మూడో రోజు బాగా పెరిగిన కలెక్షన్లు! | Sonakshi Akira collects over Rs 16 crore | Sakshi
Sakshi News home page

మూడో రోజు బాగా పెరిగిన కలెక్షన్లు!

Published Mon, Sep 5 2016 6:44 PM | Last Updated on Mon, Sep 4 2017 12:25 PM

మూడో రోజు బాగా పెరిగిన కలెక్షన్లు!

మూడో రోజు బాగా పెరిగిన కలెక్షన్లు!

భారీ యాక్షన్‌ సినిమాల్ని తెరకెక్కించే దర్శకుడు మురగదాస్‌.. సోనాక్షి సిన్హాతో ఆయన తీసిన లేడి ఒరియంటెడ్‌ సినిమా 'అకీరా' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ పోరాట సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న 'అకీరా' తొలిరోజు కేవలం రూ. 5.15 కోట్లు సాధించి నిరాశపరచగా, రెండోరోజు రూ. 5.30 కోట్లు వసూలు చేసింది.

మూడోరోజు మాత్రం ఈ సినిమా వసూళ్లు గణనీయంగా పెరిగాయి. మూడోరోజైన ఆదివారం ఈ సినిమా ఏకంగా రూ.6.20 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా తొలి వీకెండ్‌లో రూ. 16 కోట్లు కొల్లగొట్టింది. దక్షిణాది డైరెక్టర్‌ అయిన మురగదాస్‌కు సోనాక్షి సిన్హాతో ఇది రెండో సినిమా. అక్షయ్‌కుమార్‌, సోనాక్షి జంటగా ఆయన తీసిన 'హాలీడే: ఏ సోల్జర్‌ ఈజ్‌ నెవర్‌ ఆఫ్‌ డ్యూటీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతకుముందు ఆయన అమీర్‌ఖాన్‌తో తీసిన 'గజనీ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement