బాలీవుడ్కి నారావారి అబ్బాయి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న చాలా మంది నటులు బాలీవుడ్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు కూడా ఈ ప్రయత్నం చేయగా, ఈ జనరేష్ హీరోలు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రానా లాంటి వారు బాలీవుడ్లో అడుగు పెట్టాగా, మరికొంత మంది సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. కమర్షియల్ సక్సెస్ సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో నారా రోహిత్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడట. చాలా కాలం క్రితం రోహిత్ హీరోగా శంకర సినిమా పూర్తయ్యింది. అయితే తెలుగులో ఇంత వరకు రిలీజ్కు నోచుకోని ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తమిళ హిట్ సినిమా మౌనగురుకు రీమేక్గా రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. అయితే ఇదే కథను కొద్ది పాటి మార్పులతో అకీరా పేరుతో బాలీవుడ్ తెరకెక్కించారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, అకీరా సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ బాలీవుడ్ ఎంట్రీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.