రియల్ ఇన్ రీల్! | Shatrughan Sinha to play Sonakshi Sinha's father in 'Akira', but won't share screen space | Sakshi
Sakshi News home page

రియల్ ఇన్ రీల్!

Published Thu, Mar 26 2015 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

రియల్ ఇన్ రీల్!

రియల్ ఇన్ రీల్!

అలనాటి సూపర్ హీరో శత్రుఘన్ సిన్హా కుమార్తెగానే అరంగేట్రం చేసినా ఆపై తన నటనతో పర్సనల్ ఐడెంటీని తెచ్చుకుంది బాలీవుడ్ సుందరి సోనాక్షి సిన్హా. ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్నేళ్ల తరువాత రీల్ లైఫ్‌లో కూడా ఇద్దరూ తండ్రీ, కూతుళ్లుగా చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అకీరా’లో ఈ సోగకళ్ల సుందరి కీ రోల్ చేస్తోంది.

అందు కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తోంది. ఇందులో సోనాక్షి తండ్రిగా శత్రుఘన్ సిన్హా నటిస్తున్నాడు. చిత్రంలో సోనాక్షి చిన్న వయసులో ఉన్నప్పడే ఫాదర్ చనిపోతాడట. అంటే శత్రు చైల్డ్ ఆర్టిస్టుతో కలసి సన్నివేశాలు పంచుకుంటాడని, తన సొంత కుమార్తెతో సీన్లు ఉండవని ఓ ఆంగ్ల పత్రిక కథనం. కాకపోతే... అమ్మడు పెద్దయిన తరువాత నాన్న మాటలు వెనకాల నుంచి వినిపిస్తూ ఉంటాయట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement