నా ఏకైక కుమార్తె పెళ్లి.. మీకు సంబంధం లేని విషయం: హీరోయిన్ తండ్రి | Shatrughan Sinha Reacts About His Presence At Sonakshi Sinha Wedding | Sakshi

Sonakshi Sinha: కూతురి పెళ్లికి వెళ్తున్నా.. మీ పని మీరు చేసుకోండి: శతృఘ్న సిన్హా

Jun 20 2024 7:12 PM | Updated on Jun 20 2024 7:27 PM

Shatrughan Sinha Reacts About His Presence At Sonakshi Sinha Wedding

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవల హీరామండి వెబ్‌ సిరీస్‌తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ  ప్రస్తుతం పెళ్లికి రెడీ ‍అయిపోయింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడనుంది. ఈనెల 23 ముంబయిలోని బాస్టియన్‌లో ఈ జంట ఒక్కటి కానుంది. చాలా ఏళ్లుగా వీరిద్దరు సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్నారు. అయితే గతంలోనే సోనాక్షి పెళ్లి గురించి తమకేలాంటి సమాచారం లేదని ఆమె తండ్రి శతృఘ్న సిన్హా అన్నారు. దీంతో ఆయన కూతురి పెళ్లికి వెళ్లడం లేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఆయన తనపై వచ్చిన వార్తలను ఖండించారు. తన కూతురి వివాహానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఇది మీకు సంబంధం లేని విషయం.. మీ పని మీరు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

శతృఘ్న సిన్హా మాట్లాడుతూ..' సోనాక్షి నా ఏకైక కుమార్తె. ఆమె అంటే నాకు పిచ్చి ప్రేమ. నేనే తన బలం అని చాలాసార్లు చెప్పింది. తప్పకుండా తన పెళ్లికి వెళ్తాను' అని అన్నారు. అయతే మరోవైపు ఆమె తల్లి పూనమ్ సిన్హా, ఆమె సోదరుడు లవ్ సిన్హా ఈ పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాలోను సోనాక్షి సన్హాను అన్‌ ఫాలో చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా.. ప్రస్తుతం సోనాక్షి.. తన కాబోయే భర్త కుటుంబంతోనే ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement