ఆమె మగాడిలా ఫైట్ చేసింది | Sonakshi fought like a man in 'Akira': A.R. Murugadoss | Sakshi
Sakshi News home page

ఆమె మగాడిలా ఫైట్ చేసింది

Published Tue, Aug 30 2016 3:28 PM | Last Updated on Tue, Oct 2 2018 3:27 PM

ఆమె మగాడిలా ఫైట్ చేసింది - Sakshi

ఆమె మగాడిలా ఫైట్ చేసింది

చెన్నై: అకీరా సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా యాక్షన్ సీన్లను అద్భుతంగా చేసిందని, మగవాడిలా ఫైట్స్ చేసిందని తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ప్రశంసించాడు. మురుగదాస్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా అకీరా వచ్చే నెల 2న విడుదల కానుంది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, అనురాగ్ కశ్యప్, కొంకనా సేన్ శర్మ నటించారు.

'హీరోలు ప్రధాన పాత్రలుగా ఉన్నా సినిమాలను మాత్రమే నేను ఇంతకుముందు తీశాను. హీరోయిన్ (సోనాక్షి) టైటిల్ రోల్ పోషించిన సినిమాకు దర్శకత్వం వహించడం విభిన్న అనుభూతిని కలిగించింది. ఈ యాక్షన్ సినిమాలో నటించేందుకు సోనాక్షి ఏడెనిమిది నెలలు శిక్షణ తీసుకుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. హెయిర్ కట్ చేయించుకుంది. వేరే ఆఫర్లను అంగీకరించకుండా అంకితభావంతో ఈ సినిమాలో నటించింది. మగవాడిలా ఫైట్ చేసింది. పంచ్లు విసిరింది. అకీరాగా సోనాక్షి నటన నన్ను అబ్బురపరిచింది' అని మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement