Shankara
-
సాగుబడి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు!
మన దేశంలో 28.7% భూమి (9 కోట్ల 78 లక్షల హెక్టార్ల భూమి బంజరు భూమి ఉంది. విచ్చలవిడిగా రసాయనాల వినియోగం వల్ల పూర్తిగా నిస్సారమై సాగుయోగ్యం కాకుండా పోయిన భూమి కూడా ఇందులో కలసి ఉంది. ఇటువంటి రాళ్లూ రప్పలతో కూడిన బంజరు, నిస్సారమైన భూములను సైతం కేవలం ద్రవరూప ఎరువు ‘సస్యగవ్య’తో పునరుజ్జీవింపచేయ వచ్చని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. వేదకాలం నాటి కృషిపరాశర గ్రంథం నుంచి తీసుకున్న సాగు పద్ధతిలో బంజరు భూములను, నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేస్తూ తిరిగి సాగులోకి తేవడానికి ఉపయోగపడే వినూత్న ప్రకృతి సేద్య పద్ధతిని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ అనుసరిస్తోంది. అనేక రకాల పండ్ల మొక్కలను ఐదేళ్లుగా ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తోంది. వనపర్తి జిల్లా మదనాపురంలోని ఉద్యాన బోధనా క్షేత్రంలో 11 ఎకరాల రాళ్లతో కూడిన బంజరు భూమిలో అసిస్టెంట్ ్రపొఫెసర్ డా. జడల శంకరస్వామి 2019 నుంచి ఈ ప్రయోగాత్మక సాగు పద్ధతిని అవలంభిస్తూ భూమిని క్రమంగా సారవంతం చేస్తున్నారు. ఎత్తుమడులు.. అధిక సాంద్రత.. 11 ఎకరాలను ఎకరం ప్లాట్లుగా చేసి నేల తీరుకు సరిపోయే పంటలను సాగు చేస్తున్నారు. ఉదాహరణకు రాళ్లు రప్పలతో కూడిన నేలలో దానిమ్మ (భగువ) రకం మొక్కల్ని అధిక సాంద్రతలో ఎకరానికి 300 నాటారు. అదేవిధంగా, 7 రకాల మామిడి, మూడు రకాల అంజూర, జామ, మునగ తదితర తోటలను వేశారు. భూమిని దుక్కి చేసి 2.5 అడుగులు (75 సెం.మీ.) వెడల్పుతో.. సాళ్ల మధ్యలో మీటరు లోతున తవ్విన మట్టిని పోసి 2 మీటర్ల ఎత్తున బెడ్స్ చేశారు. సాళ్ల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఎత్తుమడులపై మొక్కలు అధిక సాంద్ర పద్ధతిలో నాటి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. గుంతకు 5 కిలోల వర్మీ కంపోస్టు వేసి మొక్కలు నాటారు. ఇక ఆ తర్వాత ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ, పిచికారీలు గానీ చేయటం లేదు. కలుపు మొక్కలే బలం! ఏ పొలంలో మొలిచే కలుపు మొక్కలను పీకి ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వాడటంతో పాటు.. ఆ మొక్కలను మురగబెట్టి సస్యగవ్య అనే ద్రవ రూప ఎరువును తయారు చేస్తున్నారు. దీన్ని అదే పొలంలో గడ్డీ గాదాన్ని కుళ్లించడానికి వినియోగించటం ద్వారా భూమిని సారవంతం చేసుకోవచ్చు. బంజరు భూముల్ని, సారం కోల్పోయిన భూముల్ని సాగులోకి తేవటానికి బయటి నుంచి ఎటువంటి ఉత్పాదకాలను ఖర్చుపెట్టి కొని తెచ్చి వేయాల్సిన అవసరం లేదని రైతులకు తెలియజెప్పడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టామని డా. శంకరస్వామి ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. కలుపు మొక్కలుగా మనం భావించేవాటిలో చాలా మటుకు నిజానికి ఔషధ మొక్కలేనని అంటూ.. వాటిని పీకి పారేయటం కాకుండా అదే నేలలో కలిపేస్తే చాలు. కలుపు ఆచ్ఛాదనపై సస్యగవ్య పిచికారీ ఇక ఏ రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు చల్లకుండా ఉంటే.. ఆ భూమిలోనే ఉండే సూక్ష్మజీవరాశి సంరక్షించబడి భూమిని క్రమంగా సారవంతం చేస్తుందని ఆయన తెలిపారు.గులక రాళ్లు సైతం భూసారాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని తమ అనుభవంలో వెల్లడైందన్నారు. గణనీయంగా పెరిగిన సేంద్రియ కర్బనం.. సస్యగవ్యతో సేద్యం చేయనారంభించిన తొలి దశలో, నాలుగేళ్ల తర్వాత పండ్ల తోటలో భూసార పరీక్షలు చేయించగా భూసారం గణనీయంగా వృద్ధి చెందింది. 11 ఎకరాల్లో సగటున సేంద్రియ కర్బనం 0.24 నుంచి 0.53కి, సేంద్రియ పదార్థం 0.1 నుంచి 1%కి పెరిగింది. వీటితో పాటు మట్టిలో టోటల్ నైట్రోజన్ 0.015 నుంచి 0.045కి పెరిగిందని డా. శంకర స్వామి తెలిపారు. సస్యగవ్యను వరుసగా నాలుగేళ్లు వాటం వల్ల సాగుకు యోగ్యం కాని భూమిని కూడా తిరిగి సారవంతం చేయటం సాద్యమేనన్నారు. ఒక్కో రకం పండ్ల తోట సాగులో ఉన్న తోటలో వేర్వేరు రకాల కలుపు మొక్కలు, ఔషధ మొక్కలు మొలుస్తున్న విషయం గుర్తించామన్నారు. మట్టిలోని గులకరాళ్లు కూడా పరోక్షంగా మట్టిని సారవంతం చేయడానికి పరోక్షంగా దోహదపడుతున్నట్లు కూడా గుర్తించామని అంటూ.. సాగు భూమిలోని గులక రాళ్లు పనికిరానివేమీ కాదన్నారు. బెడ్స్ మధ్యలో రాళ్ల భూమి - బోడ్స్ మధ్య కలుపు ఆచ్ఛాదన ‘సస్యగవ్య’ తయారీ ఇలా.. పొలంలో మొలిచిన కలుపు మొక్కలను ఏడాదికి మూడు దఫాలు పీకి వాటితో సస్యగవ్యను డా. శంకర స్వామి తయారు చేయిస్తున్నారు. ఆ పొలంలోని తాజా కలుపు మొక్కలు కిలో, తాజా ఆవు పేడ కిలో, ఆవు మూత్రం లీటరు, రెండు లీటర్ల నీటి (1:1:1:2)తో కలిపి పొలంలోనే నీడన ఫైబర్ పీపాల్లో మురగబెడుతున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం కలియదిప్పుతుంటే 10–12 రోజుల్లో సస్యగవ్య ద్రవ రూప ఎరువు సిద్ధమవుతుంది. ఆ పొలంలోనే సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం, ఆకులు అలములు, కొమ్మలు రెమ్మలపై సస్యగవ్యను 1:1 పాళ్లలో నీరు కలిపి పిచికారీ చేస్తున్నారు. వారం తర్వాత ఆ గడ్డీ గాదాన్ని రొటోవేటర్‌తో మట్టిలో కలియదున్ని, ఆ మట్టిపై మరోసారి సస్యగవ్యను పిచికారీ చేస్తున్నారు. తద్వారా ఈ సేంద్రియ పదార్థం కుళ్లి మట్టిలో కలిసిపోయి భూమి సారవంతం అవుతోంది. ఏడాదిలో మూడు సీజన్లలో కొత్తగా కలుపు మొలిచినప్పుడు ఆ కలుపు మొక్కలతో మాత్రమే దీన్ని తయారు చేసి వాడుతున్నారు. భూమిని సారవంతం చేయటానికి ఈ ఒక్క పని తప్ప మరే ఎరువూ వేయటం లేదు. డ్రిప్ ద్వారా అవసరం మేరకు నీరు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారు. రైతులు అనుసరించడానికి ఇది చాలా అనువైన, ఖర్చులేని పద్ధతని డా. శంకరస్వామి అంటున్నారు. ఇంతకీ దిగుబడి ఎంత? స్వల్ప ఖర్చుతోనే బంజరు భూముల్ని, రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్ని తిరిగి సారవంతం చేసుకొని ఫలసాయాన్నిచ్చేలా పునరుజ్జీవింపచేయొచ్చని మా ప్రయోగం రుజువు చేసింది. సస్యగవ్యతో కూడిన ప్రకృతి సేద్యంలో 4 ఏళ్ల తర్వాత ఒక్కో దానిమ్మ (భగువ) చెట్టుకు 3.96 కిలోల పండ్లు, అంజూర (డయాన) చెట్టుకు 13.8 కిలోల పండ్లు, జామ (అలహాబాద్ సఫేది) చెట్టుకు 1.65 కిలోల దిగుబడి వచ్చింది. బయటి నుంచి ఏదీ కొని వేయకుండా సాధించిన ఫలసాయం ఇది. – డా. జడల శంకరస్వామి (97010 64439), ఉద్యాన కళాశాల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం -
సౌరగోళంపై అధ్యయనానికే ఆదిత్య–ఎల్1 మిషన్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) : సౌరగోళం రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఇస్రో సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా 1,475 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ మొదటివారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు జరుగుతుండగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం బెంగళూరు నుంచి షార్కు చేరుకుంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి ఉన్న రహస్యాలను పరిశోధనలు చేయనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు. దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)పై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు. బెంగళూరులోని ఫ్రొపెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్సీ)లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. యూఆర్ఎస్సీ సెంటర్లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే శంకర సుబ్రమణియన్ శాటిలైట్ సెంటర్లో స్పేస్ ఆస్ట్రానమీ గ్రూపు (సాగ్)కు నాయకత్వం వహిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఆదిత్య ఎల్1 ఉపగ్రహం రూపకల్పన చేశారు. శంకర్ సుబ్రమణియన్ గతంలో ఖగోళ పరిశోధనకు ఉపయోగించిన ఆస్ట్రోశాట్ ఆనే ఉపగ్రహాన్ని, చంద్రయాన్–1. చంద్రయాన్–2 మిషన్లకు అనేక హోదాల్లో పనిచేశారు. ఆదిత్య ఎల్–1 ప్రయోగంలో పరిశోధనలకు పేలోడ్స్ ఇవే 1,475 కేజీలు బరువు కలిగిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్ బరువు 244 కేజీలు మాత్రమే. మిగిలిన 1,231 కేజీలు ద్రవ ఇంధనం ఉంటుంది. మొదట ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (భూ మధ్యంతర కక్ష్య)లోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బింవు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి సూర్యుడిపై జరిగే మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చి పంపుతున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీలు వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1 దృష్టి సారించి పరిశోధనలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. చంద్రుడు, ఆంగారకుడిపై చేసిన పరిశోధనలు మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కావడంతో సూర్యుడిపై కూడా పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఆదిత్య ఎల్1లో ఆరు పేలోడ్స్ పరిశోధనలు.. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి 1,470 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్ 1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 170 కేజీల బరువు కలిగిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్ ద్వారా సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది. సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూమి యొక్క వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై పరిశోధనలు చేస్తుంది. సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. సూర్యుడ్ని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఇస్రో ఇతర సంస్థల సహకారంతో పుణేలోని ఇంటర్–యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఏఎన్ రామ్ ప్రకాష్, దుర్గేష్ త్రిపాఠి నేతృత్వంలో ఈ పేలోడ్‌ను అభివృద్ధి చేశారు. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ ద్వారా సౌర గాలి యెక్క వైవిధ్యం, లక్షణాలను తెలియజేయడమే కాకుండా దాని వర్ణపటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి యొక్క కూర్పు దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా యొక్క సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది. హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. -
బ్లాక్ బస్టర్స్ లిస్ట్‌లో శంకర ఉంటుంది – సురేశ్ కొండేటి
‘‘ఈ సినిమాకు ఫస్ట్ టెక్నీషియన్ సాయికార్తీక్‌గారే. ఆయన తర్వాతే మిగిలిన టెక్నీషియన్స్ అందరూ సెట్ అయ్యారు. మా అందరి ఆరు నెలల కష్ట ఫలితమే ఈ సినిమా. శంకర్ హీరో ఏంటి? అని అనుకునేవాళ్లందరికీ ఈ సినిమా సమాధానం చెబుతుంది. సినిమా చూస్తే శంకర్‌తో ఎందుకు తీశామో అర్ధమవుతుంది. నిర్మాతల్లో ఒకరైన రమణారెడ్డిగారి వల్లే ఈ సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. నాకు తెలిసి ఈ ఏడాది బ్లాక్‌బస్టర్స్ లిస్టులో ‘శంభో శంకర’ ఖచ్చితంగా ఉంటుంది. బిజినెస్ పూర్తయ్యింది. అందరి నమ్మకం ఫలిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు సురేశ్ కొండేటి. శ్రీధర్ దర్శకత్వంలో షకలక శంకర్ హీరోగా ఆర్.ఆర్. పిక్చర్స్ , యస్కే పిక్చర్స్ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించిన చిత్రం ‘శంభో శంకర’. జూన్ 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను సంగీత దర్శకుడు సాయి కార్తీక్ విడుదల చేయగా హీరో శంకర్ మొదటి సీడీని అందుకున్నారు. శ్రీధర్ మాట్లాడుతూ –‘‘మాటల రచయిత భానుప్రసాద్ గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. సినిమా కోసం ఏమైనా ఫర్వాలేదని శంకర్ ప్రాణం పెట్టి చేశారు. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. హీరో శంకర్ మాట్లాడుతూ –‘‘దర్శ కులు శ్రీధర్‌కు, నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయముంది. మాకు సినిమాల మీద ఆసక్తి కలిగేలా చేసింది నటి నిర్మలమ్మగారు. ఆవిడ వల్లే మేం సినిమా జీవితం గురించి తెలుసుకున్నాం. ఆవిడ ఆశీర్వాదం ఎప్పటికీ మాపై ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాను మొదట ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ గార్ల దగ్గరికి తీసుకెళ్లాను. వారు చేస్తామన్నారు, కానీ రెండేళ్లు ఆగాలన్నారు. మా బాధను నెల్లూరులోని రమణారెడ్డిగారు అర్థం చేసుకున్నారు. అలాంటి నిర్మాతలుంటే నాలాంటి ఎందరో హీరోలుగా, శ్రీధర్ లాంటి వారెందరో దర్శకులు అవుతారు. నేను నటునిగా పది రూపాయలు సంపాదిస్తే అందులో ఎనిమిది రూపాయలు కష్టాల్లో ఉన్నవారికి ఇచ్చేస్తాను. ఈ నెల 29 మేమంతా ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుస్తుంది’’ అన్నారు. -
చెరిగిపోయిన చిత్రాలు
తల వంచుకొని నడుస్తున్నాడు. ఆ వీధిలో జన సంచారం తక్కువగా ఉంది. ఒక ఇంటిలో నుండి రాధమనస్సు అనే పాట వినిపిస్తోంది. ఎక్కడ ఆ పాట వినిపించినా నిలబడి విని ఆనందించే అతడు, నేడు నిలవకుండా ముందుకు సాగిపోయాడు. వీధి మలుపులో ఒక ట్యూబులైటు వెలుగుతూ ఉంది. షాపువాడు సామానులను చాలా బాధ్యతతో కడుగుతూ సర్దుతున్నాడు. ‘‘ఏం అన్నా! సినిమాకు వెళ్లి వస్తున్నావా?’’ ‘‘లేదోయ్!’’ అంటూ అక్కడ పేరుకుపోయిన మురికి నీటిని దాటుతూ అన్నాడు. చెప్పులు తెగిపోయాయి. రెండు రోజులుగా ఎప్పుడు తెగిపోతాయోనని భయపెడ్తున్న చెప్పులు, ఆ రాత్రివేళ, ఇంటికి పోతున్న సమయంలో ఎవరూ లేని చోట తెగిపోయాయి. ‘ఇది ఒక రకంగా మంచిదే! రేపు ఎలాగైనా కుట్టించాలి. కనీసం 15 పైసలయినా అవుతాయి.’ అనుకొని వంగి రెండు చెప్పులను చేతిలోకి తీసుకుంటూ ఉండగా మనస్సులో పొంగిన దుఃఖాన్ని ‘‘ఛీ!’’ అంటూ బయటకు కక్కాడు. పచారీ కొట్టుముందు ఉన్న బెంచీ ఖాళీగా ఉంది. పడుకోవచ్చు. ఎసెస్సెల్సీ చదివి ఉండకపోతే దానిపై పడుకోవడానికి ధైర్యం వచ్చి ఉండేదే. తిరిగి నడక ప్రారంభించాడు. ఇంటిలో దీపం మినుక్కు మినుక్కుమంటోంది. తలుపు తట్టడానికి సిగ్గుపడి బయటే నిలబడ్డాడు. వీధి వరండా కిటికీ దగ్గర చీకటిలో ముఖం ఏదో అస్పష్టంగా కనిపిస్తోంది. ‘ఎవరా?’ అని అనుకునేలోగా తలుపు తెరుచుకుంది. అక్కే తలుపు తెరిచింది. ఆ మసక చీకటిలో ఆమె తలలో పెట్టుకున్న బంతిపువ్వు వాసన ప్రత్యేకంగా ఉంది. ‘‘ఏరా! మూగవాడిలా వసారాలో నిలబడిపోయావ్? తలుపు తడితే ఏం? ఇంతరాత్రి అయింది. వచ్చాడో లేదో అని చూసి బయట పడుకుందామని తలుపుతీసాను. ఇలా ఎంతసేపు నిల్చుంటావ్? ఎందుకిలా చేస్తున్నావ్? తలుపు కొడితే కదా ఎవరైనా తలుపు తెరుస్తారు. మంచివాడివిరా! సరే రా!’’ అరుగు కింద చప్పుడు చెయ్యకుండా చెప్పులు పడేశాడు. అక్క తలుపు గడియపెట్టిన చప్పుడుకు మేల్కొన్న నాన్న తలెత్తి చూశాడు. ‘‘ఎవరు శంకరమా? ఎక్కడరా ఇంతసేపు తిరిగి వస్తున్నావ్? వేళకు వచ్చి, ఇంత తిండి తిని పడుకుంటే ఏం? ఆడపిల్ల నీకోసం ఎంత సేపు మేల్కొని ఉంటుంది?’’ గోడలో కలిసిపోయినట్లు వొదిగి నిలబడిన శంకరాన్ని చూసి ‘‘నువ్వు రారా!’’ అని లోపలకు వెళ్లింది అక్క. అంతకు పూర్వమే వంటిల్లు కడగడం చేత అంతా తడితడిగా ఉంది. పచ్చరంగు గచ్చు అక్కడక్కడ పొడిపొడిగా ఉండి మెరుస్తోంది. అక్కడ ఒక గోనెపట్టా వేసి శంకరాన్ని కూర్చోమని చెప్పింది. వంటింటి గుమ్మం దగ్గరే నిలబడి ‘‘నాకు భోజనం వద్దు’’ అని చెప్పి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. వేగంగా వచ్చి అతడి చెయ్యిపట్టుకొని పోకుండా ఆపింది. అతడి ముఖంలోకి చూసింది. అతడు తలవంచుకున్నాడు. ‘‘ఎందుకురా! భోజనం వద్దు అంటున్నావ్? రా! వచ్చి తిని నిద్రపో! చాలా పెద్దమనిషిని అనుకుంటున్నావా?’’ అని బలవంతంగా తీసుకొని వచ్చి గోనెమీద శంకరాన్ని కూర్చోబెట్టింది. వడ్డించిన భోజనం కంచాన్ని అతని ఎదురుగా పెట్టి ఎదురుగా చిన్న పీటను వేసుకొని కూర్చుంది. అతడు తినలేదు. కంచంలోని భోజనాన్ని ఉదాసీనంగా చూస్తుండిపోయాడు. ‘‘ఏరా! అలా చూస్తూ కూర్చున్నావ్? తిను ఎప్పుడో మధ్యాహ్నం తిన్నది కదా! సాయంకాలం కాఫీకూడా తాగి ఉండవ్!’’ అంది అక్క. ఆమె అమితమైన ప్రేమను చూసి అతడు తట్టుకోలేకపోయాడు. పొంగివస్తున్న దుఃఖాన్ని గొంతు లోపలే అణుచుకోవడానికి ప్రయత్నించాడు. పీటను అతడి పక్కకు జరుపుకుని కూర్చుంది ఆమె. ‘‘చెయ్యి పట్టు..’’ అంటూ భోజనాన్ని కలిపి ముద్దలు చేసి ఒక ముద్ద అతని చేతిలో పెట్టింది. ‘‘నువ్వొక్కడివేనా పనిలేకుండా ఉన్నావ్? ఊరిలో ఎంతమంది నీలా చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఇంటిలో లేరు? ఏ ఇంటికి మాత్రం ద్వారం ఉండదు? అలాగే ఇదీను. నా విషయం చూడు. రోజురోజుకు వయసు మీదపడుతూనే ఉంది. నేనెవరి దగ్గర మొర పెట్టుకోను? చెయ్యి సరిగ్గా పట్టు. చూడు అన్నం కిందపడగలదు. ఎవరో పరాయివాళ్ల ఇంటికి వచ్చినట్లు బెరుకుగా వస్తావు. ఎవరింటిలోనో తింటున్నట్లు బిడియ పడుతున్నావ్. ఊ! నోటిలో పెట్టుకో!’’ ఇంకా కొంచెం అన్నం పెట్టించుకొని తిన్నాడు. వాకిట్లో చెయ్యి కడుక్కోవడానికి అక్క నీళ్లు పోస్తుంటే కడుక్కున్నాడు. ‘‘చూసుకొని వెళ్లు! దారిలో అడ్డదిడ్డంగా పడుకొని ఉంటారు. ఇవన్నీ సర్దిపెట్టి వస్తాను. వెళ్లి పడుకో!’’ పంచకు చేతులు తుడుచుకుంటూ పడుకోవడానికి వెళ్లి గదిలో లైటు వేశాడు. పెద్ద తమ్ముడు పడుకొని పొర్లుతున్నాడు. ఊయల ఊగుచున్న శబ్దం అయింది. ఆ శబ్దం అతడికి ఊహ తెలిసినప్పటి నుండి వినిపిస్తూనే ఉంది. అది అతడికి బాగా నచ్చే శబ్దం. ఆ ఊయలమీద అతడు, అక్క, తమ్ముడూ అందరూ సెలవు రోజుల్లో బస్సు ఆట ఆడేవారు. అతడే డ్రైవరు. చేతి నిండా క్యాలండరు ముక్కలను పట్టుకున్న తమ్ముడు కండక్టర్. ఊయలను ఊపి ఊపి చివరకు ఎక్కబోతుండగా ఒకసారి పడిపోతే నుదుట దెబ్బతగిలింది. ఇప్పటికీ అతడికి తెలియకుండా నుదుట మీద దెబ్బ తగిలిన చోట ఉన్న మచ్చదగ్గరకు చెయ్యి వెళ్లింది. చెల్లా చెదురుగా పడివున్న తమ్ముడి పుస్తకాలను బాగా సర్దిపెట్టాడు. బాగా చదివే తమ్ముడిని, కష్టంలో కష్టంగా భావించి కష్టపడి చదివిస్తున్నాడు నాన్న. అతడికి మాత్రం చదువూలేదు, ఉద్యోగమూలేదు. చొక్కా తీసి గోడకు ఉన్న హేంగర్‌కు తగిలించి గోడకు చేరబడి పక్కమీద కూర్చున్నాడు. నిద్రపోకపోయినా పడుకొని తీరాలి. ఇదేం కష్టం? ఇంటిలో ఉండడమే పెద్ద ఇబ్బందిగా ఉంది. అక్క వచ్చింది. అతడి తల పక్కగా ఆమె పక్క ఉంది. ‘‘ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్? నిద్రపోలేదా?’’ అని అడిగింది అక్క. నిట్టూర్పు విడిచాడు అతడు. ఆమె రెండు తలదిండులను చేర్చి కూర్చుంది. మసగ్గావున్న నైట్ ల్యాంపు వెలుతురులో ఆమె చాలా అందంగా ఉంది. ఇంటిలో అందరి కంటే ఆమెదే మంచి రంగు. అయినా ఇంకా పెండ్లి కాలేదు. ‘‘ఆ కంపెనీలో ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు, ఉద్యోగ విషయంగా రమ్మని చెప్పాడన్నావ్, వెళ్లావా?’’ కొద్దిసేపు మౌనంగా ఉండి అతడు మాట్లాడసాగాడు. ‘‘చూశావా ఎల్లుండి రమ్మని చెప్పాడు. దారిలో లాలాపత్రం దగ్గర ఆర్ముగం మామను చూశాను. రేపు తాళైయూత్తుకు రా! మా సిమ్మెంటు ఫ్యాక్టరీ సూపర్వైజర్తో చెప్తాను’’ అని అన్నాడు. అది ఎంతో భయంతో మెల్లగా చెప్పాడు. ‘‘వాళ్లింటిలో అందరూ బాగున్నారా? వాళ్ల అబ్బాయి ఉద్యోగంలో చేరాడట కదూ!’’ ‘‘ఊ! అందరూ మన నాన్నలాగే ఉంటారా? వాళ్ల అబ్బాయి ఉద్యోగంలో చేరాడట’’ ఆ మామ కొడుక్కి అక్కను ఇవ్వాలని అనుకున్నారు. మాటలు జరిగాయి. కానీ నిశ్చయం కాలేదు. ‘‘రేపు నువ్వు తాళయుత్తుకు ఎప్పుడు వెళ్తావ్?’’ ‘‘ఎందుకు అక్కా వెళ్లడం? అక్కడేం ఉద్యోగాలు రాసులు పోసుకొని కూర్చున్నారా?’’ ‘‘పోరా.. వెధవా!! ఆ మామ నిన్ను కావాలనే పిలిచాడు వెళ్లి రా! బస్సుకు డబ్బులు ఉన్నాయా? లేకపోయినా, నచ్చితే నడిచే పోతావ్?’’ అంది ఆమె. ‘‘ఊ! ఉన్నాయి.’’ ‘‘అబద్దం చెప్పకు’’ కూర్చున్న చోటునుండే, చెయ్యి ఎత్తి హేంగర్‌కు తగిలించి ఉన్న అతడి చొక్కా అందుకుంది. 5 పైసల నాణెం ఒకటి కిందపడింది. చొక్కా నుంచి ఒకటే చెమట వాసన. జేబులో చెయ్యిపెట్టి చూసింది. రెండు నలిగిపోయిన బస్సు టికెట్లు. వాటిని తీసి బయట పారేసింది. ‘‘ఎక్కడరా డబ్బులు? నాకు నీ గురించి తెలీదా?’’ అని లేచివెళ్లి బీరువా తెరిచింది. ఆమె తన బట్టల మడతల మధ్య నుంచి ఒక చాక్లెట్ డబ్బా తీసింది. డబ్బాలో నుంచి చిన్న కుంకుమ భరణి తీసుకొని వచ్చింది. అందులో నుంచి మడిచి పెట్టి ఉన్న ఒక రూపాయి నోటు తీసి అతడికి ఇచ్చింది. ‘‘ఎందుకక్కా!’’ అని అడిగాడు మెల్లగా. ‘‘సరేలే! చాల్లే! బెట్టు చెయ్యకు!’’ అని చెప్పి నవ్వింది. మరల దగ్గరకు వచ్చి కూర్చొని చొక్కాతీసి, చొక్కా చేతి మడతలను విప్పింది. అతని దగ్గర నుంచి రూపాయి తీసుకొని, ఆ మడతలో పెట్టింది. ‘‘ఈవేళే కదా! ఈ చొక్కా వేసుకున్నావ్? ఇంతలోనే ఇంత మురికిగా అయిందేమిటి?’’ సబ్బుతో స్నానం చెయ్యడమైనా మానేసినట్లున్నాడు. అతడు ఆమెను సూటిగా చూశాడు. ‘‘అంతా నేను చూస్తున్నాను, ఈమె ఇంటిలోనే కదా ఉంటుంది. ఈమెకు ఏం తెలుసులే.. అని అనుకుంటున్నావా?’’ అంది ఆమె. ‘‘సబ్బు రాసుకొని స్నానం చెయ్యడం మానేశావు. అంతా పేస్టుతో పళ్లు తోముకుంటుంటే.. నువ్వు మాత్రం 15 పైసలకు పండ్ల పొడి కొని పండ్లు తోముతున్నావ్? ఇదంతా గమనించి చూడ్డం అమ్మకు తెలీదు. ఒరేయ్! నీకు ఏమైందిరా?’’ ‘‘... ఉద్యోగం లేకపోయినంత మాత్రాన అంత పౌరుషంగా ఉండాలా? నన్ను చూడు ఇంటిలో కూర్చొని పది సంవత్సరాలయ్యింది. ఏమైనా నాకు నేను తగ్గించుకున్నానా? ఏమైనా నువ్వు చాలా పౌరుషవంతుడివిరా!’’ అంది ఆమె. చివరకు దుఃఖంతో ఆమె గొంతు జీరపోయింది. చప్పున అతడు తన ముఖాన్ని ఆమె ఒడిలో పెట్టుకొని పడుకున్నాడు. ఆమె అతడి వీపుమీద చెయ్యి వేసి నిమరసాగింది. (‘తమిళ చిన్న కథలు’ సౌజన్యంతో...) -
నారా vs నందమూరి
వెండితెర మీద ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతోంది. నారా, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు యువ కథనాయకులు బాక్సాఫీస్ ముందు తలపడేందుకు రెడీ అవుతున్నారు. పటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. నారా రోహిత్, రెజీనా జంటగా తెరకెక్కిన శంకర సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఈ సినిమాను ఈ సారి ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దీంతో వెండితెరపై నారా, నందమూరి హీరోల పోటి తప్పేలా కనిపించటం లేదు. మరి ఈ పోటిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. -
వ్యవస్థలోని లోటుపాట్లపై పోరాటం
సమాజంలోని లోటుపాట్లను ప్రశ్నించే యువకుడి పాత్రలో నారా రోహిత్ నటించిన చిత్రం ‘శంకర’. రెజీనా కథానాయిక. తాతినేని సత్యప్రకాశ్ దర్శకత్వంలో ఆర్వీ చంద్రమౌళి ప్రసాద్(కిన్ను) నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘తమిళంలో రూపొం దిన ‘మౌన గురు’ చిత్రానికి రీమేక్ ‘శంకర’. యూని వర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఏఆర్ మురుగదాస్ చిన్న చిన్న మార్పులు చేసి హిందీలో ‘అకీరా’ పేరుతో నిర్మించారు. వ్యవస్థలోని లోటుపాట్లు నచ్చని శంకర అనే కుర్రాడు వాటిని ప్రశ్నిస్తుంటాడు. ఓ ప్రయాణంలో జరిగిన ప్రమాదం అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? అనే కథాంశంతో తాతినేని సత్య అన్ని వర్గాల వారికీ నచ్చేలా తెరకెక్కించాడు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమేరా: టి.సురేందర్ రెడ్డి, సమర్పణ: ఎమ్వీ రావు. -
టాలీవుడ్ కన్నా ముందు బాలీవుడ్లో..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న చాలా మంది నటులు బాలీవుడ్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు కూడా ఈ ప్రయత్నం చేయగా, ఈ జనరేష్ హీరోలు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రానా లాంటి వారు బాలీవుడ్లో అడుగు పెట్టాగా, మరికొంత మంది సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. కమర్షియల్ సక్సెస్ సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో నారా రోహిత్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడట. చాలా కాలం క్రితం రోహిత్ హీరోగా శంకర సినిమా పూర్తయ్యింది. అయితే తెలుగులో ఇంత వరకు రిలీజ్‌కు నోచుకోని ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ హిట్ సినిమా మౌనగురుకు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. అయితే ఇదే కథను కొద్ది పాటి మార్పులతో అకీరా పేరుతో బాలీవుడ్ తెరకెక్కించారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, అకీరా సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ బాలీవుడ్ ఎంట్రీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. -
బాలీవుడ్‌కి నారావారి అబ్బాయి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న చాలా మంది నటులు బాలీవుడ్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు కూడా ఈ ప్రయత్నం చేయగా, ఈ జనరేష్ హీరోలు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రానా లాంటి వారు బాలీవుడ్లో అడుగు పెట్టాగా, మరికొంత మంది సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. కమర్షియల్ సక్సెస్ సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో నారా రోహిత్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడట. చాలా కాలం క్రితం రోహిత్ హీరోగా శంకర సినిమా పూర్తయ్యింది. అయితే తెలుగులో ఇంత వరకు రిలీజ్‌కు నోచుకోని ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ హిట్ సినిమా మౌనగురుకు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. అయితే ఇదే కథను కొద్ది పాటి మార్పులతో అకీరా పేరుతో బాలీవుడ్ తెరకెక్కించారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, అకీరా సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ బాలీవుడ్ ఎంట్రీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. -
'శంకర' మూవీ స్టిల్స్
-
అమితాబ్ బచ్చన్ గుర్తుకొచ్చారు - కేయస్ రామారావు
‘‘రోహిత్ మంచి ఎనర్జిటిక్ హీరో. తమిళ చిత్రం ‘మౌనగురు’ని తనతో తెలుగులో రీమేక్ చేశాం. ఇందులో రోహిత్ నటన చూస్తుంటే, యాంగ్రీమేన్ అమితాబ్ బచ్చన్ గుర్తొచ్చారు. మంచి యాక్షన్ హీరోగా రోహిత్ అందరికీ దగ్గరవుతాడు’’ అని కేయస్ రామారావు అన్నారు. ఆయన సమర్పణలో నారా రోహిత్, రెజీనా జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో ఆర్వీ చంద్రమౌళి (కిన్ను) నిర్మించిన చిత్రం ‘శంకర’. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చాముండేశ్వరీనాథ్ ఆవిష్కరించి హీరో నానీకి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని కేయస్ రామారావు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘నేను భారతీయ టీమ్‌లో క్రికెట్ ప్లేయర్ కావాలని, మంచి సినిమా తీయాలని నాన్నగారి ఆశయం. అందుకే ఈ సినిమా నిర్మించా. ఏడేళ్ల క్రితం ఆయన చనిపోయారు. ఎక్కడున్నా నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. కేయస్ రామారావులాంటి మంచి ఫిల్మ్ మేకర్ సహాయంతో ఈ సినిమా నిర్మించా’’ అని తెలిపారు. ‘‘మొదట్నుంచీ ఇప్పటివరకు నేను చేసినవి విభిన్నమైన సినిమాలే. ‘శంకర’ కూడా చాలా బాగుంటుంది’’ అని నారా రోహిత్ చెప్పారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందని, సాయికార్తీక్ మంచి పాటలు ఇచ్చారని దర్శకుడు పేర్కొన్నారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న రమేష్‌ప్రసాద్, టీఎల్వీ ప్రసాద్, మంచు మనోజ్, నాని, సుధీర్‌బాబు తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.