ప్రణీత ఎప్పుడూ సెకండేనా? | pranitha second heroine role in surya movie | Sakshi
Sakshi News home page

ప్రణీత ఎప్పుడూ సెకండేనా?

Published Fri, Jul 31 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

ప్రణీత ఎప్పుడూ సెకండేనా?

ప్రణీత ఎప్పుడూ సెకండేనా?

 కాలం కలిసొస్తే నడిచొచ్చే బిడ్డ పుడతారంటారు. అది కలిసి రానోళ్లకు నటి ప్రణీత పరిస్థితే. మధ్యలో ఆమె గొడవ ఎందుకంటారా? ఆకర్షణీయమైన ముఖారవిందం, నవ నవ లాడే వయసు ప్రణీత సొంతం. ఒక రకంగా చెప్పాలంటే ఆమెలోని ఈ లక్షణాలే హీరోయిన్‌ను చేశాయి. మలయాళం, తమిళ్, తెలుగు అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ హీరోయిన్‌గా నటించింది. దీంతో భవిష్యత్ గురించి బోలెడు కలలు కనేసింది. అయితే హీరోయిన్‌గా ఈ అమ్మడికి ఏ భాషలోను మంచి హిట్ రాలేదు.
 
  దీంతో సెకండ్ హీరోయిన్ పాత్రలు పోషించడానికి సిద్ధమైంది.  అలా ఏ ముహుర్తాన ఆ నిర్ణయం తీసుకుందో వరుస అలాంటి పాత్రల్లే వస్తున్నాయి. తెలుగులో అత్తారింటికి దారేదిలో రెండవ హీరోయిన్‌గా ప్రణీత నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించినా ఈమెకు హెల్ప్ అవ్వలేదు. తర్వాత తమిళంలో సూర్య సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. అయితే ఇది నటి ఎమిజాక్సన్ నిరాకరించిన పాత్ర. అంతేకాదు ఇందులోను రెండవ హీరోయిన్‌నే. ఇదీ నిరాశపరచడంతో మరో అవకాశం రాలేదు.
 
  ఇలాంటి పరిస్థితిలో తెలుగులో ప్రముఖ హీరో బాలకృష్ణ సరసన నటించే అవకాశం వచ్చిందట. అయితే ఇందులోను నటి అంజలి ఆల్‌రెడీ బుక్ అవడంతో షరామామూలుగా సెకండ్ హీరోయిన్ పాత్ర కావడంతో అలాంటి పాత్రలు పోషించి విసిగెత్తడంతో ఆ అవకాశాల్ని వదులుకుందట.  ఇకపై రెండవ హీరోయిన్ పాత్ర చేసేది లేదంటూ నిర్ణయాన్ని తీసేసుకుందట. పాపం వచ్చే అవకాశాలు పోతాయేమో! ఆ నిర్ణయం మార్చుకుంటే మంచిదంటున్నారు సినీ వర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement