మా నాన్నతో రాజకీయాలు చర్చిస్తా: సోనాక్షి | I will never join politics, says Sonakshi Sinha | Sakshi
Sakshi News home page

మా నాన్నతో రాజకీయాలు చర్చిస్తా: సోనాక్షి

Published Sun, Dec 7 2014 5:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మా నాన్నతో రాజకీయాలు చర్చిస్తా: సోనాక్షి - Sakshi

మా నాన్నతో రాజకీయాలు చర్చిస్తా: సోనాక్షి

జలంధర్: రాజకీయాల్లో చేరబోనని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తెలిపింది. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, తన దృష్టాంతా సినిమాలపైనే అని చెప్పింది. ప్రపంచకప్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి సోనాక్షి హాజరయింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన తండ్రి శత్రుఘ్నసిన్హాతో రాజకీయాలు చర్చించేందుకు ఆసక్తి చూపిస్తానని వెల్లడించింది.
 
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టాక రాజకీయాల పట్ల కొద్దిగా ఆసక్తి కలిగిదందని, ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకే తన తండ్రితో పాలిటిక్స్ గురించి మాట్లాడతానని 27 ఏళ్ల సోనాక్షి పేర్కొంది. ఆమె తండ్రి శత్రుఘ్నసిన్హా బీహార్ లోని పాట్నా లోక్సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement