తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. స‌డ‌న్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌.. ఎక్క‌డంటే? | Suniana Starrer Regina Movie Telugu Version Released In OTT, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Regina Movie In OTT: ఓటీటీలో క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. ఎటువంటి ప్ర‌క‌ట‌న లేకుండా నేరుగా స్ట్రీమింగ్‌

Published Thu, Feb 22 2024 3:55 PM | Last Updated on Thu, Feb 22 2024 7:29 PM

Suniana Starrer Regina movie Telugu Version Styreming On This OTT Platfom - Sakshi

రాజ రాజ చోర ఫేమ్ సునైన హీరోయిన్‌గా న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ రెజీనా. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ గ‌తేడాది జూన్ 23న రెజీనా త‌మిళ వెర్ష‌న్  మాత్ర‌మే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి థియేట‌ర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. అందుకోసం తెలుగునాట‌ ప్ర‌మోష‌న్స్ భారీ స్థాయిలో నిర్వ‌హించారు. కానీ రెజీనాకు ఇక్క‌డ‌ అనుకున్న స్థాయిలో స్క్రీన్స్ దొర‌క‌లేదు.

త‌మిళంలో ఎప్పుడో రిలీజ్‌
దాంతో తెలుగు రిలీజ్ డేట్‌ వాయిదాప‌డింది. త‌మిళంలో సినిమా అంత‌గా ఆడ‌క‌పోవ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌న సైతం విర‌మించుకున్నారు. ఇక‌పోతే రెజీనా త‌మిళ వర్ష‌న్ అమెజాన్ ప్రైమ్‌లో ఇదివ‌ర‌కే అందుబాటులో ఉంది. ఇన్నాళ్ల త‌ర్వాత స‌డ‌న్‌గా తెలుగు వెర్ష‌న్ రిలీజ్ చేశారు. త‌మిళ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది నెల‌ల త‌ర్వాత తెలుగు వెర్ష‌న్‌ను  ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు..

ఛాలెంజింగ్ పాత్ర‌లో..
డొమిన్ డిసిల్వా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ రివేంజ్ థ్రిల్ల‌ర్‌ మూవీలో అనంత్ నాగ్ కీల‌క పాత్ర పోషించాడు. ఇందులో యాక్ష‌న్ ఓరియెంటెడ్ రోల్‌లో సునైన‌ న‌టించింది. గ‌త సినిమాల్లో సాఫ్ట్ రోల్స్ చేసిన సునైన ఇందులో ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది. త‌న భ‌ర్త మ‌ర‌ణంపై ఓ మ‌హిళ‌ ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంద‌న్న‌దే క‌థ‌. ఈ సినిమాలో సునైన న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కానీ క‌థ‌లోని మ‌లుపులు ఈజీగా గెస్ చేసేలా ఉండ‌టం, క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఈ సినిమా అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

తెలుగు సినిమాతోనే కెరీర్ మొద‌లు
హీరోయిన్‌గా సునైన కెరీర్ తెలుగు సినిమాతోనే మొద‌లైంది. కుమార్ వ‌ర్సెస్ కుమారీ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 10th క్లాస్ మూవీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఆ త‌ర్వాత టాలీవుడ్‌కు 10 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకుని 'పెళ్లికి ముందు ప్రేమ క‌థ‌'తో రీఎంట్రీ ఇచ్చింది. రాజ‌రాజ‌చోర మూవీ, చ‌దరంగం, మీట్ క్యూట్ వెబ్ సిరీస్‌ల‌తోనూ మెప్పించిందీ బ్యూటీ.

చ‌ద‌వండి: 'విడాకులిచ్చేశా.. బిజీగా ఉన్నాను కాబ‌ట్టి లైట్‌..', జీవితం చాలా చిన్న‌ది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement