పెట్టమని సున్నితంగా మందలించింది. సరేనని తలూపి.. తలపుల్లో శత్రుఘ్న్ను మరింతగా పదిలపరచుకుంది రీనా. శత్రుఘ్న్ కూడా రీనా తోడిదే లోకమన్నట్టున్నాడు. ఎప్పుడోకప్పుడు వీళ్ల పెండ్లి పిలుపును అందుకోకపోమని బాలీవుడ్డూ ఎదురుచూడసాగింది. అయిదేళ్లు గడిచాయి. శత్రుఘ్న్ వెడ్స్ పూనమ్ శత్రుఘ్న్ పెళ్లి నిశ్చయమైంది. వెడ్డింగ్ కార్డ్‌లో పూనమ్ పేరు అచ్చయింది. ఆమె ఒకప్పటి మిస్ ఇండియా. నటి కూడా. ‘కోమల్’ ఆమె స్క్రీన్ నేమ్. ‘సబక్’ అనే మూవీలో శత్రుఘ్న్ పక్కనా నటించింది. రైలు ప్రయాణంలో ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు శత్రుఘ్న్. అప్పటికే రీనా ప్రేమలో తలమునకలై కూడా. పూనమ్‌తో శత్రుఘ్న్ పెళ్లికి ఒక్క రీనానే కాదు, బాలీవుడ్డూ షాక్ అయింది. ఆ సమయానికి రీనా లండన్‌లో ఉంది. ఈ వార్త తెలిసి హుటాహుటిన ముంబై చేరుకొని సరాసరి శత్రుఘ్న్ ఇంటికే వెళ్లింది. ‘ఇలా చేశావేంటి?’ అని నిలదీసింది. ఆ క్షణంలో అతను ఆమెకు ఏం సమాధానం చెప్పాడో కాని తన ఆత్మకథ ‘నథింగ్ బట్ ఖామోష్’ లో వివరణ ఇచ్చుకున్నాడు శత్రుఘ్న్.. ‘ఆ టైమ్‌లో చాలా భయపడ్డాను. బాచిలర్‌గా ఉండటానికే ఇష్టపడ్డా. కాని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ పెళ్లి నుంచి తప్పుకుందామనే అనుకున్నా. పూనమ్ కూడా నేను పెళ్లి తప్పించుకుంటున్నాననే డిసైడ్ అయింది. ఎందుకంటే పెళ్లి ముందు రోజు వరక్కూడా నేను ఇండియాలో లేను. సరిగ్గా ముహూర్తానికి వచ్చా. మా వైవాహిక జీవితంలో ఏవైనా పొరపాట్లు జరిగాయంటే అవి నావల్లే. నా భార్యది ఇసుమంతైనా తప్పు లేదు’ అని. వదల్లేదు పెళ్లయినా రీనా చేయివదల్లేదు శత్రుఘ్న్. ఇదీ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. మళ్లీ రీనాను మందలించింది ఆమె తల్లి. ‘అతణ్ణి నీకు దూరంగానైనా ఉండమను. లేదంటే నిన్ను పెళ్లయినా చేసుకొమ్మను’ అని. నిజానికి రీనా కుటుంబానికి శత్రుఘ్న్ సిన్హా అంటే వల్లమాలిన అభిమానం, గౌరవం. అతణ్ణి వదులకోవాలనీ వాళ్లూ అనుకోలేదు. అతను వేరే పెళ్లి చేసుకొని తమ ఇంటికి వస్తున్నా ఆదరించారు. అతని సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనీ చేసేవారు కాదు. తల్లి చెప్పినట్టుగా శత్రుఘ్న్ను కోరింది రీనా.. తనను పెళ్లి చేసుకొమ్మని. ఖామోష్గా విన్నాడతను. అప్పుడే శత్రుఘ్న్, రీనా రాయ్, సంజీవ్ కుమార్‌లతో పహలాజ్ నిహలానీ తీసిన ‘హథ్కడీ’ హిట్ అయింది. దాంతో తిరిగి ఈ ముగ్గురితోనే ‘ఆంధీ తూఫాన్’ను ప్లాన్ చేసుకున్నాడతను. అగ్రిమెంట్ కోసం రీనా దగ్గరకి వెళ్లాడు. ‘శత్రుజీ నన్ను పెళ్లి చేసుకుంటేనే ఈ సినిమా చేస్తాను. మీ ఫ్రెండ్‌కి పది రోజులు టైమ్ ఇస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకున్నాడా ఓకే. లేదంటే నేను మరొకరి జీవిత భాగస్వామి అవడం ఖాయమని మీ ఫ్రెండ్‌కి చెప్పండి’ అని అల్టిమేటం జారీ చేసింది రీనా. పొగిలి పొగిలి.. ఆ విషయాన్ని శత్రుఘ్న్కు చేరవేశాడు పహలాజ్. వెంటనే రీనాకు ఫోన్ చేసి అడిగాడు శత్రుఘ్న్. తనతో పెళ్లి గురించి రెట్టించింది రీనా. శత్రుఘ్న్ దగ్గర సమాధానం లేదు. ఫోన్లోనే పొగిలి పొగిలి ఏడ్చాడు. ‘అంత నిస్సహాయంగా శత్రును చూడలేదెప్పుడు. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు’ అన్నాడు పహలాజ్. శత్రుఘ్న్ ఫోన్ పెట్టేశాక చెప్పాడట పహలాజ్ ‘రీనాను వదిలెయ్. ఆమె బతుకు ఆమె బతకనియ్’ అని. అలా ఏడేళ్ల ఆ ప్రేమ కథ విషాదాంతమైంది. పాకిస్తానీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్‌ను పెళ్లి చేసుకొని, తన కెరీర్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పి భర్తతో లండన్‌కు వెళ్లిపోయింది రీనా. పట్టించుకోలేదు రీనా రాయ్‌తో శత్రుఘ్న్ సిన్హా ప్రేమ సంగతి తెలిసే అతని పెళ్లి ప్రతిపాదనను ఒప్పుకుంది పూనమ్. ‘రీనాకు నేనెప్పుడూ అడ్డుగాలేను. శత్రుఘ్నే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. నాకు తెలుసు నాతో పెళ్లి తర్వాతా ఆ వ్యవహారం కంటిన్యూ అవుతుందని’ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది పూనమ్. అందుకే ఆమె తన భర్త వివాహేతర ప్రేమను పట్టించుకోలేదు. అతని మీద నమ్మకమూ పెట్టుకోలేదు. -
కంగనపై అసూయతోనే : శత్రుఘ్న సిన్హా
ముంబై: బాలీవుడ్లో బంధుప్రీతికి వ్యతిరేకంగా గళమెత్తిన క్వీన్ కంగనా రనౌత్‌కు సీనియర్ నటుడు, మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా బాసటగా నిలిచారు. ఎలాంటి అండదండలు లేకుండా నటిగా ఎదిగిన కంగనాపై ఈర్ష్య, అసూయలతోనే ఆమెను కొంతమంది విమర్శిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బీ-టౌన్లో అవుట్సైడర్లపై వేధింపులు, నెపోటిజం మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంగనా రనౌత్ బాలీవుడ్ పెద్దలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కావాలనే టార్గెట్ చేసి, సినిమాలు ఆడకుండా అడ్డుకుని సుశాంత్‌ను బలితీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (కంగనాకు బాసటగా బెంగాల్ బ్యాట్స్‌మన్) ఈ విషయంలో కొంతమంది సినీ ప్రముఖులు, అభిమానులు కంగనను సమర్థిస్తుండగా.. మరికొంత మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన శత్రుఘ్న సిన్హా.. ‘‘చాలా మంది కంగనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆమెపై ఉన్న అసూయే ఇందుకు కారణం. మన దయాదాక్షిణ్యాలు, ఆశీర్వాదాలు, మన గ్రూపుల్లో చేరకుండానే తను ఎదిగింది. ఎవరి ప్రోద్బలం లేకుండానే ఉన్నత శిఖరాలకు చేరుకుంది. అందుకే ఆమె విజయం, సాహసాన్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. తమ అండగా లేకుండా ఎదిగినందుకు విసిగెత్తిపోతున్నారు’’అని కంగనాపై ప్రశంసలు కురిపించారు. (ఎంతగా ప్రాధేయపడ్డాడో పాపం సుశాంత్..) చదవండి: సుశాంత్ ‘దిల్ బేచారా’ మూవీ రివ్యూ అదే విధంగా తమ కాలంలో ‘కాఫీ విత్ అర్జున్’ వంటి వివాదాలకు దారితీసే కార్యక్రమాలు లేవని, ఓ వ్యక్తిని టార్గెట్ చేసి ఇండస్ట్రీ నుంచి పంపేయాలనే రాజకీయాలు కూడా లేవంటూ పరోక్షంగా దర్శక, నిర్మాత కరణ్ జోహార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా స్టార్ కిడ్స్‌పై ట్రోల్స్‌కి దిగిన సుశాంత్ ఫ్యాన్స్ శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సొనాక్షి సిన్హాపై కూడా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. -
ఈ వీడియో భయంకరంగా ఉంది!
పట్నా: బిహార్‌లో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావిత రాష్ట్రాల్లో బిహార్ రెండోస్థానంలో ఉందంటూ ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ అధ్యయనం తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. పరిశుభ్రత, ఆరోగ్య వ్యవస్థ లాంటి అనేక కీలక సూచికలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాకు వచ్చినట్టు అధ్యయనం పేర్కొంది. ఇలాంటి తరుణంలో బిహార్‌లోని ఆస్పత్రుల నిర్వహణ తీరుకు అద్దం పట్టే వీడియో ఒకటి చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోని ఔట్‌పేషెంట్ విభాగంలో వందలాది మంది ఒకేచోట గుమిగూడి.. సహాయం కోసం వేచి చూస్తున్న వీడియోను మాజీ ఎంపీ శత్రుఘ్ఞ సిన్హా ట్విటర్లో షేర్ చేశారు. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న తరుణంలో లాక్డౌన్ విధించడం ఒక్కటే సరైన పరిష్కారం కాదని, సామాజిక దూరం నిబంధనలు పాటించేలా ప్రజలకు సరైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విమర్శించారు. (కరోనా: అత్యంత ప్రమాదకర జిల్లాల రాష్ట్రాలివే!) ‘‘భీతావహం! భయంకరం! ఈ వైరల్ వీడియో పట్నాలోని ప్రముఖ ఆస్పత్రికి సంబంధించినది. దీన్నేమనాలి అసలు? చాలా విచారకరం. బిహార్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. నేను ఎవరినీ తప్పుబట్టాలనుకోవడం లేదు. అయితే మహమ్మారి విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం ఏంటి? ఓపీడీలో ఆ జనసంద్రాన్ని చూడండి. నిబంధనలు ఏమైపోయాయి? ఇలాంటి సమయాల్లోనే ఎక్కువ మందికి వైరస్ సంక్రమించే అవకాశం ఉంది. వారితో పాటు పేషెంట్లకు కూడా ప్రమాదమే. రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం నితీశ్ కుమార్ తగిన చర్యలు తీసుకోవాలి’’ అని శత్రుఘ్ఞ సిన్హా విజ్ఞప్తి చేశారు. కాగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జూలై 16నుంచి 31 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు బిహార్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.(బిహార్ రాజ్‌భవన్‌కు కరోనా సెగ) Frightening! Scary! This viral video being shared here is of a prominent & established hospital in Patna, Bihar. What would we call this? Extremely pathetic & sheer negligence on part of the Govt of Bihar. I'm not blaming anyone in particular, but would like to know from the pic.twitter.com/AZHAbDWbb6 — Shatrughan Sinha (@ShatruganSinha) July 17, 2020 -
విరాళాలు ఇస్తే పబ్లిసిటీ చేయాలా?
కరోనా మహమ్మారిపై పోరాటంలో ఓ బాలీవుడ్ నటుడు ఇచ్చిన 25 కోట్ల రూపాయల విరాళం మిగతావారిని కించపరిచనట్లు ఉందని నటుడు శత్రుఘ్నసిన్హా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అంతేకాకుండా అంత భారీ మొత్తం విరాళం ఇవ్వాలనుకున్నప్పడు ఇలా అందరికీ తెలిసేలా పబ్లిసిటీ చేయడం ఎందుకని అభిప్రాయపడ్డారు. దీని వల్ల అంత మొత్తం సహాయం చేయనివాళ్లని కించపరినట్లు అవుతుందని అన్నారు. అయితే ఆ బాలీవుడ్ నటుడు ఎవరు అనే పేరును మాత్రం వెల్లడించలేదు. అయినప్పటికీ శత్రుఘ్నసిన్హా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ను ఉద్దేశించి చేసినవేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో శత్రుఘ్న వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నీకు ఇవ్వడం చేతకానప్పడు ఇతరులను విమర్శించడం ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు. కరోనాపై పోరాటంలో తన వంతుగా హీరో అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ సినీ ప్రముఖుడు ఇవ్వనంత విరాళాన్ని ప్రకటించి అక్షయ్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అలాగే ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు మరో రూ.3 కోట్ల ఆర్థిక సహాయం చేశాడు. దీంతో శత్రుఘ్నసిన్హా అక్షయ్‌నే టార్గెట్ చేశారంటూ ఆయనపై నెటిజన్లు, బాలీవుడ్ ప్రముఖులు సైతం విమర్శలు చేస్తున్నారు. దీనిపై శత్రుఘ్నసిన్హా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. `నేను అక్షయ్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. నా వ్యాఖ్యలను అక్షయ్‌కు ఆపాదిస్తూ కొందరు తీర్పులు చెప్పేస్తున్నారు. అక్షయ్‌ను టార్గెట్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. సమాజానికి సేవ చేయడంలో అక్షయ్ ఎప్పడూ ముందుంటార’ని పొగడ్తలు కురిపించారు. అయినప్పటికీ శత్రుఘ్నసిన్హాకు వ్యతిరేకంగా చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. -
‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’
సోనాక్షి సిన్హా పేరును కేవలం ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించానని బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేష్ ఖన్నా సమాధానమిచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం దూరదర్శన్‌లో పునఃప్రసారమవుతున్న రామాయణం, మహాభారతం వంటి కార్యక్రమాలు భారత సంస్కృతి, సాహిత్యం గురించి తెలియని సోనాక్షి వంటి వారికి ఉపయోగపడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై స్పందించిన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా.. ముకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. (వినూత్న వేషం.. 150 కిమీ నడక ) రామాయణంపై సోనాక్షిని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం ఎవరికో సమస్యగా ఉందని, ఆ వ్యక్తికి రామాయణంపై నిపుణుడిలా వ్యవహరించడానికి ఏ అర్హత ఉందంటూ ఘూటు విమర్శలు చేశారు. హిందూ మతం సంరక్షకుడిగా అతడిని ఎవరు నియమించారని, సోనాక్షి వంటి కూతురుకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. రామాయణ ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వకపోవడం ఆమెను హిందువు కాదని చెప్పలేదని, ఆమెకు ఎవరి నుంచి అర్హత పత్రం అవసరం లేదని శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. (ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు) తన వ్యాఖ్యలపై శత్రుఘ్న ఫైర్ అవ్వడంతో తాజాగా సోనాక్షిపై చేసిన వ్యాఖ్యలను ముకేష్ ఖన్నా సమర్థించుకున్నాడు. సోనాక్షి సిన్హా పేరును ఒక ఉదాహరణగా మాత్రమే వెల్లడించానని, ఆమెను కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు. సోనాక్షి జ్ఙానాన్ని ప్రశ్నించలేదని, ఆమెను టార్గెట్ చేయడం తన ఉద్ధేశ్యం కాదని తెలిపారు. తన మాటలను శత్రుఘ్న తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తమ మధ్య (శత్రుఘ్న ) చాలా కాలం నుంచి పరిచయం ఉందని. శత్రుఘ్న పట్ల తనకు గౌరవం ఉందన్నారు. అలాగే ‘రామాయణం, హిందూ సాహిత్యానికి సంరక్షకుడిని అని నేను అనడం లేదు. ప్రస్తుత తరం కేవలం హ్యారీ పోటర్, టిక్‌టాక్ పైనే ఆసక్తి కనబరుస్తున్నారు. భారత పౌరుడిగా దేశ చరిత్రను, సాహిత్యాన్ని వారికి తెలియజేయడం మన కర్తవ్యం. ఇందుకు సోనాక్షి పేరును ఉపయోగించడం శత్రుఘ్న తప్పుగా భావిస్తున్నాడు. కానీ అది నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు’. అని తన వ్యాఖ్యాలపై సమధానమిచ్చారు. (శ్రియ భర్తకు కరోనా లక్షణాలు? ) -
ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్షాపై నటుడు ముఖేష్ కన్నా చేసిన వ్యాఖ్యలపై ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా ఘాటుగా స్పందించారు. సోనాక్షికి తండ్రిగా ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఇక బిగ్‌బీ హోస్టుగా వ్యవహరించిన ‘కోన్ బనేగా కరోడ్ పతి’ షోకు అతిథిగా వచ్చిన సోనాక్షి రామాయణాయానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమధానం ఇవ్వలేకపోయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన ఆ ఒక్క సమాధానం ఇవ్వనంతా మాత్రాన ఆమెకు హిందు పురాణాలపై అవగాహన లేదని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. కాగా దేశంలో విధించిన లాక్డౌన్ నేపథ్యంలో రామాయణం, మహా భారతం వంటి ఇతిహాసాలను దూరదర్శన్‌లో మరోసారి ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దీనిపై బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేష్ ఖన్నా స్పందిస్తూ.. రామాయణం, మహాభారతం పునఃప్రసార కార్యక్రమం భారత సంస్కృతి, సాహిత్యం గురించి తెలియని సోనాక్షి వంటి వారికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. (నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి) ఇక ముకేష్ ఖన్నా వ్యాఖ్యలపై స్పందించిన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా.. పరోక్షంగా ముకేష్ ఖన్నాపై తీవ్ర విమర్శలు చేశారు. ఎవరి పేరును ప్రస్తావించకుండా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శత్రుఘ్న ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రామాయణంపై అడిగిన ఒక ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పకపోవడం ఎవరికో సమస్యగా ఉందని నేను అనుకుంటున్నాను. ముందుగా ఆ వ్యక్తికి రామాయణంపై నిపుణుడిలా వ్యవహరించడానికి ఏ అర్హత ఉంది. హిందూ మతం సంరక్షకుడిగా అతడిని ఎవరు నియమించారు’ అని పరోక్షంగా ముకేష్‌పై విరుచుకుపడ్డారు. (పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా: చిరు) అలాగే.. ‘సోనాక్షితో సహా తన ముగ్గురు పిల్లలకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. సోనాక్షి కెరీర్‌ను నేను ప్రారంభించాల్సిన అవసరం లేదు. తన సొంత కాళ్లపై నిలబడి స్టార్ అయ్యింది. తను కుమార్తెగా ఉన్నందుకు ఏ తండ్రి అయినా గొప్పగా ఫీల్ అవుతాడు. రామాయణ ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వకపోవడం ఆమెను హిందువు కాదని చెప్పలేదు. ఆమెకు ఎవరి నుంచి అర్హత పత్రం అవసరం లేదు.’ అని ముకేష్ మాటలకు ఘాటుగా సమాధానమిచ్చారు. (ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో) -
అది అస్సలు నచ్చేది కాదు: హీరోయిన్
కరీనా కపూర్ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హాజరైంది. ఈ సందర్భంగా తన తండ్రి రాజకీయాల్లో అడుగుపెట్టడం వల్ల ఎదురైన ఇబ్బందులను పేర్కొంది. తన వెంట సెక్యురిటీ గార్డులు రావడం అస్సలు ఇష్టం ఉండేది కాదని చెప్పుకొచ్చింది. ‘నా తండ్రి శతృఘ్న సిన్హ మంత్రైన తర్వాత ఒక్కసారిగా నా చుట్టూ వాతావారణం మారిపోయింది. నేను స్కూలుకు వెళ్తే నా వెనకాలే కొంతమంది రక్షణగా వచ్చేవారు. అది నాకు విచిత్రంగా తోచేది. అప్పుడు నేను ఆరో, ఏడో తరగతి చదువుతున్నాననుకుంటా. సరిగ్గా ఆ సమయంలోనే నాన్నకు మంత్రి పదవి దక్కింది. ఇంకేముంది, గన్మెన్లు మేం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవారు. (ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా?!) నేను బడికి వెళ్లే జీపు నిండా సెక్యూరిటీ గార్డులు ఉండేవారు. వారి చేతుల్లో పెద్ద పెద్ద గన్స్ ఉండేవి. ఇలా వెళ్లడం నాకు అస్సలు నచ్చేది కాదు. నేను స్కూల్లో జీపులో నుంచి దిగుతుంటే అందరూ వింతగా చూసేవారు. ఇలా కాదింక అని, వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలని అమ్మతో నా గోడు వెల్లబోసుకున్నా. సెక్యూరిటీ గార్డులను నాతో పంపించకపోతేనే స్కూలుకు వెళ్తా.. లేదంటే మానేస్తానని బెదిరించా. ఆ కల నిజమైనప్పుడే నాకు నిజమైన స్వాతంత్య్రం అని భావించాను. ఆ తర్వాతి కాలంలో నేను ఇంటికి దూరంగా ఉన్న కాలేజీ ఎంచుకున్నాను. దీంతో నా చుట్టూ ఏ సెక్యూరిటీ గార్డు లేకుండానే ఎంచక్కా రైలులో వెళ్లేదాన్ని’ అని చెప్పుకొచ్చింది. కాగా ఆమె సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘దబాంగ్ 3’ వసూళ్లు కురిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘భుజ్: ది ప్రైడ్ఆఫ్ ఇండియా’ చిత్రంలో నటిస్తోంది.(నమ్మలేకపోతున్నా!) -
కరోనా ఎఫెక్ట్: మోదీపై రెబల్ నేత ప్రశంసలు
పట్నా : బీజేపీ నేతలపై ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఎప్పూడు విమర్శల దాడి చేసే కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్రమాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా ఓ ఆశ్చర్యకరమైన ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించే ఈ రెబల్ నేత.. అనూహ్యంగా మోదీపై ప్రశంసలు కురిపించారు. చైనా వ్యాప్తంగా భయంకరమైన ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వుహాన్‌లో ఉన్న భారతీయులను సొంత ప్రాంతాలకు తరలించడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమైంది. ప్రత్యేక విమానం బోయింగ్ 747 ద్వారా అక్కడున్న భారతీయులు కరోనా బారిన పడకుండా వేగవంతమైన చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై శత్రుఘ్న సిన్హా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీకి సెల్యూట్ అంటూ కితాబిచ్చారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. (ఢిల్లీ చేరుకున్న భారతీయులు) -
అగ్రనేతల జాబితాలో సిద్ధూ, సిన్హా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి ఫిబ్రవరి 8న జరిగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వాయ్‌నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. అగ్ర నేతలు పాల్గొనే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత శత్రుఘ్నసిన్హా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, కమల్‌నాథ్, అమరీందర్ సింగ్‌లకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో చోటు లభించిడం విశేషం. ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌లు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 66స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తుంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిగా రోమేష్ సబర్వాల్ తలపడనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 70 స్థానాలకు జరగనున్న విషయం తెలిసిందే. చదవండి: మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్ ఖాన్ -
‘కంటతడి పెట్టుకున్నారు కానీ ఆపలేదు’
ముంబై : నేను ఇప్పుడు సరైన, ఉత్తమమైన దారిలోనే వెళ్తున్నాను. దీనికి అద్వానీజీ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయన్నారు నటుడు, కాంగ్రెస్ నాయకుడు శతృఘ్న సిన్హా. 20 ఏళ్లుగా బీజేపీతో కలిసి సాగిన శతృఘ్న.. సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు సరైన దారిలో వెళ్తున్నాను. ఉత్తమైన మార్గాన్ని ఎంచుకున్నాను. ఇందుకు అద్వానీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. నా నిర్ణయం తెలుసుకుని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కానీ వెళ్లవద్దని నన్ను ఆపలేదు. సరే మంచిది అని మాత్రం అన్నార’ని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి అధ్వర్యంలో శతృఘ్న బీజేపీలో చేరారు. దాదాపు 20 ఏళ్ల పాటు బీజేపీతో కొనసాగిన శతృఘ్న.. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. వాజ్‌పేయి కాలంలో బీజేపీలో ప్రజాస్వామ్యం కనిపించేదని.. కానీ నేడు రాచరికం పెత్తనం చెలాయిస్తుందని శతృఘ్న ఆరోపించారు. ప్రస్తుతం పార్టీలో అనుభజ్ఞులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ అద్వానీకి టికెట్ కేటాయించకపోవడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను అద్వానీలానే. ఎవరికి తలవంచను. వారు కూర్చోమంటే కూర్చోవడం.. నిల్చోమంటే నిల్చోడం వంటి పనులు నేను చేయలేను’ అన్నారు. అంతేకాక నిరుద్యోగం, వ్యవసాయం సంక్షోభం గురించి ప్రశ్నిస్తే.. మోదీ పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడతారని శతృఘ్న మండిపడ్డారు. -
కుటుంబ ‘రుణాలు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, సినీ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా.. వీరంతా తల్లి, కొడుకు, కూతురు తదితర కుటుంబసభ్యులకు బాకీ ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న వీరంతా కుటుంబ సభ్యులకు బకాయి ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. రాహుల్ తన తల్లి సోనియా నుంచి అప్పు తీసుకోగా, ములాయం కొడుకు అఖిలేశ్ నుంచి, శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా నుంచి రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. రాహుల్‌కు రూ.5 లక్షల అప్పు యూపీలోని అమేథీ నుంచి, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తన తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నుంచి రూ.5 లక్షలను అప్పు రూపంలో తీసుకున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. ఇది తప్ప ఇతర అప్పులేవీ లేవని తెలిపారు. సోనియా మాత్రం ఎవరి వద్దా రుణం తీసుకోలేదని పేర్కొన్నారు. యూపీలోని మైన్‌పురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ తన కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ నుంచి రూ.2.13 కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండో భార్య సాధనా యాదవ్‌కు రూ.6.75 లక్షలు, కొడుకు ప్రతీక్‌కు రూ.43.7 లక్షలు, కుటుంబ సభ్యురాలు మృదులా యాదవ్‌కు రూ.9.8 లక్షలు అప్పు ఇచ్చినట్లు ములాయం తెలిపారు. కూతురి నుంచి రూ.10 కోట్ల అప్పు పట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా తన కూతురు, సినీ నటి అయిన సోనాక్షి సిన్హాకి రూ.10.6 కోట్లు బకాయి ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, తన కుమారుడు లవ్ సిన్హాకు రూ.10 లక్షలు, భార్య పూనమ్ తదితరులకు రూ.80 లక్షల మేర అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు. యూపీలో లక్నో నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పూనమ్ సిన్హా తన కూతురు సోనాక్షి నుంచి రూ.16 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. ఆమె ప్రధాన ప్రత్యర్థి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎటువంటి రుణం లేదని వెల్లడించారు. శత్రుఘ్న సిన్హా ప్రత్యర్థి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎటువంటి బకాయిలు లేవని తెలిపారు. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు, ఆర్జేడీ తరఫున పాటలీపుత్రలో బరిలో ఉన్న మిసా భారతి వ్యక్తిగత రుణాలు లేవని, తన భర్త శైలేష్ కుమార్‌కు మాత్రం రూ.9.85 లక్షల బ్యాంకు లోన్ ఉందని పేర్కొన్నారు. రుణాలు, అడ్వాన్సుల రూపంలో తాను రూ.28 లక్షలు, తన భర్త రూ.2.9 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీకి చెందిన ఆమె ప్రత్యర్థి రామ్‌కృపాల్ రూ.17.17 లక్షలు‡ తన కూతురి కోసం విద్యారుణం తీసుకున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగిగా పేర్కొన్న కన్హయ్యకుమార్ బిహార్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తనకు రూ.5.86 లక్షలు, తన భార్యకు రూ.26.5 లక్షలు రుణం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తనకు రూ.75 లక్షలు, తన భార్యకు రూ.15 లక్షల ఆస్తిపాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈయన ప్రత్యర్థిగా ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ బ్యాంకు అకౌంటు లేదని, నిరుద్యోగినని తెలిపారు. చండీగఢ్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని కిరణ్ ఖేర్ తన కుమారుడి నుంచి రూ.25 లక్షలు తీసుకున్నట్లు, భర్త, ప్రముఖ సినీ నటుడు అయిన అనుపమ్ ఖేర్‌కు రూ.35 లక్షలను రుణంగా ఇచ్చినట్లు చెప్పుకున్నారు. దక్షిణ ముంబై నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరా తన భార్య పూజాకు బదులు రూపంలో రూ.4.96 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. -
భర్తగా నా ధర్మాన్ని నెరవేర్చాను!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థిగా లక్నో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన భార్య పూనమ్ సిన్హా తరఫున తాను ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రతుఘ్న సిన్హా సమర్థించుకున్నారు. తమ పార్టీలు వేరైనా.. ఆమె తన భార్య అయినందున పతిధర్మాన్ని నెరవేరుస్తున్నానని, భార్య తరఫున ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ‘లక్నోలో ప్రచారం చేయడం ద్వారా నేను పతిధర్మాన్ని నెరవేర్చాను. పట్నాలో ప్రచారం చేపట్టడం ద్వారా పూనమ్ కూడా తన పత్ని ధర్మాన్ని నెరవేరబోతుంది’ అని షాట్‌గన్ తనదైన శైలిలో చెప్పారు. బీజేపీ రెబెల్‌గా ప్రధాని మోదీ, అమిత్‌షాలపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన శ్రతుఘ్న ఎన్నికల సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పట్నా నుంచి కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకుడై ఉండి.. లక్నోలో ఎస్పీ తరఫున ప్రచారం చేయడం ద్వారా.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని లక్నో కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య ప్రమోద్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై శత్రుఘ్న స్పందిస్తూ.. ‘ఈ వివాదం ఎందుకు చెలరేగుతుందో నాకు అర్థం కావడం లేదు. గత నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే నేను నా భార్య తరఫున ప్రచారం చేస్తానని పార్టీ అధినాయకత్వానికి చెప్పాను. అధిష్టానం కూడా ఒప్పుకుంది. లక్నోలో మే 6న పోలింగ్ ముగిసిన తర్వాత పూనం పట్నాలో ప్రచారం నిర్వహించనున్నారని ఎస్పీకి కూడా సమాచారం ఇచ్చాం. ఆ పార్టీ కూడా అభ్యంతరం చెప్పలేదు. నా వరకు కుటుంబానికే మొదటి ప్రాధాన్యం’ అని షాట్ గన్ వివరించారు. -
జిన్నాపై సిన్హా వ్యాఖ్యలకు ఎన్సీపీ సమర్ధన
ముంబై : మహ్మద్ అలీ జిన్నాపై పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ నేత మజీద్ మెమన్ సమర్ధించారు. స్వాతంత్ర పోరాటంలో జిన్నా విశేష సేవలందించారని, ఆయన ముస్లిం అయినందునే జిన్నాకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. ఇదే కారణంతో శత్రుఘ్న సిన్హాపై కాషాయ పార్టీ దేశ వ్యతిరేకి అనే ముద్ర వేసిందని దుయ్యబట్టారు. సిన్హా నిన్న మొన్నటి వరకూ బీజేపీలో ఉన్నందున ఆయన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అది కాషాయ పార్టీ బోధించినవేనని గుర్తురగాలని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఓ ప్రచార ర్యాలీని ఉద్దేశించి శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పాక్ వ్యవస్ధాపకుడు జిన్నా వంటి దిగ్గజ నేతలున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీని వీడి తాను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానో వివరిస్తూ గాంధీ, నెహ్రూ, జిన్నా, సుభాష్ చంద్ర బోస్, ఇందిరా, రాజీవ్‌గాంధీ వంటి నేతలు తీర్చిదిద్దిన పార్టీ ఇదని, దేశ అభివృద్ధికి, స్వాతంత్ర సముపార్జనకు కాంగ్రెస్ విశేష కృషిచేసిందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, సిన్హా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడటంతో తాను పొరపాటున నోరుజారానని తాను మౌలానా అబ్ధుల్ కలాం ఆజాద్ పేరు చెప్పబోయి జిన్నా అని చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు. కాగా శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి తలపడనున్నారు. -
నేను నోరు జారాను!
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బాలీవుడ్ షాట్‌గన్ శత్రుఘ్నసిన్హా నోరుజారారు. ముస్లింలీగ్ నేత మహమ్మద్ ఆలీ జిన్నాను కాంగ్రెస్ ఫ్యామిలీలో చేర్చారు. మధ్యప్రదేశ్‌లోని చంద్వారాలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన శత్రుఘ్నసిన్హా ... కాంగ్రెస్ పార్టీని ప్రశంసల్లో ముంచెత్తే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ నుంచి సర్దార్ పటేల్ వరకూ, మహమ్మద్ ఆలీ జిన్నా నుంచి జవహర్లాల్ నెహ్రూ వరకూ దేశాభివృద్ధిలో కీలకభూమిక పోషించారని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడైన జిన్నాను కాంగ్రెస్ కుటుంబసభ్యునిగా పేర్కొంటూ శత్రుఘ్నసిన్హా చేసిన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామెంట్లపై ప్రత్యర్థులు మండిపడుతున్న నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా వివరణ ఇచ్చారు. తాను అనుకోకుండా నోరు జారానని, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్‌కు బదులు మహమ్మద్ జిన్నా పేరును తాను ఉచ్చరించానని ఆయన వివరణ ఇచ్చారు. -
పూనం నామినేషన్ కార్యక్రమంలో శత్రుఘ్న సిన్హా
లక్నో : బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన శత్రుఘ్న సిన్హా రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి ఎస్పీ తరపున లక్నో నుంచి పోటీ చేస్తున్న తన భార్య పూనం నామినేషన్ కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. శత్రుఘ్న సిన్హా బిహార్‌లోని పట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ అనుబంధాలూ తనకు ముఖ్యమేనని, కుటుంబ యజమానిగా, భర్తగా తన కుటుంబానికి మద్దతు ఇవ్వడం తన బాధ్యతని శత్రుఘ్న సిన్హా తన చర్యను సమర్ధించుకున్నారు. కాగా 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన సిన్హా ప్రస్తుత ఎన్నికల్లో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో తలపడుతున్నారు. ఇక లక్నోలో సిన్హా భార్య పూనం ఎస్పీ తరపున పోటీ చేస్తూ ప్రత్యర్ధిగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే లక్నోలో తన భార్య పూనం నామినేషన్‌కు శత్రుఘ్న సిన్హా హాజరవడం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. సీనియర్ నేత, దిగ్గజ నటుడైన సిన్హా పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
వారు నన్ను ఓ స్టార్లా చూడరు..
ముంబై : తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తనను ఎన్నడూ ఓ స్టార్‌గా చూడలేదని ప్రముఖ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా కుమార్తె, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా చెప్పారు. తన సన్నిహితులు తనను చూసే విధానం తాను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతి మూవీని తాను తన తొలి చిత్రంగానే భావించి కష్టపడతానని తెలిపారు. తాను తన పాత్రను ఆకళింపు చేసుకుని అందులోకి తనను తాను నిమగ్నమయ్యేలా కసరత్తు చేస్తానని సోనాక్షి వెల్లడించారు. నిజజీవితంలో తల్లితండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులు ఎవరూ తనను ఓ స్టార్‌గా చూడరని, వారికి తాను తమకు తెలిసిన సోనాగానే ఉంటానని చెప్పారు. తన చుట్టూ చేరిన వారు యస్ మేడమ్ అనడం వాస్తవం కాదని, తనను ప్రేమించే వారు అదే సమయంలో సద్విమర్శలు చేయడం సహజత్వమని సోనాక్షి సిన్హా అన్నారు. ఈ ఏడాది తొలి మూవీగా తాను నటిస్తున్న కళంక్ విడుదల కానుందని , మరో మూడు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. -
రెబెల్.. స్టార్ తిరిగేనా!
సాక్షి, ఎలక్షన్ డెస్క్ : శత్రుఘ్న సిన్హా రంగప్రవేశంతో పట్నా సాహిబ్ నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఢీకొనేందుకు శత్రుఘ్న సమాయత్తమవుతున్న తరుణంలో దేశంలోకెల్లా అత్యంత ఉత్కంఠ పోరు నెలకొన్న నియోజకవర్గంగా పట్నా సాహిబ్ అవతరించబోతోంది. బీజేపీతో పాతికేళ్లకు పైగా ఉన్న బంధాన్ని శత్రుఘ్న సిన్హా తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి సొంత సీటు పట్నా సాహిబ్ నుంచి లోక్‌సభకు బరిలోకి దిగుతుండడంతో ఇప్పటి వరకూ సిన్హా భవిష్యత్తుపై కొనసాగిన సస్పెన్స్ తొలగిపోయింది. వాజ్‌పేయి సర్కారులో మంత్రిగా పనిచేసిన సిన్హా ‘బిహారీ బాబు’గా ఉన్న జనాదరణతో రెండుసార్లు రాజ్యసభకు (1996, 2002), మరో రెండుసార్లు లోక్‌సభకు బీజేపీ టికెట్‌పై ఎన్నికయ్యారు. మోదీ కేబినెట్లో మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను మే 19 జరగనున్న ఎన్నికల్లో ఢీకొననున్నారు. దాదాపు 22 ఏళ్లు బీజేపీ తరఫున పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన శత్రుఘ్న కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం ఇదే ప్రథమం. 1970ల్లో రెబెల్ స్టార్‌గా సంచలనం సృష్టించిన శత్రు.. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పొందిన శిక్షణతో రాణించారు. ప్రతినాయకుని పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. రాజకీయాల్లో ఎలాంటి శిక్షణ లేకున్నా 1992లో న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ టికెట్‌పై తొలిసారి పోటీకి దిగారు. కాంగ్రెస్ తరఫున పోటీపడిన తోటి బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా చేతిలో 28 వేలకు పైగా ఓట్ల తేడాతో శత్రుఘ్న ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికలో రాజేష్, శత్రు భార్యలు డింపుల్ కపాడియా, పూనమ్ సిన్హా భర్తల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. 1996లో రాజ్యసభకు.. 1992 జూన్ ఉప ఎన్నికలో ఓడినా కానీ బీజేపీ తరఫున చేస్తున్న ప్రచారానికి గుర్తింపుగా సిన్హాను 1996లో రాజ్యసభకు నామినేట్ చేశారు. మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా 2002లో ఆయన రెండోసారి రాజ్యసభకు బీజేపీ తరఫున ఎన్నికయ్యారు. రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఉండగా ఆయన 2003 జనవరి నుంచి 2004 మే వరకూ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, షిప్పింగ్ మంత్రిగా పనిచేశారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనతో బిహార్ రాజధానిలో కొత్తగా ఏర్పాటైన పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి బీజేపీ టికెట్‌పై లోక్‌సభకు సిన్హా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన ఆర్జేడీ అభ్యర్థి విజయ్‌కుమార్‌ను లక్షా 66 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. మళ్లీ 2014లో బీజేపీ తరఫునే పోటీచేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుణాల్‌సింగ్‌ను 2 లక్షల 65 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. పార్లమెంటులో బీజేపీ ఎంపీగా 17 ఏళ్ల అనుభవంతో ఇంత మెజారిటీతో గెలిచినా మోదీ కేబినెట్లో చోటు దక్కకపోవడం శత్రుçఘ్న బీజేపీలో ‘రెబెల్ స్టార్’గా మారడానికి దారితీసింది. వాజ్‌పేయి కేబినెట్లో సిన్హా సహచరుడైన యశ్వంత్ సిన్హాతో చేతులు కలిపారు. కొన్నేళ్లుగా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. బీజేపీని, మోదీని మరింత ఇరుకున పెట్టడానికి బీజేపీ బద్ధ శత్రువు, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ను సిన్హా అనేకసార్లు కలిశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మోదీ ద్వయం వల్లే తనకు మంత్రి పదవి, ప్రాధాన్యం లేకుండా పోయిందనే కసితో కాంగ్రెస్‌లో చేరిన రోజు కూడా సిన్హా వారిపై బాణాలు సంధించారు. ‘బీజేపీ ఒన్ మ్యాన్ షో (మోదీ ఏకపాత్రాభినయం), ఇద్దరు సిపాయిలతో కూడిన సేన’గా మారిందని శత్రు వ్యాఖ్యానించారు. ఇద్దరు కాయస్థుల మధ్య రసవత్తర పోటీ! సిన్హాకు టికెట్ ఇవ్వడం లేదనే విషయం సూటిగా చెప్పకుండా కేంద్ర మంత్రి, సిన్హా కులానికే (కాయస్థు ) చెందిన రవిశంకర్‌ప్రసాద్‌ను పట్నాసాహిబ్‌కు తమ అభ్యర్థిగా రెండు వారాల క్రితమే బీజేపీ ప్రకటించింది. 2000 నుంచి వరుసగా రాజ్యసభకు ఎన్నికైన ప్రసిద్ధ లాయర్ ప్రసాద్‌కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి ఠాకూర్ ప్రసాద్ బీజేపీ పూర్వ రూపం జనసంఘ్ స్థాపక సభ్యుల్లో ఒకరు. ఈ నియోజకవర్గంలో కాయస్థులతోపాటు అగ్రవర్ణాల జనాభా దాదాపు 28 శాతం వరకూ ఉంది. వారిలో బీజేపీకి మద్దతుదారులు ఎక్కువ. కాయçస్థు ఓట్లలో అధిక శాతం ప్రసాద్‌కే పడతాయని అంచనా. ఆర్జేడీతో పొత్తు వల్ల గణనీయ సంఖ్యలో ఉన్న యాదవుల ఓట్లు, కాయస్థుల ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి సిన్హాకు లభిస్తాయని భావిస్తున్నారు. 2014లో కాయస్థులు చాలా వరకూ బీజేపీ అభ్యర్థి సిన్హాకే ఓటేశారు. ఈసారి ప్రసాద్‌కు ఆ స్థాయిలో ఈ కులస్తుల మద్దతు లభించకపోవచ్చనీ, కాయస్థులు, ఇతర అగ్రకులాల ఓట్లు చీలిపోతాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు. కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిలో (మహాగఠ్‌బంధన్)లో భాగం కావడం వల్ల శత్రుఘ్న నుంచి ప్రసాద్‌కు గట్టి పోటీ తప్పదనీ, సీఎం నితీశ్‌కుమార్ (జేడీయూ) మద్దతు ఉన్నా కూడా.. బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తే తప్ప విజయం దక్కదని కొందరు జోస్యం చెబుతున్నారు. ఓటర్లు : 20,51,905 అసెంబ్లీ సెగ్మెంట్లు : 6 (బక్తియార్పూర్, దీఘా, బంకీపూర్, కుంహ్రార్, పట్నాసాహిబ్, ఫాతుహా.. వీటిలో మొదటి ఐదు సీట్లను 2015 ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకోగా, ఫాతుహాలో ఆర్జేడీ గెలిచింది). -
కాంగ్రెస్‌లో చేరిన శత్రుఘ్న సిన్హా
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ నేత, బీజేపీ రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా శనివారం కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జీవాలాల సమక్షంలో సిన్హా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీని వీడటం బాధాకరమే అయినా బరువెక్కిన గుండెతో ఆ పార్టీని వీడుతున్నానని వరుస ట్వీట్లలో ఆయన పేర్కొన్నారు. బీజేపీ వ్యవస్ధాపక దినం రోజే ఆ పార్టీని వీడటం బాధాకరమని, బీజేపీ నుంచి ఎందుకు వైదొలగుతున్నాననేది మీ అందరికీ తెలుసునని సిన్హా అన్నారు. బీజేపీతో తన పయనంలో తనను బాధించిన వారిని మన్నిస్తానని స్పష్టం చేశారు. వాజ్‌పేయి, అద్వానీ వంటి దిగ్గజ నేతల మార్గదర్శకత్వంలో తాను బీజేపీలో ఎదిగానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చేందుకు బాధ్యులైన వారితో పాటు పార్టీ విధానాలతో తనను సరిపడక పోవడంతో బీజేపీని వీడటం మినహా తనకు మరో మార్గం లేకుండాపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమానికి, ఐక్యతకు తాను కృషిచేసేలా తనకు అవకాశం ఇస్తుందని సిన్హా ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాజ్‌నాథ్‌కు పోటీగా ఉమ్మడి అభ్యర్థి ?
సాక్షి, లక్నో: బీజేపీకి అసంతృప్తి నేత, పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నుసిన్హా సెగ మరోసారి తాకింది. లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు పోటిగా ఉమ్మడి అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా భార్య పూనం సిన్హా బరిలో నిలవనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. లక్నోనుంచి బీజేపీ సీనియర్ రాజ్‌నాథ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి కీలకమైన లక్నో స్థానం నుంచి పూనం సిన్హా బీఎస్పీ సహకారంతో సమాజ్ వాదీ పార్టీ తరపున లక్నో స్థానం నుంచి పోటీలో దిగనున్నారు. రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ భాగస్వామ్య పద్దతిలో కూటమి బీజేపీకి సవాల్ విసురుతోంది. మరోవైపు లక్నో స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా..ఎస్పీ అభ్యర్థి పూనం సిన్హాకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే నాలుగు లక్షల కాయస్తా (శతృఘ్న సిన్హా సామాజికవర్గం) ఓటర్లతోపాటు, 1.3లక్షల సింధీ ( పూనం సిన్హా సామాజికవర్గం) ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఆమె అభ్యర్థి త్వానికి మంచి జోష్ నిస్తుందని ఎస్పీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. కాగా బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా పార్టీకి గుడ్ బై చెప్పి షాకిచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో గత నెలలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచుకున్నారు. మరి తాజా పరిణామంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్ తప్పదు. -
లాలూ చెప్పారనే కాంగ్రెస్‌లోకి
న్యూఢిల్లీ: బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన సినీనటుడు, రాజకీయనేత శతృఘ్న సిన్హా కాంగ్రెస్‌లో చేరడంపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయ పార్టీగా వాస్తవ దృక్పథాన్ని కలిగి ఉన్నందునే తమ కుటుంబ సన్నిహితుడు లాలూ ప్రసాద్ సూచన మేరకు ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు తమ పార్టీలో చేరాలని కోరినప్పటికీ తాను లోక్‌సభ ఎన్నికల్లో పట్నా సాహిబ్ నుంచి పోటీ చేయాలనే కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉన్న తనకు పార్టీని వీడటం కష్టంగానే ఉందని, కానీ ఎల్.కె.అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా వంటి అగ్ర నేతలకు పార్టీ తగిన గౌరవం కల్పించకపోవడంతో కలత చెందానని పీటీఐ వార్తా సంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ఇక 2014లో పట్నా సాహిబ్ నియోజక వర్గం నుంచి బీజేపీ మద్దతు లేకుండా తన సొంత అర్హత ఆధారంగానే గెలుపొందానని, ఈసారి కూడా గత రికార్డులను బద్దలుకొట్టి ఘనవిజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో నియంతృత్వ పోకడలున్నాయని దుయ్యబట్టారు. వాజ్‌పేయి హయాంలో పార్టీలో ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే పద్ధతి ఉండేదని, కానీ ఇప్పుడు వన్ మ్యాన్ షో, టూ మెన్ ఆర్మీ పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తను కాంగ్రెస్‌లో చేరడానికి పలు కారణాలున్నాయని, గాంధీజీ, పటేల్, నెహ్రూ, వంటి గొప్ప నాయకులున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. అలాగే స్వాతంత్య్రోద్యమ సమయంలో కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని కొనియాడారు. పట్నా సాహిబ్ నియోజక వర్గం నుంచి తన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్‌పై స్పందిస్తూ ‘రవి శంకర్‌కు నా శుభాకాంక్షలు. గెలుపును పట్నా ప్రజలే నిర్ణయిస్తారు. ఆ దేవుడి దయ, ప్రజల మద్దతుతో గెలుస్తాననే నమ్మకం నాకుంది’ అని చెప్పారు. -
‘బీజేపీలో వన్‌మ్యాన్ షో’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించిన ఆ పార్టీ రెబెల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ గూటికి చేరడంపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ నిజమైన జాతీయ పార్టీగా వాస్తవిక దృక్పధంతో ఉన్నందున తమ కుటుంబ స్నేహితుడు లాలూ ప్రసాద్ సూచన మేరకు ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు తమ పార్టీల్లో చేరాలని తనను కోరినప్పటికీ తాను పట్నా సాహిబ్ నుంచే లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. ఇక సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉన్న తనకు ఆ పార్టీని వీడటం బాధాకరమేనని, అయితే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, యశ్వంత్ సిన్హా వంటి దిగ్గజ నేతలను పార్టీ నిర్లక్ష్యం చేస్తున్న తీరు తనను బాధించిందని చెప్పుకొచ్చారు.బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని మోదీ, అమిత్ షాల నేతృత్వంలో ఆ పార్టీలో ఇప్పుడు నియంతృత్వం రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. వాజ్‌పేయి హయాంలో పార్టీలో ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే పద్ధతి ఉండేదని, ఇప్పుడు బీజేపీలో ఒన్ మ్యాన్ షో...టూ మాన్ ఆర్మీలా పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయోద్యమానికి కాంగ్రెస్ పార్టీ విశేష కృషిసాగించిందని, తాను కాంగ్రెస్‌లో చేరడానికి పలు కారణాలు ఉన్నాయని అన్నారు. -
‘నాన్న.. ఈ పని ఎప్పుడో చేయాల్సింది ’
ముంబై : బీజేపీని వీడి తన తండ్రి మంచి పనిచేశారని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అన్నారు. గౌరవం లేని చోట ఉండే బదులు కనీస మర్యాద పాటించే వారి సమక్షంలో ఉండటం ఉత్తమమని పేర్కొన్నారు. మూడు దశాబ్ధాల పాటు బీజేపీలో కొనసాగిన బీజేపీ రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఏప్రిల్ 6న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన కూతురు సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. ‘ నాకు తెలిసి చాలా ఏళ్ల క్రితమే మా నాన్న ఈ పని చేయాల్సింది. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీలో ఆయనకు తగిన గౌరవమర్యాదలు ఎప్పుడూ లభించలేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా బిహార్‌లోని పట్నాసాహిబ్ లోకసభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందిన శత్రుఘ్న సిన్హాకు బీజేపీ ఈ సారి టికెట్ నిరాకరించింది. ఆ సీటును కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేటాయించింది. దీంతో తనకు టికెట్ నిరాకరించిన బీజేపీ నాయకత్వానికి తానూ అదేస్ధాయిలో బదులిస్తానని సిన్హా ఇదివరకే స్పష్టం చేశారు. అద్వానీకి గాంధీనగర్ నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం పట్లా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగ్గజ నేతను రాజకీయాల నుంచి వైదొలిగేలా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. రవిశంకర్‌కు పోటీగా కాంగ్రెస్ శత్రుఘ్న సిన్హాను బరిలో దించనున్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ గూటికి బీజేపీ రెబల్ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో బీజేపీ రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా బుధవారం సమావేశమయ్యారు. మూడు దశాబ్ధాల పాటు బీజేపీతో కొనసాగిన శత్రుఘ్న సిన్హా ఏప్రిల్ 6న కాంగ్రెస్‌లో చేరనున్నారు. పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన సిన్హాకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించి ఆ స్ధానం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను బరిలో దింపింది. బీజేపీ అగ్రనాయకత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్న సిన్హా కాంగ్రెస్ నుంచి అదే స్ధానంలో పోటీ చేస్తారని భావిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సిన్హా పార్టీ తిరిగి తనకు టికెట్ నిరాకరించడంతో తానూ అదేస్ధాయిలో బదులిస్తానని వ్యాఖ్యానించారు. మరోవైపు సిన్హాను తమ పార్టీ చిహ్నంపై పోటీ చేయిస్తామని బిహార్‌లో కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసిన ఆర్జేడీ పట్టుబడుతోంది. -
బిహార్‌లో ఎన్డీఏ సోషల్ ఇంజనీరింగ్
బిహార్‌లో బీజేపీ తాను పోటీచేస్తున్న 17 సీట్లలో అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి ప్రయోగాల జోలికి పోలేదు. మూడు సీట్లలో మినహా పాత అభ్యర్థులకే టికెట్లు ఇచ్చింది. సాధ్యమైనంత వరకూ సామాజిక సమతూకం పాటించింది. గెలుపులో కీలకపాత్ర పోషించే అన్ని కులాలకు ప్రాతినిధ్యం లభించేలా అభ్యర్థులను ఎంపిక చేసింది. కొత్త అభ్యర్థులు అశోక్ యాదవ్ (మధుబనీ), గోపాల్జీ ఠాకూర్ (దర్భంగా), కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్(పట్నా సాహిబ్)లో ప్రసాద్ ఒక్కరే ఎన్నికల రాజకీయాలకు కొత్త. ఆయన గతంలో ఎప్పుడూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయలేదు. యాదవ్ కేవతీ మాజీ ఎమ్మెల్యే కాగా 2010లో ఠాకూర్ బేనీపుర్ నుంచి అసెంబ్లీకి బీజేపీ టికెట్‌పై ఎన్నికయ్యారు. 2015 ఎన్నికల్లో జేడీయూ చేతిలో ఠాకూర్ ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో దర్భంగా నుంచి బీజేపీ తరఫున గెలిచిన కీర్తీ ఆజాద్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. మధుబని బీజేపీ ఎంపీ హుకుందేవ్ నారాయణ్ యాదవ్ బదులు ఆయన కొడుకు అశోక్‌కు టికెట్ ఇచ్చారు. మిగిలిన 14 మంది బీజేపీ సిట్టింగ్ ఎంపీల్లో ఐదుగురు కేంద్రమంత్రులు రాధామోహన్‌సింగ్, గిరిరాజ్‌సింగ్, రాంకృపాల్ యాదవ్, అశ్వనీ చౌబే, ఆర్కే సింగ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద్రాయ్ ఉజియార్పూర్ నుంచి, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ సారణ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కిందటిసారి భాగల్పూర్ నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్‌కు అరరియా టికెట్ ఇవ్వజూపినా ఆయన పోటీకి నిరాకరించారు. కులాల సమతూకం ఎన్డీఏతో పోటీకి ఆర్జేడీ నాయకత్వంలోని మహాగఠ్‌బంధన్ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నందున బీజేపీ అంతే శ్రద్ధతో తన అభ్యర్థులను ఎంపిక చేసింది. కేంద్ర మంత్రులు, ప్రస్తుత సభ్యులకు మళ్లీ టికెట్లు ఇవ్వాలనేది రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ నిర్ణయం. కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ పాత స్థానం బెగూసరాయ్‌ని ఈసారి జేడీయూకు కేటాయించడంతో ఆయన నవాదా నుంచి పోటీ చేస్తున్నారు. 39 సీట్లకు సంబంధించిన ఎన్డీఏ జాబితాలో 13 మంది అగ్రకులాలకు చెందిన వారు. 12 మంది బీసీలు, ఏడుగురు బాగా వెనుకబడిన కులాల వారు (ఈబీసీ). ఈబీసీలైన ధనుక్, కేవట్, గంగేయీ, గోసాయీ, గంగోటా, చంద్రవంశీ కులాలకు ఒక్కో సీటు లభించింది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ ఆరుగురు ఎస్సీలకు రిజర్వ్డ్ సీట్లలో టికెట్లు ఇచ్చింది. అగ్రవర్ణాల్లో ఏడుగురు రాజపుత్రులు, ముగ్గురు భూమిహార్లు, ఒక కాయస్థ, ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు. బీసీల్లో ఐదుగురు యాదవులు, ముగ్గురు కుష్వాహాలు, ఒక కూర్మీ, ఇద్దరు వైశ్యులు (ఈ వైశ్యులను బిహార్‌లో బీసీలుగా పరిగణిస్తారు) పోటీ చేస్తున్నారు. ఎస్సీ అభ్యర్థుల్లో రవిదాస్ (చర్మకారులు), ముషాహర్ కులాల వారికి చెరొకటి కేటాయించారు. మిగిలిన నలుగురూ పాస్వాన్ కులస్తులు. కిషన్‌గంజ్‌లో జేడీయూ ముస్లిం అభ్యర్థిని (మహ్మద్ అష్రఫ్) నిలబెడుతోంది. కాయస్థ వర్గానికి చెందిన మాజీ నటుడు శత్రుఘ్నసిన్హా స్థానంలో ఇదే కులానికి చెందిన మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను పట్నాసాహిబ్ సీటుకు బీజేపీ ఎంపిక చేసింది. సిన్హా ఈసారి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసే అవకాశాలున్నాయి. ఆర్జేడీకి యాదవుల్లో గట్టి పునాది ఉన్న కారణంగా అదే కులానికి చెందిన నిత్యానంద్ రాయ్‌కు, రాంకృపాల్సింగ్కు బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది. కాని, బ్రాహ్మణ–బనియా పార్టీ అనే పేరు చెరిపేసుకోవడానికి ఇద్దరు బ్రాహ్మణులు అశ్వనీ చౌబే (బుక్సర్), గోపాల్జీ ఠాకూర్ (దర్భంగా)కు మాత్రమే బీజేపీ టికెట్లు ఇచ్చింది. రెబెల్ ట్రబుల్ ఈసారి అనేక కారణాలతో ప్రధాన పార్టీల టికెట్లు లభించని ప్రముఖ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దీంతో పలుచోట్ల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి. రెండేసి సార్లు లోక్‌సభకు ఎన్నికైన అరుణ్‌కుమార్ (జెహానాబాద్), ఓంప్రకాశ్యాదవ్ (సివాన్), ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్‌గా కూడా పనిచేసిన ఉదయ్‌నారాయణ్ చౌధరి, బంకా మాజీ ఎంపీ పుతుల్ కుమారి, కాంగ్రెస్ సీనియర్ నేత నిఖిల్‌కుమార్, గయ నుంచి రెండుసార్లు గెలిచిన హరి మాంఝీ ఇలాంటి అసంతృప్త నేతల్లో ఉన్నారు. మాజీ మంత్రి, భర్త దిగ్విజయ్‌సింగ్ మరణించాక 2010లో బంకా నుంచి ఉప ఎన్నికలో గెలిచిన పుతుల్కుమారి (జేడీయూ) 2014లో ఆర్జేడీ నేత జైప్రకాశ్నారాయణ్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. ఆమెకు బదులు గిరిధారీ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. పుతుల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలనే పట్టుదలతో ఉన్నారు. సివాన్‌లో నేర నేపథ్యమున్న ఆర్జేడీ నేత షహాబుద్దీన్, ఆయన భార్యను ఓడించిన బీజేపీ ఎంపీ ఓంప్రకాశ్ యాదవ్‌కు ఈ సీటు జేడీయూకు కేటాయించడంతో ఈసారి పోటీచేసే అవకాశం రాలేదు. ఆయన కూడా రెబెల్‌గా బరిలోకి దిగే అవకాశముంది. మహాభారతంలో అభిమన్యుడిలా తనను వాడుకుని వదిలేశారని యాదవ్ ఆరోపించారు. మాజీ స్పీకర్ ఉదయ్ చౌధరి (జేడీయూ) కిందటి పార్లమెంటు ఎన్నికల్లో జమూయి రిజర్వుడు స్థానంలో ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ చేతిలో ఓడిపోయారు. 2017లో జేడీయూ మళ్లీ ఎన్డీఏలో చేరడంతో దళితుడైన చౌధరి తన పార్టీకి రాజీనామా చేసి ఆర్జేడీ కూటమికి దగ్గరయ్యారు. అయినా ఆయనకు జమూయిలో కూటమి టికెట్ దక్కలేదు. ఔరంగాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత నిఖిల్‌కుమార్‌కు టికెట్ నిరాకరించడంతో ఆయన అనుచరులు పార్టీ ఆఫీసుపై ఆగ్రహం ప్రదర్శించారు. ఆయన రెబెల్‌గా పోటీచేయకుండా నివారించడానికి కాంగ్రెస్ ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేతలు తిరుగుబాటుదారులుగా పోటీకి దిగితే ప్రధాన అభ్యర్థుల గెలుపోటములు తారుమారవుతాయి. -
కాంగ్రెస్‌లోకి బీజేపీ ‘రెబల్’స్టార్..!
న్యూఢిల్లీ : బీజేపీ రెబల్ శత్రుఘ్నసిన్హా ఎన్నికల వేళ ఆ పార్టీకి షాకివ్వనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని ఎంపీ అఖిలేష్ ప్రసాద్ తెలిపారు. బిహార్‌లోని పట్నాసాహిబ్ లోకసభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందిన శత్రుఘ్నకు బీజేపీ ఈ సారి టికెట్ నిరాకరించింది. ఆ సీటును కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేటాయించింది. కాగా, పట్నాసాహిబ్ నుంచే శత్రుఘ్నను కాంగ్రెస్ పోటీలోకి దింపుతుందని తెలుస్తోంది. గతకొంత కాలంగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న శత్రుఘ్న.. కాంగ్రెస్, రాహుల్ గాంధీని పొగడ్తలతో ముంచెత్తున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశంలోని అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000 అందిస్తామని రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకంపై ఆయన ప్రశంసలు కురిపించారు. పరిస్థితులకు అనుగుణంగా రాహుల్ ప్రకటించిన ఈ పధకాన్ని పేదరికంపై మాస్టర్‌స్ర్టోక్‌గా ఆయన అభివర్ణించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ సహా, పాలక బీజేపీ విధానాలను గత కొన్నేళ్లుగా శత్రుఘ్న బాహాటంగా ఎండగడుతున్న సంగతి తెలిసిందే. తనకు టికెట్ నిరాకరించిన బీజేపీ నాయకత్వానికి తానూ అదేస్ధాయిలో బదులిస్తానని సిన్హా ఇదివరకే స్పష్టం చేశారు. అద్వానీకి గాంధీనగర్ నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం పట్లా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగ్గజ నేతను రాజకీయాల నుంచి వైదొలిగేలా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. (చదవండి : షాట్‌గన్ వర్సెస్ రవిశంకర్ ప్రసాద్?) -
రాహుల్ పధకంపై బీజేపీ నేత ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశంలోని అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000 అందిస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకంపై బీజేపీ అసంతృప్త నేత శత్రుఘ్న సిన్హా ప్రశంసలు కురిపించారు. పరిస్థితులకు అనుగుణంగా రాహుల్ ప్రకటించిన ఈ పధకాన్ని పేదరికంపై మాస్టర్‌స్ర్టోక్‌గా ఆయన అభివర్ణించారు. రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకంతో భీతిల్లిన కొందర మన దిగ్గజ నేతలు ఈ పధకాన్ని విమర్శించేందుకు హుటాహుటిన విలేకరుల సమావేశం నిర్వహించారని అరుణ్ జైట్లీని ఉద్దేశించి శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ సహా, పాలక బీజేపీ విధానాలను గత కొన్నేళ్లుగా శత్రుఘ్న సిన్హా బాహాటంగా ఎండగడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకాన్ని బీజేపీ తోసిపుచ్చింది. ఈ పధకం ఆర్భాటమేనని పేదరికాన్ని తొలగించే దిశగా కాంగ్రెస్ ఎన్నడూ చర్యలు చేపట్టలేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. కాగా పార్టీ విధానాలను బహిరంగంగా విమర్శిస్తున్న శత్రుఘ్న సిన్హాకు బీజేపీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నా సాహిబ్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేరును అభ్యర్ధుల జాబితాలో పొందుపరిచింది. తనకు టికెట్ నిరాకరించిన బీజేపీ నాయకత్వానికి తానూ అదేస్ధాయిలో బదులిస్తానని సిన్హా స్పందించారు. అద్వానీకి గాంధీనగర్ నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం పట్లా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగ్గజ నేతను రాజకీయాల నుంచి వైదొలిగేలా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాగా, శత్రుఘ్న సిన్హా ఈనెల 28న కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం సాగుతోంది. -
షాట్‌గన్ వర్సెస్ రవిశంకర్ ప్రసాద్?
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని పట్నా సాహీబ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తిరుగుబాటుదారుడు శతృఘ్నసిన్హాని పోటీ చేయించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇదే విషయం బిహార్ రాజకీయాలను కుదిపేస్తోంది. పట్నా సాహీబ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ని నిలబెడుతున్న తరుణంలో కాంగ్రెస్ శతృఘ్నసిన్హాను ముందుకు తెస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పట్నా సాహీబ్ నుంచి ఎట్టిపరిస్థితుల్లో పోటీచేసి తీరుతానని ఇప్పటికే శతృఘ్న ప్రకటించారు. ‘షాట్ గన్’గా అభిమానులు పిలుచుకునే శతృఘ్న బీజేపీ ప్రస్తుత ఎంపీ అయినా.. కొన్నేళ్లుగా బీజేపీపై, మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గత వారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హాజరై, రవిశంకర్‌ప్రసాద్‌ను ఇక్కడ నిలబెట్టాలని చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఆర్కే సిన్హా పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవలే పార్టీని వీడిన బీజేపీ మాజీ నేత, క్రికెటర్ కీర్తీ ఆజాద్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయవచ్చని తెలుస్తోంది. కీర్తీ ఆజాద్ బిహార్‌లోని దర్భంగ నియోజకవర్గానికి బీజేపీ తరఫున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
హోలీ స్పెషల్ : మోదీకి సిన్హా చురకలు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా బీజేపీ అసంతృప్త నేత, ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా విమర్శల దాడి చేపట్టారు. ప్రధాని మోదీ చౌకీదార్ల ప్రచారంలో నిమగ్నమైతే ఆయనకు దేశ ప్రజలు జవాబులేని ప్రశ్నల గురించి గుర్తుచేస్తారని హెచ్చరించారు. దేశంలోని చౌకీదార్లను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించడాన్ని తప్పుపట్టిన సిన్హా వారిలో చాలా మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానికి హోళీ శుభాకాంక్షలు చెబుతూ మోదీని ఉద్దేశిస్తూ..‘సర్జీ..మీరు దయచేసి కాపలాదారుల గురించి లోతుగా వెళ్లకండి.. మీ నుంచి జవాబులేని ప్రశ్నల గురించి, రఫేల్ ఒప్పందం గురించి ప్రజలు చాలా తెలుసుకోవాలని భావిస్తున్నార’ని వ్యాఖ్యానించారు. చౌకీదార్ల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయని, వారిలో చాలామంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ గతవారం సోషల్ మీడియాలో చౌకీదార్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్విటర్లో తన పేరు ముందు ఆయన చౌకీదార్ పదం చేర్చారు. ప్రధాని బాటనే పార్టీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నేతలు చౌకీదార్ క్యాంపెయిన్‌ను అనుసరించి తమ పేర్ల ముందు ఆ పదాన్ని జోడించారు. ఇక బుధవారం దేశంలోని 25 లక్షల మంది చౌకీదార్లు (సెక్యూరిటీ గార్డులు) ఉద్దేశించి మోదీ మాట్లాడారు. రఫేల్ ఒప్పందంలో తనను విమర్శించేందుకు రాహుల్ పలుమార్లు కాపలాదారే దొంగ అనే పదాన్ని వాడటం పట్ల ఆయన చౌకీదార్లకు క్షమాపణ చెప్పారు.కాగా పట్నా నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తారని భావిస్తున్నారు. -
కాంగ్రెస్ టికెట్‌పై బీజేపీ ఎంపీ పోటీ..!
పట్నా: బీజేపీ రెబల్ ఎంపీ ఎంపీ శతృఘ్న సిన్హా.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా బీజేపీ అధిష్టానంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ టికెట్‌ను నిరాకరించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయనకు టికెట్ దక్కకపోతే కాంగ్రెస్ నుంచి పోటీలో దిగాలని ఆయన భావిస్తున్నారు. బిహార్‌కు చెందిన శతృఘ్న.. పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మోదీపై శతృఘ్న ఎన్ని విమర్శలు చేసినా ఇప్పటికీ ఆయనపై బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2009, 2014 ఎన్నికల్లో పాట్నా సాహిబ్ స్థానం నుంచి శతృఘ్న గెలిచారు. ఈసారి కూడా ఇదే స్థానం నుంచి పోటీచేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. కానీ ఏ పార్టీ నుంచి పోటీచేస్తారనేది ఇంకా స్పష్టంకాలేదు. అయితే ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం నుంచి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను బరిలో నిలపాలని బీజేపీ భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తుకూడా ప్రారంభించింది. -
‘అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా’
లక్నో : బీజేపీ నాయకత్వంతో విభేదిస్తున్న ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తాను తిరిగి పట్నా సాహిబ్ స్ధానం నుంచే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం నిర్ణయంతో నిమిత్తం లేకుండా తాను నియోజకవర్గం మారే ప్రసక్తే లేదని తెగేసిచెప్పారు. ఏ పరిస్థితుల్లోనైనా తాను పోటీ చేసే నియోజకవర్గంలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదన్నారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పలు అంశాలపై సిన్హా పార్టీ అగ్రనాయకత్వంతో విభేదిస్తున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు, జీఎస్టీ సహా పలు నిర్ణయాలపై సిన్హా సొంత పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలో జరిగిన బీజేపీ వ్యతిరేక ర్యాలీలో పాల్గొని స్టార్ స్పీకర్‌గా విపక్షాల ప్రశంసలు అందుకున్నారు.మరోవైపు తన భార్య పూనం సిన్హాను యూపీలోని లక్నో నుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై పోటీకి నిలిపేందుకు శత్రుఘ్న సిన్హా యోచిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో ఇటీవల లక్నోలో సిన్హా భేటీని ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ధ్రువీకరించని సిన్హా దీన్ని తోసిపుచ్చలేనని కూడా నర్మగర్భంగా వ్యాఖ్యానించడం విశేషం. కాగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సిన్హా ఎస్పీ టికెట్‌పై పోటీలో ఉంటారని భావిస్తున్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. -
శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు
-
‘ప్రతీ వ్యక్తి పతనం వెనుక కూడా ఓ మహిళ ఉంటుంది’
సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు శత్రుఘ్న సిన్హా. సొంత పార్టీ నాయకుల మీదే వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడే ఈ సీనియర్ స్టార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఓ బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న శత్రుఘ్న సిన్హా మీటూ ఉద్యమం పై స్పందించారు. ‘మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను ఈ వ్యాఖ్యలు చేయడానికి ఏ మాత్రం సంశయించటం లేదు. విజయవంతమైన ప్రతీ వ్యక్తి పడిపోవటం వెనుక కూడా ఓ మహిళ ఉంటుంది. మీటూ వివాదంలో నా పేరు వినిపించకపోవటం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. -
‘ఆమె ఉక్కు మహిళ’
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో జాగ్రత్తగా వ్యవహరించాలని బీజేపీ నాయకత్వానికి ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సూచించారు. ప్రభుత్వాన్ని, పార్టీని తన వ్యాఖ్యలతో తరచూ ఇరకాటంలోకి నెట్టే సిన్హా మమతా వర్సెస్ సీబీఐ వ్యవహరంలోనూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడుల నేపథ్యంలో మమతా సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ ఐరన్ లేడీ అని ఆమెను జాగ్రత్తగా హ్యాండిల్ చేయకుంటే ప్రమాదమని పార్టీని హెచ్చరించారు. ఏమైనా సమయం మించిపోతుంది జాగ్రత్త అంటూ సిన్హా నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. శత్రుఘ్న సిన్హా గతంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు, జీఎస్టీ సహా మోదీ సర్కార్ చేపట్టిన పలు విధాన నిర్ణయాలతో ఆయన పలుమార్లు విభేదించారు. -
మమతకు శత్రుఘ్నసిన్హా ఝలక్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి బీజేపీ అసంతృప్త నాయకుడు శత్రుఘ్నసిన్హా ఝలక్ ఇచ్చారు. ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన అంగీకరించలేదు. మమత ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలతో కలిసి కోల్‌కతాలో విపక్ష ర్యాలీకి ఆయన హాజరయ్యారు. (మమతా బెనర్జీ మెగా ర్యాలీ) ‘వాస్తవంగా చెప్పాల్సివస్తే మమతా బెనర్జీ జాతీయ నాయకురాలు. రాజకీయాల్లో తానేంటో నిరూపించుకున్నారు. అయితే ఆమె ఇచ్చిన వాగ్దానాలకు, అమలు చేయడానికి మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఇచ్చిన మాటపై నిలబడగలగాలి. తర్వాతి ప్రధానమంత్రి ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది నా పని కాద’ని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. సొంత పార్టీపై తరచుగా విమర్శలు చేస్తున్న సిన్హా.. తాను బీజేపీ ఎంపీగా ఇక్కడకు రాలేదని చెప్పారు. యశ్వంత్ సిన్హా నాయకత్వంలో ఏర్పాటైన రాష్ట్ర మంచ్ తరపున ర్యాలీకి హాజరైనట్టు వెల్లడించారు. అయోధ్యలో రామమందిరం వివాదంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. -
మమత ర్యాలీలో పాల్గొంటా: శతృఘ్న సిన్హా
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కోల్‌కతాలో నిర్వహించనున్న మెగా ర్యాలీలో పాల్గొననున్నట్లు నటుడు, బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా తెలిపారు. బీజేపీలో తనకు గౌరవం దక్కడం లేదన్న ఆయన, ‘రాష్ట్ర మంచ్’ సంస్థ తరఫున ఆ ర్యాలీకి హాజరవుతానన్నారు. కొందరు బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరవుతుండగా లేనిది తాను టీఎంసీ ర్యాలీకి వెళ్ల కూడదా అంటూ సిన్హా సమర్ధించుకున్నారు. బీజేపీ పట్ల తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. మమతా బెనర్జీని కీలక జాతీయ స్థాయి నేతగా ఆయన పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు హెచ్డీ దేవెగౌడ, మల్లికార్జున ఖర్గే, కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులు పాల్గొంటున్న ఆ ర్యాలీలో శతృఘ్న సిన్హా ‘స్టార్ స్పీకర్’గా మారనున్నట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను బాహాటంగానే గత కొంతకాలంగా తప్పుబడుతున్న శతృఘ్న సిన్హా బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేసిన ‘రాష్ట్ర మంచ్’లో చేరారు. దీంతో ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీ సహా పలు సౌకర్యాలను ఉపసంహరించింది. -
శత్రుఘ్న సిన్హాకు మోదీ షాక్
పట్నా : ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీపై పలు సందర్భాల్లో విమర్శలతో విరుచుకుపడుతున్న ఆ పార్టీ నేత, ఎంపీ శత్రుఘ్న సిన్హాకు బీజేపీ సీనియర్ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ షాక్ ఇచ్చారు. బీజేపీతో ఏమైనా ఇబ్బందులుంటే సిన్హా పార్టీ నుంచి వైదొలగాలని, ఆయన బీజేపీ అసంతృప్త నేత యశ్వంత్ సిన్హా ప్రభావానికి లోనయ్యారని విమర్శించారు. బీజేపీపై శత్రుఘ్న సిన్హా మాట్లాడుతున్న విధానం, ఆయన ఉపయోగిస్తున్న భాష తీవ్ర అభ్యంతరకరమని ఆక్షేపించారు. సిన్హాకు బీజేపీతో సమస్యలుంటే పార్టీకి రాజీనామా చేయాలని సుశీల్ మోదీ సూచించారు. ‘అసలు ఆయన పార్టీలో ఎందుకుండాలి..పార్టీని దూషిస్తూ బీజేపీలో ఉన్నాని ఎలా చెబుతా’రని ప్రశ్నించారు. పార్టీ సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న యశ్వంత్, శత్రుఘ్న సిన్హాలు తరచూ బీజేపీ విధానాలపై, ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ విమర్శల దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని కేవలం ముందస్తు ప్రణాళికతో కూడిన ఇంటర్వ్యూలు ఇవ్వడం మినహా నిబద్ధత కలిగిన జర్నలిస్టులు నేరుగా అడిగే ప్రశ్నలకు బదులివ్వలేరని సిన్హా ఇటీవల ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వన్‌మాన్ షోలా తయారైందని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. -
మా పార్టీని ఓడించండి: బీజేపీ ఎంపీ
ముజాఫర్‌నగర్(ఉత్తరప్రదేశ్) : రఫేల్ డీల్‌పై విపక్షాల ఎక్కుపెట్టే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్న మోదీ సర్కారుకు స్వపక్షం నుంచే సెగ తగులుతోంది. రఫేల్ డీల్‌పై బీజేపీ అసంతృప్తి నేత శత్రుఘ్నసిన్హా, సొంత ప్రభుత్వంపైనే మండిపడ్డారు. ఎంతో అనుభవపూర్వకమైన కంపెనీ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)ను పక్కనపెట్టి, కొత్త కంపెనీని రఫేల్ కాంట్రాక్ట్‌కు ఎంపిక చేయడమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం తవ్లి గ్రామంలో జరిగిన వ్యవసాయదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రఫేల్ డీల్‌కు ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం దస్సాల్ట్ ఏవియేషన్‌కు భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను కేంద్ర ప్రభుత్వమే ఎంపిక చేసిందని ఫ్రాన్స్ అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చెప్పినట్టు వెల్లడైన విషయాన్ని గుర్తు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా హాజరయ్యారు. కాగా, రూ.58 వేల కోట్లకు పైగా విలువైన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటున్నాయి. 2019 ఎన్నికలకు విపక్షాలకు ఇదే ప్రధాన అస్త్రంగా మారింది. -
వారణాసిలో మోదీ వర్సెస్ శత్రుఘ్న సిన్హా..?
సాక్షి, న్యూఢిల్లీ : సొంత పార్టీపైనే విమర్శల దాడితో విరుచుకుపడుతున్న సీనియర్ బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా సార్వత్రిక ఎన్నికలకు ముందు కాషాయ పార్టీకి గట్టి షాక్ ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీని బాహాటంగా పలు సందర్భాల్లో విమర్శించిన శత్రుఘ్న సిన్హా రానున్న ఎన్నికల్లో ఆయనపైనే పోటీకి దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి వైదొలగితే సమాజ్ వాదీ పార్టీ నాయకత్వం సిన్హాను ప్రధాని మోదీపై వారణాసి నుంచి బరిలోకి దింపేందుకు యోచిస్తోందని తెలుస్తోంది. వారణాసిలో ప్రధాని మోదీకి ప్రజాదరణపై ఎలాంటి సందేహాలు లేకున్నా ఓటర్లకు చిరపరిచితుడు కావడంతో పాటు వారణాసిలోని కాయస్థ వర్గంలో గట్టి మద్దతు కలిగిన శత్రుఘ్న సిన్హా పోటీని తోసిపుచ్చలేమని చెబుతున్నారు. గుజరాత్లో ఇటీవల యూపీ, బిహార్ వలస కార్మికులు భయంతో స్వస్థలాలకు తిరిగివస్తున్న ఉదంతం వారణాసిలో బీజేపీ అవకాశాలను ప్రభావితం చేయనుంది. మరోవైపు లక్నోలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శత్రుఘ్న సిన్హా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో వేదికను పంచుకున్నారు. ఇదే వేదిక నుంచి మోదీ సర్కార్‌పై సిన్హా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాఫెల్ యుద్ధవిమానాల తయారీకి దసాల్ట్ ఏవియేషన్ భాగస్వామిగా ప్రభుత్వ రంగ హిందుస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను పక్కనపెట్టి ప్రయివేటు సంస్థను ఎందుకు ఎంచుకున్నారని ఆయన నిలదీశారు. రాఫెల్ డీల్‌పై ప్రభుత్వం నుంచి ప్రజలు సమాధానం కోరుతున్నారన్నారు. -
‘వన్ మ్యాన్ షో.. టూ మ్యాన్ ఆర్మీ’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా సొంత పార్టీ నేతలపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఈ సారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలను టార్గెట్ చేశారు. వారిద్దరి నాయకత్వాన్ని ‘‘వన్ మ్యాన్ షో.. టూ మ్యాన్ ఆర్మీ’’ అంటూ వ్యంగ్యాస్త్రలు వర్ణించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘‘వారిద్దరి నాయకత్వం అహంకారపూరితమైనది. వారికి అతి విశ్వాసం ఎక్కువ. ఈవీఎంలు వారి కంట్రోల్లో ఉంటాయి కాబట్టే.. మరో 50 ఏళ్లు అధికారంలో ఉంటామని ముందుగా ప్రకటించారు’’ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఆయన రెండు అడుగులు వెనక్కి వేసి మాయావతితో పొత్తు పెట్టుకున్నారని సిన్హా అభిప్రాయపడ్డారు. అఖిలేష్ రాజకీయాల్లో యువకుడైనా అద్భుతమైన విశ్వాసం, ధైర్యం, రాజకీయాల్లో పరిపక్వత కలిగిన నాయకుడని అభినందనలతో ముంచెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు దేశం కోసం ఓటు వేస్తారని సిన్హా పేర్కొన్నారు. కాగా గత కొంత కాలంగా అధికార పార్టీ నేతలపై సిన్హా తీవ్ర విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. రాఫెల్ ఒప్పందంపై కూడా మోదీ ప్రభుత్వాన్ని ఆయన బహిరంగంగానే నిలిదీశారు. -
సిద్ధూకి మద్దతుగా బీజేపీ సీనియర్ ఎంపీ
సాక్షి, కోలకతా: బీజేపీ సీనియర్ నేత శతృఘ్న సిన్హా మరోసారి సొంత పార్టీపై తనదైన శైలిలో స్పందించారు. పాక్ ఆర్మీ చీఫ్‌తో హగ్ వివాదంలో మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి మద్దుతుగా నిలిచారు. దేశ మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో పాకిస్తాన్ ప్రధానమంత్రులను ఆలింగనం చేసుకోలేదా అని సిన్హా ప్రశ్నించారు. పాక్ పర్యటనల సందర్భంగా దేశ ప్రధానులు పాక్ ప్రధానులను హగ్ చేసుకున్నారని గుర్తుచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు, ప్రస్తుత ప్రధాని మోదీ పాక్ పర్యటనల సందర్భంగా అప్పటి ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను కౌగిలించుకోలేదా అని ప్రశ్నించారు. అలాగే ఈ విషయంపై ఇప్పటికే సిద్ధూ వివరణ ఇచ్చిన తరువాత ఇంకా వివాదం ఉంటుందని తాను భావించలేదన్నారు. కోల్‌కతాలో జరిగిన ఒక సదస్సులో శతృఘ్నసిన్హా మాట్లాడుతూ, బిజెపికి వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని, పార్టీకి అద్దంలా వ్యవహరించానని పేర్కొన్నారు. అయితే పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన పార్టీకి వ్యతిరేకమైనట్టు కాదని పేర్కొన్నారు. వ్యక్తుల కంటే పార్టీ గొప్పదనే సూత్రాన్ని నానాజీ దేశ్‌ముఖ్, అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ లాంటి బీజేపీ అగ్రనేతల నుంచి తాను నేర్చుకున్నానని గుర్తు ఆయన చేసుకున్నారు. అంతేకాదు జీఎస్టీ చట్టంపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంక్లిష్టమైన చట్టంగా పేర్కొన్న సిన్హా, దీనిమూలంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొన్నారన్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీపై నోరు విప్పడం తన బాధ్యత అని చెప్పారు. కాగా గత వారం పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ 22వ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన క్రికెటర్ టర్న్డ్ పొలిటీషియన సిద్ధూ పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సిగ్గుమాలిన చర్యగా శివసేన మండిపడగా, కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ బీజేపీ కాంగ్రెస్‌పార్టీపై విరుచుపడిన సంగతి తెలిసిందే. -
మా బంగ్లా పేరు సీక్రెట్ అదే! : నటి
ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా గారాల పట్టి, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తమ బంగ్లా పేరు వెనుక ఉన్న సీక్రెట్ చెప్పేశారు. ‘దబంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సరైన హిట్లులేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ సింగింగ్ షోకి గెస్ట్‌గా హాజయ్యారు సోనాక్షి. ఇందిరా దాస్ అనే కంటెస్టెంట్ ప్రతిభకు ముగ్ధురాలైన సోనాక్షి.. ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ఇందిరా దాస్, ఆమె తల్లితో సోనాక్షి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మీ బంగ్లాకు రామాయణ్ అనే పేరు ఎందుకు పెట్టారంటూ’ ఇందిర తల్లి సోనాక్షిని అడిగారు. ‘ఎన్నో ఏళ్లుగా, ఎంతో మంది ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. కానీ ఈ రోజు మీ కోసం ఆ రహస్యాన్ని చెప్పేస్తున్నా. మా నాన్న పేరు మీకందరికీ తెలిసిందే. ఆయన అన్నదమ్ముల పేర్లు... రామ్, లక్ష్మన్, భరత్. ఇక నా అన్నదమ్ములు లవ్, కుశ. కాబట్టి రామాయణ్ అనే పేరు మా బంగ్లాకు సరిగ్గా సరిపోతుందని కుటుంబ సభ్యులు భావించారు. అందుకే ఆ పేరు పెట్టారు. ఈ రకంగా చూస్తే మా ఇంట్లో నేను, మా అమ్మే(పూనం) బయటివాళ్లం అన్పిస్తోంది కదా. కానీ ఒక్కోసారి మహాభారత సంఘటనలు(యుద్ధం) కూడా ‘రామాయణ్’లో సృష్టించగల సత్తా మాకుంది’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. -
సూపర్ 30కి మద్దతుగా తేజస్వీ యాదవ్
పట్నా : విద్యార్థుల ఫలితాల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఎదురుకొంటున్న ప్రముఖ మ్యాథ్స్ నిపుణుడు ఆనంద్ కుమార్‌కు పలువురు ప్రముఖులు బాసటగా నిలిచారు. తొలుత బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా, కుమార్‌కు మద్దతుగా నిలిచారు. ‘మూక దాడులు మరో రూపం దాల్చాయి. ఈ సారి బాధితుడు మన ‘సూపర్ 30’ హిరో కుమార్. నిజమైన మ్యాథ్స్ నిపుణుడైన కుమార్ ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచారు. అతని సేవలు బిహార్‌కు, భారత్‌కు గర్వకారణమ’ని శత్రుఘ్న సిన్హా కొనియాడారు. తాజాగా బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. కుమార్‌ని సోమవారం అతని ఇంట్లో కలిసిన తేజస్వీ ట్విటర్లో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘కుమార్ సమాజంలోని వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు. ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి అండగా నిలిచారు. వారి మెరుగైన భవిష్యత్ కోసం పాటుపడుతూ.. తాను కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ నియంతృత భావాలు కలిగిన ఓ వర్గం అతని పేరును చెడగొట్టేలా అసత్యాలను ప్రచారం చేస్తోంది. కుమార్‌కు గౌరవ సూచికగా.. బాలీవుడ్లో అతని బయోపిక్ తెరకెక్కుతోంద’ని పేర్కొన్నారు. పట్నా కేంద్రంగా కుమార్ ‘సూపర్ 30’ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో ఎటువంటి లాభం ఆశించకుండా విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. 14 ఏళ్ల కిందట కుమార్ స్థాపించిన సూపర్ 30 2010లో తొలిసారిగా వార్తలో నిలిచింది. ఆ ఏడాది ఐఐటీ-జేఈఈలో కుమార్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మొత్తం 30 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇది అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. ఇటీవల కుమార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సూపర్ 30కి చెందిన 26 మంది ఐఐటీ-జేఈఈకి అర్హత సాధించినట్టు తెలిపారు. దీనిపై అభ్యంతరం తెలిపిన సూపర్ 30కి చెందిన ఓ విద్యార్థి కుమార్ తప్పడు ప్రచారం చేసుకున్నట్టు ఆరోపించాడు. సూపర్ 30కి చెందిన ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఎగ్జామ్‌లో అర్హత సాధించారని, ఇతర ఇనిస్టిట్యూట్లకు చెందిన వారిని కూడా కుమార్ ఆ జాబితాలో చేర్చాడని తెలిపాడు. కాగా కుమార్ జీవితం ఆధారంగా హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. -
‘బీజేపీకి అతిపెద్ద సవాల్’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం హక్కుల్ని కేంద్రం కాలరాస్తుందని, ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్రమంత్రులు ఐదురోజులుగా బైజాల్ ఇంట్లో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ధర్నాకు జాతీయ నాయకులు నుంచి మద్దతు అభిస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కేజ్రీవాల్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్ చాలా బలమైనది, బీజేపీకి ఇది అతి పెద్ద సవాల్ అని ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ పరిపాలన, ప్రభుత్వ పథకాలపై ప్రశంశలు కురిపిస్తూ.. ప్రస్తుత రాజకీయ పార్టీలకు ఆప్ తండ్రిలాంటి పార్టీ అని పొగడ్తల్లో ముంచెత్తారు. కేజ్రీవాల్‌ను జంటిల్మాన్గా సిన్హా అభివర్ణించాడు. ఢిల్లీలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యం హత్య కంటే అధ్వాన్నంగా ఉందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శించారు. గత ఇరవైఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్నందున ఢిల్లీ ప్రజలపై బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోందని ఆర్జేడీ ఛీప్, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వం నడవకుండా లెఫ్టనెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టకుని కేంద్రం రాజకీయం చేయడం తగదని సీపీఎం జాతీయ కార్యదర్శి సితారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ ధర్నాకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు తెలిపారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నుంచి కేజ్రీవాల్‌కు మద్దతు లభిస్తుంచే కాంగ్రెస్ మాత్రం భిన్నంగా స్పందించింది. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం ఎల్జీ ఇంట్లో ధర్నాకి కూర్చోడం సరికాదని ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపిస్తే పాలన గాలికొదిలేసి ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. -
బీజేపీ హామీల పార్టీ..
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలనపై బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పదవీకాలంలో తమ ప్రభుత్వం వాగ్ధానాలు చేయడంలోనే మెరుగ్గా వ్యవహరించిందని అన్నారు. హామీల మీద హామీలు గుప్పించడంలో తమది మెరుగైన పార్టీగా మాత్రమే తాను చెప్పగలనని ట్వీట్ చేశారు. పార్టీని పలు సందర్భాల్లో ఇరుకునపెడుతున్న శత్రుజ్ఞ సిన్హా మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భాన్ని సైతం వాడుకున్నారు. బీజేపీ విధానాలను బాహాటంగా తప్పుపట్టిన సిన్హా ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కేవలం పంజాబ్, పుదుచ్చేరి, పరివార్లకే పరిమితమవుతుందని మోదీ వ్యాఖ్యలపై సిన్హా మండిపడిన విషయం తెలిసిందే. కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీని జైళ్లు, ధరల పెరుగుదల, పకోరా పార్టీగా కాంగ్రెస్ అభివర్ణిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాపులర్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)గా ఎదుగుతుందని ఆశిద్దామని సిన్హా పేర్కొనడం గమనార్హం. -
బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోదీ పార్టీ ..
చంఢీఘడ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మరోసారి అసంతృప్తి వెళ్లగక్కారు. చండీఘడ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిన్న (ఆదివారం) మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరినప్పుడు అటల్ బిహారి వాజ్‌పేయి వంటి ఎంతో మంది గొప్ప నాయకులు ఉండేవారని వ్యాఖ్యానించారు. వారి ప్రభావం వల్లే పార్టీలో చేరానన్నారు. అప్పట్లో అందరి అభిప్రాయాలకు విలువ ఉండేదని.. కానీ ప్రస్తుతం బీజేపీ నరేంద్ర మోదీ పార్టీగా మారిందని.. ఇక్కడ టూ మెన్ షో నడుస్తోందంటూ విమర్శించారు. వ్యక్తి కన్నా వ్యవస్థ, పార్టీ కన్నా జాతి గొప్పదనే విషయాన్ని గుర్తించినపుడే బాగుపడుతామంటూ ఆయన హితవు పలికారు. పార్టీని వీడను.. బీజేపీ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న శత్రుఘ్న సిన్హా.. ‘ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాం. ఈ బిహారి బాబు(శత్రుఘ్న సిన్హా)ను వారు(బీజేపీ) ఎక్కడికీ ఆహ్వానించరు. తగినంత గుర్తింపు ఇవ్వరు. ఢిల్లీలో బీజేపీ ఓడిపోయినప్పుడు నేను పార్టీని వీడే అవకాశాలు వచ్చాయి. కానీ నేను అలా చేయలేదు. ఇప్పటికీ పార్టీని వీడాలనుకోవడం లేదు. ఒకవేళ అధిష్టానం నిర్ణయిస్తే అప్పుడు ఆలోచిస్తానంటూ’ వ్యాఖ్యానించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే తనను రెబల్ అంటున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఇప్పటి వరకు మీపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆర్ఎస్సెస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) హస్తం ఉందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు బదులుగా.. అవును బహుశా ఆ కారణం వల్లే తానింకా పార్టీలోనే ఉన్నానేమోనంటూ వ్యాఖ్యానించారు. -
రాహుల్‌కు బీజేపీ ఎంపీ మద్దతు.. మోదీకి చురకలు!
పట్నా: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మద్దతు తెలిపారు. ప్రధాని అవుతానన్న రాహుల్ వ్యాఖ్యలపై మోదీ విమర్శలు గుప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. రాహుల్ అన్నదాంట్లే తప్పేంలేదని కాంగ్రెస్ అధినేతకు మద్దతుగా నిలిచారు శత్రఘ్న సిన్హా. పీఎం అవుతానని రాహుల్ చెప్పగా.. ‘పీపీపీ అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘సార్.. రాహుల్‌కు ప్రజల్లో మంచి పేరుంది. వాళ్లు రాహుల్‌ను ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ కలకంటే మాత్రం ఆ లక్ష్యాలు సాధ్యం కావు. ప్రధాని కావాలంటే ఏ అర్హత అక్కర్లేదు. ఎవరైనా ప్రధాని కావొచ్చు. ఓ జాతీయపార్టీకి చెందిన అధినేత ప్రధాని కావాలనుకోవడంలో తప్పేంలేదు. ప్రధాని సీటును మీరు రిజిస్ట్రర్ చేసుకున్నారా. ప్రజలు మీ నుంచి అంకెలు, విశ్లేషణతో కూడిన ప్రసంగాన్ని కోరుకుంటున్నారు. అయితే మీరు ‘పీపీపీ’ (పంజాబ్, పాండిచ్చేరి, పరివార్) అని రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం సముచితం కాదు. ప్రజల మనసులు గెలుచుకునేందుకు ఇలాంటివి మీ స్థాయి వ్యక్తికి తగవంటూ’ బీజేపీ అసంతృప్త నేత శత్రఘ్న సిన్హా చేసిన వరుస ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. Anybody can become PM in our democracy. Naamdar, Kaamdar, Daamdar or for that matter any average Samajhdar, if he has the numbers & support. Why are we making such a hue and cry about it? After all isn’t it their internal matter & any PMship has to be through verdict of majority. — Shatrughan Sinha (@ShatruganSinha) 12 May 2018 Sir. He is popular with the general public & very much liked by them. Anybody can dream & dreams would only come true if you dream. As said earlier, to become the PM one needs no qualification or special wisdom....@BJP4India — Shatrughan Sinha (@ShatruganSinha) 12 May 2018 Sir, you received our full support along with full media support & now you are raising slogans so that it isn't taken over?What's wrong if the President of biggest, oldest National Party sees the possibility & wishes to be next PM..if he wins the upcoming elections? @BJP4India — Shatrughan Sinha (@ShatruganSinha) 12 May 2018 -
అసందర్భ ప్రేలాపనలు ఎందుకు?
పట్నా: బీజేపీ అసంతృప్త ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని దుందుడుకు ప్రసంగాలను ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీపై, పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై ప్రధాని అసందర్భ ప్రేలాపనలు తగవని మండిపడ్డారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిసే వేళ ధనబలం కంటే జనబలమే చివరిగా గెలుస్తుందన్నది గుర్తెరగాలని మోదీకి వరుస ట్వీట్లలో హితవు పలికారు. బిహార్ నుంచి కర్ణాటక ఎన్నికల వరకూ తనను స్టార్ క్యాంపెయినర్‌గా ఆహ్వానించకపోయినా పార్టీ సానుభూతిపరుడిగా తాను సూచనలు చేస్తున్నానని, ప్రచారంలో పరిమితి దాటి వ్యక్తిగత దాడులు చేయడం తగదని అన్నారు. ప్రసంగాలు హుందాతనంగా, మర్యాదకరంగా సాగాలని ప్రధానికి సిన్హా సూచించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌కు పీపీపీ (పాండిచేరి, పంజాబ్, పరివార్) మిగులుతాయని ప్రధాని వ్యాఖ్యానించడాన్ని సిన్హా తప్పుపట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మే 5న జరిగిన ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ శత్రుఘ్నసిన్హా ప్రధాని మోదీ విధానాలను తప్పుపడుతూ బహిరంగంగా పలుమార్లు విమర్శలు గుప్పించారు. -
కోవింద్ మంచి వ్యక్తే, కానీ...
సాక్షి, ముంబై: నేషనల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం పెట్టిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించటం లేదు. విజేతలందరికీ రాష్ట్రపతి అవార్డులు ఇవ్వకపోవటంపై యావత్ సినీ పరిశ్రమ అసంతృప్తితో ఉంది. విషయం ముందుగా తెలియటంతో సుమారు 60 మంది విజేతలు కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై వెటరన్ నటుడు, బీజేపీ సీనియర్ నేత శతృఘ్నసిన్హా తనదైన శైలిలో స్పందించారు. శుక్రవారం ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ... ‘రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. గతంలో ఆయన బిహార్ గవర్నర్‌గా పని చేసిన సమయంలో చాలా దగ్గరగా చూశాను. ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ, ఇలా జరగాల్సింది కాదు. ఎక్కడో పొరపాటు జరగటంతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ, ఇలా జరగాల్సింది కాదు. నటులు అంటే దేశ గౌరవానికి ప్రతీకలు. అలాంటి వారిని అవమానించటం మంచి పద్ధతి కాదు’ అని సిన్హా తెలిపారు. ‘రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వాల్సిన అవార్డులను వేరే ఎవరో ఇవ్వటం సరైంది కాదు. అలాగని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని నేను తక్కువ చేయడం లేదు(మిగతా అవార్డులు ఆమె ప్రదానం చేశారు). ఆమె మంచి నేత. కానీ, ఈ అవార్డులను ఆమె ఇవ్వటాన్ని నేను అంగీకరించను. భోజనానికి పిలిచి ఒకరికి ఒకరకమైన భోజనాన్ని.. మరొకరికి ఒకరకమైన భోజనాన్ని పెడితే ఎలా ఉంటుంది? ఈ వ్యవహారం కూడా అలాగే ఉంది. గతంలో రాష్ట్రపతులంతా చాలా ఓపికగా అవార్డులను ఇచ్చారు. మహిళ అయి ఉండి కూడా ప్రతిభా పాటిల్ మినహాయింపు తీసుకోలేదు. కానీ, కోవింద్ మాత్రం ఎందుకు ఆ సంప్రదాయాన్ని పాటించలేదో అర్థం కావట్లేద’ని శతృఘ్నసిన్హా ఆక్షేపించారు. ఇదిలా ఉంటే జరిగిన పరిణామాలపై రాష్ట్రపతి కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి నెల నుంచే తాము ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి(సాంకేతిక మరియు సమాచార మంత్రిత్వ శాఖ) సమాచారం అందిస్తూ వస్తున్నామని, అయిన విషయాన్ని గోప్యంగా ఉంచి చివరి నిమిషంలో వెల్లడించటంతో ఈ వివాదం చెలరేగిందని పేర్కొంటూ ఓ లేఖను రాష్ట్రపతి కార్యాలయం కేంద్రానికి రాసింది. -
ఔను క్యాస్టింగ్ కౌచ్ ఉంది: నటుడు
ముంబై : సినీ పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తామంటూ మహిళలను లైంగికంగా దోపిడీ చేస్తుండటంపై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌కు పలువురు వ్యతిరేకంగా గళమెత్తుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ భిన్నంగా స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ తప్పేమీ కాదని, అది మహిళలకు జీవనోపాధి కల్పిస్తోందని ఆమె సమర్థించారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చిత్ర పరిశ్రమకే పరిమితం కాదని, పార్లమెంటులోనే ఇదే పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ప్రకటించి సంచలనం రేపారు. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. రాజకీయ, వినోద రంగాల్లో లైంగిక లబ్ధులు ఇచ్చిపుచ్చుకోవడం, డిమాండ్ చేయడం సాధారణమేనని అన్నారు. ‘సరోజ్ ఖాన్ కానీ, రేణుకా చౌదరికానీ తప్పు కాదు. లైంగిక లబ్ధులు డిమాండ్ చేయడం, ఇవ్వడం వినోద, రాజకీయ రంగాల్లో ఉన్నదే. ఇది పాత విధానం. కాలపరీక్ష నిలబడిన విధానం. జీవితంలో ముందుకు వెళ్లాలంటే తప్పదు. నువ్వు నన్ను.. నేను నిన్ను సంతృప్తి పరచే విధానం. చాలాకాలం నుంచి ఇది జరుగుతూ వస్తున్నదే. ఇందులో అంత బాధపడాల్సింది ఏముంది’ అని ఆయన అన్నారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కొరియోగ్రఫీ రంగంలో ఆమె చేసిన సేవలు నిరూపమానమైనవని, రేఖ, మాధూరీ దీక్షిత్, దివంగత శ్రీదేవి కెరీర్లోను మలచడంలో ఆమె పాత్ర మరువలేనిదని, తన రంగంలో ఆమె లెజెండ్ అని శత్రుఘ్న పేర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఉనికి లేదని తాను అనడం లేదని ఆయన పేర్కొన్నారు. ‘సరోజ్, రేణుకా వ్యాఖ్యలతో నేనూ పూర్తిగా ఏకీభవిస్తాను. సినిమాల్లో అవకాశాల కోసం అమ్మాయిలు ఎలా రాజీపడతారో నాకు తెలుసు. సరోజ్ కూడా తన జీవితంలో ఇలాంటి అవమానాలు, వేదనలు ఎదుర్కొని ఉంటారు. ఇక రాజకీయాల్లో ఉన్నదానిని క్యాస్టింగ్ వోట్ కౌచ్ అనాలేమో.. ఎదగాలనుకుంటున్న యువతులు.. సీనియర్ నేతలకు లైంగిక లబ్ధులను ఆఫర్ చేస్తూ ఉండొచ్చు. వారి అంగీకరిస్తూ ఉండొచ్చు’ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘అయితే ఈ సంస్కృతి సరైనదని నేను అనడం లేదు. అలాంటి రాజీ పడే పనులు నేను ఎన్నడూ చేయలేదు. కానీ చుట్టూ జరుగుతున్న దానిని చూడకుండా ఉండలేదం కదా. నిజాన్ని మాట్లాడినందుకు సరోజ్‌ను ఖండించకండి’ అని శత్రుఘ్న పేర్కొన్నారు. -
బీజేపీకి యశ్వంత్ సిన్హా గుడ్ బై
పట్నా: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా(80) ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలోనూ చేరననీ, ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేస్తానన్నారు. బీజేపీకి చెందిన మరో తిరుగుబాటు ఎంపీ శత్రుఘ్న సిన్హాతో కలిసి శనివారం పట్నాలో జరిగిన ‘రాష్ట్రీయమంచ్’ కార్యక్రమంలో మాట్లాడారు. పార్టీ రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పటి అల్లకల్లోల పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆందోళనలను ఆయన ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వం అన్నదాతలను అడుక్కునే స్థాయికి దిగజార్చిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, ఆప్ పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని మొదట్నుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్న యశ్వంత్ సిన్హా.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు జనవరిలో రాష్ట్రీయమంచ్ పేరిట రాజకీయ వేదిక ఏర్పాటు చేశారు. సిన్హా నిర్ణయం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని, తాము ముందే ఊహించామని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ ఆదేశాల ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని తెలిపింది. -
బీజేపీకి గుడ్‌బై.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ!
పట్నా: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో మరో నేత పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆయన మరెవరో కాదు బీజేపీ ఎంపీ శత్రఘ్న సిన్హా. అయితే పార్టీ మారతారన్న వదంతులపై ఎంపీ స్పందించారు. ఆయన పట్నాలో మీడియాలో మాట్లాడుతూ.. పార్టీ మారే ఉద్దేశమే తనకు లేదని, బీజేపీకి గుడ్ బై చెప్పడం లేదని స్పష్టం చేశారు. గతంలోనూ తనపై ఇలాంటి వదంతులే వ్యాప్తి చేశారని గుర్తుచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వరని బీజేపీ అధిష్టానం చెప్పడంతో శత్రుఘ్న సిన్హా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. తనపై బీజేపీ చిన్నచూపు చూస్తోందని గతంలో పలుమార్లు వ్యాఖ్యానించిన ఆయన.. ప్రస్తుతం తాను ఎక్కడికి వెళ్లనని.. బీజేపీలోనే ఉంటానని పేర్కొన్నారు. ఒకవేళ తాను బీజేపీలో లేకున్నా, ఇతర పార్టీల నుంచి టికెట్ దక్కినా పట్నా లోక్‌సభ నియోజవర్గం నుంచే బరిలోకి దిగడం ఖాయమని పలుమార్లు శ్రతఘ్న సిన్హా చెప్పకనే చెప్పారు. -
బీజేపీకి శత్రుఘ్న సిన్హా టాటా..?
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఎంపీ శత్రుఘ్న సిన్హా షాకివ్వనున్నారా? ఈ మేరకు ఆయన బుధవారం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బీజేపీ తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, 2019 ఎన్నికల్లో వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సిన్హా అన్నారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీజేపీ తనను చిన్నచూపు చూస్తోందని వ్యాఖ్యానించారు. అయితే, ఏ పార్టీ నుంచి టికెట్ తీసుకున్నా పాట్నా పార్లమెంటు నియోజవర్గం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. ఇప్పటికే పలు పార్టీలు తనకు టికెట్ ఆఫర్ చేశాయని చెప్పారు. 2014లో బీజేపీ తనకు టికెట్ ఇవ్వబోవడం లేదనే పుకార్లు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం మళ్లీ అవే పుకార్లు షికార్లు చేస్తున్నాయని చెప్పారు. పార్టీని భుజస్కంధాలపై వేసుకుని రెండు నుంచి 200 సీట్లకు తీసుకొచ్చిన ఎల్కే అద్వాణీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలుసని అన్నారు. పార్టీలోని కొందరు వ్యక్తులు ఇతరులను చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు. -
లాలూ తనయుడికి బీజేపీ నేత ప్రశంస
పట్నా : సొంత పార్టీని, ప్రధాని మోదీని విమర్శిస్తూ వార్తల్లో ఉండే బీజేపీ అసంతృప్త నాయకుడు, నటుడు శతృఘ్నసిన్హా మంగళవారం బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఇంటికి వెళ్లిన సందర్భంగా ఆర్జేడీ వారసుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. తేజస్వి యాదవ్‌కు మంచి భవిష్యతు ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్‌కు ఉన్న పరిణీతిని చూస్తే ముచ్చటేస్తుంది. అతన్ని చూస్తే నాకు వయసులో ఉన్న శరద్‌పవార్ గుర్తుకువస్తున్నాడని అన్నారు. ‘తేజస్వి యాదవ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాడు. నితీష్‌కుమార్‌కు పోటీ అవుతాడని నేను కచ్చితంగా చెప్పలేను. కానీ నితీష్‌కుమార్ కూడా ఈ యువకుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని ఒప్పుకుంటారు. పోయిన వారం జరిగిన ‘బిహారి దివాస్’ పండగకు లాలు కుటుంబం నన్ను ఆహ్వానిస్తే ఆ సమయంలో నేను లాలూజీని కలవొచ్చనుకున్నాను. కానీ ఈ బిహారిబాబు నన్ను పిలవలేదు అందుకు కారణం అందరికీ తేలుసు, నేను వివరించాల్సిన అవసరం లేద’ని అన్నారు. పట్నాలో లాలు ఇంటికి రావడానికి ఒకరోజు ముందు రాంచీలో ఆస్పత్రిలో ఉన్న ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌ను శతృఘ్నసిన్హా కలిసి వచ్చారు. ఇన్ని రోజుల తర్వాత లాలును కలవడం చాలా సంతోషంగా ఉంది, ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. భవిష్యత్ రాజకీయాల గురించి, బిహార్‌లో జరిగిన మతఘర్షణల కారణంగా బీజేపీపై వచ్చిన ఆరోపణల గురించి సిన్హాను అడగ్గా.. తరువాత మాట్లాడదామంటూ సమాధానం దాటవేశారు. దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్‌కి కోర్టు శిక్ష విధించడంతో ఆయనను రాంచీలోని బిర్సా ముండా జైలుకు తరలించారు. జైలులో అనారోగ్యం పాలవడంతో మార్చి 17న ఆయన రాంచీలోని ఆస్పత్రిలో చేర్చారు. -
మోదీ అహంకారం వల్లే.. ఈ ఫలితాలు!
పట్నా: ఉత్తరప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ పరాభవం నేపథ్యంలో సొంత పార్టీపై ఎంపీ శత్రుఘ్న సిన్హా మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీ అధినాయకత్వం అహంకారం, అతి విశ్వాసం, షార్ట్‌టెంపర్ కారణంగానే ఈ పరాభవం ఎదురైందంటూ పరోక్షంగా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. ‘ప్రజాస్వామ్య రాజకీయాల్లో అహంకారం, అతి విశ్వాసం, అతి కోపం పతనానికి దారితీస్తాయని నేను పదేపదే చెప్తూ వస్తున్నాను. ఇవి ట్రంప్ లేదా, మిత్రోం లేదా, ప్రతిపక్ష నాయకులు ఎవరి నుంచి వచ్చినా ప్రమాదమే’ అని శత్రుఘ్న ట్వీట్ చేశారు. మిత్రోం అంటూ ప్రధాని మోదీ ప్రసంగించే సంగతి తెలిసిందే. అదేవిధంగా బీజేపీకి రానున్నది కష్టకాలమేనని, ఇప్పటికైనా బీజేపీ అధినాయకత్వం (ప్రధాని మోదీ, అమిత్‌షా) మేలుకోవాలని హితవు పలికారు. ‘మన వ్యక్తులు, శ్రేణులు త్వరగా సీటు బెల్టు సర్దుకోవాల్సిన అవసరాన్ని యూపీ, బిహార్ ఫలితాలు చాటుతున్నాయి. రానున్నది సంక్షోభకాలం. ఈ సంక్షోభం నుంచి ఎంత త్వరగా బయటపడితే.. అంత మంచిదని కోరుకుంటూ మనం ప్రార్థించాలి. ఈ ఫలితాలు మన భవిష్యత్తు గురించి సంకేతాలు ఇస్తున్నాయి. వీటిని తేలికగా తీసుకోకూడదు’ అని ఆయన ట్వీట్ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎస్పీ, బీఎస్పీ కూటమి ఇక్కడ ఘనవిజయాలు సాధించింది. అటు బిహార్‌లోనూ బీజేపీ-జేడీయూ కూటమిని మట్టికరిపిస్తూ ఆర్జేడీ విజయాలు సాధించింది. ఈ ఫలితాలు బీజేపీ అధినాయకత్వంలో తీవ్ర ఆంతర్మథనానికి కారణయ్యాయి. -
థ్యాంక్ గాడ్.. వాళ్లు ప్యూన్‌ను వదిలేశారు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణం విషయంలో మరోసారి బీజేపీ అసమ్మతి ఎంపీ శత్రుఘ్నసిన్హా నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన పీఎన్బీ నాలుగేళ్లుగా కుంభకోణం యథేచ్ఛగా సాగుతున్నా.. కేంద్రం ఎందుకు ఏమీ తెలియనట్టు ఉండిపోయిందని ప్రశ్నించారు. ప్రముఖ డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ పీఎన్‌బీను రూ. 12వేల కోట్ల మేర ముంచేసి.. విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణానికి పీఎన్బీ ఆడిటర్లే కారణమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడాన్ని తప్పుబట్టారు. సంస్థ ఆడిటర్లను తప్పుబడుతూ.. బ్యాంకులోని చిన్న చిన్న ఉద్యోగులను సైతం ఈ స్కాంలో అరెస్టు చేయడాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘థ్యాంక్ గాడ్.. వాళ్లు ప్యూన్ వదిలేశారు’ అని ట్వీట్ చేశారు. ‘మన విద్యావంతులు నెహ్రూ పాలన నుంచి కాంగ్రెస్ తప్పుడు పాలన వరకు ప్రతి ఒక్కరినీ నిందిస్తారు. అదేవిధంగా పీఎన్బీ కుంభకోణానికి ఆడిటర్లు కారణమని నిందించారు. అదృష్టవశాత్తు వారు ప్యూన్‌ను విడిచిపెట్టారు. అసలైన ప్రశ్న ఏమిటంటే.. పీఎన్బీ నిజమైన యజమాని అయిన ప్రభుత్వం ఏంచేస్తోంది’ అని ఆయన ట్వీట్ చేశారు. కుంభకోణం జరిగిన గడిచిన ఆరేళ్లలో నాలుగేళ్లు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. -
ఫైర్‌బ్రాండ్‌కు ‘రెబల్’ మద్దతు
న్యూఢిల్లీ: బీజేపీ ‘రెబల్’ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి సొంత పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శస్త్రాలు ఎక్కుపెట్టారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి బాసటగా నిలిచారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా నవ్వినందుకు బీజేపీ నాయకులు ఆమెను రామాయణంలోని తాటాకితో పోల్చి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో శత్రుఘ్నసిన్హా ట్విటర్లో స్పందించారు. రేణుక ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎవరేమన్నా పట్టించుకోవద్దని, తనను చూసి ఏడ్చేవారిని ఏడవనివ్వాలని సూచించారు. మహిళా సాధికారతను వ్యతిరేకించేవాళ్లు త్వరలోనే పతనమవుతారని వ్యాఖ్యానించారు. వారికి ఇదే చివరి నవ్వు అవుతుందని పేర్కొంటూ నారీ శక్తికి జై కొట్టారు. బీజేపీకి తలనొప్పిలా తయారైన శత్రుఘ్నసిన్హా ఇంతకుముందు కూడా ప్రతిపక్ష నాయకులను ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టారు. బీజేపీ అగ్రనాయకులపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నాయకులను వెనకేసుకొచ్చారు. Laugh Renuka laugh! We love you, we're fond of you & wish you well. Don’t worry, be happy! Let them cry & shout hoarse. Things will settle down. Those who oppose women's empowerment & laughter would melt soon. We all will have the last laugh. Long live ‘Nari Shakti. Jai hind! — Shatrughan Sinha (@ShatruganSinha) February 13, 2018 -
బీజేపీకి 'ట్రిపుల్ తలాక్' చెప్పిన మొదటి రాష్ట్రం అదే!
పట్నా: బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఏ చిన్న అవకాశం దొరికినా పార్టీపై నిప్పులు చెరిగే ఈ షాట్‌గన్.. తాజాగా రాజస్థాన్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై స్పందించారు. దేశంలో బీజేపీకి ట్రిపుల్ తలాక్ చెప్పిన తొలి రాష్ట్రం రాజస్థానేనని ఆయన పేర్కొన్నారు. 'బ్రేకింగ్ న్యూస్: అధికార పార్టీకి విపత్కర ఫలితాలు వచ్చాయి. బీజేపీకి ట్రిపుల్ తలాక్ చెప్పిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. అజ్మీర్: తలాక్, అల్వార్: తలాక్, మండల్‌గఢ్: తలాక్. మన ప్రత్యర్థులు రికార్డు మెజారిటీతో ఎన్నికలను గెలుస్తూ.. మనకు ఝలక్ ఇస్తున్నారు' అని శత్రుఘ్న శనివారం ట్వీట్ చేశారు. ఇప్పటికైనా బీజేపీ మేలుకొని.. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, లేకపోతే త్వరలోనే బీజేపీకి టాటా-బైబై చెప్పాల్సిన ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇటీవల వెలువడిన రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరిగిన కీలకమైన ఉప ఎన్నికల్లో కమలదళానికి చుక్కెదురైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొని మండల్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో, అజ్మీర్, అల్వార్ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించింది. ఈ ఫలితాలు వసుంధరారాజే ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చాయి. -
బీజేపీ నన్నో సవతి కొడుకులా చూస్తోంది
పట్నా : వెటరన్ నటుడు, ‘షాట్ గన్’ శతృఘ్న సిన్హా సొంత పార్టీ బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నతల్లిలాంటి పార్టీ ఇప్పుడు తనపై సవతి ప్రేమను చూపిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా ఆయన పార్టీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనన్న కథనాలు వెలువడుతున్నాయి. వీటిపై శుక్రవారం ఓ జాతీయ మీడియా ఛానెల్ ఆయన్ని సంప్రదించగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ పార్టీ నాకు అమ్మలాంటిది. కానీ, సొంత పార్టీ నేతలే నాపై సవతి ప్రేమను చూపిస్తూ నన్ను దూరం పెడుతున్నారు. మాట్లాడటం తప్పించి పార్టీ కోసం ఏ పని చేయలేకపోతున్నా. నిజాయితీగా చెప్పాలంటే ఇదంతా చూస్తుంటే నన్ను అణిచివేస్తున్నారేమో అనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ పార్టీపై ఇంతకన్నా ఎక్కువే విమర్శలే చేశాను. అయినా టికెట్ దక్కింది కదా!. ఇప్పుడు కూడా అంతే’’ అంటూ ఆయన బదులిచ్చారు. ఇక బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా రైతులు, నిరుద్యోగుల హక్కుల సాధనకై ‘రాష్ట్ర మంచ్’ అనే రాజకీయ వేదికను స్థాపించిన విషయం తెలిసిందే. అందులో తాను కూడా చేరటంపై ఈ బీజేపీ ఎంపీ స్పందించారు. 'రాష్ట్ర మంచ్' రాజకీయ పార్టీ కాదని.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించటం.. సమస్యలపై పోరాటం కోసమే ఏర్పాటు చేసిందని చెప్పారు. తానూ, యశ్వంత్ సిన్హా ఇద్దరమూ బీజేపీలోనే ఉన్నామని శతృఘ్న సిన్హా స్పష్టతనిచ్చారు. అయితే వీరిద్దరి వ్యవహారం రాను రాను మరీ శ్రుతిమించుతోందని.. వేటు వేయాల్సిందేనంటూ పలు రాష్ట్రాల విభాగాలు అధిష్ఠానానికి ఇప్పటికే లేఖలు రాశాయి. -
ఇది ఒకప్పటి బీజేపీ కానే కాదు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం పార్టీలో నేతలకు క్రమశిక్షణ కొరవడి అస్తవ్యస్తంగా తయారయ్యిందన్నారు. ఈ క్రమంలో ఆయన పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాజ్‌పేయి, అద్వానీల హయాంలో పార్టీ పరిస్థితి ఎంతో బాగుండేదని సిన్హా పేర్కొన్నారు. ‘‘అప్పట్లో ముఖ్యనేతలను కలిసేందుకు పార్టీ కార్యకర్తలకు కూడా అవకాశం లభించేంది. అందుకు అపాయింట్మెంట్ కూడా అవసర ఉండేది కాదు. నేరుగా వెళ్లేవాళ్లం. కానీ, ఇప్పుడున్న నేతల వ్యవహారం మరోలా ఉంది. 13 నెలల క్రితం ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు దరఖాస్తు చేసుకున్నా. కానీ, దానికి ఇప్పటిదాకా బదులు లేదు. అందుకే ఇకపై ఎవరినీ కలవకూడదని నిర్ణయించుకున్నా. చెప్పాలనుకున్న విషయాలను నేరుగా ప్రజలకే వివరిస్తా’’ అని సిన్హా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అద్వానీ లాంటి సీనియర్లకు కనీసం గౌరవం కూడా ఇవ్వటం లేదని వాపోయారు. గత కొంతకాలంగా బీజేపీ పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ఐ నీడ్ టూ స్పీక్ అప్ నౌ పేరిట ఓ జాతీయ పత్రికలో ఆయన రాసిన వ్యాసంతో మొదలైన ఈ వ్యవహారం.. మహారాష్ట్రలో రైతులకు మద్దతుగా ఆయన చేస్తున్న దీక్షతో తారాస్థాయికి చేరుకుంది. త్వరలో ఆయన మధ్యప్రదేశ్ రైతులకు మద్దతుగా దీక్షకు సిద్ధమవుతున్నారు. నా ఇంటిని అందుకే కూల్చారేమో : శతృఘ్న సిన్హా మరో సీనియర్ నేత, పట్న ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా పార్టీపై తన అసంతృప్తిని వెల్లగక్కారు. రెండు రోజుల క్రితం శత్రుఘ్న సిన్హాకు చెందిన రామాయణ భవనంలోని కొంత భాగాన్ని బీఎంసీ అధికారులు కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే వాటిని కూల్చేశామని అధికారులు వెల్లడించారు. దీనికి పై శతృఘ్నసిన్హా ట్విట్టర్ లో స్పందించారు. ‘‘నా ఇంటిని కూల్చేసిన విషయం ఇప్పుడు వార్తల్లో బాగా చక్కర్లు కొడుతోంది. నిజాయితీగా ఉండటం, నిజాలు మాట్లాడటం... అన్నింటికి మించి యశ్వంత్ సిన్హాకు మద్ధతు ఇవ్వటంతోనే మీపై కుట్ర పన్నారా? అని ప్రజలు నన్ను అడుగుతున్నారు. కానీ, నా దగ్గర సమాధానం లేదు’’ అంటూ పరోక్షంగా ఆయన బీజేపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. The part demolition of my home "Ramayan" in Mumbai is presently the most talked about news. People are asking me if I am paying the price for honest politics based on facts, figures & truth & for supporting statesman Yashwant Sinha's support to Satara farmers.I have no answer1>2 — Shatrughan Sinha (@ShatruganSinha) January 9, 2018 -
ఆధార్ ఎఫ్ఐఆర్ : మనం బనానా రిపబ్లిక్లో ఉన్నామా..?
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ అవకతవకలను వెలుగులోకి తెచ్చిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా విస్మయం వ్యక్తం చేశారు. ఆధార్ లోటుపాట్లను బహిర్గతం చేస్తే కేసులు పెడతారా..? ఇదెక్కడి న్యాయం..? అంటూ సిన్హా ప్రభుత్వంపై మండిపడ్డారు. మనమేమైనా బనానా రిపబ్లిక్లో ఉన్నామా అంటూ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా నిలదీశారు. దేశంకోసం, జాతి ప్రయోజనాల కోసం బయటికొస్తున్న వారినీ బాధితులుగా చేస్తున్నారని ట్వీట్ చేశారు. సిన్హా పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్నీ, బీజేపీ ప్రభుత్వాన్నీ ఇరుకునపెట్టేలా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆధార్ అంశంలో ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా దీటుగా నిలిచిన ఎడిటర్స్ గిల్డ్‌ను సిన్హా ప్రశంసించారు. దీనిపై సుప్రీం కోర్టు స్పందించి దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వంద కోట్ల మంది ఆధార్ కార్డుల డేటా లీకయిందని ఓ వార్తా పత్రిక కథనంపై యూఐడీఏఐ అధికారి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.