ఈ అకీరా.. ఎవరినీ క్షమించదు!! | Sonakshi Sinha looks fierce in Akira 1st poster | Sakshi
Sakshi News home page

ఈ అకీరా.. ఎవరినీ క్షమించదు!!

Published Tue, Jun 28 2016 5:14 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

ఈ అకీరా.. ఎవరినీ క్షమించదు!!

ఈ అకీరా.. ఎవరినీ క్షమించదు!!

‘ఆమె పోరాటానికి దిగింది. ఇక ఎవరినీ క్షమించదు’  అంటూ అకీరా ఫస్ట్ పోస్టర్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సోనాక్షి సిన్హా లీడ్ రోల్‌లో తెరకెక్కించిన ఈ సినిమా తొలి పోస్టర్‌ను సోమవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సోనాక్షి సిన్హాతోపాటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటి కోంకణ్ సేన్ కూడా ఉన్నారు.

మహిళా ప్రాధాన్యమున్న కథతో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ‘అకీరా’గా బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి తొలిసారి యాక్షన్ స్టంట్స్‌ చూపించబోతున్నది. 2011లో తమిళంలో వచ్చిన ‘మౌనగురు’  సినిమాకు రీమేక్‌గా హిందీలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా మొదట జూలై 4న విడుదలవుతుందని ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడంతో సెప్టెంబర్ 2న ప్రేక్షకులు ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement