Sonakshi
-
నా ఏకైక కుమార్తె పెళ్లి.. మీకు అనవసరం: హీరోయిన్ తండ్రి
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవల హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెళ్లికి రెడీ అయిపోయింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడనుంది. ఈనెల 23 ముంబయిలోని బాస్టియన్‌లో ఈ జంట ఒక్కటి కానుంది. చాలా ఏళ్లుగా వీరిద్దరు సీక్రెట్‌గా డేటింగ్లో ఉన్నారు. అయితే గతంలోనే సోనాక్షి పెళ్లి గురించి తమకేలాంటి సమాచారం లేదని ఆమె తండ్రి శతృఘ్న సిన్హా అన్నారు. దీంతో ఆయన కూతురి పెళ్లికి వెళ్లడం లేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఆయన తనపై వచ్చిన వార్తలను ఖండించారు. తన కూతురి వివాహానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఇది మీకు సంబంధం లేని విషయం.. మీ పని మీరు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.శతృఘ్న సిన్హా మాట్లాడుతూ..' సోనాక్షి నా ఏకైక కుమార్తె. ఆమె అంటే నాకు పిచ్చి ప్రేమ. నేనే తన బలం అని చాలాసార్లు చెప్పింది. తప్పకుండా తన పెళ్లికి వెళ్తాను' అని అన్నారు. అయతే మరోవైపు ఆమె తల్లి పూనమ్ సిన్హా, ఆమె సోదరుడు లవ్ సిన్హా ఈ పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాలోను సోనాక్షి సన్హాను అన్ ఫాలో చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా.. ప్రస్తుతం సోనాక్షి.. తన కాబోయే భర్త కుటుంబంతోనే ఉంది. -
చక్కని ‘ఫాంగ్’కు చాంగు భళా.. ఇదే!
కొడితే ‘ఫాంగ్’ జాబ్ కొట్టాలి అనుకుంటోంది యువతరం. ప్రపంచంలోని ఉత్తమ పనితీరు కనబరిచే దిగ్గజ కంపెనీల సంక్షిప్త నామం–ఫాంగ్ (ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫిక్స్, గూగుల్) ‘ఫాంగ్’ కంపెనీలలో ఉద్యోగం చేయాలనే కలను నెరవేర్చుకోవడానికి స్కిల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కావడం నుంచి సీనియర్ ఉద్యోగులతో మాట్లాడడం వరకు ఎంతో కసరత్తు చేస్తున్నారు. కలను నెరవేర్చుకుంటున్నారు.ప్రతిష్ఠాత్మకమైన ఫాంగ్ (ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్) కంపెనీలలో ఉద్యోగం చేయాలని యువతరం బలంగా అనుకోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే... కాంపిటీటివ్ స్పిరిట్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీపై పనిచేసే అవకాశం అనేవి ముఖ్య కారణాలు.‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేయాలనే కలను నెరవేర్చుకోవడానికి తగిన కసరత్తు చేస్తున్నారు. ‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. ‘ఫాంగ్’ రిక్రూటర్స్, ఎం.ఎల్. ఇంజినీర్స్, రిసెర్చర్లు హాజరయ్యే స్కిల్ లెర్నింగ్ కాన్పరెన్స్లకు హాజరవుతున్నారు. ‘ఫాంగ్’ ఇంటర్వ్యూల గురించి అవగాహన చేసుకోవడానికిప్రొఫెషనల్స్తో మాట్లాడుతున్నారు.‘నా ఫ్రెండ్ ఒకరు మోస్ట్ టాలెంటెడ్. అయితే మొదటి ప్రయత్నంలో ఫాంగ్ కంపెనీలలో ఒకదాంట్లో ఎంపిక కాలేదు. అలా అని డిప్రెస్ కాలేదు. ఏ పొరపాట్ల వల్ల తనకు ఉద్యోగం రాలేదో లోతైన విశ్లేషణ చేసుకుంది. ప్రొఫెషనల్స్‌తో మాట్లాడింది. పొరపాట్లను సరిదిద్దుకొని రెండో ప్రయత్నంలో విజయం సాధించింది’ అంటుంది బెంగళూరుకు చెందిన షాలిని.‘ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నా ఫాంగ్ కల నెరవేరలేదు. మొదట బాధ అనిపించింది. అయితే ఆ బాధలో నుంచి త్వరగా కోలుకున్నాను. మాస్టర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్‌పై దృష్టి పెట్టాను. మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్–సాల్వింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాను’ అంటున్న శైలిమ శ్రీవాస్తవ రెండవ ప్రయత్నంలో విజయం సాధించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోవాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఖుష్బు గుప్తా గూగుల్‌లో ఉద్యోగం చేయాలనే తన కలను నెరవేర్చుకుంది.సవాళ్లను అధిగమిస్తే విజయం ఎప్పుడూ మనదే అవుతుంది. ‘గూగుల్‌లో చేరిన కొత్తలో చాలా మిస్టేక్స్ చేసేదాన్ని. అయితే సీనియర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ద్వారా తప్పులు జరగకుండా జాగ్రత్త పడడం నేర్చుకున్నాను’ అంటుంది ఖష్బు గుప్తా.అమెజాన్ పాపులర్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ను మన దేశంలో లాంచ్ చేసిన బృందంలో లీలా సోమశేఖర్ ఒకరు. అమెజాన్‌లో పనిచేయాలనేది ఆమె కల. కంటెంట్ ఎడిటర్‌గా అమెజాన్‌లో అడుగులు మొదలు పెట్టిన లీల ఆ తరువాత ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌లోకి వచ్చింది. ‘ఆన్ది–జాబ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్న లీల సక్సెస్ మంత్రకు ఇచ్చే నిర్వచనం... కొత్తగా ఆలోచించడం. చిన్న వయసులోనేపోలియో బారిన పడిన రేఖాపోడ్వాల్కు వీల్ చైర్‌పై ఆధారపడడం తప్పనిసరి అయింది. అయితే ఏదో సాధించాలనే తపన మాత్రం గట్టిగా ఉండేది. ఆ తపనే ఆమెను అమెజాన్ ఇండియా స్టార్ ఉద్యోగులలో ఒకరిగా చేసింది.‘కలను నెరవేర్చుకోవడానికి అదృష్టం, అల్లావుద్దీన్ అద్భుతదీపంతో పనిలేదు. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఆత్మవిశ్వాసం ఉంటే చాలు’ అంటుంది పుణెకు చెందిన రేఖాపోడ్వాల్. సుందర సందేశం..ఇటీవల గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్ని యూట్యూబర్ వరుణ్ మయ్యా ‘ఫాంగ్’కు సంబంధించి యువత కల గురించి అడిగినప్పుడు అమీర్ ఖాన్ బ్లాక్బాస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’లోని ఒక సన్నివేశాన్ని గురించి ప్రస్తావించాడు పిచాయ్. ‘ఆ సీన్లో మోటర్ అంటే ఏమిటో వివరించే వెర్షన్ ఉంది. మోటర్ అంటే ఏమిటో అర్థం చేసుకునే వెర్షన్ ఉంది. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారానే నిజమైన విజయం లభిస్తుంది’ అంటాడు సుందర్ పిచాయ్. సినిమా సీన్ విషయానికి వస్తే ‘మెషిన్ అంటే ఏమిటో నిర్వచనం చెప్పండి’ అనిప్రొఫెసర్ అడిగిన దానికి అమీర్ సింపుల్‌గా చెప్పిన సమాధానం, ‘మెషిన్స్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ బాడీస్ సో కనెక్టెడ్ దట్ రిలేటివ్ మోషన్స్....’ అంటూ మార్కులు బాగా తెచ్చుకునే స్టూడెంట్ చెప్పిన సుదీర్ఘ, సంక్లిష్ట నిర్వచనం... ఒక విషయాన్ని వివరించడానికి, అర్థం చేసుకోడానికి మధ్య ఉండే తేడాను తెలియజేస్తుంది.ధైర్యమే దారి చూపుతుంది..కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన సోనాక్షి పాండే స్వభావరీత్యా సిగ్గరి. ఇంట్రావర్ట్. నలుగురిలో ధైర్యంగా మాట్లాడేది కాదు. డేటాబేస్ గురించి ఒక చర్చాకార్యక్రమంలో టెక్ ఎక్స్పర్ట్ ఒకరు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న, చర్చిస్తు్తన్న యూట్యూబ్ వీడియోను చూసింది పాండే. ఈ వీడియో ఆమె కెరీర్ గమనాన్ని మార్చేసింది. ఈ వీడియోతో ఇన్స్పైర్ అయిన పాండే నలుగురిలో ధైర్యంగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయింది. ఆ తరువాత అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి సొల్యూషన్ ఆర్కిటెక్చర్లోకి వచ్చింది. ఇందులో పబ్లిక్ స్పీకింగ్, క్లయింట్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అయిదు సంవత్సరాలు అమెజాన్‌లో పనిచేసిన తరువాత మైక్రోసాఫ్ట్, గూగుల్‌కు అప్లై చేసింది. రెజ్యూమ్‌లోని కీ ఎలిమెంట్స్ వల్ల రెండు దిగ్గజ సంస్థల్లోనూ పాండేకు ఉద్యోగం వచ్చింది. -
హారరా? థ్రిల్లరా?
భాను శ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కలశ’. కొండా రాంబాబు దర్శకత్వంలో శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ–‘‘కలశ’ ట్రైలర్ బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హారరా? అనే సందేహం కలిగేలా ట్రైలర్‌ను కట్ చేశారు. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘కలశ’ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. థియేటర్స్‌లో చూడండి’’ అని యూనిట్ పేర్కొంది. -
పాఠకుల మనసులూ దోచుకున్నాడు!
‘దబాంగ్’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన సోనాక్షి సిన్హాకు ఇష్టమైన పుస్తకం శాంతారామ్. ‘థ్రిల్లింగ్, ఫిలాసఫికల్, రొమాంటిక్, ట్రాజెడీ, ఒక జీవితానికి సంబంధించిన ఎత్తుపల్లాలు చూపించే మల్టీ–ఫేస్డ్ ప్లాట్ ఇది’ అంటోంది సోనాక్షి. ‘శాంతారామ్’ సంక్షిప్త పరిచయం... ఇది జరిగిన కథ కాదు. అలా అని జరగని కథ కాదు. రచయిత స్వీయఅనుభవాలకు కల్పన జోడించి కమర్శియల్ ఫార్మట్‌లో రాసిన నవల ఇది. ‘శాంతారామ్ అనేది ఆటోబయోగ్రఫీ కాదు. పక్కా నవల. ఒకవేళ ఇది ఆటోబయోగ్రఫీ అనే భావన కలిగిస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది!’ అంటాడు రచయిత డేవిడ్ రాబర్ట్స్. ఇక కథలోకి వద్దాం... ఆస్ట్రేలియాలోని పెన్ట్రిడ్జ్ జైలు నుంచి తప్పించుకొని ఇండియాకు పారిపొయి బాంబేలో తేలుతాడు బ్యాంక్ రాబర్ డేవిడ్. బాంబేలో అతనికి మొదట పరిచయమైన వ్యక్తి ప్రభాకర్. మొదట తనకు గైడ్‌గా సహాయపడిన ప్రభాకర్ ఆతరువాత మంచి స్నేహితుడవుతాడు. తనకు ‘లిన్బాబా’ అని పేరు పెడతాడు. ‘లిన్’ అని పిలుచుకుంటాడు. ‘జిలుగువెలుగుల బాంబే కాదు....మరో బాంబే కూడా ఉంది’ అంటూ బాంబే మురికివాడల జీవితాన్ని పరిచయం చేస్తాడు ప్రభాకర్. అంతే కాదు తన స్వగ్రామం ‘సుందర్’కు తీసుకువెళతాడు. ఆ ఊళ్లో బీదరికం తాండవించినా కోట్ల కంటే విలువైన సౌందర్యం ‘లిన్’ను ఆకట్టుకుంటుంది. ప్రభాకర్ తల్లి డేవిడ్‌కు ‘శాంతారామ్’ అని పేరు పెడుతుంది. ఆ పేరు విలువ తెలుసుకొని మురిసిపోతాడు లిన్. బాంబే వచ్చిన తరువాత ఒక బార్లో డబ్బుతో పాటు తన రెక్కలు ‘నకిలీ పాస్‌పోర్ట్’ కూడా పోగొట్టుకుంటాడు. ఇక చచ్చినట్లు బాంబేలో ఉండాల్సిందే! బాంబేలోని స్లమ్ ఏరియాలో చిన్న షెడ్డులో మకాం పెడతాడు. ఒకరోజు ఆ ఏరియాలో అగ్నిప్రమాదం జరుగుతుంది. ఎంతోమందిని రక్షించడమే కాదు వారికి తానే స్వయంగా వైద్యం చేస్తాడు. ఆ తరువాత కూడా తనకు తెలిసిన వైద్యంతో అక్కడి జనాలకు సహాయపడుతూ అనధికార డాక్టర్ అవుతాడు. వచ్చే పోయే పేషెంట్లతో అతడి షెడ్డు చిన్నపాటి ‘క్లీనిక్’ అవుతుంది. వైద్యం కోసమే కాదు రకరకాల విషయాల్లో సలహా కోసం అతని దగ్గరికి వచ్చే జనాల సంఖ్య పెరుగుతుంది. స్లమ్ ఏరియాలో శాంతారామ్ హీరోగా ఎదుగుతున్న విషయం క్రిమినల్ అబ్దుల్ ఖాదర్ ఖాన్‌కు తెలిసి పరిచయం చేసుకుంటాడు. ‘పేద ప్రజలకు నువ్వు చేస్తున్న సహాయం నాకు బాగా నచ్చింది’ అని వేనోళ్ల పొగుడుతాడు. అలా మంచిచేసుకున్న తరువాత మెల్లగా శాంతారామ్ను బ్లాక్‌మార్కెట్ దందాలోకి లాగుతాడు. ప్రత్యర్థి ఒకరు చేసిన కుట్ర వల్ల శాంతారామ్ అరెస్ట్ అవుతాడు. బాంబే జైల్లో చిత్రహింసలు అనుభవిస్తాడు. ఖాదర్ అతడిని జైలు నుంచి విడిపించి బయటికి తీసుకువస్తాడు. ఇక అప్పటి నుండి ప్రొఫెషనల్ కిల్లర్‌గా మారుతాడు. దేశమంతా తిరుగుతాడు. తనకు అత్యంత సన్నిహితుడైన భాస్కర్ చనిపోవడంతో శాంతారామ్ ఒకలాంటి వైరాగ్యస్థితిలోకి వెళ్లిపోతాడు. రామ్‌ను మళ్లీ మామూలు జీవితంలోకి తీసుకువచ్చే బాధ్యతను ఖాదర్ ‘కార్లా’ అనే అమ్మాయికి ఇస్తాడు. బాలీవుడ్ సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేసే కార్లాను బాంబే అండర్ వరల్డ్ రకరకాల క్రిమినల్ ఆపరేషన్స్‌లో పావుగా ఉపయోగించుకుంటారు. ఎట్టకేలకు కార్ల వల్ల మళ్లీ మూమూలు జీవితంలోకి వస్తాడు శాంతారామ్. ఆఫ్గనిస్థాన్‌లో తీవ్రవాదులకు సహకారం అందించడానికి ఖాదర్ శాంతారామ్ను తీసుకువెళతాడు. అక్కడ ఖాదర్ హత్యకు గురవుతాడు. శాంతారామ్ చావు తప్పి కన్ను లొట్ట పోయే పరిస్థితుల్లో ఇండియాకు పారిపోయి వస్తాడు. నేరాల బాట వీడి నిజాయితీగా బతకాలని నిర్ణయించుకుంటాడు. -
నైజీరియన్ చేతిలో మోసపోయిన నటి
సాక్షి, హైదరాబాద్ : నైజీరియన్ చేతిలో నటి సోనాక్షి వర్మ మోస పోయారు. ఫేస్బుక్లో ఫ్రెండ్ చేసుకుని ఆపై స్నేహం పేరుతో నైజీరియన్ వ్యక్తి మోసం చేశాడు. సోనాక్షి ఫేస్బుక్ ఖాతాకు మే నెలలో మెర్రిన్ కిర్రాక్ పేరుతో ఓ రిక్వెస్ట్ రావడంతో ఆమె యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి వారిద్దరు ఛాటింగ్ చేసుకునేవారు. తాను లండన్‌లో ఉంటున్నానని, మీతో స్నేహం చేయాలని ఉందని చెప్పడంతో సొనాక్షి దగ్గరైంది. కొద్దిరోజుల తర్వాత తమ పరిచయానికి గుర్తుగా ఓ గిఫ్ట్ పంపుతున్నానని, ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్‌లోని ఇంటికి వస్తుందని చెప్పడంతో ఆమె నమ్మారు. మే 27వ తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మెర్రిన్ కిర్రాక్ పేరుతో మీకు బహుమతి వచ్చిందని, దాన్ని హైదరాబాద్ పంపాలంటే రూ.85వేలు కట్టాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన సొనాక్షి అధికారి చెప్పిన బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ చేసింది. వారం రోజులైనా బహుమతి రాకపోవడంతో ఎయిర్పోర్ట్ అధికారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన సొనాక్షి వర్మ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొంచెం కంగారు.. కొంచెం భయం
తెలుగు తెరపై మెరవబోతున్న మరో పరభాష బ్యూటీ సోనాక్షీ సింగ్ రావత్. రాజస్థాన్‌లో పుట్టి, ముంబైలో చదువుకుని, ‘నా లవ్ స్టోరీ’ ద్వారా తెలుగు స్క్రీన్‌కి పరిచయం కాబోతున్నారామె. శివ గంగాధర్ దర్శకత్వంలో మహిధర్, సోనాక్షీ సింగ్ జంటగా జి. లక్ష్మీ నిర్మించిన ‘నా లవ్ స్టోరీ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. సోనాక్షీ సింగ్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం బిజినెస్ మేనేజ్మెంట్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను. యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్. 16వ సంవత్సరంలోనే మోడలింగ్‌లోకి ఎంటరయ్యా. హీరోయిన్గా ‘నా లవ్ స్టోరీ’ నా ఫస్ట్ మూవీ. ట్రైనింగ్ ఏమీ తీసుకోలేదు. ట్రైనింగ్ తీసుకుంటే నటన రాదని, క్యారెక్టర్ని అర్థం చేసుకుని అప్పటికప్పుడు లొకేషన్లో చేస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. ఈ సినిమాకి చాలామంది హీరోయిన్లను ఆడిషన్స్ చేశారని విన్నాను. ఎవరూ నచ్చలేదని తెలిసి, నా ఫొటోలు పంపాను. నచ్చి హీరోయిన్గా ఓకే చేశారు. ఇందులో నాది మధ్యతరగతి అమ్మాయి పాత్ర. తండ్రి చాలా స్ట్రిక్ట్. రియల్ లైఫ్‌లో మా నాన్నగారు అలా కాదు. ఇక, ఈ చిత్రం మొదటి రోజు షూటింగ్ గురించి చెప్పాలంటే... ఫస్ట్ డే రొమాంటిక్ సాంగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ డేనే రొమాంటిక్ సాంగ్ అనడంతో కొంచెం కంగారు, కొంచెం భయం అనిపించాయి. యూనిట్ సహకారంతో చేశాను. తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్గార్లంటే ఇష్టం. ‘బాహుబలి’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలు చూశాను’’ అన్నారు. -
మహిళలు చూడాల్సిన చిత్రమిది
‘‘రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘నా లవ్‌స్టోరీ’. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్‌ను సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం. యువతకి బాగా నచ్చుతుంది. ప్రతి మహిళ ఈ సినిమా తప్పక చూడాలి’’ అని దర్శకుడు జి. శివ గంగాధర్ అన్నారు. మహీధర్, సోనాక్షిసింగ్ జంటగా కె. శేషగిరిరావు నిర్మిస్తున్న ‘నా లవ్‌స్టోరీ’ మోషన్ పోస్టర్ని జర్నలిస్ట్, శాటిలైట్ కన్సల్టెంట్ రాఘవేంద్రరెడ్డి విడుదల చేశారు. కె. శేషగిరిరావు మాట్లాడుతూ –‘‘సినిమా తీయాలని తిరుగుతున్న రోజుల్లో శివగారు పరిచయమయ్యారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో నిర్మించాం. శివ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు’’ అన్నారు. ‘‘శివగారు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. ‘నా లవ్ స్టోరీ’ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు మహీధర్. సోనాక్షి సింగ్, మ్యూజిక్ డైరక్టర్ వేధనేవన్, నటులు శివన్నారాయణ, తోటపల్లి మధు పాల్గొన్నారు. -
చిరు సరసన వాళ్లిద్దరిలో ఎవరో?
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఉయ్యలవాడ నర్సింహారెడ్డిలో ఆయనకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సరసన కథనాయికగా పలువురు బాలీవుడ్ భామల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్లు సోనాక్షి సిన్హా లేదా ప్రియాంకా చోప్రాను నటింపచేసేందుకు చిత్ర యూనిట్ యత్నిస్తున్నట్లు సమాచారం. అంగీకారం కోసం చిత్ర నిర్మాతలు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సోనాక్షి సిన్హా రజనీకాంత్ సరసన లింగా చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటికీ... ఆమెను తెలుగు సినిమాల్లో నటింపజేయాలని కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అమ్మడు పచ్చజెండా ఊపలేదు. అంతేకాకుండా ఇటీవలే మహేష్ బాబు చిత్రంలో ఛాన్స్ వచ్చినా తిరస్కరించినట్లు ఆమె వెల్లడించింది కూడా. ఇక ప్రియాంకా చోప్రా కూడా రాంచరణ్‌తో హిందీ చిత్రం జింజర్ (తెలుగులో తుఫాను)లో కలిసి నటించిన విషయం తెలిసిందే. మరోవైపు చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి... ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌తో భేటీ అయ్యారు. అయితే రెహమాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందట. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పూర్తి కాగా ఆగస్ట్, లేదా సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ లోపు చిత్ర యూనిట్ హీరోయిన్ను ఫైనలైజ్ చేయనుంది. కాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో ముగ్గురు మహిళలు ముఖ్య భూమిక పోషించారట! ఆ ముగ్గురిలో ఓ పాత్రకు ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను అనుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అలాగే చిరంజీవితో పలు హిట్ చిత్రాలు చేసిన విజయశాంతిని ఓ పాత్రకు, శ్రుతీహాసన్‌ను మరో పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. -
ప్రియుడితో పెళ్లి.. హీరోయిన్ క్లారిటీ!
నటి సోనాక్షి సిన్హా చాలాకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నదట. ప్రియుడు బంటీ సజ్దేతో ఆమె రిలేషిన్‌షిప్‌లో ఉన్నదని బాలీవుడ్ కోడై కూస్తున్నది. ఈ రూమర్స్ తగ్గట్టే ఇటీవల సోనాక్షి-బంటీ కలిసి పార్టీలకు వెళ్లడం, బహిరంగంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకు దొరికిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే సోనాక్షి-బంటీ ఒక ఇంటివారు కాబోతున్నారని, వారి పెళ్లి ఎంతో దూరంలో లేదంటూ కథనాలు కూడా వచ్చేశాయి. తాజాగా 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ సుందరాంగి తన పెళ్లి కథనాలపై స్పందించింది. 'త్వరలోనే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానో నాకు తెలియదు. ప్రజలను మాట్లాడుకోనివ్వండి. వాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ల పనే అది' అంటూ ఈ కథనాలను తోసిపుచ్చింది. అయితే, సోనాక్షి-బంటీకి మధ్య విభేదాలు వచ్చాయని, వారు వేరుగా ఉంటున్నారని ఆ మధ్య కథనాలు కూడా వచ్చాయి. ఈ కథనాలను ఖండించడానికి అన్నట్టుగా వెంటనే సోనాక్షి-బంటీ కలిసి అనుష్క శర్మ ఫిల్హౌరి స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. అంతేకాకుండా జంటగా డైనింగ్ చేస్తూ ఫొటోలు దిగి.. లీక్ చేశారు. దీంతో వీరు ప్రేమలో మునిగితేలుతున్నారని బాలీవుడ్లో వినిపిస్తోంది. -
డిన్నర్ డేటింగ్‌కు వెళ్లి దొరికిపోయారు!
వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని గతకొన్ని రోజులుగా వినిపిస్తోంది. తాజాగా వారిద్దరి ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లి మీడియాకు చిక్కారు. వాళ్లే బాలీవుడ్ కొత్త జంట సోనాక్షి సిన్హా, బంటీ సజ్దే. ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. కాగా, శుక్రవారం రాత్రి ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌కు సోనాక్షి, బంటీ కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి కాసేపు రెస్టారెంట్లో గడిపారు. ఆ తర్వాతే ఎవరి కంటపడకుంగా గప్‌చుప్‌గా వెళ్లిపోవాలని మొదట సోనాక్షి బయటకు వచ్చింది. సోనాక్షి వెళ్లేవరకు రెస్టారెంట్లోనే వేచిచూసిన బంటీ.. ఆమె వెళ్లిపోయిన తర్వాత తాను నవ్వుతూ బయటకు వచ్చాడు. సోనాక్షి, బంటీ మధ్య చాలాకాలంగా ప్రేమ నడుస్తున్నట్టు చెప్తున్నారు. ఆ మధ్య వీరు విడిపోయినట్టు కూడా కథనాలు వచ్చాయి. ప్రియుడు బంటీ పెళ్లి ప్రతిపాదనను సోనాక్షి అంగీకరించిందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోనుందని ‘ముంబై మిర్రర్’ మ్యాగజీన్ ఓ కథనం రాయగా.. దానిని సోనాక్షి తోసిపుచ్చింది. అయితే, తమ మధ్య బ్రేకప్ అయిన వార్తలు వట్టివేనని కొట్టిపారేయడానికి సోనాక్షి, బంటీ ఇలా రెస్టారెంట్‌కు వచ్చినట్టు భావిస్తున్నారు. -
డివైడ్ టాక్ వచ్చినా స్థిరంగా కలెక్షన్లు!
దక్షిణాది టాప్ డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన తాజా బాలీవుడ్ సినిమా 'అకీరా'. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన ఈ లేడి ఒరియంటెడ్ సినిమా ఇటు ప్రేక్షకుల నుంచి, అటు విమర్శకుల నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. ప్రారంభంలో ఈ సినిమాకు బాగా నిరాశాపూరితంగా వసూళ్లు దక్కినా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. సెప్టెంబర్ 2న విడుదలైన ఈ సినిమా మంగళవారం కూడా చెప్పుకోదగినస్థాయిలో వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఐదు రోజుల్లో రూ. 22.45 కోట్లను ఈ సినిమా తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం, సోనాక్షి, మురగదాస్ కు మంచి ఇమేజ్ ఉండటం ఈ సినిమా థియేటర్లవైపు ప్రేక్షకులను నడిపిస్తోంది. 'అకీరా' తొలిరోజు కేవలం రూ. 5.15 కోట్లు సాధించి నిరాశపరచగా, రెండోరోజు రూ. 5.30 కోట్లు వసూలు చేసింది. మూడోరోజు వసూళ్లు గణనీయంగా పెరిగి.. రూ.6.20 కోట్లు రాబట్టింది. ఇక సోమవారం రూ. 3.40 కోట్లు రాబట్టగా, మంగళవారం రూ. 2.40 కోట్లు రాబట్టిందని, మొత్తంగా భారత్ లో ఈ సినిమా రూ. 22.45 కోట్లు రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు. రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి సేఫ్ ప్రాజెక్టు అయ్యే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. మురగదాస్‌కు సోనాక్షి సిన్హాతో ఇది రెండో సినిమా. అక్షయ్‌కుమార్, సోనాక్షి జంటగా ఆయన తీసిన 'హాలీడే: ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతకుముందు ఆయన అమీర్‌ఖాన్‌తో తీసిన 'గజనీ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
మూడో రోజు బాగా పెరిగిన కలెక్షన్లు!
భారీ యాక్షన్ సినిమాల్ని తెరకెక్కించే దర్శకుడు మురగదాస్.. సోనాక్షి సిన్హాతో ఆయన తీసిన లేడి ఒరియంటెడ్ సినిమా 'అకీరా' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ పోరాట సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న 'అకీరా' తొలిరోజు కేవలం రూ. 5.15 కోట్లు సాధించి నిరాశపరచగా, రెండోరోజు రూ. 5.30 కోట్లు వసూలు చేసింది. మూడోరోజు మాత్రం ఈ సినిమా వసూళ్లు గణనీయంగా పెరిగాయి. మూడోరోజైన ఆదివారం ఈ సినిమా ఏకంగా రూ.6.20 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా తొలి వీకెండ్లో రూ. 16 కోట్లు కొల్లగొట్టింది. దక్షిణాది డైరెక్టర్ అయిన మురగదాస్‌కు సోనాక్షి సిన్హాతో ఇది రెండో సినిమా. అక్షయ్‌కుమార్, సోనాక్షి జంటగా ఆయన తీసిన 'హాలీడే: ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతకుముందు ఆయన అమీర్‌ఖాన్‌తో తీసిన 'గజనీ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
ఫెంటాస్టిక్ ఫోర్
కథలు కంచిలో దొరుకుతాయో లేదో కాని బాలీవుడ్లో మాత్రం కచ్చితంగా దొరుకుతాయి. ఒకప్పుడు ఠాకూర్ ఘరానా కథలు, బందిపోట్ల కథలు, సంపన్న కుటుంబాల కథలతో మూస సినిమాలు తయారయ్యే బాలీవుడ్లో ఇప్పుడు కొత్త కథల వెతుకులాట, అందుకు అవసరమైతే రిస్క్ తీసుకునే తత్వం పెరిగింది. మంచి కథ... ఒప్పించే నెరేషన్... ఇవి రెండూ ఉంటే సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయని నమ్ముతున్నారు. ప్రేక్షకులు కూడా ఆ మాట నిజం చేస్తున్నారు. ‘వెయిటింగ్’, ‘తీన్’, ‘ఉడ్తా పంజాబ్’, ‘మదారి’... ఇవన్నీ ఇటీవల భిన్నమైన కథాంశాలతో బాలీవుడ్లో మెరిసిన సినిమాలు. నిన్న మొన్న విడుదలైన ‘హ్యాపీ భాగ్ జాయేగీ’లో ఇష్టం లేని పెళ్లి నుంచి పారిపోదామనుకున్న పెళ్లికూతురు సరాసరి పాకిస్తాన్లో తేలుతుంది. ఇక అక్కణ్ణుంచి ఇండియా ఎలా చేరిందనే అంశాన్ని నవ్వులతో చెప్పడం వల్ల ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు చివరి వారంలో సెప్టెంబర్ మొదటి వారాల్లో రిలీజ్ కాబోతున్న నాలుగు సినిమాల కథాకమామీషు... అకీరా సెప్టెంబర్ 2న విడుదల. ఇది తమిళ సినిమా ‘మౌనగురు’కి రీమేక్. సాధారణంగా దర్శకుడు మురుగదాస్ సొంత కథలతో సినిమా తీస్తాడు. కాని కరుణానిధి మనవడు అరుళ్‌నిధి నటించిన ఈ సినిమా ఐదేళ్ల క్రితానిది. అయినప్పటికీ ఇందులోని కథ, కథనం ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేది కనుక మురుగదాస్ హిందీలో సోనాక్షీతో రీమేక్ చేశాడు. తమిళంలో హీరో పాత్రను హిందీలో హీరోయిన్గా మార్పు చేయడం విశేషం. వాస్తవానికి ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. నారా రోహిత్ హీరో. కె.ఎస్.రామారావు సమర్పణ. కిన్ను నిర్మాత. పేరు ‘శంకర’. అయితే ఎందుకనో విడుదలలో జాప్యం ఉంది. ఈ సినిమాకు హాలీవుడ్ మూలం ‘ఫార్గో’ అని చెప్పవచ్చు. అందులో దివాళా తీసిన ఒక భర్త తన ఆర్థిక అవసరాల కోసం సొంత భార్యనే కిడ్నాప్ చేయమంటాడు. కాని ఎంతో సింపుల్ అనుకున్న ఆ విషయం చాలా పాశవికమైన హత్యలకు దారి తీస్తుంది. ‘అకీరా’లో ఒక కారు యాక్సిడెంట్లో దొరికిన భారీ డబ్బును పోలీసులు సొంతం చేసుకుంటారు. కాని ఆ ఒక్క సంఘటన అనేక దారుణాలకు కారణం అవుతుంది. ఆ దారుణాలలో హీరోయిన్ చిక్కుకుంటుంది. ఆసక్తికరమైన ఈ కథను వెండితెర మీద చూడాల్సిందే. బార్ బార్ దేఖో సెప్టెంబర్ 9న విడుదల. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’తో పరిచయమైన సిద్ధార్థ మల్హోత్రా ఇందులో హీరో అయితే కుర్ర హీరో అయినప్పటికీ పక్కన నటించడానికి అంగీకరించిన హీరోయిన్ కత్రినాకైఫ్. ‘లైఫ్ ఆఫ్ పై’ వంటి గొప్ప సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేసిన నిత్య మెహ్రా అనే కొత్త దర్శకురాలు రాసుకున్న ఈ కథ కరణ్ జోహార్‌ను కూడా ఆకట్టుకుని నిర్మాతగా మారేలా చేసింది. మొదట ఈ సినిమాలో హీరోగా ఆమిర్‌ఖాన్ గానీ హృతిక్ రోషన్ గానీ నటిస్తారనుకున్నారు. చివరకు సిద్ధార్థకు దక్కింది. కొంచెం సైంటిఫిక్ టచ్ ఉన్న ఈ సినిమాలో హీరో వయసు రోజులు గడిచే కొద్దీ మారిపోతూ ఉంటుంది. ఒక్కరోజులో పదహారు సంవత్సరాలు గడిచిపోతాయి. దానికి తగినట్టుగా అతడి ప్రేమ కథ కూడా మారిపోతూ ఉంటుంది. తనకే తెలియని తన గతాన్ని వెనక్కి తిప్పడానికి అతడేం చేశాడనేది కథ. దీని ప్రోమోకు విశేషమైన ఆదరణ లభించింది. రవి కె.చంద్రన్ వంటి సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ పని చేయడం మరో ఆకర్షణ. కత్రినా కొంచెం అరమరికలు లేకుండా తన సౌందర్యాన్ని ప్రదర్శించిందని భోగట్టా. అభిమానులు అందుకోసం కూడా ఎదురుచూస్తున్నారు. ఫ్రీకీ అలీ సెప్టెంబర్ 9న విడుదల. నవాజుద్దీన్ సిద్దిఖీ ఏ ముహూర్తాన ‘బజరంగీ భాయ్‌జాన్’ చేశాడో కానీ సల్మాన్ మనసును ఇట్టే గెలిచేశాడు. సల్మాన్ తమ్ముడు సొహైల్‌ఖాన్ ఇప్పుడు సిద్దిఖీని పెట్టి ‘ఫ్రీకీ అలీ’ అనే సినిమా తీశాడు. సల్మాన్ సమర్పకుడు. హాలీవుడ్ సినిమా ‘హ్యాపీ గిల్మోర్’ ఆధారంగా తీసిన ఈ చిత్రం ఒక పేవ్మెంట్ వ్యాపారి పెద్ద గోల్ఫ్స్టార్ కావడం గురించి హాస్య రసస్పోరకంగా చర్చిస్తుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ పేవ్మెంట్ మీద చడ్డీలు అమ్ముతుంటాడు. పార్ట్‌టైమ్‌గా ఒక దాదాగారితో వెళ్లి రౌడీ మామూళ్లు వసూలు చేస్తుంటాడు. కాని అతడికి క్రికెట్లో షాట్స్ కొట్టే సహజమైన టాలెంట్ ఉంటుంది. ఒకరోజు ఒక గోల్ఫ్ కోర్టులో ఒక పెద్ద మనిషి దగ్గర రౌడీ మామూలుకు వెళ్లిన సిద్ధిఖీ అతడు ఎంతకూ షాట్ కొట్టకపోవడం గురించి బూతు జోక్ వేస్తాడు. దాంతో ఆయన నీకు అంత సత్తా ఉంటే నువ్వు షాట్ కొట్టి చూపించు అంటాడు. సిద్దిఖీ కచ్చితంగా షాట్ కొడతాడు. అందరూ హతాశులవుతారు. అప్పటి నుంచి సిద్ధిఖీకి గోల్ఫ్ స్టార్ కావాలని ఉంటుంది. అందుకు ఎటువంటి అడ్డంకులు వచ్చాయనేది కథ. పింక్ సెప్టెంబర్ 16న విడుదల. అమితాబ్‌తో ‘పికూ’ తీసి పెద్ద హిట్ కొట్టిన సూజిత్ సర్కార్, ఇప్పుడు అనిరుధ్‌రాయ్ చౌదురి దర్శకత్వంలో ‘పింక్’ పేరుతో అమితాబ్ ముఖ్యపాత్రగా ఈ సినిమా నిర్మించాడు. సమాజంలో జరుగుతున్న స్త్రీల పై అత్యాచారాలు నేపథ్యం. ముగ్గురమ్మాయిలు ఒకరాత్రి షికారుకెళుతుంటే ముగ్గురు కుర్రాళ్లు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తారు. కేస్ అవుతుంది. అయితే పలుకుబడి ఉన్న ఈ కుర్రాళ్ల తరుఫువారు ఆ అమ్మాయిల్ని అప్రతిష్టపాలు చేయాలని వారిపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేస్తారు. దీనిని ఖండించడానికి అమ్మాయిలు చాలా అవస్థ పడాల్సి వస్తుంది. ‘బైపోలార్ డిజార్డర్’, అంటే తరచూ మారిపోయే భావావేశాల జబ్బుతో బాధపడే లాయర్ అయిన అమితాబ్ వీరిని ఈ కేసు నుంచి ఎలా బయటపడేశాడన్నది కథ. తాప్సీ ముఖ్యపాత్రను పోషించింది. ప్రోమో రిలీజైన వెంటనే చాలామంది బాలీవుడ్ సూపర్స్టార్లు కథాంశాన్ని మెచ్చుకున్నారు. ఈ సంవత్సరం ఈ సినిమా మంచి ఫలితాలను రాబడుతుందని అందరి ఆకాంక్ష. ఈ నాలుగు సినిమాలే కాదు... ఎం.ఎస్.ధోని, రాక్ ఆన్ 2, కహానీ 2, దంగల్ వంటి సినిమాలు ఈ సంవత్సరాంతం వరకూ ప్రేక్షకులను చేరనున్నాయి. తెలుగు సినిమాలు ఈ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాలి. కొత్త రకం కథే ఇప్పుడు విజయానికి పాస్‌పోర్ట్. -
మాంసం నిషేధంపై మరో సెలబ్రిటీ..
ముంబైలో మాంసం నిషేధం నిర్ణయం పై బాలీవుడ్ సెలబ్రిటీలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా లాంటి స్టార్ హీరోయిన్స్ ఈ విషయం పై ట్విట్టర్లో స్పందించగా, మరో బాలీవుడ్ సెలబ్రిటీ రిషీ కపూర్ కూడా బ్యాన్పై ఘాటుగా స్పందించారు. 'జాగో ఇండియా జాగో, మతం పేరుతో దేశాన్ని ఎటు వైపు తీసుకెళుతున్నారు. రాధే మా, మాంసం పై నిషేధం ఏంటి గోల..?' అంటూ కామెంట్ చేశాడు. ఇప్పటికే సోనమ్, సోనాక్షిలా కామెంట్స్ పై దుమారం రేగుతుండటంతో రిషీకపూర్ కామెంట్స్ ఆ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. గతంలో స్వామిజీలపై ఇలాంటి కామెంట్సే చేసిన రిషీకపూర్, ఈ సారి మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించారు. 'ఆల్ ఈజ్ వెల్' సినిమా తరువాత యురోపియన్ టూర్‌కి వెళ్లిన కపూర్ తిరిగి ముంబై చేరుకోగానే ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు. Jaago India Jaago. Stop all this in the name of religion.All taking the nation for a ride. Kabhi Radhe baby Kabhi meat ban! Kya ho raha hai? — rishi kapoor (@chintskap) September 9, 2015 -
అతగాడితో విహార యాత్ర!
‘‘ఒంటరిగా విహార యాత్రకు వెళ్లినా... జంటగా వెళ్లిందని జనాలు చెప్పుకునే రోజులివి. ఫలానా కథానాయిక విహార యాత్రకెళ్లిందట అనే వార్త వస్తే చాలు.. తనతో పాటు ‘అతను’ కూడా వెళ్లాడని ఏదో ఒక హీరోతో లింకు పెట్టేస్తారు’’ అని సోనాక్షీ సిన్హా అంటున్నారు. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. ఇటీవల ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం ఆమె మాల్దీవులు వెళ్లారు. అక్కడ కొంచెం విరామం దొరికితే, ఓ రెండు రోజులు విహార యాత్ర ప్లాన్ చేసుకున్నారు. దాంతో, ఈ ట్రిప్‌కి సోనాక్షీ ఎవర్నో తీసుకెళ్లారనీ, అతగాడెవరనీ కొంతమంది ఆరా తీసే పని మీద పడ్డారు. ఈ విషయం విన్న సోనాక్షీ హాయిగా నవ్వుకున్నారట. ‘‘నాతో తీసుకెళ్లడానికి బాయ్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. నేను ఒంటరిగా వెళ్లా. ఇక ఆరా తీయడం ఆపితే బెటర్’’ అంటున్నారామె. ప్రస్తుత సింగిల్‌గా ఉన్నాననీ, జీవితం చాలా ఆనందంగా ఉందనీ సోనాక్షీ స్పష్టం చేశారు. -
మామను ఫాలో అవుతున్న అల్లుడు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే ఓ స్టయిల్ ఐకాన్. స్టైలిష్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అన్నారు. సిగరెట్ గాల్లో ఎగరవేసే రజనీ స్టయిల్‌కు ఫిదా అయినవాళ్లు ఉన్నారు. తాజాగా రజనీ అల్లుడు, యువ హీరో ధనుష్ ...మామను అనుసరిస్తున్నాడు. కాగా రజనీ స్టయిల్‌ను ధనుష్ ఫాలో అవుతున్నాడని ఎప్పటి నుంచి టాక్ ఉంది. 'విఐపీ' సినిమాలో రజనీ స్టైల్స్‌ను అనుకరించాడు కూడా. ఈ మూవీ 'రఘువరన్ బీటెక్' పేరుతో తెలుగులోకి కూడా వచ్చింది. అయితే నటన విషంయంలో ధనుష్‌ను ఎవ్వరూ వంక పెట్టలేరు. ఇటు కోలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్లో కూడా డిఫరెంట్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. రజనీ స్టయిల్‌ను ధనుష్ అనుకరించడం మానుకోలేదని కోలీవుడ్‌లో ఇంకా గుసగుసలు వినిస్తున్నాయి. రీసెంట్గా రిలీజైన 'మారీ' సినిమా టీజర్ అందుకు నిదర్శనం అంటున్నారు. ధనుష్ మళ్లీ మాస్ గెటప్‌లో రజనీలా సిగరెట్ కాలుస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ధనుష్ విషయం పక్కన పెడితే.. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా రజనీని టాప్ ఆఫ్ డైలాగ్స్ చెబుతూ మతులు పోగొడుతుంది. సోనాక్షీ మెయిన్ రోల్లో ఓ లేడీ ఓరియెంటెండ్ చిత్రాన్ని దర్శకుడు మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ తమిళ దర్శకుడికి రజనీ అంటే విపరీతమైన అభిమానం. ఈ డైరెక్టర్.. రజినీ స్టైల్లో సోనాక్షితో డైలాగ్ చెప్పించి నెట్లో ఉంచాడు. మొత్తానికి రజనీ మేనియా కోలీవుడ్, బాలీవుడ్లో నడుస్తోంది.