'సరైన సమయంలో నాజీవితంలోకి..' | 'Akira' came at the right time of my career: Sonakshi | Sakshi
Sakshi News home page

'సరైన సమయంలో నాజీవితంలోకి..'

Published Wed, Aug 31 2016 12:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

'సరైన సమయంలో నాజీవితంలోకి..' - Sakshi

'సరైన సమయంలో నాజీవితంలోకి..'

న్యూఢిల్లీ: తన జీవితంలో సరైన సమయంలో 'అకీరా కథ' వచ్చిందని ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా చెప్పింది. ప్రముఖ దర్శకుడు మురుగుదాస్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్లో వస్తున్న అకీరా చిత్రంలో సోనాక్షి ప్రధాన పాత్ర పోషించింది. అకీరాలో నటించడం ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పింది. తాను ఒక చాలెంజింగ్ చేసిన పాత్ర ఇదని సోనాక్షి వెల్లడించింది. ప్రస్తుతం తన జీవితం ఉన్న పరిస్థితుల్లో అకీరా కథ రావడం నిజంగా అదృష్టం అని, చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.

మురుగదాస్ గొప్పగొప్ప నటులతో చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడని, ఆయన ఇంతకుముందు ఒక మహిళను ప్రధాన పాత్రదారిగా పెట్టి చిత్రాలు చేయలేదని, అలాంటాయన నేరుగా తన వద్దకు అకీరా చిత్రం తీసేందుకు రావడం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని సోనాక్షి ఆనందం వ్యక్తం చేసింది. నూర్ అనే చిత్రంలో కూడా చేస్తున్నాని, తన జీవితంలోనే బహుశా ఎక్కువగా ఇష్టపడే పాత్రలు ఈ రెండు చిత్రాలవే ఉంటాయని సోనాక్షి చెప్పుకొచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement