second heroine
-
లక్కీచాన్స్
దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ రెజీనా సుపరిచితురాలే. కానీ ఇటీవల కాలంలో ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. ఇలాంటి సమయంలో రెజీనాకు ఓ లక్కీచాన్స్ లభించిందని కోలీవుడ్ టాక్. అజిత్ హీరోగా మగిళ తిరుమేణి దర్శకత్వంలో ‘విడాముయార్చి’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారని సమాచారం. అలాగే కథ రీత్యా ఈ సినిమాలో మరో హీరోయిన్ కు చాన్స్ ఉందని, ఈ అవకాశం రెజీనా తలుపు తట్టిందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. మరి.. ఈ మూవీలో రెజీనా నటి స్తారా? లేదా? వేచి చూడాలి. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. -
మణికి కీర్తిసురేశ్ హ్యాండ్
షూటింగ్ ప్రారంభమయ్యే వరకే కాదు, మొదలయిన తరువాత కూడా చిత్రంలో ఎవరుంటారో? ఉండరో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. 30,40 శాతం షూటింగ్ పూర్తయిన తరువాత కూడా కథానాయికలు చిత్రం నుంచి వైదొలగడమో, తొలగించడమో జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మణిరత్నం చిత్రానికి అలాంటి పరిస్థితి కాకపోయినా షూటింగ్ ప్రారంభానికి ముందే హీరోహీరోయిన్లు అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలగడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఓ కాదల్ కణ్మణి వంటి విజయవంతమైన చిత్రం తరువాత మణిరత్నం ఒక భారీ ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మొదట మళయాళ సూపర్‌స్టార్ మమ్ముటి, కార్తీ హీరోయిన్లుగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా నటించనున్నట్లు చెప్పుకున్నారు. ఆ తరువాత కార్తీ, దుల్కర్‌సల్మాన్‌లు హీరోలుగానూ, కీర్తీసురేశ్, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అలాటిది ఇక షూటింగ్రెడీ అవ్వడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా చిత్రం నుంచి దుల్కర్సల్మాన్ తప్పుకున్నారు. ఆయన ప్రతాప్పోత్తన్ దర్శకత్వంలో మలయాళ చిత్రాన్ని అంగీకరించడమే మణిరత్నం చిత్రాన్ని చేయలేకపోవడానికి కారణంగా తెలిసింది. మణిరత్నం దుల్కర్సల్మాన్ స్థానంలో తెలుగు నటుడు నానిని తీసుకున్నారు. ఇక అంతా సెట్ అయిపోయింది అనుకున్నారు. అంతా అవ్వలేదనేవిధంగా తాజాగా మణి చిత్రానికి కీర్తీసురేశ్ హ్యాండ్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ నిర్మాత సురేశ్ స్పష్టం చేశారు. కారణాన్ని ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ తన కూతురు మణిరత్నం చిత్రం నుంచి వైదొలగిన విషయం నిజమేనన్నారు. ఆ చిత్రంలో కీర్తీ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. మరో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో ఇప్పుడే సెకెండ్ హీరోయిన్ పాత్ర చేయడానికి కీర్తీకి ఇష్టం లేదన్నారు. -
ప్రణీత ఎప్పుడూ సెకండేనా?
కాలం కలిసొస్తే నడిచొచ్చే బిడ్డ పుడతారంటారు. అది కలిసి రానోళ్లకు నటి ప్రణీత పరిస్థితే. మధ్యలో ఆమె గొడవ ఎందుకంటారా? ఆకర్షణీయమైన ముఖారవిందం, నవ నవ లాడే వయసు ప్రణీత సొంతం. ఒక రకంగా చెప్పాలంటే ఆమెలోని ఈ లక్షణాలే హీరోయిన్ను చేశాయి. మలయాళం, తమిళ్, తెలుగు అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ హీరోయిన్గా నటించింది. దీంతో భవిష్యత్ గురించి బోలెడు కలలు కనేసింది. అయితే హీరోయిన్గా ఈ అమ్మడికి ఏ భాషలోను మంచి హిట్ రాలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ పాత్రలు పోషించడానికి సిద్ధమైంది. అలా ఏ ముహుర్తాన ఆ నిర్ణయం తీసుకుందో వరుస అలాంటి పాత్రల్లే వస్తున్నాయి. తెలుగులో అత్తారింటికి దారేదిలో రెండవ హీరోయిన్గా ప్రణీత నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించినా ఈమెకు హెల్ప్ అవ్వలేదు. తర్వాత తమిళంలో సూర్య సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. అయితే ఇది నటి ఎమిజాక్సన్ నిరాకరించిన పాత్ర. అంతేకాదు ఇందులోను రెండవ హీరోయిన్నే. ఇదీ నిరాశపరచడంతో మరో అవకాశం రాలేదు. ఇలాంటి పరిస్థితిలో తెలుగులో ప్రముఖ హీరో బాలకృష్ణ సరసన నటించే అవకాశం వచ్చిందట. అయితే ఇందులోను నటి అంజలి ఆల్రెడీ బుక్ అవడంతో షరామామూలుగా సెకండ్ హీరోయిన్ పాత్ర కావడంతో అలాంటి పాత్రలు పోషించి విసిగెత్తడంతో ఆ అవకాశాల్ని వదులుకుందట. ఇకపై రెండవ హీరోయిన్ పాత్ర చేసేది లేదంటూ నిర్ణయాన్ని తీసేసుకుందట. పాపం వచ్చే అవకాశాలు పోతాయేమో! ఆ నిర్ణయం మార్చుకుంటే మంచిదంటున్నారు సినీ వర్గాలు. -
నేనా... రెండో కథానాయికగానా!?
‘‘పదకొండేళ్ల నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను. ఇన్నేళ్లలో నేను ఇక్కడ చేసింది పందొమ్మిది సినిమాలు. అగ్రకథానాయకులు, అగ్రదర్శక, నిర్మాతలతో సినిమాలు చేశాను. ఒక నంది అవార్డు, మూడు ఫిలింఫేర్లతో పాటు మరెన్నో అవార్డులు దక్కాయి. తెలుగులో నా ట్రాక్ రికార్డ్ ఇది. ఇంత ఘనమైన కెరీర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని త్రిష చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఇప్పటివరకు త్రిష చేసిన సినిమాలు యాభై పైచిలుకు. ఈ నెల 5తో ఆమె తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి, పదకొండేళ్లయ్యింది. ఎన్నో గొప్ప పాత్రలు చేసే అవకాశం తెలుగు పరిశ్రమ తనకు కల్పించిందని ఈ సందర్భంగా త్రిష పేర్కొన్నారు. ఇన్నేళ్ల కెరీర్లో త్రిష ఇద్దరు నాయికలున్న చిత్రాలు చేసింది చాలా తక్కువ. కావాలనే అలాంటి చిత్రాలకు దూరంగా ఉన్నారా? అనే ప్రశ్న త్రిష ముందుంచితే - ‘‘ఇద్దరు హీరోయిన్ల కథల మీద నాకు ఆసక్తి లేని మాట వాస్తవమే. కానీ, కొన్ని చిత్రాలు చేశాను. వాటిలో నా పాత్రలెంతో గొప్పగా ఉంటాయి. అందుకే చేశా. భవిష్యత్తులో కూడా గొప్ప పాత్ర వస్తే.. ఇద్దరు నాయికలున్న చిత్రంలో నటించడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ, రెండో కథానాయికగా మాత్రం ఎప్పటికీ చేయను’’ అని తెలిపారు. -
బాహుబలి కోసం తమన్నా హార్డ్ వర్క్
-
సెకండ్ హీరోయిన్గా త్రిష
అజిత్ చిత్రంలో రెండో హీరోయిన్గా నటించడానికి త్రిష ఓకే అన్నారన్నది తాజా సమాచారం. ఈ చెన్నై బ్యూటీ ఇంతకు ముందు అజిత్ సరసన మంగాత్తాలో మెరిశారన్నది గమనార్హం. అజిత్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆరంభం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సీనియర్ నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఒక హీరోయిన్గా క్రేజీ నటి అనుష్క ఇప్పటికే ఎంపికయ్యారు. మరో హీరోయిన్ కోసం గౌతమ్ మీనన్ త్రిషను అడగ్గా ఈ ముద్దుగుమ్మ మరుమాట లేకుండా వెంటనే ఓకే చెప్పారట. ఇందుకు కారణం ఇంతకు ముందు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబుకు జంటగా నటించిన విన్నైతాండి వరువాయా చిత్రం త్రిషకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా త్వరలో శింబుతో కలిసి ఈయన దర్శకత్వంలోనే ఇంకో చిత్రం చేయనున్నారు. ఇటీవలే ప్రారంభమైన అజిత్ చిత్రంలో విలన్‌గా అరుణ్ విజయ్ నటించడం విశేషం. ఈ చిత్రానికి హారిష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల గౌతమ్ మీనన్‌కు, హారిష్ జయరాజ్‌కు మనస్పర్థలు వచ్చాయి. వీరు కొంత గ్యాప్ తరువాత మళ్లీ కలిసి పని చేస్తున్న చిత్రం ఇది. -
సమంతకు చెమటలు పట్టిస్తున్న ప్రణీత