సెకండ్ హీరోయిన్‌గా త్రిష | Trisha playing second heroine role in Ajith's | Sakshi
Sakshi News home page

సెకండ్ హీరోయిన్‌గా త్రిష

Published Mon, Apr 21 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

సెకండ్ హీరోయిన్‌గా త్రిష

సెకండ్ హీరోయిన్‌గా త్రిష

అజిత్ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించడానికి త్రిష ఓకే అన్నారన్నది తాజా సమాచారం. ఈ చెన్నై బ్యూటీ ఇంతకు ముందు అజిత్ సరసన మంగాత్తాలో మెరిశారన్నది గమనార్హం. అజిత్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆరంభం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సీనియర్ నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఒక హీరోయిన్‌గా క్రేజీ నటి అనుష్క ఇప్పటికే ఎంపికయ్యారు.
 
 మరో హీరోయిన్ కోసం గౌతమ్ మీనన్ త్రిషను అడగ్గా ఈ ముద్దుగుమ్మ మరుమాట లేకుండా వెంటనే ఓకే చెప్పారట. ఇందుకు కారణం ఇంతకు ముందు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబుకు జంటగా నటించిన విన్నైతాండి వరువాయా చిత్రం త్రిషకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా త్వరలో శింబుతో కలిసి ఈయన దర్శకత్వంలోనే ఇంకో చిత్రం చేయనున్నారు. ఇటీవలే ప్రారంభమైన అజిత్ చిత్రంలో విలన్‌గా అరుణ్ విజయ్ నటించడం విశేషం. ఈ చిత్రానికి హారిష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఇటీవల గౌతమ్ మీనన్‌కు, హారిష్ జయరాజ్‌కు మనస్పర్థలు వచ్చాయి. వీరు కొంత గ్యాప్ తరువాత మళ్లీ కలిసి పని చేస్తున్న చిత్రం ఇది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement