
కుక్క లేదా ఇతర జంతువులు కొరికితే వెంటనే భయపడతాం ఇంజెక్షన్లు చేయించుకుంటారు. అదే చేప, పీత లాంటివి అనగానే కొందరూ లైట్ తీసుకుంటారు. ఎందుకుంటే అవి విషపూరితం కాదనే ఫీలింగ్. అలానే ఈ వ్యక్తి కూడా చేప కదే అని చాలా లైట్ తీసుకున్నాడు. పాపాం చివరికి అది అతడి ఊహించిన బాధనే మిగిల్చింది. ఇలా జరగుతుందని కల్లో కూడా అనుకోలేదని వాపోతున్నాడు పాపం. ఇంతకీ అతడికీ ఏం జరిగిందంటే..
కేరళలోని కన్నూర్ జిల్లాలోని థలస్సెరీ ప్రాంతానికి చెందిన టి.రాజేశ్ అనే రైతు తన ఇంటికి సమీపంలో ఉన్న చిన్న నీటిగుంటని క్లీన్ చేశాడు. సరిగ్గా ఆ సమయంలో కడు అనే జాతికి చెందిన చేప(క్యాట్ ఫిష్ జాతికి చెందింది) అతడి వేలిని కొరుకింది. దాంతో అతడు స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. నయం అయిపోతుందిలే అని ధీమాగా ఉన్నాడు.
అంత సీరియస్‌గా పట్టించుకోలేదు. కానీ రానురాను భాధ ఎక్కవై చెయ్యి కదిలించాలంటేనే నొప్పితో విలవిల్లాడిపోయే పరిస్థితికి దిగజారిపోయింది. ఇక ఆ బాధకు తాళ్లలేక దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అక్కడ వైద్యులు అతడికి ఎందువల్ల ఇలాంటి పరిస్థి వచ్చిందన్నది అంచనా వేయలేకపోయారు. దాంతో ఆ వైద్యులు కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
బేబీ మెమోరియల్ వైద్యులు రాజేష్‌కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి.. గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. చేతి వేళ్లను తొలగించకపోతే ఆ బ్యాక్టీరియా పైకి పాకి.. మరింత సోకే ప్రమాదం ఉందని చేతివేళ్లను తొలగించారు వైద్యులు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
అప్పటికే ఆలస్యం కావడంతో ఆ ఇన్ఫెక్షన్ అరచేయి అంతా వ్యాపించేసింది. దీంతో వైద్యులు పూర్తిగా ఆ అరచేతి మొత్తాన్ని తొలగించారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..బురద నీటిలో నివశించే క్లోస్ట్రడియం పెర్ఫ్రింజెన్స్ అనే బ్యాక్టీరియ వల్ల ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది.
ఈ బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించి కణాలపై దాడి చేసి..ఇన్ఫెక్షన్‌ని మెదడు వరకు వ్యాప్తి చేసి ప్రాణాంతకంగా మారుస్తుంది. ఇక్కడ ఈ రైతు రాజేష్ కేసులో ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి అరచేతిని తొలగించడం తప్పమరో అవకాశం లేదు. బురదలో ఉండే ఆ చేప కారణంగానే ఈ బ్యాక్టీరియా శరీరం లోపలికి ప్రవేశించిందని చెప్పుకొచ్చారు వైద్యులు.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment