Akira
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అకిరా, గౌతమ్
-
పవన్‌తో అకీరా, లెజినోవా: రేణు ట్వీట్
సాక్షి, సినిమా: జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో ఆయన కుమారుడు అకీరా నందన్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ విజయవాడలోని పడమట ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని శుక్రవారం ఉదయం గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ముందు రోజు రాత్రి విజయవాడలోని ఓ హోటల్లో కొడుకు అకీరానంద్, భార్య అన్నాలెజినోవాతో కలిసి రావడం కొంతమంది కంట పడింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకీరా విజయవాడకు రావడాన్ని ప్రశ్నిస్తూ కొంత మంది రేణుకి మెసేజ్ చేశారట. దీనికి రేణు తన ట్విటర్ ద్వారా స్పందించారు. ‘అకీరా తన సెలవుల్లో కొన్ని రోజులు పవన్(నాన్న)తో కలిసి గడపాలనుకున్నాడు. అతడు హైదరాబాద్‌కు రాలేదు. ప్రస్తుతం అకీరా కల్యాణ్ గారితో కలిసి విజయవాడలో ఉన్నాడు. అప్పటి నుంచి నాకు విరామం లేకుండా మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే ఈ ట్వీట్ చేస్తున్నా’ అని రేణు దేశాయ్ పేర్కొన్నారు. నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్ తన పిల్లల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రేణుదేశాయ్ తన కొడుకు అకీరాను జూనియర్ పవర్ స్టార్ అని కొంతమంది సోషల్ మీడియాలో అంటే ఫైర్ అయ్యింది. అకీరాను అలా పిలవద్దంటూ సీరియస్ అయ్యింది. తన కొడుకు సొంతంగా ఎదిగేందుకు తాను భరోసానిస్తున్నానని.. అకీరాను తనలాగే గుర్తించాలని అభిమానులను కోరింది. Akira is just spending few days of school holidays with his father. He has not shifted to Hyderabad. This tweet is because of the constant msgs I am getting since yesterday about Akira being in Vijaywada with Kalyan garu. 😊 — renu (@renuudesai) June 23, 2018 -
పరిశోధన మీది.. పెట్టుబడి మాది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హవాయ్‌కు చెందిన ఓ రీసెర్చ్ స్కాలర్ ‘అగ్నిపర్వతాల నుంచి విద్యుత్ తయారీ’ అంశాన్ని శోధిస్తున్నాడు. జర్మనీకి చెందిన మరో స్కాలర్ ‘మైక్రోసెన్సార్లతో భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని ఎలా చేయాలి’ అనేది పరిశోధిస్తున్నాడు. ఢిల్లీకి చెందిన ఇంకో రీసెర్చర్ ‘డ్రోన్లు, సెన్సార్ల ఆధారంగా గాలి, కాలుష్యం స్థాయి ఎలా ఉంటుందోనని’ చూస్తున్నాడు. ..ఇలా ఒకటి, రెండూ కాదు!. సైన్స్, సామాజిక అంశాలపై 30కి పైగా రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. వీటన్నింటికీ వేదిక మన తెలుగు కుర్రాడి స్టార్టప్ ‘రీసెర్చ్ ఫండర్స్’!! నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అకీరా పీఎస్ ప్రారంభించిన రీసెర్చ్ ఫండర్స్ గురించి మరిన్ని వివరాలు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... ‘‘రీసెర్చ్ స్కాలర్స్‌కు ఎదురయ్యే ప్రధాన సమస్యలు.. నిధులు, మార్గదర్శనం, పరిశోధన పరికరాలు. ఇక ల్యాబ్, ఆర్అండ్డీ కోసమైతే కోట్లలోనే ఖర్చవుతుంది. కానీ, ప్రభుత్వమిచ్చే నిధులు 40 శాతమే. మిగిలిన మొత్తాన్ని స్కాలర్లు సమకూర్చుకోలేక మధ్యలోనే పరిశోధనలు నిలిపేస్తున్న సంఘటనలు బోలెడు. ‘ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ’ అంశంపై ఎంఎస్ చేస్తున్న సమయంలో నాకూ ఇవన్నీ ఎదురయ్యాయి. దీనికి పరిష్కారం చూపే క్రమంలోనే ‘రీసెర్చ్ ఫండర్స్.ఓఆర్జీ’ సంస్థను ప్రారంభించా. రూ.18 లక్షల పెట్టుబడితో గతేడాది సెప్టెంబర్‌లో మొదలైంది. రీసెర్చ్ స్కాలర్లు, ఇన్వెస్టర్లను కలపడమే మా పని. అంటే రీసెర్చ్ అకడమిక్‌కు మాది ఒక సామాజిక వేదికన్న మాట. స్కాలర్లకు రూ.1.4 కోట్ల నిధులు.. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనమిక్స్, డాటా సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్ వంటి 25కి పైగా సబ్జెక్ట్‌ల్లోని పరిశోధనలను మా వేదికపై నమోదు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 30కి పైగా పరిశోధన ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. మన దేశంతో పాటు జర్మనీ, యూకే, సింగపూర్ దేశాల నుంచి కూడా పరిశోధనలున్నాయి. రీసెర్చ్ ఫండర్స్‌లో 7 వేల మంది ఇన్వెస్టర్లు (బ్రాకర్స్) నమోదయ్యారు. ఇప్పటివరకు రీసెర్చ్ స్కాలర్స్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1.4 కోట్ల నిధులను సమీకరించారు. నమోదు ఉచితమే, కానీ.. రీసెర్చ్ ఫండర్స్‌లో పరిశోధనల నమోదు ఉచితమే. కాకపోతే, నిధులు పొందాక దాన్లో 5 శాతం, ల్యాబ్‌కైతే 10 శాతం రీసెర్చ్ ఫండర్స్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి, ఇన్వెస్టర్లకేం ప్రయోజనమంటే.. రీసెర్చ్ స్కాలర్లు తమ పరిశోధన పూర్తయ్యాక దాని ఫలితాలను వారికి ఫండింగ్ ఇచ్చిన వారితోనే పంచుకోవాల్సి ఉంటుంది. గత నెలలో రూ.12 లక్షల వ్యాపారాన్ని నమోదు చేశాం. హైదరాబాద్‌లో ఏఐ ఆర్అండ్డీ ల్యాబ్.. ప్రస్తుతం మా సంస్థలో ఆరుగురు ఉద్యోగులున్నారు. దేశంలో ఆర్ అండ్ డీ పరిశ్రమ విలువ 48 బిలియన్ డాలర్లు. పలు ఆర్అండ్డీ వర్సిటీలు, ప్రైవేట్ సంస్థల సహకారంతో హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అకడమిక్ రీసెర్చ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం కేంద్ర పరిశోధన విభాగం(సీబీడీ) తోనూ చర్చలు జరిపాం. కలారీ క్యాపిటల్ ‘కే స్టార్ట్’ కార్యక్రమంలో రూ.5 కోట్ల నిధులను సమీకరించనున్నాం. తొలి విడత చర్చలూ ముగిశాయి’’ అని అకీరా వివరించారు. అకీరా పీఎస్‌కు జర్మనీ ఫెలోషిప్.. అకీరా పీఎస్ అసలు పేరు పరిశణబోయిన శ్రవణ్ కుమార్. హైదరాబాద్‌లోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. ఉద్యోగం రాకపోవటంతో జేఎన్టీయూలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీపై ఎంఎస్‌లో చేరాడు. ఆర్ధిక ఇబ్బందులతో మధ్యలోనే వదిలేసి.. అదే జేఎన్టీయూలో పరీక్షల విభాగంలో ఉద్యోగంలో చేరాడు. ‘‘అప్పుడే అనిపించింది చిన్న నగరాలు, పట్టణాల్లో యువతకు నిరుద్యోగ సమస్యలేంటో? ఉద్యోగావకాశాలు సరిగా తెలియవు? తెలిసినా ఎలా దరఖాస్తు చేసుకోవాలో? ఎలా ఎదుర్కోవాలో తెలియదని. దీనికి పరిష్కారం చూపించే క్రమంలోనే ఇంటర్నెట్ అవసరం లేకుండా స్థానిక ఉద్యోగ అవకాశాలను తెలుసుకునే ‘నోటిఫై యూ’ అనే ఓ సామాజిక సెర్చ్ ఇంజిన్‌ను అభివృద్ధి చేశా. ఉద్యోగార్థులు విద్యార్హత, చిరునామా, ఫోన్ నంబరు వంటి వ్యక్తిగత వివరాలను నోటిఫై యూ డేటాబేస్‌లో నమోదు చేస్తే.. మీ అర్హతకు తగ్గ ఉద్యోగం స్థానికంగా ఎక్కడ ఉందో వెతికి సంబంధిత కస్టమర్ ఫోన్‌కు మెసేజ్ పంపిస్తుంది. 2013లో ప్రారంభించి.. 2014 డిసెంబర్ వరకూ నోటిఫై యూను నడిపించాం. సుమారు 20 లక్షల మంది నమోదయ్యారు. నోటిఫై యూ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. దీన్ని గమనించిన జర్మనీలోని ఇంక్యుబేటర్ 2016లో సోషల్ ఆస్ట్రోనాట్ రీసెర్చ్‌లో ఫెలోషిప్ ఇచ్చింది’’ అని అకిరా తెలియజేశారు. -
పాడు అఫ్రీన్
పాడకపోతే... పాడు అఫ్రీన్ అంటారు. పాడతానంటే... ‘పాడు అఫ్రీన్’ అంటారు. అయినా పాటకి ‘పాడు’, ‘మంచి’ ఉంటుందా? పాడటమే ఉంటుంది కదా! పాటకి ఇన్ని పాట్లయితే... పాట మూగబోవాలా? గొంతెత్తి నినదించాలా? నహీద్ అఫ్రీన్ ఈ శనివారం 25వ తేదీన నినదిస్తుందా..? మూగబోతుందా? ఏఆర్ మురుగదాస్ సినిమా ‘అకీరా’ (2016)లో అకీరా శర్మ అనే అమ్మాయి ఉంటుంది. చిన్న పల్లె. అమాయకపు పిల్ల. అమ్మానాన్న, తను. హాయిగా ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఓరోజు ఓ గుంపు ఒక యువతి ముఖం మీద యాసిడ్ పోసి పారిపోవడం చూస్తుంది. వాళ్లలో ఒకడిని గుర్తుపట్టి పోలీసులకు చెబుతుంది. పోలీసులు వాడిని పట్టుకుంటారు. తప్పించుకుపోయినవాళ్లు ఈ అమ్మాయి మీద పగబడతారు. ఎందుకైనా మంచిదని కూతురికి ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తాడు తండ్రి. ఇంకోసారి ఇంకో గ్యాంగు ఓ అమ్మాయిని ఏడిపించడం చూస్తుంది అకీరా. వాళ్లను తరిమి తరిమి కొడుతుంది. వాళ్లలో ఒకడు అకీరా మీదకు యాసిడ్ విసరబోతాడు. అకీరా ఒడుపుగా తప్పించుకుంటుంది. యాసిడ్ విసిరినవాడి మీదే పడుతుంది. అకీరానే పోసిందని, ఆమెను బాలనేరస్థుల జైలుకు పంపుతారు. జైలు నుంచి విడుదలయ్యాక, కాలేజీలో చేరాక జీవితంతో అకీరా ఫైట్ మొదలవుతుంది. అన్యాయాలతో ఆమె రాజీ పడదు. అందుకే ఆ ఫైట్. పాకిస్థానీ దర్శకుడు షోయబ్ మన్సూర్ సినిమా ‘ఖుదా కె లియే’ (2007)లో మన్సూర్, సర్మద్ అనే ఇద్దరు యువ గాయకులు ఉంటారు. వాళ్లది లాహోర్. ఇద్దరికీ మంచి పేరొస్తుంటుంది. సర్మద్ హఠాత్తుగా పాటలు పాడడం ఆపేస్తాడు. ‘ఇస్లాం మతస్థుడెవరూ నీలా పాటలు పాడుతూ తిరగడు’ అని సర్మద్ మనసు మార్చేస్తాడు ఓ కార్యకర్త. ఇస్లాం పేరుతో వ్యక్తం అయ్యే ఇస్లాం వ్యతిరేక భావాలను దర్శకుడు చివర్లో కోర్టు సీన్లో చూపిస్తాడు. అవి రెండూ సినిమాలు పై రెండు సినిమాలకు, ప్రస్తుతం ఇస్లాం వ్యతిరేకిగా నిందను మోస్తున్న పదహారేళ్ల భారతీయ గాయని నహీద్ అఫ్రీన్‌కి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ నెల 25న అస్సాంలోని ఉడాలి సొనాయి బీబీ కాలేజీలో అఫ్రీన్ మ్యూజికల్ నైట్ ఉంది. అయితే అలాంటి ఆలోచనలేవీ పెట్టుకోవద్దని అస్సాంలోని 46 మంది ముల్లాలు ఏకమై అఫ్రీన్కు ఫత్వా జారీ చేశారు. మధ్య అస్సాంలోని హోజాయ్, నగావన్ జిల్లాల్లో ఈ ఫత్వా ఉన్న కరపత్రాలు పంపిణీ అయ్యాయి. ‘చుట్టూ మసీదులు, ఈద్గాలు, మదరసాలు, ముస్లింల సమాధులు ఉన్న ప్రాంతంలో మ్యూజికల్ నైట్ పేరుతో పాటలు పాడితే తరతరాల వరకు అల్లా ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది’ అని ముల్లాలు ఆ కరపత్రాల్లో హెచ్చరించారు. అఫ్రీన్ చిగురుటాకులా వణికిపోయింది. పాటంటే ఆ అమ్మాయికి ప్రాణం. వణికింది ఆ ప్రాణమే. 2015 సోనీ టీవీ మ్యూజికల్ రియాలిటీ షోలో అఫ్రీన్ ఫస్ట్ రన్నర్–అప్. వైష్ణవ ఆచార్యులు శ్రీమంత శంకరదేవ విరచించి, స్వరపరచిన కీర్తనలు అఫ్రీన్ గాత్రంలోంచి ఒలికి ఆమెకొక దేవరాగపుత్రికగా పునర్జన్మనిచ్చాయి. ఈ జన్మను నిలుపుకోడానికి ఇప్పుడు ఫత్వాలతో పోరాటానికి దిగింది అఫ్రీన్! దర్ద్ బేదర్దా... ‘అకీరా’ చిత్రంలో ‘రజ్రజ్కే’ అనే పాట ఉంది. ఆ పాట ‘దర్ద్ బేదర్దా... దర్ద్ బేదర్దా’ అనే చరణంతో మొదలౌతుంది. దర్ద్ బేదర్దా అంటే... దయలేని బాధ. ఆ పాట అర్థం ఇలా ఉంటుంది. జీవితమా... నవ్వూ నేనూ ఘర్షణ పడుతున్నాం రాజీకొచ్చే సూచనలేమీ నాకు కనిపించడం లేదు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరమే ప్రాణాలతో ఉంటాం. కటువుగా ఉండేదే కటుత్వం పనికిరాదని అంటోంది! ఎంత ఏడిపిస్తావో ఏడిపించు నన్నివాళ. ఎంత శిక్షిస్తావో శిక్షించు నన్ను ఇవాళ. బాధను భరించడానికి నా హృదయం సిద్ధమైంది. నా దారిలో పగిలిన గాజుముక్కలు పడి ఉన్నాయి. అవి నన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఆ బాధే నాకిప్పుడు ఉపశమన లేపనం... ...అంటూ ఈ పాట పూర్తవుతుంది. సినిమాలో... సమాజానికీ, ఆ అమాయకపు పల్లె పిల్లకు మధ్య జరిగిన ఘర్షణ ఇది. నిజ జీవితంలో ఈ పాట పాడింది ఎవరో కాదు... నహీద్ అఫ్రీనే! ప్రస్తుతం అఫ్రీన్ ఉన్న పరిస్థితికి, ఆ పాటలోని భావం చక్కగా సరిపోతుంది. మా ఊరి కోకిలమ్మ అఫ్రీన్ అస్సామీ. తేజ్‌పూర్‌లోని బిస్వనాథ్ చరియాలీ ఆమె ఊరు. టెన్త్ చదువుతోంది. అస్సామీ, హిందీ, బెంగాలీ భాషల్లో పాడుతుంది. మ్యూజిక్ షోలో ఫస్ట్ రన్నర్ అప్‌గా గెలిచాక, అఫ్రీన్కు సినిమా చాన్స్ వచ్చింది. ఇంట్లో పెద్దమ్మాయి. తమ్ముడు ఫయీజ్ అన్వర్. సినిమాలో పాడినప్పటి నుంచి అక్కను వాడు అబ్బురంగా చూస్తున్నాడు! ‘అక్కా.. స్కూల్లో అంతా నీ గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు’ అని ఇంటికి వచ్చీరాగానే ఉత్సాహంగా చెబుతున్నాడు. మునుపటిలా కాదు. అక్క చెప్పిన పనుల్నీ, చెప్పని పనుల్నీ చటుక్కున అందుకుని చేసేస్తున్నాడు. ఇక చరియాలీ గ్రామస్థులైతే ‘మా ఊరి కోకిలమ్మ’ అంటూ మురిసిపోతున్నారు. సీఎం ఫేవరేట్ సింగర్! అఫ్రీన్ తండ్రి డి.ఆర్.డి.ఓ.లో జూనియర్ ఇంజనీరు. ఆయనైతే మరీను. పుత్రికోత్సాహంలో ఉన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే తను అఫ్రీన్ అభిమానిని అని చెప్పుకుంటే ఏ తండ్రికి మాత్రం గొప్పగా ఉండదు! అయితే ఇప్పుడా ఉత్సాహం స్థానంలో ఆ కుటుంబంలో భయం, ఆందోళన వచ్చి చేరాయి. అఫ్రీన్‌కి వ్యతిరేకంగా జారీ అయిన ఫత్వాలోని అర్థం ఒకటే. ‘ఆ పిల్ల పాడడం ఆపకుంటే... ఆ ఇంటిని వెలి వెయ్యండి’ అని చెప్పడం. ముస్లిం సంప్రదాయ కుటుంబాలకు సహజంగానే ముల్లాలు చెప్పిందే వేదం అవుతుంది. అయితే అస్సాంలోని ముస్లిం కుటుంబాలకు ఆఫ్రీన్ గాత్రం కూడా వేదంలానే వినిపిస్తోంది. అఫ్రీన్ అభిమాని అయిన పూర్వపు ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, ప్రస్తుత ముఖ్యమంత్రి శరవానంద్ సోనోవాల్ పూర్తిగా అఫ్రీన్ వైపే ఉన్నారు. ఈ చిన్నారికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్థానిక యంత్రాంగానికి సి.ఎం. ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అంతేకాదు, సోనోవాల్ స్వయంగా అఫ్రీన్‌కి ఫోన్ చేసి మరీ ధైర్యం చెప్పారు! ‘నా స్వరం... దేవుడి వరం’ ‘మ్యూజిక్, డాన్స్, డ్రామా, థియేటర్... ఇవన్నీ షరియా చట్టాలకు వ్యతిరేకం. అల్లా క్షమించడు’ అని కరపత్రాల్లోని ముల్లాల హెచ్చరికను చూడగానే మొదట ఆఫ్రీన్ ఏడ్చేసింది. తర్వాత తేరుకుంది. ‘స్వరం నాకు దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని నేను వదులుకోలేను’ అంటోంది. అఫ్రీన్ తండ్రి కూడా కూతురికి పూర్తి మద్ధతు ఇస్తున్నారు. స్థానిక మత పెద్దలు, ముస్లిం ప్రముఖులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా అఫ్రీన్ వైపే ఉన్నాయి. అఫ్రీన్కు ముందు.. సుహానా నహీద్ అఫ్రీన్ కన్నా ముందు సుహానా సయీద్ అనే 22 ఏళ్ల కన్నడ ముస్లిం గాయని మతపరమైన ఒత్తిళ్లకు గురయ్యారు. కన్నడ టీవీ రియాలిటీ షోలో ఆమె హైందవ కీర్తనలను ఆలాపించడమే ఆ ఒత్తిళ్లకు ప్రధాన కారణం. సుహానా కుటుంబం కర్నాటకలోని షిమోగా జిల్లాలో ఉంటుంది. టీవీ షోలో సుహానా గాత్రానికి న్యాయనిర్ణేతలు ముగ్ధులై, హిందూ ముస్లిం ఐక్యతకు సుహానా ఒక సాక్ష్యం అని ప్రశంసించారు కూడా. అయితే ఆ ప్రశంసలేవీ సుహానా కుటుంబ సభ్యులను విమర్శల నుంచి కాపాడలేకపోయాయి. ‘సుహానా... నువ్వు మగవాళ్ల ముందు పాడి, ముస్లిం మత ప్రతిష్టకు మచ్చ తెస్తున్నావు. నీ అందాన్ని పర పురుషుల ఎదుట ప్రదర్శించడానికి నీ తల్లితండ్రులు అనుమతించారు. నీ వల్ల వాళ్లు స్వర్గానికి వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు. పరదాను గౌరవించని నువ్వు పరదాను వేసుకోవడం మానెయ్’ అని మంగుళూరు ముస్లిం పేరిట ఫేస్బుక్లో సుహానాపై మండిపడుతూ ఒక పోస్టు ప్రత్యక్షమయింది! అయితే అదే పోస్టులో సుహానాను సమర్థిస్తూ కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి. ఉదారవాదులైన ముస్లింలు మాత్రం ఇప్పుడు నహీద్ అఫ్రీన్‌ను వెనకేసుకు వచ్చినట్లే, అప్పుడు సుహానా సయీద్‌ను కూడా అక్కున చేర్చుకున్నారు. పొడవాటి జుట్టున్నయువరాణి సోనీ రియాలిటీ మ్యూజిక్ షోలో తనని తను పరిచయం చేసుకుంటోంది నహీద్ అఫ్రీన్. ‘‘అనగనగా ఒక యువరాణి. ఆమె పేరు రాపుంజల్. పెద్ద జుట్టుతో భలే అందంగా ఉండేది. అందరినీ ఆకట్టుకునేది. ఇతర రాజ్యాల యువరాణులు ఆమె జుట్టు రహస్యం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించేవారు. కానీ ఆ రహస్యాన్ని రాపుంజల్ ఎప్పుడూ బయట పెట్టలేదు. ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోయింది. నాదీ పెద్ద జుట్టే. నాకూ యువరాణి కావాలని ఆశ. స్వరాల యువరాణి కావాలి. ఏ సంగీత పోటీలకు వెళ్లినా జడ్జీలతో సహా అంతా అందమైన నా పొడవాటి జుట్టును ప్రశంసించేవాళ్లే. నా పేరు నహీద్ అఫ్రీన్. ఈ దేశపు రాపుంజల్ని! సంగీతం అంటే ప్రాణం. యాక్టింగ్, డ్రాయింగ్, టేబుల్ టెన్నిస్... అన్నిటికన్నా అల్లరి చేయడం అంటే చాలా ఇష్టం ’ అని పరిచయం పూర్తి చేసుకుని, తను ఎంపిక చేసుకున్న బెంగాలీ సింగర్ యాష్కింగ్ పాటను పాడింది. పరిచయం, పాట పూర్తవగానే సల్మాన్ ఖాన్ ఎగ్జయిట్ అయిపోయాడు. రియాలిటీ షో జడ్జీలలో ఒకరు ఆయన. ‘‘శభాష్ నహీద్. ఈ పాటతో ఈ రోజు నువ్వు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లావు. శభాష్’’ అన్నాడు. ఇంకో పాటకు ఇంకో జడ్జి ‘‘నువ్వు స్వరాల ఖజానా. ఎక్స్ప్రెషన్స్ ఖజానా. పెర్ఫార్మెన్స్ ఖజానా... ఎన్నని చెప్పమంటావు? నువ్వే ఒక ఖజానా! మంచి భవిష్యత్తు ఉంది నీకు. ఆల్ ది బెస్ట్’’ అన్నారు. మిగతా ఇద్దరు జడ్జీలూ అఫ్రీన్కు ఆశీస్సులు అందించారు. అఫ్రీన్ ఇటీవల పాడిన పాటల్లో కొన్ని తీవ్రవాదాన్ని వ్యతిరేకించేవి కూడా ఉన్నాయి. ‘‘బహుశా ముల్లాల ఆగ్రహానికి అదే కారణం కావచ్చు’ అని భావిస్తున్న పోలీసులు ఆ కోణంలోంచి కూడా విచారణ జరుపుతున్నారు. అమ్మానాన్నలతో అఫ్రీన్ -
డివైడ్ టాక్ వచ్చినా స్థిరంగా కలెక్షన్లు!
దక్షిణాది టాప్ డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన తాజా బాలీవుడ్ సినిమా 'అకీరా'. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన ఈ లేడి ఒరియంటెడ్ సినిమా ఇటు ప్రేక్షకుల నుంచి, అటు విమర్శకుల నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. ప్రారంభంలో ఈ సినిమాకు బాగా నిరాశాపూరితంగా వసూళ్లు దక్కినా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. సెప్టెంబర్ 2న విడుదలైన ఈ సినిమా మంగళవారం కూడా చెప్పుకోదగినస్థాయిలో వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఐదు రోజుల్లో రూ. 22.45 కోట్లను ఈ సినిమా తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం, సోనాక్షి, మురగదాస్ కు మంచి ఇమేజ్ ఉండటం ఈ సినిమా థియేటర్లవైపు ప్రేక్షకులను నడిపిస్తోంది. 'అకీరా' తొలిరోజు కేవలం రూ. 5.15 కోట్లు సాధించి నిరాశపరచగా, రెండోరోజు రూ. 5.30 కోట్లు వసూలు చేసింది. మూడోరోజు వసూళ్లు గణనీయంగా పెరిగి.. రూ.6.20 కోట్లు రాబట్టింది. ఇక సోమవారం రూ. 3.40 కోట్లు రాబట్టగా, మంగళవారం రూ. 2.40 కోట్లు రాబట్టిందని, మొత్తంగా భారత్ లో ఈ సినిమా రూ. 22.45 కోట్లు రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు. రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి సేఫ్ ప్రాజెక్టు అయ్యే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. మురగదాస్‌కు సోనాక్షి సిన్హాతో ఇది రెండో సినిమా. అక్షయ్‌కుమార్, సోనాక్షి జంటగా ఆయన తీసిన 'హాలీడే: ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతకుముందు ఆయన అమీర్‌ఖాన్‌తో తీసిన 'గజనీ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
మూడో రోజు బాగా పెరిగిన కలెక్షన్లు!
భారీ యాక్షన్ సినిమాల్ని తెరకెక్కించే దర్శకుడు మురగదాస్.. సోనాక్షి సిన్హాతో ఆయన తీసిన లేడి ఒరియంటెడ్ సినిమా 'అకీరా' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ పోరాట సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న 'అకీరా' తొలిరోజు కేవలం రూ. 5.15 కోట్లు సాధించి నిరాశపరచగా, రెండోరోజు రూ. 5.30 కోట్లు వసూలు చేసింది. మూడోరోజు మాత్రం ఈ సినిమా వసూళ్లు గణనీయంగా పెరిగాయి. మూడోరోజైన ఆదివారం ఈ సినిమా ఏకంగా రూ.6.20 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా తొలి వీకెండ్లో రూ. 16 కోట్లు కొల్లగొట్టింది. దక్షిణాది డైరెక్టర్ అయిన మురగదాస్‌కు సోనాక్షి సిన్హాతో ఇది రెండో సినిమా. అక్షయ్‌కుమార్, సోనాక్షి జంటగా ఆయన తీసిన 'హాలీడే: ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతకుముందు ఆయన అమీర్‌ఖాన్‌తో తీసిన 'గజనీ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
'సరైన సమయంలో నాజీవితంలోకి..'
న్యూఢిల్లీ: తన జీవితంలో సరైన సమయంలో 'అకీరా కథ' వచ్చిందని ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా చెప్పింది. ప్రముఖ దర్శకుడు మురుగుదాస్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్లో వస్తున్న అకీరా చిత్రంలో సోనాక్షి ప్రధాన పాత్ర పోషించింది. అకీరాలో నటించడం ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పింది. తాను ఒక చాలెంజింగ్ చేసిన పాత్ర ఇదని సోనాక్షి వెల్లడించింది. ప్రస్తుతం తన జీవితం ఉన్న పరిస్థితుల్లో అకీరా కథ రావడం నిజంగా అదృష్టం అని, చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. మురుగదాస్ గొప్పగొప్ప నటులతో చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడని, ఆయన ఇంతకుముందు ఒక మహిళను ప్రధాన పాత్రదారిగా పెట్టి చిత్రాలు చేయలేదని, అలాంటాయన నేరుగా తన వద్దకు అకీరా చిత్రం తీసేందుకు రావడం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని సోనాక్షి ఆనందం వ్యక్తం చేసింది. నూర్ అనే చిత్రంలో కూడా చేస్తున్నాని, తన జీవితంలోనే బహుశా ఎక్కువగా ఇష్టపడే పాత్రలు ఈ రెండు చిత్రాలవే ఉంటాయని సోనాక్షి చెప్పుకొచ్చింది. -
ఆమె మగాడిలా ఫైట్ చేసింది
చెన్నై: అకీరా సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా యాక్షన్ సీన్లను అద్భుతంగా చేసిందని, మగవాడిలా ఫైట్స్ చేసిందని తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ప్రశంసించాడు. మురుగదాస్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా అకీరా వచ్చే నెల 2న విడుదల కానుంది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, అనురాగ్ కశ్యప్, కొంకనా సేన్ శర్మ నటించారు. 'హీరోలు ప్రధాన పాత్రలుగా ఉన్నా సినిమాలను మాత్రమే నేను ఇంతకుముందు తీశాను. హీరోయిన్ (సోనాక్షి) టైటిల్ రోల్ పోషించిన సినిమాకు దర్శకత్వం వహించడం విభిన్న అనుభూతిని కలిగించింది. ఈ యాక్షన్ సినిమాలో నటించేందుకు సోనాక్షి ఏడెనిమిది నెలలు శిక్షణ తీసుకుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. హెయిర్ కట్ చేయించుకుంది. వేరే ఆఫర్లను అంగీకరించకుండా అంకితభావంతో ఈ సినిమాలో నటించింది. మగవాడిలా ఫైట్ చేసింది. పంచ్‌లు విసిరింది. అకీరాగా సోనాక్షి నటన నన్ను అబ్బురపరిచింది' అని మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. -
ఫెంటాస్టిక్ ఫోర్
కథలు కంచిలో దొరుకుతాయో లేదో కాని బాలీవుడ్లో మాత్రం కచ్చితంగా దొరుకుతాయి. ఒకప్పుడు ఠాకూర్ ఘరానా కథలు, బందిపోట్ల కథలు, సంపన్న కుటుంబాల కథలతో మూస సినిమాలు తయారయ్యే బాలీవుడ్లో ఇప్పుడు కొత్త కథల వెతుకులాట, అందుకు అవసరమైతే రిస్క్ తీసుకునే తత్వం పెరిగింది. మంచి కథ... ఒప్పించే నెరేషన్... ఇవి రెండూ ఉంటే సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయని నమ్ముతున్నారు. ప్రేక్షకులు కూడా ఆ మాట నిజం చేస్తున్నారు. ‘వెయిటింగ్’, ‘తీన్’, ‘ఉడ్తా పంజాబ్’, ‘మదారి’... ఇవన్నీ ఇటీవల భిన్నమైన కథాంశాలతో బాలీవుడ్లో మెరిసిన సినిమాలు. నిన్న మొన్న విడుదలైన ‘హ్యాపీ భాగ్ జాయేగీ’లో ఇష్టం లేని పెళ్లి నుంచి పారిపోదామనుకున్న పెళ్లికూతురు సరాసరి పాకిస్తాన్లో తేలుతుంది. ఇక అక్కణ్ణుంచి ఇండియా ఎలా చేరిందనే అంశాన్ని నవ్వులతో చెప్పడం వల్ల ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు చివరి వారంలో సెప్టెంబర్ మొదటి వారాల్లో రిలీజ్ కాబోతున్న నాలుగు సినిమాల కథాకమామీషు... అకీరా సెప్టెంబర్ 2న విడుదల. ఇది తమిళ సినిమా ‘మౌనగురు’కి రీమేక్. సాధారణంగా దర్శకుడు మురుగదాస్ సొంత కథలతో సినిమా తీస్తాడు. కాని కరుణానిధి మనవడు అరుళ్‌నిధి నటించిన ఈ సినిమా ఐదేళ్ల క్రితానిది. అయినప్పటికీ ఇందులోని కథ, కథనం ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేది కనుక మురుగదాస్ హిందీలో సోనాక్షీతో రీమేక్ చేశాడు. తమిళంలో హీరో పాత్రను హిందీలో హీరోయిన్గా మార్పు చేయడం విశేషం. వాస్తవానికి ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. నారా రోహిత్ హీరో. కె.ఎస్.రామారావు సమర్పణ. కిన్ను నిర్మాత. పేరు ‘శంకర’. అయితే ఎందుకనో విడుదలలో జాప్యం ఉంది. ఈ సినిమాకు హాలీవుడ్ మూలం ‘ఫార్గో’ అని చెప్పవచ్చు. అందులో దివాళా తీసిన ఒక భర్త తన ఆర్థిక అవసరాల కోసం సొంత భార్యనే కిడ్నాప్ చేయమంటాడు. కాని ఎంతో సింపుల్ అనుకున్న ఆ విషయం చాలా పాశవికమైన హత్యలకు దారి తీస్తుంది. ‘అకీరా’లో ఒక కారు యాక్సిడెంట్లో దొరికిన భారీ డబ్బును పోలీసులు సొంతం చేసుకుంటారు. కాని ఆ ఒక్క సంఘటన అనేక దారుణాలకు కారణం అవుతుంది. ఆ దారుణాలలో హీరోయిన్ చిక్కుకుంటుంది. ఆసక్తికరమైన ఈ కథను వెండితెర మీద చూడాల్సిందే. బార్ బార్ దేఖో సెప్టెంబర్ 9న విడుదల. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’తో పరిచయమైన సిద్ధార్థ మల్హోత్రా ఇందులో హీరో అయితే కుర్ర హీరో అయినప్పటికీ పక్కన నటించడానికి అంగీకరించిన హీరోయిన్ కత్రినాకైఫ్. ‘లైఫ్ ఆఫ్ పై’ వంటి గొప్ప సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేసిన నిత్య మెహ్రా అనే కొత్త దర్శకురాలు రాసుకున్న ఈ కథ కరణ్ జోహార్‌ను కూడా ఆకట్టుకుని నిర్మాతగా మారేలా చేసింది. మొదట ఈ సినిమాలో హీరోగా ఆమిర్‌ఖాన్ గానీ హృతిక్ రోషన్ గానీ నటిస్తారనుకున్నారు. చివరకు సిద్ధార్థకు దక్కింది. కొంచెం సైంటిఫిక్ టచ్ ఉన్న ఈ సినిమాలో హీరో వయసు రోజులు గడిచే కొద్దీ మారిపోతూ ఉంటుంది. ఒక్కరోజులో పదహారు సంవత్సరాలు గడిచిపోతాయి. దానికి తగినట్టుగా అతడి ప్రేమ కథ కూడా మారిపోతూ ఉంటుంది. తనకే తెలియని తన గతాన్ని వెనక్కి తిప్పడానికి అతడేం చేశాడనేది కథ. దీని ప్రోమోకు విశేషమైన ఆదరణ లభించింది. రవి కె.చంద్రన్ వంటి సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ పని చేయడం మరో ఆకర్షణ. కత్రినా కొంచెం అరమరికలు లేకుండా తన సౌందర్యాన్ని ప్రదర్శించిందని భోగట్టా. అభిమానులు అందుకోసం కూడా ఎదురుచూస్తున్నారు. ఫ్రీకీ అలీ సెప్టెంబర్ 9న విడుదల. నవాజుద్దీన్ సిద్దిఖీ ఏ ముహూర్తాన ‘బజరంగీ భాయ్‌జాన్’ చేశాడో కానీ సల్మాన్ మనసును ఇట్టే గెలిచేశాడు. సల్మాన్ తమ్ముడు సొహైల్‌ఖాన్ ఇప్పుడు సిద్దిఖీని పెట్టి ‘ఫ్రీకీ అలీ’ అనే సినిమా తీశాడు. సల్మాన్ సమర్పకుడు. హాలీవుడ్ సినిమా ‘హ్యాపీ గిల్మోర్’ ఆధారంగా తీసిన ఈ చిత్రం ఒక పేవ్మెంట్ వ్యాపారి పెద్ద గోల్ఫ్స్టార్ కావడం గురించి హాస్య రసస్పోరకంగా చర్చిస్తుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ పేవ్మెంట్ మీద చడ్డీలు అమ్ముతుంటాడు. పార్ట్‌టైమ్‌గా ఒక దాదాగారితో వెళ్లి రౌడీ మామూళ్లు వసూలు చేస్తుంటాడు. కాని అతడికి క్రికెట్లో షాట్స్ కొట్టే సహజమైన టాలెంట్ ఉంటుంది. ఒకరోజు ఒక గోల్ఫ్ కోర్టులో ఒక పెద్ద మనిషి దగ్గర రౌడీ మామూలుకు వెళ్లిన సిద్ధిఖీ అతడు ఎంతకూ షాట్ కొట్టకపోవడం గురించి బూతు జోక్ వేస్తాడు. దాంతో ఆయన నీకు అంత సత్తా ఉంటే నువ్వు షాట్ కొట్టి చూపించు అంటాడు. సిద్దిఖీ కచ్చితంగా షాట్ కొడతాడు. అందరూ హతాశులవుతారు. అప్పటి నుంచి సిద్ధిఖీకి గోల్ఫ్ స్టార్ కావాలని ఉంటుంది. అందుకు ఎటువంటి అడ్డంకులు వచ్చాయనేది కథ. పింక్ సెప్టెంబర్ 16న విడుదల. అమితాబ్‌తో ‘పికూ’ తీసి పెద్ద హిట్ కొట్టిన సూజిత్ సర్కార్, ఇప్పుడు అనిరుధ్‌రాయ్ చౌదురి దర్శకత్వంలో ‘పింక్’ పేరుతో అమితాబ్ ముఖ్యపాత్రగా ఈ సినిమా నిర్మించాడు. సమాజంలో జరుగుతున్న స్త్రీల పై అత్యాచారాలు నేపథ్యం. ముగ్గురమ్మాయిలు ఒకరాత్రి షికారుకెళుతుంటే ముగ్గురు కుర్రాళ్లు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తారు. కేస్ అవుతుంది. అయితే పలుకుబడి ఉన్న ఈ కుర్రాళ్ల తరుఫువారు ఆ అమ్మాయిల్ని అప్రతిష్టపాలు చేయాలని వారిపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేస్తారు. దీనిని ఖండించడానికి అమ్మాయిలు చాలా అవస్థ పడాల్సి వస్తుంది. ‘బైపోలార్ డిజార్డర్’, అంటే తరచూ మారిపోయే భావావేశాల జబ్బుతో బాధపడే లాయర్ అయిన అమితాబ్ వీరిని ఈ కేసు నుంచి ఎలా బయటపడేశాడన్నది కథ. తాప్సీ ముఖ్యపాత్రను పోషించింది. ప్రోమో రిలీజైన వెంటనే చాలామంది బాలీవుడ్ సూపర్స్టార్లు కథాంశాన్ని మెచ్చుకున్నారు. ఈ సంవత్సరం ఈ సినిమా మంచి ఫలితాలను రాబడుతుందని అందరి ఆకాంక్ష. ఈ నాలుగు సినిమాలే కాదు... ఎం.ఎస్.ధోని, రాక్ ఆన్ 2, కహానీ 2, దంగల్ వంటి సినిమాలు ఈ సంవత్సరాంతం వరకూ ప్రేక్షకులను చేరనున్నాయి. తెలుగు సినిమాలు ఈ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాలి. కొత్త రకం కథే ఇప్పుడు విజయానికి పాస్‌పోర్ట్. -
అకీరాగా సోనాక్షి అదుర్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇప్పుడు లేడి ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అయితే ఎక్కువ మంది ఎమోషనల్ డ్రామాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటే.., స్టార్ వారసురాలు సోనాక్షి సిన్హా మాత్రం యాక్షన్ అవతార్‌లో అదరగొడుతోంది. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన బాలీవుడ్ యాక్షన్ డ్రామా అకీరా. సోనాక్షి సిన్మా లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పూర్తిగా సోనాక్షిని యాక్షన్ స్టార్‌గా ప్రజెంట్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ అయిన 15 గంటల్లో దాదాపు 9 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ఈ ట్రైలర్‌ను వీక్షించారు. తమిళ్లో ఘనవిజయం సాధించిన మౌనగురు సినిమాలోనే హీరో పాత్రను లేడీ క్యారెక్టర్‌గా మార్చి... మురుగదాస్, ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. -
టాలీవుడ్ కన్నా ముందు బాలీవుడ్లో..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న చాలా మంది నటులు బాలీవుడ్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు కూడా ఈ ప్రయత్నం చేయగా, ఈ జనరేష్ హీరోలు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రానా లాంటి వారు బాలీవుడ్లో అడుగు పెట్టాగా, మరికొంత మంది సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. కమర్షియల్ సక్సెస్ సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో నారా రోహిత్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడట. చాలా కాలం క్రితం రోహిత్ హీరోగా శంకర సినిమా పూర్తయ్యింది. అయితే తెలుగులో ఇంత వరకు రిలీజ్‌కు నోచుకోని ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ హిట్ సినిమా మౌనగురుకు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. అయితే ఇదే కథను కొద్ది పాటి మార్పులతో అకీరా పేరుతో బాలీవుడ్ తెరకెక్కించారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, అకీరా సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ బాలీవుడ్ ఎంట్రీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. -
బాలీవుడ్‌కి నారావారి అబ్బాయి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న చాలా మంది నటులు బాలీవుడ్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు కూడా ఈ ప్రయత్నం చేయగా, ఈ జనరేష్ హీరోలు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రానా లాంటి వారు బాలీవుడ్లో అడుగు పెట్టాగా, మరికొంత మంది సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. కమర్షియల్ సక్సెస్ సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో నారా రోహిత్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడట. చాలా కాలం క్రితం రోహిత్ హీరోగా శంకర సినిమా పూర్తయ్యింది. అయితే తెలుగులో ఇంత వరకు రిలీజ్‌కు నోచుకోని ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ హిట్ సినిమా మౌనగురుకు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. అయితే ఇదే కథను కొద్ది పాటి మార్పులతో అకీరా పేరుతో బాలీవుడ్ తెరకెక్కించారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, అకీరా సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ బాలీవుడ్ ఎంట్రీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. -
ఈ అకీరా.. ఎవరినీ క్షమించదు!!
‘ఆమె పోరాటానికి దిగింది. ఇక ఎవరినీ క్షమించదు’ అంటూ అకీరా ఫస్ట్ పోస్టర్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో తెరకెక్కించిన ఈ సినిమా తొలి పోస్టర్‌ను సోమవారం ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ పోస్టర్లో సోనాక్షి సిన్హాతోపాటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటి కోంకణ్ సేన్ కూడా ఉన్నారు. మహిళా ప్రాధాన్యమున్న కథతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ‘అకీరా’గా బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి తొలిసారి యాక్షన్ స్టంట్స్ చూపించబోతున్నది. 2011లో తమిళంలో వచ్చిన ‘మౌనగురు’ సినిమాకు రీమేక్‌గా హిందీలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా మొదట జూలై 4న విడుదలవుతుందని ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడంతో సెప్టెంబర్ 2న ప్రేక్షకులు ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. She will fight back. No one will be forgiven! Heres the 1st poster of #Akira & more good news: #AkiraTrailerOnJuly4 pic.twitter.com/nkwiSsYGyL — AKIRA/Sonakshi Sinha (@sonakshisinha) June 28, 2016 -
మురుగదాస్ సినిమా రిలీజ్‌కు రెడీ
తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ అకీరా. గజిని, హలీడే లాంటి సినిమాలతో ఉత్తరాదిలో కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ మురుగదాస్.. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు తొలిసారిగా ఓ రీమేక్ సినిమాను డైరెక్ట్ చేసిన మురుగదాస్, తమిళ సూపర్ హిట్ సినిమా మౌనగురు చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చాలాకాలం కిందటే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఈ సినిమాపై ఎలాంటి సమాచారం ఇవ్వని దర్శకుడు మహేష్‌తో తీసే సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. దీంతో అకీరా ఆగిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. అలాంటి వదంతులకు చెక్ పెడుతూ సెప్టెంబర్ 2న అకీరా రిలీజ్ అవుతుందంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మురుగదాస్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం సోనాక్షి సిన్హా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ నటించింది. అందుకోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. 2015 మార్చ్‌లో మొదలైన అకీరా ఏడాదిన్నర తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రేణుదేశాయ్
పూణె: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ శుక్రవారం ఒకే రోజు మూడు పండుగలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముద్దుల కొడుకు అకీరా నందన్ పుట్టిన రోజు ఒకటి కాగా. మరో ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల. దీంతోపాటు తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది. ఈ సందర్భంగా ఏప్రిల్ 8కి సంబంధించి మధుర జ్ఞాపలకాలను రేణు దేశాయ్ నెమరు వేసుకున్నారు. ముద్దుల కొడుకు అకీరా నందన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. కుమారునితో ఉన్న అనుబంధాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. '2004 ఏప్రిల్ 8న నిన్ను ఓ బుజ్జి బాబుగా నా చేతిలోకి మొదటిసారిగా తీసుకున్నా. అప్పుడే 12 ఏళ్లు నిండి నా అంత పెద్దవాడివయ్యావు. ఆధ్యని ప్రేమగా చూసుకునే అన్నగా, నాకో మంచి కొడుకుగా మా మనసులు దోచుకున్నావు. నువ్వు నా కొడుకుగా లభించడం నా అదృష్టం. తల్లిగా ఎంతగానో గర్వపడుతున్నా. నా కొడుకు చూస్తుండగానే పెద్దవాడవుతున్నాడు. నా భుజాల దగ్గరకు వచ్చేశాడు. ఐ లవ్ యూ అకీరా.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్' అంటూ రాసి ఉన్న ఫోటోను రేణూ దేశాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్, అక్కినేని అఖిల్ కు రేణు దేశాయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. యాదృచ్ఛికంగా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అఖిల్, అర్జున్, అకీరా నందన్ల పేర్లు 'ఏ' తోనే ప్రారంభమౌతున్నాయని పేర్కొన్నారు. అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. I love you Akiriiii ❤️ #HappyBirthdayAkira pic.twitter.com/sxjdzkX4tj — renu (@renuudesai) 8 April 2016 -
లక్కీ చాన్స్..
‘కాంచన’ ఫేమ్ లక్ష్మీరాయ్ తెలుగు, తమిళ భాషల్లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆమెకు లక్కీగా హిందీలో నటించే అవకాశం వచ్చింది. అది కూడా మురుగుదాస్ లాంటి పెద్ద దర్శకుడి సినిమా. సోనాక్షి సిన్హాతో ఆయన తీస్తున్న ‘అకిరా’లో లక్ష్మీరాయ్ అతిథిపాత్ర చేస్తున్నారు. -
రియల్ ఇన్ రీల్!
అలనాటి సూపర్ హీరో శత్రుఘన్ సిన్హా కుమార్తెగానే అరంగేట్రం చేసినా ఆపై తన నటనతో పర్సనల్ ఐడెంటీని తెచ్చుకుంది బాలీవుడ్ సుందరి సోనాక్షి సిన్హా. ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్నేళ్ల తరువాత రీల్ లైఫ్‌లో కూడా ఇద్దరూ తండ్రీ, కూతుళ్లుగా చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అకీరా’లో ఈ సోగకళ్ల సుందరి కీ రోల్ చేస్తోంది. అందు కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తోంది. ఇందులో సోనాక్షి తండ్రిగా శత్రుఘన్ సిన్హా నటిస్తున్నాడు. చిత్రంలో సోనాక్షి చిన్న వయసులో ఉన్నప్పడే ఫాదర్ చనిపోతాడట. అంటే శత్రు చైల్డ్ ఆర్టిస్టుతో కలసి సన్నివేశాలు పంచుకుంటాడని, తన సొంత కుమార్తెతో సీన్లు ఉండవని ఓ ఆంగ్ల పత్రిక కథనం. కాకపోతే... అమ్మడు పెద్దయిన తరువాత నాన్న మాటలు వెనకాల నుంచి వినిపిస్తూ ఉంటాయట! -
సోనాక్షి నెక్ట్స్ సినిమా పేరు...అకీరా
చెన్నై: బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా నెక్ట్స్ సినిమా పేరు ఖరారైంది. మురుగదాస్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియో నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ సినిమా పేరు అకిరా అని సోనాక్షి ట్వీట్ చేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా ఒక ప్రముఖ పాత్రలో నటించబోతున్న ఈ సినిమా మురుగదాస్ కు హిందీలో మూడవ సినిమా కావడం విశేషం. తమిళ హిట్ మూవీ మౌనగురును మురుగదాస్ హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
తెలుగులో పవన్ కల్యాణ్ కొడుకు సినిమా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా త్వరలో వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు. అకీరా తన తల్లి రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మరాఠీ సినిమా 'ఇష్క్ వాలా లవ్'లో అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. పవన్ అభిమానుల కోసం ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. రేణు దేశాయ్ ఫేస్బుక్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. 'ఇష్క్ వాలా లవ్ చిత్రం తెలుగు డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తెలుగు చిత్రం ట్రైలర్‌ను త్వరలో విడుదల చేస్తాం' అని రేణు దేశాయ్ తెలిపారు. రేణు పవన్‌తో విడిపోయినా అతణ్ని ప్రశంసిస్తూ తరచూ సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తుంటారు. అకీరా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫొటోలను రేణు గతంలో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. -
వెండితెరపై పవన్ కల్యాణ్ కొడుకు
పవన్ కల్యాణ్ అభిమానులకో శుభవార్త. పవన్ గారాలబ్బాయి అకీరాను త్వరలో వెండితెరపై చూడవచ్చు. పవన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న రేణు దేశాయ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మరాఠీ సినిమాలో అకీరా అతిథి పాత్రలో నటించాడు. అకీరా తెరంగేట్రం గురించి రేణు ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు. 'ఇష్క్ వాలా లవ్ చిత్రంలో అకీరా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. నేను దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న చిత్రంలో అకీరా వెండితెరకు పరిచయం కావడం ఓ తల్లిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది' అని రేణు ట్వీట్ చేశారు. పవన్ అభిమానులకు ఆశ్చరకర విషయం చెబుతానని ఇంతకుముందే ప్రకటించిన రేణు.. అకీరా తెరంగేట్రం గురించి వెల్లడించారు. అకీరా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫొటోలను రేణు గతంలో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పవన్‌తో విడిపోయినా రేణు అతణ్ని ప్రశంసిస్తూ తరచూ సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తుంటారు.