వ్యవస్థలోని లోటుపాట్లపై పోరాటం | shankara movie release on 16th august | Sakshi
Sakshi News home page

వ్యవస్థలోని లోటుపాట్లపై పోరాటం

Published Fri, Aug 19 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

వ్యవస్థలోని లోటుపాట్లపై పోరాటం

వ్యవస్థలోని లోటుపాట్లపై పోరాటం

సమాజంలోని లోటుపాట్లను ప్రశ్నించే యువకుడి పాత్రలో నారా రోహిత్ నటించిన చిత్రం ‘శంకర’. రెజీనా కథానాయిక. తాతినేని సత్యప్రకాశ్ దర్శకత్వంలో ఆర్‌వీ చంద్రమౌళి ప్రసాద్(కిన్ను) నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘తమిళంలో రూపొం దిన ‘మౌన గురు’ చిత్రానికి రీమేక్ ‘శంకర’.
 
  యూని వర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఏఆర్ మురుగదాస్ చిన్న చిన్న మార్పులు చేసి హిందీలో ‘అకీరా’ పేరుతో నిర్మించారు. వ్యవస్థలోని లోటుపాట్లు నచ్చని శంకర అనే కుర్రాడు వాటిని ప్రశ్నిస్తుంటాడు. ఓ ప్రయాణంలో జరిగిన ప్రమాదం అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? అనే కథాంశంతో తాతినేని సత్య అన్ని వర్గాల వారికీ నచ్చేలా తెరకెక్కించాడు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమేరా: టి.సురేందర్ రెడ్డి, సమర్పణ: ఎమ్వీ రావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement