మణికి కీర్తిసురేశ్ హ్యాండ్ | Keerthy Suresh quits Mani Ratnam project | Sakshi
Sakshi News home page

మణికి కీర్తిసురేశ్ హ్యాండ్

Published Tue, Oct 13 2015 4:27 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

మణికి కీర్తిసురేశ్ హ్యాండ్

మణికి కీర్తిసురేశ్ హ్యాండ్

షూటింగ్ ప్రారంభమయ్యే వరకే కాదు, మొదలయిన తరువాత కూడా చిత్రంలో ఎవరుంటారో? ఉండరో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. 30,40 శాతం షూటింగ్ పూర్తయిన తరువాత కూడా కథానాయికలు చిత్రం నుంచి వైదొలగడమో, తొలగించడమో జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మణిరత్నం చిత్రానికి అలాంటి పరిస్థితి కాకపోయినా షూటింగ్ ప్రారంభానికి ముందే హీరోహీరోయిన్లు అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలగడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.

ఓ కాదల్ కణ్మణి వంటి విజయవంతమైన చిత్రం తరువాత మణిరత్నం ఒక భారీ ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మొదట మళయాళ సూపర్‌స్టార్ మమ్ముటి, కార్తీ హీరోయిన్లుగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా నటించనున్నట్లు చెప్పుకున్నారు. ఆ తరువాత కార్తీ, దుల్కర్‌సల్మాన్‌లు హీరోలుగానూ, కీర్తీసురేశ్, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది.

అలాటిది ఇక షూటింగ్‌రెడీ అవ్వడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా చిత్రం నుంచి దుల్కర్‌సల్మాన్ తప్పుకున్నారు. ఆయన ప్రతాప్‌పోత్తన్ దర్శకత్వంలో మలయాళ చిత్రాన్ని అంగీకరించడమే మణిరత్నం చిత్రాన్ని చేయలేకపోవడానికి కారణంగా తెలిసింది. మణిరత్నం దుల్కర్‌సల్మాన్ స్థానంలో తెలుగు నటుడు నానిని తీసుకున్నారు.

ఇక అంతా సెట్ అయిపోయింది అనుకున్నారు. అంతా అవ్వలేదనేవిధంగా తాజాగా మణి చిత్రానికి కీర్తీసురేశ్  హ్యాండ్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ నిర్మాత సురేశ్ స్పష్టం చేశారు. కారణాన్ని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొంటూ తన కూతురు మణిరత్నం చిత్రం నుంచి వైదొలగిన విషయం నిజమేనన్నారు. ఆ చిత్రంలో కీర్తీ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. మరో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో ఇప్పుడే సెకెండ్ హీరోయిన్ పాత్ర చేయడానికి కీర్తీకి ఇష్టం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement