లక్కీచాన్స్  | Vidamuyarchi: Regina Cassandra Has Been Roped For Ajith Movie | Sakshi
Sakshi News home page

లక్కీచాన్స్ 

Published Tue, Oct 10 2023 12:17 AM | Last Updated on Tue, Oct 10 2023 12:17 AM

Vidamuyarchi: Regina Cassandra Has Been Roped For Ajith Movie - Sakshi

రెజీనా

దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్  రెజీనా సుపరిచితురాలే. కానీ ఇటీవల కాలంలో ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ హిట్‌ దక్కలేదు. ఇలాంటి సమయంలో రెజీనాకు ఓ లక్కీచాన్స్ లభించిందని కోలీవుడ్‌ టాక్‌. అజిత్‌ హీరోగా మగిళ తిరుమేణి దర్శకత్వంలో ‘విడాముయార్చి’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారని సమాచారం.

అలాగే కథ రీత్యా ఈ సినిమాలో మరో హీరోయిన్ కు చాన్స్ ఉందని, ఈ అవకాశం రెజీనా తలుపు తట్టిందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. మరి.. ఈ మూవీలో రెజీనా నటి స్తారా? లేదా? వేచి చూడాలి. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ విదేశాల్లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement