Kirti Suresh
-
బ్యాంక్ రెడీ అవుతోంది!
మహేశ్ బాబు కోసం ఓ బ్యాంక్ రెడీ అవుతోంది. నెల రోజుల పాటు మహేశ్ ఈ బ్యాంక్‌కి వెళుతుంటారు. ఇంతకీ బ్యాంక్ కథ ఏంటీ అంటే.. ‘సర్కారువారి పాట’లో మహేశ్‌బాబు బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారనే వార్త వినపడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో బ్యాంక్ సెట్ వేస్తున్నారని సమాచారం. ఈ సెట్లో నెల రోజుల చిత్రీకరణ ప్లాన్ చేశారట. వచ్చే నెల ఈ షూటింగ్ ప్రారంభమయ్యే చాన్స్ ఉంది. ముందు అమెరికా షెడ్యూల్ జరిపి, ఆ తర్వాత ఇక్కడ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల ప్లాన్ మారింది. ముందు ఈ సెట్లో షూట్ చేసి, మార్చిలో అమెరికా షెడ్యూల్ ప్రారంభించాలనుకుంటున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు. -
వీనుల విందు!
మహేశ్‌బాబు పుట్టినరోజున (ఈ నెల 9) ఆయన అభిమానుల కోసం ఓ మ్యూజికల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారట ‘సర్కారువారి పాట’ చిత్రబృందం. సూపర్ స్టార్ కష్ణ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను (సర్కారువారి పాట), మహేశ్ ప్రీ–లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని ఓ వీనుల విందైన ట్యూన్‌ని ఆగస్ట్ 9న వినిపించబోతున్నారట. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు, కీర్తీ సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లల్స్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఓ హీరోయిన్గా బాలీవుడ్ భామ అనన్యా పాండే నటిస్తారని సమాచారం. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. -
మణికి కీర్తిసురేశ్ హ్యాండ్
షూటింగ్ ప్రారంభమయ్యే వరకే కాదు, మొదలయిన తరువాత కూడా చిత్రంలో ఎవరుంటారో? ఉండరో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. 30,40 శాతం షూటింగ్ పూర్తయిన తరువాత కూడా కథానాయికలు చిత్రం నుంచి వైదొలగడమో, తొలగించడమో జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మణిరత్నం చిత్రానికి అలాంటి పరిస్థితి కాకపోయినా షూటింగ్ ప్రారంభానికి ముందే హీరోహీరోయిన్లు అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలగడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఓ కాదల్ కణ్మణి వంటి విజయవంతమైన చిత్రం తరువాత మణిరత్నం ఒక భారీ ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మొదట మళయాళ సూపర్‌స్టార్ మమ్ముటి, కార్తీ హీరోయిన్లుగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా నటించనున్నట్లు చెప్పుకున్నారు. ఆ తరువాత కార్తీ, దుల్కర్‌సల్మాన్‌లు హీరోలుగానూ, కీర్తీసురేశ్, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అలాటిది ఇక షూటింగ్రెడీ అవ్వడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా చిత్రం నుంచి దుల్కర్సల్మాన్ తప్పుకున్నారు. ఆయన ప్రతాప్పోత్తన్ దర్శకత్వంలో మలయాళ చిత్రాన్ని అంగీకరించడమే మణిరత్నం చిత్రాన్ని చేయలేకపోవడానికి కారణంగా తెలిసింది. మణిరత్నం దుల్కర్సల్మాన్ స్థానంలో తెలుగు నటుడు నానిని తీసుకున్నారు. ఇక అంతా సెట్ అయిపోయింది అనుకున్నారు. అంతా అవ్వలేదనేవిధంగా తాజాగా మణి చిత్రానికి కీర్తీసురేశ్ హ్యాండ్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ నిర్మాత సురేశ్ స్పష్టం చేశారు. కారణాన్ని ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ తన కూతురు మణిరత్నం చిత్రం నుంచి వైదొలగిన విషయం నిజమేనన్నారు. ఆ చిత్రంలో కీర్తీ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. మరో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో ఇప్పుడే సెకెండ్ హీరోయిన్ పాత్ర చేయడానికి కీర్తీకి ఇష్టం లేదన్నారు.