Pranitha
-
ఫ్యాషన్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ ప్రణీత..మరింత గ్లామరస్‌గా టిల్లు భామ నేహాశెట్టి..!
ఫ్యాషన్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ ప్రణీత...లవ్ యాపా మూడ్‌లో బాలీవుడ్ భామ ఖుషీకపూర్...మరింత గ్లామరస్‌గా టిల్లు భామ నేహాశెట్టి..గేమ్ ఛేంజర్ హీరోయిన్ భర్త స్పెషల్ విషెస్..అలాంటి డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ నుస్రత్ బరుచ్చా.. View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
ముద్దుల కూతురు నామకరణం వేడుక.. ఫోటోలు షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ (ఫోటోలు)
-
మా అక్క ఎక్కువగా కలవదు మాట్లాడదు
-
మరింత అందంగా ప్రణీత.. సన్నజాజిలా రకుల్ ప్రీత్
ఆరెంజ్ కలర్ డ్రస్సులో శ్రీముఖి కిల్లర్ లుక్స్వైట్ ఔట్ఫిట్లో దేవకన్యలా మెరిసిపోతున్న తృప్తి దిమ్రిబికినీలో కేక పుట్టించేస్తున్న హాట్ బ్యూటీ సాక్షి అగర్వాల్బాడీని విల్లులా వంచేస్తున్న యూట్యూబర్ దీప్తి సునైనానిగనిగా మెరిసిపోతున్న 'అత్తారింటికి దారేది' బ్యూటీ ప్రణీతక్లాస్ లుక్‌లో క్యూట్‌గా చూస్తూ చాందినీ చౌదరిబీచ్ ఒడ్డున మత్తెక్కించే సోయగాలతో మౌనీరాయ్ View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
రెడ్ డ్రెస్‌లో హనీ రోజు అందాలు.. అత్తారింటికి దారేది భామ పోజులు అదరహో!
లైట్ కలర్ డ్రెస్‌లో అత్తారింటికి దారేది భామ హోయలు.. పిజ్జా తింటానంటోన్న బుట్టబొమ్మ.. ఫ్యామిలీతో చిల్ అవుతోన్న సీతారామం బ్యూటీ.. గ్లామర్‌తో కవ్విస్తోన్న శ్రద్ధాదాస్.. రెడ్ డ్రెస్‌లో హనీ రోజు అందాలు.. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
స్విమ్ సూట్లో అప్పటి గ్లామర్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
అత్తారింటికి దారేది చిత్రంతో కుర్రకారు గుండెలను పిండేసిన ముద్దుగుమ్మ ప్రణీత. ఈ బ్యూటీ తెలుగులో పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే... హీరోయిన్ ప్రణీత సుభాష్ టర్కీలో టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఒకరి తల్లి కూడా తన అందంతో కొత్త నటీమణులకు ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పుడు టర్కీలో ఓ బీచ్‌లో నిలబడి ఉన్న ఫోటోను ఆమె రిలీజ్ చేసింది . అయితే ఆ ఫోటోలో ఆమె బ్లూ కలర్ స్విమ్ సూట్ ధరించి ఉంది. నటి ప్రణీత సుభాష్ ఇటీవల ఏ సినిమాలోనూ కనిపించలేదు. అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. నటి ప్రణీత సుభాష్ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. 'చాలా హాట్‌గా ఉంది కానీ పూర్తి ఫోటో లేదని ఒకరు కామెంట్ చేస్తే.. 'వావ్, మీరు ఎల్లప్పుడూ చాలా అందంగా కనిపిస్తారంటూ హబీబీ కమ్ టు ఇండియా అని తెలిపారు. మరోకరైతే దయచేసి టర్కీకి వెళ్లవద్దు.. ఇది శత్రు దేశమని తెలిపారు. కొన్నేళ్లుగా నటనకు విరామం ఇచ్చిన ప్రణిత కొద్దిరోజుల క్రితం రామావతార్ చిత్రాన్ని ప్రకటించింది. రిషి, ప్రణీత ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
స్టన్నింగ్ లుక్‌లో అత్తారింటికి దారేది భామ.. పింక్ డ్రెస్‌లో నమ్రత!
►డిసెంబర్ పిక్స్ షేర్ చేసిన మాళవిక ►పింక్ డ్రెస్‌లో నమ్రత శిరోద్కర్ లుక్స్ ►స్టన్నింగ్ లుక్‌లో అత్తారింటికి దారేది భామ ప్రణీత ►పారిస్‌లో చిల్ అవుతోన్న హెబ్బా పటేల్ ►క్రిస్మస్ మూడ్‌లోనే బుట్టబొమ్మ ►క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న దేవర భామ జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
నిధి అగర్వాల్ అలాంటి పోజులు.. బికినీలో ఆ హీరోయిన్!
మత్తెక్కించే పోజుల్లో 'బిగ్‌బాస్' దీప్తి సునయన ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసిపోతున్న అరియానా చాన్నాళ్ల తర్వాత నిధి అగర్వాల్ గ్లామర్ ట్రీట్ చీర కట్టినా ఈషా రెబ్బా అస్సలు తగ్గట్లేదుగా బికినీలో కనిపించిన షాకిచ్చిన హీరోయిన్ ప్రణీత డిజైనర్ చీరలో వావ్ అనిపిస్తున్న 'బ్రహ్మస్త్ర' బ్యూటీ క్యూట్ పోజుల్లో వావ్ అనిపిస్తున్న 'జైలర్' కోడలు View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్
హీరోయిన్ ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆకట్టుకునే కళ్లతో పాటు అంద,చందాలతో తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'రభస', 'డైనమైట్', ‘అత్తారింటికి దారేది’లాంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. గతేడాది ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ప్రణీత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ప్రణీత తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అవి కాస్త వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్స్ ఆమెను విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వారికి ప్రణీత గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘భీమన అమావాస్య’సందర్భంగా అనవాయితీ ప్రకారం నా భర్తకు పాదపూజ చేశాను. ప్రతి ఏడాది ఇలానే చేస్తాను. ఆ ఫోటోలను షేర్ చేసినందుకు గతంలో కూడా నేను విమర్శలు ఎదుర్కొన్నాను. అలా నన్ను ట్రోల్ చేసేవారికి ఇది పితృస్వామ్య రాజ్యంలా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం ఈ పూజ సనాతన ధర్మంలో ఒక భాగమే. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి పూజలకు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎన్నో కథలు కూడా హిందూ పురాణాల్లో ఉన్నాయి. మన సంస్కృతిలో అందరి దేవతలను ఒకేలా పూజిస్తాం’అని ప్రణీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. భీమన అమావాస్య కన్నడ నెల ఆషాడ (జూలై - ఆగస్టు)లో చంద్రుడు లేని రోజు (అమావాస్) నాడు జరుపుకుంటారు. ఈ రోజున మహిళలు తమ భర్తలు మరియు సోదరుల క్షేమం కోసం ప్రార్థిస్తారు. ఈ ఆచారాన్ని దీపస్తంభ పూజ అని కూడా అంటారు. తుళునాడుకు ఇది పెద్ద పండగ. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లో భీమన అమావాస్యను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
ట్రెండీ లుక్‌లో ప్రణీత ఫోజులు.. సమ్మర్లో చిల్ అవుతోన్న ఇస్మార్ట్ శంకర్ భామ
ట్రెండీ లుక్‌లో అత్తారింటికి దారేది భామ ప్రణీత సన్ని లియోన్ ట్రెండీ అవుట్ ఫిట్ లుక్స్ ఫ్యాషన్ డ్రెస్‌లో ప్రియమణి ఫోజులు చిల్ అవుతూ సమ్మర్‌ను ఎంజాయ్ చేస్తోన్న నభా నటేశ్ View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
మార్చి 3న ‘రిచి గాడి పెళ్లి’
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రిచి గాడి పెళ్లి’. కెఎస్ హేమరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత కె యస్ హేమరాజ్ మాట్లాడుతూ.. "రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య ఫోన్ లోజరిగే గేమ్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఆ ఆట వల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి , ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” , శ్రీమణి, రాసిన నా నిన్నలలో కన్నులలో అనే పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు. -
చిరు పాటకు అషు స్టెప్పులు.. ముద్దుల కూతురితో ప్రణీత ఆటలు
చిరంజీవి పాటకు అషు రెడ్డి స్టెప్పులు తన కూతురితో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది హీరోయిన ప్రణీత పొట్టి దుస్తుల్లో ‘ఖుషి’ భామ భూమిక.. న్యూ ఇయర్ సందర్భంగా కొత్త ఫోటోలను అభిమానులతో పంచుకుంది View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
తల్లి కాబోతున్న 'అత్తారింటికి దారేది' హీరోయిన్
ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 'నా భర్త34వ పుట్టినరోజున దేవుడు మాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ప్రణీత ఆమె భర్తను హగ్ చేసుకొని పట్టలేని ఆనందంతో కనిపిస్తుంది. ఈ సందర్భంగా ప్రెగ్నెన్సీ కిట్ సహా స్కానింగ్‌కు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంది. దీంతో పలువురు ప్రముఖులు సహా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతేడాది వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కరోనా ఆంక్షల నడుమ అతికొద్ది మంది సన్నిహితులు, బంధువు సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇక ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ప్రణీత 'రభస', 'డైనమైట్' సహా పలు చిత్రాల్లో నటించింది. పవన్‌కల్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించిన 'బాపు బొమ్మ'గా పాపులర్ అయ్యింది. View this post on Instagram A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) -
‘ది లెగసీ ఆఫ్ ఇండియన్ వీవ్’ప్రదర్శనకి అతిథిగా ప్రణీత!
ప్రముఖ డిజైనర్ దీప్తి గణేష్ ఆధ్వర్యంలో మద్రాస్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్‌లో 'ది లెగసీ ఆఫ్ ఇండియన్ వీవ్' పేరుతో రూపొందించిన డిజైనర్ దుస్తులను ప్రదర్శన ఈ నెల 26న చెన్నైలో నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో అత్తారింటికి దారేది సినిమా ఫేం ప్రణీత ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా, సరికొత్తదనాన్ని జోడించి రూపొందించిన విభిన్న రీతులతో కూడిన డిజైన్లను షోస్టాపర్‌గా నిలిచి మిగిలిన మోడల్స్‌తో కలిసి ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో దీప్తి గణేష్ మాట్లాడుతూ.. ‘సంప్రదాయ చేనేత కార్మికులు చేతితో రూపొందించిన వాటిని నా డిజైన్లకు ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నాను. వాటికి క్లాసిక్ లుక్స్ తీసుకొచ్చి నేటి తరానికి, కొత్తదనానికి స్వాగతం పలుకుతూ రూపొందిస్తున్నాను. నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా నా డిజైన్లు ప్రతిబింబిస్తాయి. మారుతున్న కాలానికి, అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయడం వల్లనే విజయాన్ని సాధించే వీలుంటుంది’అన్నారు. దీప్తి గణేష్ విషయానికొస్తే.. ఆమె ఒక ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్. సినీ నటులు తమన్నా, రాశి ఖన్నా, సుమ కనకాల, రోజ, జయసుధ తదితరులు చాలా మంది ఆమె డిజైన్ చేసిన దుస్తులను వాడుతారు. -
పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలోని బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ప్రణీతకు గత ఐదు సంవత్సరాలుగా ప్రశాంత్‌తో పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి యువతిని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు. చదవండి: (వివాహేతర సంబంధం: మైనర్ బాలుడే నిందితుడు) అయితే ప్రియురాలిని మోసం చేసి శ్రీజ అనే మరో అమ్మాయిని ప్రశాంత్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని ప్రియురాలు గట్టిగా నిలదీయడంతో ఈనెల మూడున మిర్యాలగూడ తీసుకువెళ్ళి ఒక గదిలో పెళ్ళి చేసుకున్నాడు. అంతలోనే తనకు చెప్పాపెట్టకుండా మిర్యాలగూడ నుంచి ఇంటికి వచ్చేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే అతని తల్లి దండ్రులు ప్రశాంత్‌ను దాచిపెట్టి తమను ఏం చేసుకుంటారో చేసుకో పొమ్మంటున్నారని వాపోయింది. తనకు న్యాయం చేసే వరకూ ఊరుకునేది లేదని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను పీఎస్‌కు తరలించారు. -
వనస్థలిపురంలో ప్రణీత సందడి
-
నగరంలో ప్రణీత
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): నగరంలో సినీనటి ప్రణీత(అత్తారింటికి దారేది ఫేం) శుక్రవారం సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆమె సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తో కలిసి నగరంలో తళుక్కున మెరిశారు. ఆమెను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకుని ముచ్చటపడ్డారు. అనంతరం వీఐపీ రోడ్డులో ఏర్పాటు చేసిన సోమ రెస్టోబార్ను ప్రణీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. ప్రస్తుతం తెలుగులో ‘హాలో గురు ప్రేమ కోసమే రా’చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. తన తొలి హిందీ చిత్రం పాట శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేశామని, 5 మిలియన్ల మంది వీక్షించటం చాలా సంతోషంగా ఉందన్నారు. నగరంలో మంచి ఫుడ్ కోసం యువత ఎంతో ఆసక్తి కనబరుస్తారని, వారి అభిరుచులకు అనుగుణంగా ఆహారం అందించి సోమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ లోకనాథ్, నటుడు రాంకీ తదితరులు పాల్గొన్నారు. -
బాపు బొమ్మ ప్రణీత సందడి
-
నిక్కచ్చిగా మాట్లాడితే నిందిస్తారు
ఇటీవల జరిగిన ‘సౌత్ కాన్క్లేవ్ 2018’ సదస్సులో ‘సెక్సిజమ్ ఇన్ సినిమా’, ఇండస్ట్రీలో ఉన్న మేల్ డామినేషన్, క్యాస్టింగ్ కౌచ్ వంటి సంచలనాత్మక‡విషయాల గురించి కథానాయికలు ప్రణీత, శ్రుతీ హరిహరన్ తమ అభిప్రాయాలు చెప్పారు. హీరోయిన్స్... జస్ట్ ఐ–క్యాండీ: ప్రణీత ∙సినిమా ఇండస్ట్రీలోనే కాదు జెండర్ డిస్క్రిమినేషన్ (లింగ వివక్ష) అనేది ఎక్కడైనా ఉంది. స్త్రీ ఎక్కడైనా చిన్న చూపుకు గురవుతోంది. సినిమాలో హీరోయిన్స్ నిర్ణయాలకు అసలు విలువ ఉండదు. నా ఫస్ట్ సినిమాలో నేను రూమ్‌లోకి పరిగెత్తుకొని వెళ్లే షాట్ ఉంది. కెమేరా యాంగిల్ నా కంట్రోల్లో లేదు. సీన్‌ను స్లో మోషన్లో తీశారు. అది అలా తీయదగ్గది కాదు. అంత చిన్న షాట్‌ను అలా తీసేసరికి నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ∙లక్కీగా నాకు క్యాస్టింగ్ కౌచ్ వంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు. కానీ హీరోయిన్స్ తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెబితే కచ్చితంగా విమర్శలకు గురవుతారు. పార్వతి (మలయాళ కథానాయిక) విషయాన్నే తీసుకోండి. కేవలం ఒక స్టార్ హీరో నటించిన సినిమాలోని అభ్యంతరకరమైన దృశ్యం గురించి పాయింట్ రైజ్ చేసినందుకే సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురయ్యారామె. అలాగే, ఓ సూపర్ స్టార్ సినిమా పోస్టర్ని పేరు చెప్పకుండా ఒక హీరోయిన్ విమర్శిస్తే.. ఆమె ఆ హీరో అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ∙కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌కు పాత్ర అనేది ఏం ఉండదు. కేవలం ఐ–క్యాండీ (కనువిందు)గా, గ్లామరస్‌గా, బబ్లీగా కనిపిస్తే చాలు అంటారు. బట్ ఇటువంటి సినిమాల ద్వారా వచ్చే పాపులారిటీని కాదనలేం. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌కి చెందిన మేల్ ఆడియన్స్ హీరోయిన్లను గ్లామరస్‌గా చూడ్డానికి ఇష్టపడతారనుకుంటా. వాళ్లకు ఏం కావాలో అదే మేం చేస్తున్నాం. నాతో పాటు చెప్పులుంటాయి అన్నాను: శ్రుతీహరిహరన్ ∙సినిమాలో హీరోకి డాక్టర్, ఇంజనీర్, జర్నలిస్ట్ అని ఏదో ఒక ప్రొఫెషన్ ఉంటుంది. హీరోయిన్స్‌కు ఒక క్యారెక్టరైజేషన్ ఉండదు. కేవలం వారి అందచందాలను చూపించటానికే ఉపయోగపడతున్నారు. వారి శరీరం మీద సినిమా వ్యాపారం జరగడం విచారకరం. ∙నా 18 ఏళ్ల వయస్సులోనే క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నా. హీరోయిన్గా పరిచయం కాకముందు డ్యాన్సర్‌గా చేశా. అప్పుడు అభ్యంతరకర సంఘటనలు ఎదురైతే ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. మా కొరియోగ్రాఫర్‌ను అడిగితే ‘హ్యాండిల్ చేయటం రాకపోతే వదిలేయ్ అన్నారు’ దాంతో ఆ సినిమాను వదిలేశాను. ఆ తర్వాత ఒక బడా తమిళ ప్రొడ్యూసర్ నేను నటించిన కన్నడ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకొని, నన్నే నటించమన్నారు. ‘నాతో పాటుగా నలుగురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మాకు కావాల్సిన విధంగా నిన్ను ఎక్స్చేంజ్ చేసుకోదలిచాం’ అన్నారాయన. ఈసారి ఎలా డీల్ చేయాలో నాకో ఐడియా వచ్చింది. ‘‘నాతో పాటు ఎప్పుడూ స్లిప్పర్స్ క్యారీ చేస్తుంటాను’’ అని సమాధానం ఇచ్చాను. దాంతో ‘ఈ అమ్మాయితో వర్క్ చేయటం చాలా కష్టం’ అని న్యూస్ స్ప్రెడ్ చేశారు. నాకు ఆఫర్స్ రావటం తగ్గిపోయాయి. -
నాకే ఎందుకిలా?
తమిళసినిమా: నాకే ఎందుకిలా జరుగుతోందని వాపోతోంది నటి ప్రణీత. ఈ కన్నడ భామ మాతృభాషతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఆ క్రేజ్‌తో వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తోంది. అయితే దక్షిణాదిలో ఏ భాషలోనూ ప్రముఖ కథానాయకిగా పేరు సంపాదించుకోలేకపోతోంది. తెలుగులో మొదట సోలో హీరోయిన్‌గానే పరిచయమైంది. ఆ తరువాత పవన్‌కల్యాణ్ వంటి స్టార్‌కు జంటగా నటించినా సెకెండ్ హీరోయిన్ పాత్రలే వస్తున్నాయని వాపోతోంది. ఇక తమిళంలో అయితే కార్తీకి జంటగా శకుని చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో గుర్తింపు పొందలేకపోయింది. నటుడు సూర్య హీరోగా నటిం చిన మాస్ చిత్రంలోనూ రెండవ హీరోయిన్ పాత్రకే పరిమితం అయ్యింది. జెమినీగణేశనుమ్ సురుళీరాజవుమ్, ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్ వం టి కొన్ని చిత్రాల్లో నటించింది. ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్ చిత్రంలో నెగిటివ్ పాత్రను కూడా ధైర్యం చేసి పోషించింది.అయితే ఆ పాత్రకు ఆమెకు ప్రశంసలు మాట అటుంచితే విమర్శలే ఎక్కువ వచ్చాయన్నది గమనార్హం. అయినా స్టార్ ఇమేజ్ను పొందలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా లేదు. దీంతో నాకే ఎందుకిలా జరుగుతోంది.నేను అందంగా లేనా, నటనా ప్రతిభను చూపడం లేదా? అంటూ తన ఆవేదనను ట్విట్టర్లో వ్యక్తం చేసింది. అయితే నా కూ ఒక టైమ్ వస్తుంది అనే ఆశాభావాన్ని వ్య క్తం చేస్తున్న ప్రణీత ప్రస్తుతం కన్నడంలో ఒక చిత్రం, మలయాళంలో ఒక చిత్రం చేస్తోంది. -
మహబూబాబాద్ లో ప్రణీత సందడి
-
అలాంటి అలవాటు నాకు లేదు
పార్టీలకు, పబ్‌లకు వెళ్లే అలవాటు నాకు లేదు అంటోంది నటి ప్రణీత. ఈ బెంగళూరు బ్యూటీ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ అన్ని భాషల్లోనూ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఏ భాషలోనూ ఇంకా ప్రముఖ కథానాయకి స్థాయికి చేరుకోలేదు. కోలీవుడ్‌లో ఉదయన్ చిత్రంతో నాయకిగా ఉదయించిన ఈ అమ్మడు ఆ తరువాత కార్తీకి జంటగా శకుని, సూర్యతో మాస్, జై సరసన ఎనకు వాయ్‌ంద అడిమైగళ్ వంటి చిత్రాల్లో నటించినా అవేవీ ఆశించిన విజయాలను సాధించికపోవడంతో ప్రణీత మార్కెట్ వేడెక్కలేదు. అయినా ఏం పర్వాలేదు. నటన అన్నది నా ఫ్యాషన్ మాత్రమే అంటున్న ప్రణీతతో చిన్న చిట్‌చాట్ తమిళసినిమా: ⇒ కోలీవుడ్‌లో ఎక్కువగా నటించడం లేదే? ♦ అందుకు నా పాలసీ కూడా ఒక కారణం కావచ్చు. ఎక్కువ చిత్రాలు చేయాలన్న ఆసక్తి, వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవా లన్న ఆశ నాకు లేవు. మా అమ్మానాన్న ఇద్దరు డాక్టర్లు. వారి కలలు, లక్ష్యాలు నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. మరో విషయం ఏమిటంటే అన్ని భాషల్లోనూ ఒకేసారి నటించ డం సాధ్యం కాదు. తెలుగు, కన్నడ భాషల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఆ భాషల్లో నటించడానికే సమయం సరి పోతోంది. అయితే తమిళంలో నటించాలన్న ఆసక్తి ఉంది. మంచి అవకాశం అనిపిస్తే అంగీకరిస్తున్నాను. ఇటీవల అధర్వతో నటించిన‘ జెమినీగణేశనుమ్ సురళీరాజనుమ్’ చిత్రంలో నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ⇒ ప్రస్తుతం హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉన్నట్లుందే? ♦ పోటీ అనేది అన్ని రంగాల్లోనూ ఉం టుంది. సినిమారంగంలో నూతన నటీమణులు చాలామందే వస్తున్నారు. అయితే ఎవరికి ఏది దక్కాలో అదే దక్కుతుంది. ప్రతిభను బట్టే అవకాశాలు వస్తుంటాయి. అందుకని నేనెవరినీ పోటీగా భావించను. ఎవరు బాగా నటించినా భుజం తట్టి అభినందిస్తా. ⇒ మీరు గ్లామర్‌కు అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారనే వారికి మీరిచ్చే సమాధానం? ♦ అని మీరంటున్నారు. ప్రేక్షకులెవరూ నా గ్లామర్ గురించి కామెంట్ చేయడం లేదు. తెలుగు చిత్రాల్లో హీరోయిన్లు ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుందన్న విషయం గురించి నేనూ విన్నాను. అయితే నేను నటించిన చిత్రాలు చూస్తే అలాంటి కామెంట్లకు అవకాశం ఉండదు. నన్నెవరూ గ్లామరస్‌గా నటించమని ఒత్తిడి చేయలేదు కూడా. కథ, పాత్రలకు తగ్గట్టుగానే నా నటన ఉంటుంది. ⇒ బాలీవుడ్ ఆశ లేదా? ♦ కలలో కూడా అలాంటి ఆశ లేదు. అసలు ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు. జీవితంలో ఎక్కువగా ఆశించకూడదు. ఒక వేళ ఆశపడింది జరగకపోతే చాలా నిరాశ పడాల్సి వ స్తుంది. అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాల్లో నాకు నచ్చిన, నాకు నప్పే పాత్రలను ఎంచుకుని నటిస్తున్నాను. నేను ఎన్నేళ్లు నటిస్తానో తెలియదు. అది నా చేతుల్లో లేదు. నటన నాకు ఫ్యాషన్. అందుకే నటిస్తున్నాను. ⇒ పబ్‌లకు పార్టీలకు వెళ్లే అలవాటు ఉందా? ♦ అసలు లేదు. ఇంకా చెప్పాలంటే నాకు సినిమారంగంలో స్నేహితులంటూ ఎవరూ లేరు. కాలేజీ స్నేహితులతోనే ఖాళీ సమయాల్లో గడుపుతాను. ⇒ ప్రేమ, పెళ్లి గురించి? ♦ నేనెవరిని ప్రేమించలేదు. పెళ్లి కూడా అమ్మానాన్నలు కుదిర్చిన అబ్బాయినే చేసుకుంటాను. ⇒ వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారట? ♦ హోటల్ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంది. అయితే అమ్మానాన్నలకు సొంతంగా బెంగళూరులో ఆస్పత్రి ఉంది. నటన చాలు ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను చూసుకో అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో! -
ముగిసిన గడువు
► వీవీ పోస్టులకు వెయ్యికి పైగా దరఖాస్తులు ► జిల్లాలో 236 పోస్టులు ► నేడు, రేపు సర్టిఫికెట్ల పరిశీలన ► 8న మెరిట్ జాబితా ∙10న తుది దశ ఎంపిక ► 12న పాఠశాలల్లో చేరిక సాక్షి, నిర్మల్: విద్యావాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. ప్రభుత్వ వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పూర్తిస్థాయిలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారన్న వివరాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఇంకా అందలేదు. అయితే ఒక్క నిర్మల్ మండలం పరిధిలోనే చివరి రోజు 300లకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా వెయ్యి మందికిపైగా దరఖాస్తు చేసుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 12న పాఠశాలల్లో చేరేలా... జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,011 ఉండగా సుమారు 1.15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో 236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 162 ఎస్జీటీ, 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అందులో ఉన్నాయి. విద్యావాలంటీర్ల ద్వారా ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఈ నెల మొదట్లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 2 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు. సోమవారంతో గడువు ముగిసింది. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడంతో సంఖ్య పరంగా విద్యాశాఖకు ఇంకా వివరాలు అందలేదు. కాగా మంగళ, బుధవారాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. ఈ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 3 పాస్‌పోర్టు సైజ్‌ఫొటోలతో సంబంధిత ఎంఈవో కార్యాలయాల్లో సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. జూన్ 8న తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. 9న ఆ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 10న తుది సెలక్షన్ జాబితాను విడుదల చేస్తారు. 12న పాఠశాలల పునఃప్రారంభం రోజు వీవీలు విధుల్లో చేరాల్సి ఉంటుంది. గతంలో ఆలస్యం ప్రభుత్వం ప్రతీ విద్యాసంవత్సరం ఆలస్యంగా విద్యావాలంటీర్ల నియామకాలు చేపట్టేది. దీంతో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నచోట విద్యార్థులకు సరైన బోధన జరగక నష్టపోయే పరిస్థితులు ఉండేవి. ప్రతీ ఏడాది జూలై, ఆగస్టు నెలల వరకు నియామక ప్రక్రియ జరగకపోవడంతో మూడు నెలల పాటు విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడేది. ఈ ఏడాది జూన్ మాసం వరకు డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించనప్పటికీ ఇంకా దానికి సంబంధించిన నోటిఫికేషనే విడుదల చేయలేదు. మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా జూన్‌లోనే వీవీ నియామకాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో తాత్కాలిక పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉపాధ్యాయుల కొరత సమస్యకు తాత్కాలికంగా ఉపశమనం కలగనుంది. విద్యావాలంటీర్లకు గతేడాది రూ.8వేల చొప్పున చెల్లించగా, ఈ విద్యాసంవత్సరం నెలకు రూ.12 వేలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పలువురు టీటీసీ, బీఈడీ పట్టాఉన్న నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా యూనిట్‌గా రోస్టర్ పాయింట్ జిల్లా యూనిట్‌గా మండలం వారీగా రోస్టర్ పాయింట్‌ను సిద్ధం చేశాం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మంగళ, బుధవారాల్లో సంబంధిత ఎంఈవోల వద్ద సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. జూన్ 12వ తేదీలోగా వీవీ పోస్టులను భర్తీ చేస్తాం. – ప్రణీత, డీఈవో -
ఆ ఆదాయమే బాగుంది
నటి ప్రణీత బహుభాషా నటే. అయినా కథానాయకిగా ఏ రంగంలోనూ ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయింది. తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో నటిస్తున్నా అవకాశాలూ అంతంత మాత్ర మే. అయితే ఈ మూడు భాషల్లోనూ కథానా యకిగానే పరిచయమైంది. కోలీవుడ్‌లో ఉదయం చిత్రం ద్వారా అరుళ్‌నిధికి జంటగా పరిచయమైనా ఆ చిత్రం పెద్దగా గుర్తింపునివ్వలేదు. ఆ తరువాత కార్తీతో జతకట్టే లక్కీచాన్స్ అందుకుంది. అదీ అమ్మడికి నిరాశే మిగిల్చింది. ఇక ఈ తరువాత ఇక్కడ హీరోయిన్గా అవకాశాలే అందుకోలేకపోయింది. ఆ మధ్య సూర్యకు జంటగా మాస్ అనే చిత్రంలో రెండో హీరోయిన్గా నటించినా ఉపయోగం లేకపోయింది. ఇటీవల జై హీరోగా నటించిన ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్ చిత్రంలో ప్రతినాయకిగా నటించింది. అదీ వర్కౌట్ కాలేదు. ఇక్కడే కాదు ఇతర భాషల్లోనూ ప్రణిత పరిస్థితి సేమ్ టు సేమ్. అయితే ఇప్పటికే వ్యాపారం రంగంలోకి దిగిన ఈ బ్యూటీ బెంగళూర్‌లో ఒక రెస్టారెంట్లో భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇక అవకాశాల కోసం నిరీక్షించడం అనవసరం అనుకుందేమో తాజాగా మోడలింగ్ రంగంలోకి రంగప్రవేశం చేయాలని నిర్ణయించుకుందట. ఇందుకు కారణాన్ని వెతుకున్న ప్రణీత ఆ రంగంలోనే ఆదాయం బాగుందని అంటోందట. సాధారణంగా హీరోయిన్లు మోడలింగ్ రంగం నుంచే సినీరంగానికి పరిచయం అవుతుంటారు. అలా మోడలింగ్ రంగం నుంచి మరోసారి సినీ ప్రముఖులను ఆకర్షించే ప్రయత్నం చేయాలనుకుంటుందనుకుంటా. ఈ అమ్మడు ఇప్పటికే పలు కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తోందన్నది గమనార్హం. -
ప్రణీత కొత్త అవతారం
నటి ప్రణీతను బహుభాషా నటి అనే అనాలి. మాతృభాష కన్నడంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్ అనిపించుకున్నా, అంతగా మార్కెట్‌ను పెంచుకోలేకపోయింది. చక్కని శరీరాకృతి, ఆకర్షణీమైన అందం వంటి ప్లస్ పాయింట్స్ ఉన్నా పాపం ఎందుకో రెండో హీరోయిన్ పాత్రలకే పరిమితం అవుతోంది ప్రణీత. తమిళంలో కార్తీ వంటి స్టార్ హీరోతో శకుని చిత్రంలో నటించినా ఆ చిత్రం నిరాశనే మిగిల్చిది. ఆ తరువాత కూడా కోలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగిడినా అత్తారింటికి దారేది లాంటి భారీ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ పాత్రతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. నటిగా అవకాశాలను నమ్ముకంటే లాభం లేదనుకుందో ఏమో ఇటీవల బెంగుళూర్లో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా ప్రణీతకు నిర్మాతగా మారాలనే కోరిక పుట్టిందట. త్వరలోనే చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీని గురించి ప్రణీత తెలుపుతూ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్న విషయం నిజమేనంది. ఇతర కథానాయికల కంటే భిన్నంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ భామ ఏ భాషలో చిత్రాన్ని నిర్మించేది క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో అధర్వతో నటించిన జెమినీగణేశనుం సురుళీరాజావుం చిత్రం త్వరలో తెరపైకి రానుంది. -
నలుగురు నాయికలతో అధర్వ రొమాన్స్
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు కథానాయికలతో రొమాన్స్ చేస్తూ వస్తున్నారు యువ నటుడు అధర్వ. ఈటీ, కణిదన్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత అధర్వ కథా నాయకుడిగా నటిస్తున్న చిత్రం జెమినీగణేశనుం సురుళిరాజానుం. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అమ్మాక్రియేషన్స్ టీ. శివ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈయన సంస్థకు ఇది జూబ్లీ చిత్రం అవుతుంది. ఇందులో అధర్వకు జంటగా నటి ఐశ్వర్యారాజేశ్, రెజీనా, ప్రణీత, అతిథి ఇలా నలుగురు బ్యూటీస్ నటిస్తున్నారు. కథ డిమాండ్ మేరకే నలుగురు కథానాయికలను ఎంచుకున్నామన్నారు దర్శకుడు ఓడం ఇళవరసు. చిత్రంలో ఈయనే హీరో, వీళ్లే హీరోయిన్లు, వీళ్లే కమెడియన్లు అన్నదేమీ ఉండదని.. వారి వారి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. రొమాం టిక్ కామెడీ కథా చిత్రంలో నటించాలన్న అధర్వ కోరిక ఈ చిత్రంతో తీరనుందని చెప్పారు. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తునట్లు తెలిపారు. ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతం, శ్రీసరవణన్ ఛాయాగ్రాహణం అందిస్తున్నారు. -
నిర్మాతగా మారుతున్న పవన్ హీరోయిన్
హీరోయిన్గా టాప్ హీరోల సరసన సినిమాలు చేసినా.. స్టార్ స్టేటస్ అందుకోలేకపోయిన హీరోయిన్ ప్రణీత సుభాష్. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా.. ప్రణీతకు రావాల్సిన స్ధాయిలో గుర్తింపు రాలేదు. దీంతో తెలుగు సినిమాలకు టాటా చెప్పేసిన ఈ భామ తమిళ కన్నడ సినిమాల మీద దృష్టి పెట్టింది. అక్కడ అవకావాలు బాగానే వస్తున్న స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో బిజినెస్ మీద దృష్టి పెట్టిన ప్రణీత, హోటల్ రంగంలోకి అడుగుపెట్టి మంచి విజయం సాధించింది. అదే జోరులో ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉంది. హీరోయిన్ గా కొనసాగుతూనే స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే నిర్మాతగా మారేందుకు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసిందట. త్వరలోనే తన బ్యానర్ లో తెరకెక్కబోయే సినిమాపై ప్రకటన చేయనుంది.. ఈ సాండల్‌వుడ్ బ్యూటీ. -
అలా ఎవరూ చేయలేదు!
నాపై అలా ఎవరూ ఒత్తిడి చేయలేదని అంటోంది నటి ప్రణిత. అమ్మో బాపుగారి బొమ్మో పాట వర్ణణకు పేటెంట్ ఈ సుందరి. గుండరాల్లాంటి కళ్లతో కుర్రకారును ఇట్టే ఆకర్షించే ప్రణితను కథానాయకి పాత్రలు మాత్రం పెద్దగా దరి చేరడం లేదు. తెలుగు చిత్రం అత్తారింటికి దారేదితో సహా చాలా చిత్రాల్లో రెండవ కథానాయకి పాత్రలకే పరిమితం అవుతోంది. తమిళంలో ఉదయన్ చిత్రంలో నాయకిగా పరిచయమైన ప్రణిత ఆ తరువాత శకుని, మాస్ లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. ఇటీవల విడుదలైన ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను చేసింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఒక్కో చిత్రం చేతిలో ఉన్న ప్రణితతో చిట్‌చాట్. ప్ర: తమిళంలో అవకాశాలు తగ్గినట్లున్నాయే? జ: అధిక చిత్రాల్లో నటించాలన్న కోరిక, ఏడాది మొత్తం నటిస్తూ బిజీగా ఉండాలన్న ఆశ నాకు లేవు. నా తల్లిదండ్రులు డాక్టర్లు. వారి కలలు, లక్ష్యం నెరవేర్చే మంచి కూతురిగా ఉండాలనే ఆశిస్తున్నాను. తెలుగు, కన్నడ భాషల్లో నాకు నటిగా మంచి ఆదరణే లభిస్తోంది. అక్కడి చిత్రాలు పూర్తి చేయడానికే టైమ్ సరిపోతోంది. ప్ర: బాలీవుడ్ ఆశ లేదా? అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తున్నారా? జ: హిందీ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి లేదు. అక్కడి వరకూ ఎందుకు మాలీవుడ్ చిత్రాలే చేయలేదు. ప్ర: రోజుకో భాషలో పూటకో కథానాయకి అంటూ కొత్త వారు వస్తున్నారు. వారితో పోటీని ఎలా ఎదుర్కొంటున్నారు? జ: నిజమే పలు భాషల్లో పలువురు నటీమణులు, సాంకేతిక కళాకారులు పరిచ యం అవుతున్నారు. అయితే వాళ్లను ఎం దుకు పోటీగా భావించాలి? ఇక్కడ ఎవరికి ఎవరూ పోటీ కాదు. వారి వారి ప్రతి భ, శ్రమనే ఉన్నతి స్థాయికి చేరుస్తాయి. ప్ర: తెలుగు చిత్రాల్లో గ్లామర్‌కు గేట్లు తెరిచారట? జ: తెలుగులో అధిక గ్లామర్‌ను ఆశిస్తారనే ప్రచారం ఉన్న మాట నిజమే. నాకక్కడ హోమ్లీ ఇమేజ్ ఉంది. గ్లామరస్‌గా నటించమని ఇప్పటి వరకూ నన్నెవరూ ఒత్తిడి చేయలేదు. ప్ర: ఇంకా ఎంత కాలం నటిగా కొనసాగుతారు? జ: అది నా చేతిలో లేదు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలంటూ ఏమీ లేవు. ఈ రోజు మంచిగా గడిచిపోయిందా? అన్నదాని గురించే ఆలోచిస్తాను. ఇక నటిగా అంటారా అభిమానులు ఆదరించే వరకూ నటిస్తాను. ప్ర: ఎలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు? జ: బాహుబలి చిత్రంలో నటించిన కథానాయికలందరూ నాకిష్టమైన వారే. అదే విధంగా హిందీ చిత్రం బాజీరావ్ మస్తానీలో దీపికాపదుకొణె నటన చాలా నచ్చింది. అలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను. ప్ర: అవార్డులను ఆశిస్తున్నారా? జ: నాకు అభిమానుల చప్పట్లు, ప్రశంసలు, మంచి విమర్శలే ముఖ్యం. ఉత్తమ నటి అవార్డు లభిస్తే సంతోషమే. అంతే గానీ అవార్డుల కోసమే నటించాలనుకోవడం లేదు. ప్ర: చివరి ప్రశ్న. పెళ్లెప్పుడు చేసుకుంటారు? జ: ఇప్పటి వరకూ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఎవరినీ ప్రేమించలేదు. అలాంటి ఆలోచన కూడా లేదు. అమ్మానాన్నలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాను. -
నెల్లూరులో ప్రణీత సందడి
-
నలుగురు బ్యూటీస్‌తో అధర్వ
యువ నటుడు అధర్వ నలుగురు భామలతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. కనిదన్ చిత్రం తరువాత నటుడు అధర్వ నటిస్తున్న చిత్రం జెమినీగణేశనుమ్ సురుళిరాజనుమ్. ఇందులో ఆయన సరసన రెజీనా, ప్రణీత, ఐశ్వర్య రాజేశ్, ఆనంది నాయికలుగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సూరి, నాన్‌కడవుల్ రాజేంద్రన్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాత టీ.శివ అమ్మా క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది. కాగా ఓడమ్ ఇళవరసు కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది రొమాంటిక్ లవ్, కామెడీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. అమ్మాయిల తొలి ప్రేమ వారి జీవితాల్లో ఎంత ప్రభావం చూపుతుందో అన్నది చాలా అందంగా చెప్పనున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను మధురైలో పూర్తి చేసినట్లు చెప్పారు. రెండో షెడ్యూల్‌ను ప్రస్తుతం ఊటీలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. చిత్రాన్ని డిసెంబర్లో తెరపై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాత టీ.శివ తెలిపారు. ఆయన ఈ చిత్రాన్ని 2ఎంబీ సంస్థ అధినేతలు రఘునందన్, పీఎస్ఆర్.చంద్రశేఖర్, ఆర్.శరవణన్‌లతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేతలు ఐబీ.కార్తీకేయదిలీపన్ సంగోటయ్య, డీ.పరంజ్యోతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
లక్కు మారుతుందా?
ఆశలు, కోరికలు మనిషికి సహజం. అయితే అవి తీరడానికి చేసే ప్రయత్నమే ప్రధానం. అదృష్టం కూడా తోడవ్వాలి. ఈ రెండోదే కలిసి రాని నటిగా మారారు ప్రణీత. ఈ కన్నడ భామ మంచి అందగత్తే. నటిగా కూడా పెద్దగా కొరతలూ లేవు. లేనిదల్లా లక్కే...ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇది అస్సలు లేదు ప్రణీతకు. ఉదయన్ చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమలో ఏన్నో ఆశలతో రంగప్రవేశం చేసిన నటి ప్రణీత. అరుళ్‌నిధి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ప్రణీతకు బోలెడంత నిరాశ. చిన్న గ్యాప్ తరువాత కార్తీతో శకుని చిత్రంలో రొమాన్స్ చేసి అవకాశం రావడంతో ప్రణీతలో మరోసారి ఆశలు చిగురించాయి. అయితే శకుని అపజయంతో ఈ బ్యూటీ ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. మళ్లీ అవకాశాలు నిల్. కొంతగ్యాప్ తరువాత మాస్ చిత్రంలో సూర్యతో నటించే అవకాశం వచ్చింది. రెండో నాయకి పాత్ర అయినా టాప్ హీరో సరసన కావడంతో మంచి ప్రచారం వస్తుంది. తద్వారా అవకాశాలు రాబట్టుకోవచ్చన్న చిన్న ఆశతో ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. నిజానికి ఆ పాత్రను శ్రుతీహాసన్ చేయాల్సింది. ప్రాధాన్యత లేదని తను ఆ చిత్రం నుంచే వైదొలగారు. మాస్ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. మళ్లీ ప్రణీత కథ మొదటికి వచ్చింది. అంతే కాదు లక్కు లేని నటి అనే ముద్రకు గురయ్యారు. అయితే తాజాగా నటుడు జై తో నటించే అవకాశం వచ్చింది. ఎనక్కు వాయ్oద అడిమైగళ్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇంతకు ముందు చిత్రాలలో అందాల ఆరబోత విషయంలో హద్దులు చెరిపేసిన ప్రణీత ఈ చిత్రంలో కాస్త డోస్ తగ్గించి నటిస్తున్నారట. అభినయానికి ప్రాధాన్యతనిస్తూ, సంభాషణలు బట్టీ పట్టి, రిహార్సల్ చేసి మరీ కెమెరా ముందుకు వెళుతున్నారట. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు ఓకే అన్నా తనకు తృప్తి కలగలేదంటూ మరో టేక్ తీసుకుని మరీ నటిస్తున్నారట. ఈ చిత్రంతో లక్కు లేని నటి అన్న ముద్రను తుడిచేస్తుందని, తానూ కోలీవుడ్‌లో ప్రముఖ నాయకిగా పేరు తెచ్చుకుంటాననే ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
అబ్బో... భలే సూటైంది!
మేడమ్ పెద్ద పార్టీకి వెళ్లాలి. అక్కడ అందరి కళ్లూ ఆమె పైనే ఉండాలి. ఇంగ్లిష్‌లో ‘సెంటరాఫ్ ఎట్రాక్షన్’ అంటారే.. మేడమ్‌గారు అలా అవ్వాలన్న మాట. ఆ విధంగా నలుగురి దృష్టినీ ఆకట్టుకోవాలంటే వేసుకునే బట్టల నుంచి పెట్టుకునే నగల వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉండాలి. అలా స్పెషల్‌గా ఉండేట్లు చేయాల్సిన బాధ్యత డిజైనర్ది. ఇక డిజైనర్ పాట్లు చూడాలి. వెరైటీగా ఉండాలి.. చూడచక్కగా అనిపించాలి.. అలాంటి డ్రెస్సుని డిజైన్ చేయడానికి ఒక్కోసారి తలబద్దులు కొట్టుకున్నంత పని చేస్తారు. అప్పుడొస్తుంది ఒక ఆలోచన. మగవాళ్లు సూట్‌కి వేసుకునే బో టై ఆకారంలో మేడమ్‌కి మంచి టాప్ తయారు చేస్తే? ‘భేష్ బాగుంది’ అని భుజం తట్టుకున్నారు డిజైనర్. ‘బో టై’ షేప్‌లో టాప్ తయారు చేసి, మేడమ్ నుంచి కితాబులు అందుకోవచ్చు అనుకున్నదే తడవు.. టాప్ రెడీ చేసేశారు. మేడమ్ కూడా మెచ్చుకున్నారు. ఆ టాప్‌లో నలుగురికీ కనువిందు చేశారు. ఇదిగో ఇక్కడ బాపూ బొమ్మ ప్రణీత తెల్లని మేని ఛాయ మీద ముదురు నీలం రంగు టాప్ చూశారు కదా? అది అచ్చంగా మగవాళ్లు కట్టుకునే బో టైలానే ఉంది కదూ. ఇక.. అమీ జాక్సన్ టాప్ చూస్తే.. బో టై అడ్డంగా బదులు నిలువుగా ఉంది. ఈ డిజైన్ కూడా అదిరింది. ఊదా రంగు బో టై టాప్‌లో పాయల్ నిండుగా ఉన్నారు. ‘మీకేనా బో టై... మేమూ వేసుకోగలం’ అని మన కథానాయికలు మగవాళ్లను సవాల్ చేస్తున్నట్లు ధీమాగా పోజిచ్చిన విధానం భలే బాగుంది కదూ. ఆ మధ్య జరిగిన సౌతిండియా ఫిలిం ఫేర్ అవార్డు వేడుకలకు అమీ జాక్సన్, పాయల్ ఘోష్ ఇలా బో టై టాప్‌లో అందరి లుక్సూ తమపై పడేలా చేసుకున్నారు. ఇటీవల జరిగిన ‘సైమా’ వేడుకల కోసం ప్రణీత బో టై టాప్, మినీ స్కర్ట్‌తో ‘అమ్మో... బాపుగారి బొమ్మో’ అనిపించుకున్నారు. మగవాళ్ల సూట్‌కి హుందాతనం తెచ్చిన బో టై మగువలకూ భలే సూట్ అయింది కదా! -
మంచు హీరోకి అక్కినేని వారసుడి గిఫ్ట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కనపెట్టి కలిసిపోతున్నారు. స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలు, ఫ్యూచర్లో తమకు పోటీ వస్తారన్న ఆలోచన ఉన్నవారితో కూడా ఎంతో స్నేహంగా ఉంటున్నారు. అదే బాటలో యంగ్ హీరో అఖిల్, మంచు వారబ్బాయికి గిఫ్ట్ ఇచ్చాడు. మంచు హీరో మనోజ్, ప్రణీత దంపతుల తొలి మ్యారేజ్ యానివర్సరీకి కానుకగా ఈ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ప్రకటించిన మనోజ్, అఖిల్‌కు థ్యాంక్స్ చెపుతూ గిఫ్ట్ ఫోటోను పోస్ట్ చేశాడు. అమల నటనకే కాదు జంతు ప్రేమకు కూడా వారసుడిగా పెరిగిన అఖిల్ దగ్గర ఎన్నో అరుదైన జాతుల పెట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటైన అలస్కన్ మాలామ్యూట్ను మనోజ్ దంపతులకు ప్రెజెంట్ చేశాడు. నీలి కళ్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ బుజ్జి కుక్కపిల్లను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపిన మనోజ్ దానికి జోయా అని పేరు పెట్టుకున్నాడు. New addition to our family :) pl welcome Zoya:) I thank @AkhilAkkineni8 for gifting us 'Zoya' for our anniversary:) pic.twitter.com/EoUcFtEBt1 — Manchu Manoj (@HeroManoj1) 5 June 2016 Zoya is Blue eyed Alaskan Malamute pic.twitter.com/agTTJGbe6d — Manchu Manoj (@HeroManoj1) 5 June 2016 -
అందుకే బ్రహ్మోత్సవం...ప్రతి హృదయాన్ని కదిలిస్తోంది
బాపుగారి బొమ్మని తలపించే అందం ప్రణీత సొంతం. అలాంటి అమ్మాయి లంగా, ఓణి, పరికిణీలతో కనిపిస్తూ బావా.. బావా అంటూ సందడి చేస్తే వెండితెరకి వచ్చే కళే వేరు. అందుకే ప్రణీతని దర్శకులు మరదలు పాత్రల్లో చూపించడానికి ఇష్టపడుతుంటారు. ‘బావ’ సినిమానే తీసుకోండి. అందులో ప్రణీత మరదలు పిల్లే. ‘అత్తారింటికి దారేది’లోనూ అంతే. పవన్‌కల్యాణ్‌కి మరదలే అవుతుంది. శుక్రవారం వచ్చిన ‘బ్రహ్మోత్సవం’లోనూ మహేశ్ మరదలిగా నటించింది. ఆ పాత్రల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ ప్రణీత సందడి చేస్తున్న విధానం కుర్రకారుకు భలే నచ్చుతోంది. ‘‘మరదలిగానే కావచ్చు గానీ ‘బ్రహ్మోత్సవం’లో నా పాత్ర కొత్త కోణంలో ఉంటుంది. ఇందులో భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆక ట్టుకొనే ప్రయత్నం చేశా’’ అంటున్న ప్రణీతతో ‘సాక్షి’ స్పెషల్ చాట్... ♦ నేను నటించిన మంచి చిత్రాల్లో ‘బ్రహ్మోత్సవం’ ఒకటి. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి హృదయాన్ని కదిలించే విధంగా ఉంటుంది. అందుకే ఈ కథ వినగానే నేను వెంటనే కనెక్ట్ అయిపోయా. పాత్రకి సంబంధించి కూడా ప్రతి అణువణువూ ఆస్వాదించా. ముఖ్యంగా నా పాత్ర తన మనసులోని భావోద్వేగాలను బయటపెట్టే విధానం స్వతహాగా నాకు భలే నచ్చింది. సినిమా పేరుకు తగ్గట్టుగానే సెట్లో ఉత్సవ వాతావరణం కనిపించేది. అందుకే షూటింగ్ జరుగుతున్నట్టు అనిపించేదే కాదు. మహేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక మంచి అనుభూతి. ఆయన సెట్స్‌లో ఎప్పుడూ సరదాగా కనిపిస్తుంటారు. ఆయనతో షూటింగ్ అంటే బోల్డెంత ఫన్. ముఖ్యంగా మహేశ్‌తో కలిసి నేను చేసిన సన్నివేశాలు నాకు నటిగా మరింత సంతృప్తినిచ్చాయి. ఆస్వాదిస్తున్నారు కుటుంబం చుట్టూ సాగే కథ ‘బ్రహ్మోత్సవం. స్వతహాగా నాకు కుటుంబంతో అనుబంధం ఎక్కువ. కాబట్టి ప్రతి సన్నివేశంలోనూ నాకు నేను, నా కుటుంబం కనిపించేది. అందుకేనేమో ఏ దశలోనూ నేనేదో సినిమా చేస్తున్నట్టు, నటిస్తున్నట్టు అనిపించేది కాదు. ఇలాంటి నేపథ్యంతో కూడిన సినిమాల్లో నటించడమంటే చాలా ఇష్టం. భవిష్యత్తులోనూ కుటుంబ నేపథ్యంతో కూడిన సినిమాలు మరిన్ని చేస్తా. ‘బ్రహ్మోత్సవం’లో ప్రేక్షకుల్ని అలరించే అంశాలు భావోద్వేగాలే. ♦ ఇలాంటి చిత్రాలు ఎప్పుడో కానీ రావు. అందుకే ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో ముగ్గురు కథానాయిక లున్నప్పటికీ మా అందరి పాత్రలకీ సమ ప్రాధాన్యం దక్కింది. ప్రతి పాత్ర కూడా కథని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంటుంది. అందుకే ఇందులో కథానాయికలు ఎంత మంది అనే విషయాన్ని పట్టించుకోలేదు. సమంత, కాజల్‌లతో కలిసి నటించడం చాలా ఆనందాన్నిచ్చింది. -
కాశీలో...మహేశ్
గత ఏడాది సాధించిన ‘శ్రీమంతుడు’ విజయం హీరో మహేశ్‌బాబులో కొత్త ఊపు తెచ్చింది. తాజాగా ‘బ్రహ్మోత్సవం’ పేరిట మరో కుటుంబ కథతో ఆయన సిద్ధమవుతున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల నిర్దేశకత్వంలో మరోసారి అలాంటి ఫ్యామిలీ ఫెస్టివల్ సినిమాను ఈ సమ్మర్ స్పెషల్‌గా అందిస్తున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత - ఇలా ఒకరికి ముగ్గురు ఈ చిత్రంలో కథానాయికలు. సీనియర్ నరేశ్, సత్యరాజ్, జయసుధ, తులసి తదితరులు ముఖ్యపాత్రధారులు. పొట్లూరి వి. ప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. ‘‘ఇటీవల ఉదయ్‌పూర్ పరిసరాల్లో షూటింగ్ చేశాం. తాజాగా పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ పరిసరాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం. ఈ నెల 13వ తేదీ వరకు ఈ పవిత్ర పరిసరా ల్లోనే షూటింగ్’’ అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ కాశీ షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా మిగతా సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. మిక్కీ జె. మేయర్ సంగీతంలో, షూటింగ్‌తో పాటు మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న వేసవి కానుకగా రిలీజ్ చేయనున్నారు. -
హీరోయిన్ ప్రణీతకు ప్రాణాపాయం తప్పింది
-
హీరోయిన్ ప్రణీతకు గాయాలు
ఖమ్మం: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీతకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బైటపడింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఊపిరి పీల్చుకున్నారు. డైనమేట్ మూవీలో ఆమెతో కలిసి నటించిన హీరో మంచు విష్ణు ప్రమాదం విషయం తెలియగానే కాస్త కంగారుపడ్డాడు. హీరో నితిన్, మంచు విష్ణు, హీరోయిన్ ప్రణీతకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని పరామర్శించారు. చివరికి ఆమె చాలా సేఫ్ గా ఉందన్న వివరాలు తెలుసుకుని కాస్త రిలీఫ్ అయ్యారు. మరికొంత మంది సినీ ప్రముఖులు ప్రణీత సురక్షితంగా ఉందన్న వార్త తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఆదివారం ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదానికి గురైంది. బైక్ ను తప్పించే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు పల్టీలు కొట్టింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్వల్పంగా గాయపడిన ప్రణీతను మోతేలోని ఆస్పత్రికి తరలించారు. తాను క్షేమంగానే ఉన్నానని, షాక్ నుంచి ఇంకా బయటపడలేదని ట్వీట్ చేసింది. తమ సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపింది. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ కు సమాచారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ట్విటర్ లో పోస్ట్ చేసింది. బావ, అత్తారింటికి దారేదీ, డైనమైట్, రభస, పాండవులు పాండువులు తుమ్మెద తదితర చిత్రాల్లో ప్రణీత నటించింది. మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం'లో నటిస్తోంది. 'చుట్టాలబ్బాయి'లో ఆదితో జత కడుతోంది. తమిళ, కన్నడ సినిమాల్లోనూ ఆమె నటించింది. మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి While on our way back from kammam. perfectly fine but unable to come out of the shock pic.twitter.com/b7TXWnULgz — Pranitha Subhash (@pranitasubhash) February 14, 2016 Big thankyou to the AEEs working on this road for calling the ambulance on time. My staff has survived injuries. But we are all safe. — Pranitha Subhash (@pranitasubhash) February 14, 2016 -
నాకు సెకండ్ హోమ్లా....
లాడ్‌బజార్‌లో.. మనసు లాక్.. హైదరాబాద్‌లో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే ఈ సిటీ అంటే చాలా ఇష్టం. నాది బెంగళూరు అయినప్పటికీ హైదరాబాద్‌ని కూడా నా హోమ్ టౌన్లానే భావిస్తాను. ఇక్కడివారు ఎంత మోడ్రన్‌గా ఉంటారో అంతే ట్రెడిషనల్‌గా కూడా ఉంటారు. ఒకసారి ఓల్డ్ సిటీకి వెళ్లాను. లాడ్‌బజార్‌ను చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ దొరికే రకరకాల గాజులు చూసి ఇన్ని రకాలుంటాయా..! అనిపించింది. ఆ ప్రాంతానికి కనెక్ట్ అయిపోయాను. హైదరాబాద్‌లో నేను చాలా ప్లేసెస్‌కి వెళ్లాను. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ ఫేమస్ అయినా, నేను నాన్-వెజ్ తినను కాబట్టి ఆ రుచి గురించి చెప్పలేను. నేనెంతగా సిటీకి కనెక్ట్ అయ్యానంటే నాకు సెకండ్ హోమ్లా అయిపోయింది. - ప్రణీత -
బ్రహ్మోత్సవంలో బిజీ కాబోతున్న ప్రిన్స్
-
ప్రణీత ఆనందోత్సవమ్
కథానాయిక ప్రణీత ఇప్పుడు తెగ సంతోషంగా ఉంది. శనివారం నాడు పుట్టినరోజు జరుపుకొంటున్న ఈ కన్నడ కస్తూరి ఆనందానికి కారణం లేకపోలేదు. గతంలో పవన్ కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’లో మెరిసిన ఈ మిల్కీవైట్ బ్యూటీ తాజాగా మహేశ్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవమ్’లో నటిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా కోసం కొద్దిరోజులు షూటింగ్లో పాల్గొన్నారామె. సినిమాలోని ముగ్గురు హీరోయిన్లలో ప్రణీత ఒకరు. కానీ, ప్రణీత మాత్రం, ‘‘మహేశ్‌తో కలసి నటించే అవకాశం రావడమే బ్రహ్మాండం. దాంతో, నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ప్రతిభావంతులైన వేర్వేరు దర్శకులు, హీరోలతో పనిచేయడం చాలా ఇంపార్టెంట్. తెర మీద ఎంతసేపు కనిపిస్తామనే దాని కన్నా, ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు చేయడం ముఖ్యం’’ అని అన్నారు. ఆ మధ్య సూర్యతో తమిళ సినిమా ‘మాస్’లో విషాదాంతమైన చిన్న పాత్ర చేసిన ప్రణీత తాజాగా మంచు విష్ణుతో కలసి ‘డైనమైట్’లో ఫైట్లు చేశారు. ‘‘ఇలాంటి వెరైటీ సినిమాలే ఇప్పుడు నాలో ఉత్సాహం నింపుతున్నాయి’’ అని ప్రణీత చెప్పారు. బెంగళూరులోని లావెల్లే రోడ్‌లోని ఒక రెస్టారెంట్లో భాగస్వామ్యం తీసుకున్న ఈ అందాల తార అలా వ్యాపారరంగంలో కూడా కాలుమోపారు. ఒక పక్క తెలుగు, తమిళ సినిమాలు, మరోపక్క వ్యాపారం! మొత్తానికి, ప్రణీతకిప్పుడు చేతి నిండా పని, మనసు నిండా ఆనందం అన్న మాట! -
అక్టోబర్ 17 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు స్మితా పాటిల్ (నటి) అనిల్ కుంబ్లే (మాజీ క్రికెటర్) ప్రణీత (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శని సంఖ్య. వీరు పుట్టిన తేదీ 17. ఇది కూడా శనిసంఖ్య కావడం వల్ల వీరిపై శని ప్రభావం బలంగా ఉంటుంది. దీనిమూలంగా పనులు కొంచెం ఆలస్యంగా జరిగినప్పటికీ శని వృత్తి కారకుడు, ఆయుఃకారకుడు కావడం వల్ల ఆయా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉత్సాకరంగా నడుస్తాయి. తగిన ప్రోత్సాహం లభించడం వల్ల స్థిరత్వాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు ఆర్థికంగా బలపడతారు. మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. సామాజికపరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. అవిశ్రాంతంగా పని చేయడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల తోటివారితో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది. లక్కీ డేస్: 1,3,6, 8,9; లక్కీకలర్స్: ఎల్లో, గోల్డెన్, శాండిల్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించడం, కుక్కలకు ఆహారం పెట్టడం, వృద్ధులను ఆదరించడం, మాటలలో సంయమనం పాటించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
గోదావరిపై సర్కారు ప్రత్యేక దృష్టి
- పూర్తి వాటా వినియోగంపై ప్రణాళికలు - నీటి లభ్యత ప్రాంతాలు, మళ్లింపునకు అనువైన ప్రదేశాల పరిశీలన - మేడిగడ్డ నుంచే ప్రాణహిత నీటిని తీసుకోవాలని సూత్రప్రాయ నిర్ణయం - వ్యాప్కోస్ ప్రతినిధులతో సీఎం సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వర ప్రదాయణిగా ఉన్న గోదావరి నదిలో జలాల లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాంతాలు, అలాగే నీటి మళ్లింపునకు అనువుగా ఉన్న ప్రదేశాల గుర్తింపుపై ప్రభుత్వం తన కసరత్తును తీవ్రం చేసింది. గోదావరి జలాల్లో రాష్ట్రానికి ఉన్న 950 టీఎంసీల మేర నీటి వాటాను పూర్తిగా వినియోగంలోకి తెచ్చే ప్రణాళికలకు తుదిరూపునిస్తోంది. నదీ పరీవాహకంలోని ఉపనదుల్లో ఏ ప్రాంతంలో నీటి లభ్యత పుష్కలంగా ఉంది, ఏటా సగటు వర్షపాతం ఎంత, గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశాలు ఏమిటి.. అన్న అంశాలపై లోతైన అధ్యయనం చేసి, ప్రాజెక్టుల నిర్మాణంపై ఓ అంచనాకు రావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం, గోదావరిపై అత్యాధునిక పద్ధతిలో లైడార్ సర్వే చేస్తున్న వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ప్రాణహిత రీ ఇంజనీరింగ్‌లో భాగంగా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి మార్గాల్లో చేసిన లైడార్ సర్వే వివరాలను తెలుసుకున్నారు. ప్రాణహిత నీటిని మేడిగడ్డ ప్రాంతం నుంచే తీసుకోవాలని ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతోపాటే మొదటి డిజైన్ ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద ఏ ఎత్తులో బ్యారేజీ నిర్మించాలన్నదానిపై మహారాష్ట్రతో చర్చలు జరిపి త్వరగా తుదినిర్ణయానికి రావాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అలాగే కొత్తగా తెరపైకి వచ్చిన ఇచ్చంపల్లి ప్రాంతంలో నీటి లభ్యత, ఇతర బ్యారేజీల నిర్మాణంైపై వ్యాప్కోస్ ప్రతినిధి శంభూ ఆజాద్, ఇతర అధికారులతో చర్చించారు. ఇదే సమయంలో ప్రాణహిత మొదలు దుమ్ముగూడెం వరకు నిర్మించదలచిన బ్యారేజీలపై మ్యాపులు, టోపొగ్రఫిక్ షీట్ల ఆధారంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రాణహితలో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీకి 70 కిలోమీటర్ల దిగువన వేమునిపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణంపై చర్చ జరిగినట్లుగా సమాచారం. కాగా, దుమ్ముగూడెంలో భాగంగా గొల్లపాడు, బయ్యారంల వద్ద బ్యారేజీలు నిర్మించి ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు నీటిని మళ్లించే విషయమై సర్వే చేయాలని సీఎం వ్యాప్కోస్ను కోరారని తెలిసింది. దీంతో పాటే కాళేశ్వరం నుంచి నిజాంసాగర్‌కు నీటిని తెచ్చే మార్గాల్లో రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం, వాటి మార్గాల్లో ఉన్న పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు చెబుతున్నారు. టెక్రా వద్ద నీటి లభ్యతపై ఆరా.. ఈ సమీక్షలో ప్రాణహిత, ఇంద్రావతిల్లో నీటి లభ్యత, వీటి పరీవాహకంలో ఈ ఏడాది కురిసిన వర్షపాతాలపై క్షుణ్ణంగా చర్చించినట్లుగా తెలిసింది. ఈ ఏడాది గోదావరి బేసిన్లో సమృద్ధిగా వర్షాలు లేనందున నీటి లభ్యత తగ్గిన అంశంపైనా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సందర్భంలో మహారాష్ట్రలోని టెక్రా ప్రాంతం వద్ద ప్రాణహిత నీటి లభ్యతపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. టెక్రా వద్ద వాటర్ లెవెల్ ఎలా ఉంటుంది, డిశ్చార్జి ఎంత, దిగువకు ప్రవాహాలు ఏ స్థాయిలో ఉంటాయనే అంశాలపై కూడా ఆరా తీసినట్లు చెబుతున్నారు. -
‘డైనమైట్’ చిత్రబృందం సందడి
-
స్టన్నింగ్ డైనమైట్
జనరల్‌గా యాక్షన్ సీన్స్ అంటే మాస్‌ను ఎట్రాక్ట్ చేసే విధంగానే డీల్ చేస్తూంటారు. కానీ ‘డైనమైట్’లో యాక్షన్ పార్ట్ స్టన్నింగ్‌గా ఉంటుందని సీనియర్ మోస్ట్ స్టంట్ డెరైక్టర్ విజయన్ చెబుతున్నారు. మంచు విష్ణు ఎంతో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మరీ ఈ సన్నివేశాలు చేశాడనీ, తాను ఇప్పటివరకూ పనిచేసిన వారిలో మంచు విష్ణు టాప్ మోస్ట్ యాక్షన్ హీరో అనీ విజయన్ ప్రశసించారు. విష్ణు ఎనర్జీ లెవల్స్ చూసి ఆశ్చర్యపోయానని, ఓ సన్నివేశంలో చెయ్యి విరిగిపోయినా బెస్ట్ అవుట్‌పుట్ వచ్చేవరకూ నటించాడని విజయన్ తెలిపారు. మంచు విష్ణు, ప్రణీత జంటగా అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ‘డైనమైట్’ చిత్రం ఈ సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ తర్వాత దేవా క ట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. -
ప్రణీత చుట్టాలబ్బాయిగా ఆది
చెన్నై: అత్తారింటికి దారేది చిత్రంలో బొంగరాలాంటి కళ్లు తిప్పిన ప్రణీత తాజాగా ఆదితో జోడి కట్టనుంది. దర్శకుడు వీరభద్ర చౌదరి దర్శకత్వంలో చుట్టాలబ్బాయి చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఆ చిత్ర యూనిట్ ఆదివారం చెన్నైలో తెలిపారు. ఈ చిత్రాన్ని వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. అలాగే ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో వీరభద్ర చౌదరి సునీల్ హీరోగా నటించిన పూలరంగడు చిత్రానికి దర్శకత్వం వహించాడు. -
ప్రణీత ఎప్పుడూ సెకండేనా?
కాలం కలిసొస్తే నడిచొచ్చే బిడ్డ పుడతారంటారు. అది కలిసి రానోళ్లకు నటి ప్రణీత పరిస్థితే. మధ్యలో ఆమె గొడవ ఎందుకంటారా? ఆకర్షణీయమైన ముఖారవిందం, నవ నవ లాడే వయసు ప్రణీత సొంతం. ఒక రకంగా చెప్పాలంటే ఆమెలోని ఈ లక్షణాలే హీరోయిన్ను చేశాయి. మలయాళం, తమిళ్, తెలుగు అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ హీరోయిన్గా నటించింది. దీంతో భవిష్యత్ గురించి బోలెడు కలలు కనేసింది. అయితే హీరోయిన్గా ఈ అమ్మడికి ఏ భాషలోను మంచి హిట్ రాలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ పాత్రలు పోషించడానికి సిద్ధమైంది. అలా ఏ ముహుర్తాన ఆ నిర్ణయం తీసుకుందో వరుస అలాంటి పాత్రల్లే వస్తున్నాయి. తెలుగులో అత్తారింటికి దారేదిలో రెండవ హీరోయిన్గా ప్రణీత నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించినా ఈమెకు హెల్ప్ అవ్వలేదు. తర్వాత తమిళంలో సూర్య సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. అయితే ఇది నటి ఎమిజాక్సన్ నిరాకరించిన పాత్ర. అంతేకాదు ఇందులోను రెండవ హీరోయిన్నే. ఇదీ నిరాశపరచడంతో మరో అవకాశం రాలేదు. ఇలాంటి పరిస్థితిలో తెలుగులో ప్రముఖ హీరో బాలకృష్ణ సరసన నటించే అవకాశం వచ్చిందట. అయితే ఇందులోను నటి అంజలి ఆల్రెడీ బుక్ అవడంతో షరామామూలుగా సెకండ్ హీరోయిన్ పాత్ర కావడంతో అలాంటి పాత్రలు పోషించి విసిగెత్తడంతో ఆ అవకాశాల్ని వదులుకుందట. ఇకపై రెండవ హీరోయిన్ పాత్ర చేసేది లేదంటూ నిర్ణయాన్ని తీసేసుకుందట. పాపం వచ్చే అవకాశాలు పోతాయేమో! ఆ నిర్ణయం మార్చుకుంటే మంచిదంటున్నారు సినీ వర్గాలు. -
‘బ్రహ్మోత్సవం’కథ ఇదేనా?
రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదన్న మాటే కానీ... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై ఇప్పటికే బోలెడంత ప్రచారం సాగుతోంది. గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి ఫ్యామిలీ కథాంశంతో ఆకట్టుకున్న ఈ దర్శక, హీరోల ద్వయం ఈసారి ‘బ్రహ్మోత్సవం’లో కూడా కుటుంబ విలువలకే పట్టం కడుతున్నారు. ఈ చిత్ర కథ అంటూ కృష్ణానగర్‌లో ఒక గాలి కబురు ప్రచారమవుతోంది. కథానుసారం ముగ్గురు హీరోయిన్లు (సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత). హీరో ఆ పాత్రల సాయంతో కుటుంబం విలువను తెలుసుకుంటాడట! హీరోకూ, అతని తండ్రి పాత్ర (సత్యరాజ్)కూ మధ్య అనుబంధం ప్రధానంగా సాగే ఈ కథ హీరో తల్లి (రేవతి) కుటుంబం చుట్టూ తిరుగుతుందట! ఈ కథలోని నిజానిజాల మాట దర్శక, నిర్మాతలకే తెలియాలి. కుటుంబ విలువలు, మన సంస్కృతికి పెద్దపీట వేసే శ్రీకాంత్ అడ్డాల ఈసారి ‘బ్రహ్మోత్సవం’లోనూ ఆ బాటలో వెళతానని ముందే ప్రకటించారు. అంటే, వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రూపంలో మరో ఘన విజయానికి రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. -
మొదటిసారి ముగ్గురితో మహేశ్
ఇప్పటివరకూ మహేశ్‌బాబు ఇరవై చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’లో నటిస్తున్నారు. ‘శ్రీమంతుడు’ వరకూ చేసిన చిత్రాల్లో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లతో మహేశ్ రొమాన్స్ చేశారు. కానీ, ‘బ్రహ్మోత్సవం’లో ముగ్గురు నాయికలతో ఆడి, పాడనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీతలను కథానాయికలుగా ఖరారు చేశారు. కాజల్‌తో మహేశ్ ‘బిజినెస్‌మేన్’లో నటించారు. సమంతతో ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’లో నటించారు. ప్రణీతతో జతకట్టడం ఇదే తొలిసారి. ఈ ముగ్గురి పాత్రలూ కథకు కీలకంగా నిలుస్తాయని శ్రీకాంత్ అడ్డాల చెబుతూ -‘‘నలుగురున్న చోట పండగ వాతావరణం ఉంటుంది. అలా, ఒక కుటుంబంలో ఎంతోమంది ఉండి, ప్రతి సందర్భాన్నీ ఓ ఉత్సవంలా జరుపుకుంటే అది ‘బ్రహ్మోత్సవం’లా ఉంటుంది. ఇది చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు. ‘‘మా సంస్థకు ఇది ప్రతిష్టాత్మకం చిత్రం. వచ్చే నెల 10 నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నాం. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి, 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్. -
మహేష్ బ్రహ్మోత్సవంలో మెరుపుతీగలు
-
డిక్టేటర్ సరసన ప్రణీత
వరుసగా సినిమాలు చేస్తూ జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 99వ సినిమా బిజీలో పడ్డారు. బుధవారం పుట్టినరోజు జరుపుకొన్న ఈ హీరో, శ్రీవాస్ దర్శకత్వంలో ‘డిక్టేటర్’గా అలరించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇటీవల లాంఛనంగా పూజ జరుపుకొన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై 20 నుంచి ప్రారంభం కానుందని ఆంతరంగిక వర్గాల సమాచారం. బాలకృష్ణను పవర్ఫుల్ పాత్రలో చూపే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటారని సమాచారం. ఒక హీరోయిన్గా నటి అంజలిని ఇప్పటికే ఎంపిక చేశారు. మిగిలిన రెండో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి దాకా సస్పెన్స్‌గా మిగిలింది. ఆ పాత్రకు నటి ప్రణీతను ఎంపిక చేసినట్లు ‘సాక్షి’ పక్కా సమాచారం. కన్నడ అమ్మాయి ప్రణీతా సుభాష్ ఇప్పటికే పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది?’ తదితర చిత్రాల ద్వారా మన ప్రేక్షకులకు సుపరిచితురాలు. బాలకృష్ణ లాంటి అగ్ర హీరో సరసన అవకాశం రావడంతో సహజంగానే ప్రణీత సంతోషంగా ఉన్నారు. కొంతకాలంగా కన్నడంపై దృష్టి పెడుతున్న తనకు ఈ ‘బిగ్ ఛాన్స్’తో మళ్ళీ తెలుగులో దశ తిరుగుతుందని భావిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ తదితర అయిదుగురు రచయితలు కలసి రూపొందించిన ఈ చిత్ర కథ మీద దర్శకుడు శ్రీవాస్ కూడా అపారంగా నమ్మకం పెట్టుకున్నారు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ లాంటి తన గత హిట్స్ జోరును ‘డిక్టేటర్’ మరింత పెంచుతుందని భావిస్తున్నారు. అందుకే, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఈరోస్’తో పాటు ఆయన కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
‘రాక్షసుడు’ స్టిల్స్
-
గోల్డెన్‌ఛాన్స్ కొట్టిన ప్రణీత
-
10 ఏళ్ల చిన్నారి.. 7 వరల్డ్ రికార్డులు
సిటీబ్యూరో : రవీంద్ర భారతిలో సాయంత్రం 7 గంటలు. అయిదో తరగతి చదువుతున్న పదేళ్ల పరిణీత స్టేజీపై గంతలు కట్టుకొని ఏదో చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు టెన్షన్‌తో కన్నార్పకుండా చూస్తున్నారు. ప్రేక్షకులూ కంగారుగా వీక్షిస్తున్నారు. ఆ అమ్మాయి 60 సెకన్లలో 101 ఫ్లాష్కార్డులపై ఉన్న అక్షరాలు చదివింది. సభంతా చప్పట్లతో మారుమోగింది... ఎందుకనుకుంటున్నారా? ప్రణీత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వరల్డ్ రికార్డులు సృష్టించింది. శుక్రవారం బాల సాహిత్య పరిషత్, ఇంపాక్ట్ మైండ్ యాక్టివేషన్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కళ్లకు గంతలు కట్టుకొని కేవలం మనసుతో అక్షరాలను గుర్తుపట్టిన పరిణీత లిమ్కా బుక్, యూనిక్ వరల్డ్, వండర్ వరల్డ్ స్టేట్ బుక్, స్టార్ బుక్, లిటిల్ బుక్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులోకెక్కింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ హాజరయ్యారు. ప్రముఖ మిమిక్రీ సింగర్ ఎల్. వెంకటేశ్వర్లు తన పాటలతో ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. సంతోషంగా ఉంది.. నేను వరల్డ్ రికార్డు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు గాదె పవణ్కుమార్, గాదె లలిత నన్ను ప్రోత్సహించి ఇలా రికార్డులు సాధించేలా తయారు చేశారు. వారితో పాటు నాకు బ్లైండ్ ఫోల్డెడ్ బ్రిలియన్స్లో శిక్షణ ఇచ్చిన డాక్టర్ బి. సాయికిరణ్, హితేశ్ గారికి ధన్యవాదాలు. - గాదె పరిణీత -
ప్రణీతతో ప్రేమలో పడ్డ మనోజ్!
త్వరలో మంచువారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. పీకల్లోతు ప్రేమలో పడ్డ మంచు మనోజ్ తొందరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. యంగ్ హీరోల్లో ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన మనోజ్ ...ప్రణిత రెడ్డిపై మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా ప్రణిత రెడ్డి అనుకుంటున్నారా? బిట్స్ పిలానీలో చదువుతుకుంటున్న ఆమె మంచు ఫ్యామీలికి సన్నిహితురాలే. అయితే ఇంతకు మించి వివరాలు మాత్రం బయటకు రాలేదు. మనోజ్‌కు చాలా రోజుల క్రితమే ప్రణీత తెలుసునని, వీరిద్దరూ త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబుతున్నారని, ఇందుకు సంబంధించి ఇరు కుటుంబాలు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లు సమాచారం. అయితే మనోజ్ మాత్రం తన ప్రేమ, పెళ్లి వార్తలపై పెదవి విప్పటం లేదు. త్వరలోనే ఈ విషయాన్ని మంచు ఫ్యామిలీ అఫిషీయల్ గా ప్రకటించనున్నట్లు సమాచారం. కరెంట్ తీగ సక్సెస్‌తో జోష్ మీద ఉన్న మనోజ్ ..తదుపరి చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. -
షూటింగ్లో లేని నటిని కోప్పడేదెట్టాగబ్బా?
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం గురించి ఇటీవల ఓ వార్త హల్చల్ చేసింది. ఆ చిత్ర షూటింగ్లో పాత్రకు తగ్గట్టుగా మేకప్ చేసుకోలేదంటూ నటి ప్రణీతను దర్శకుడు గట్టిగా అరిచారనీ, దాంతో ఆమె ఆ చిత్రం నుంచి వైదొలగిందనీ ఓ జాతీయ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన గాసిప్ సంచలనమైంది. త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ కథానాయికల్లో ఒకరైన ప్రణీత ఈ తాజా అల్లు అర్జున్ సినిమాలోనూ నటిస్తుందంటూ చాలా కాలంగా అనధికారిక వార్తలు షికార్లు చేస్తూ వచ్చాయి. కానీ, అవన్నీ వట్టి గాలివార్తలేనన్నది సినిమా తారాగణం గురించి ఆ మధ్య అధికారిక ప్రకటన వెలువడినప్పుడు తేలిపోయింది. ఇంతలో ఈ సినిమా గురించి ఈ తాజా పుకారు వచ్చింది. ఈ విషయం గురించి స్పష్టత కోసం ‘సాక్షి’ ప్రయత్నించింది. ‘‘మా సినిమాలో పాత్ర కోసం ప్రణీతను అనుకోవడం కానీ, సంప్రదించడం కానీ అసలు జరగనే లేదు. అలాంటిది... సినిమాలోనే లేని నటి వచ్చి, షూటింగ్లో పాల్గొన్నట్లు రాయడం వారి కల్పనాశక్తికి పరాకాష్ఠ. షూటింగ్లో కాదు కదా, అసలు సినిమాలోనే లేని నటిని సెట్స్‌పై ఎవరైనా ఎలా కోప్పడతారు?’’ అని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి, ఇప్పటి దాకా 15 రోజులు ఈ చిత్ర షూటింగ్ జరిగింది. అదీ - హైదరాబాద్, పరిసరాల్లోనే! అందులో హీరో అల్లు అర్జున్, సమంత, ఆదాశర్మ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్ బృందం పాల్గొన్నారు. అసలు లేని ప్రణీత ఉన్నట్లూ, అలిగి షూటింగ్లో నుంచి వెళ్ళిపోయినట్లూ పత్రికల్లో రావడం సహజంగానే చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఇలా ఉండగా, ఈ చిత్రంలో నటించడానికి అమితాబ్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి వారిని సంప్రదిస్తున్నారని కూడా అనధికారిక వార్తలు షికారు చేస్తున్నాయి. దీని గురించి చిత్ర వర్గాలు వివరణనిస్తూ, ‘‘గతంలో ‘జులాయి’ చిత్రానికి కూడా టైటిల్ ప్రకటించక ముందే ‘హనీ’, ‘పార్క్’ లాంటి పేర్లు, ‘అత్తారింటికి దారేది’కి ‘సరదా’ లాంటి పేర్లు ఎవరెవరో ప్రచారంలో పెట్టారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. టైటిల్, ముఖ్య తారాగణం వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నాయి. మొత్తానికి, గాలివార్తల పుణ్యమా అని అల్లు అర్జున్ - త్రివిక్రమ్ చిత్రానికి కావలసినంత ఉచిత ప్రచారం జరుగుతోంది. -
బ్యాట్ పట్టిన ‘బాపూ బొమ్మ’....
బొంగరాళ్లాంటి కళ్లు తిప్పడమే కాదు సుతిమెత్తని చేతులతో బ్యాట్ పట్టగలనంటోంది ఈ బాపూ బొమ్మ. తన అందచందాలతో టాలీవుడ్, శాండల్‌వుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న అందాల నటి ప్రణీత సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. జర్నలిస్ట్‌లు, ట్రాఫిక్ పోలీసుల నడుమ ఏర్పాటు చేసిన ఎస్.సుబ్బరాయలు నాయుడు మెమోరియల్ క్రికెట్ మ్యాచ్‌ను ఆదివారమిక్కడి కాక్స్‌టౌన్‌లోని మైదానంలో నటి ప్రణీత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణీత కాసేపు క్రికెట్ ఆడి అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమంలో నటి తార, సమాజ సేవకులు ఎన్.ఎస్.రవి పాల్గొన్నారు. - సాక్షి, బెంగళూరు -
హీరోయిన్ల ముద్దుల పోటీ
అందాలను ఆరబోయడానికి ఒకప్పటి కథా నాయికలు సంకోచించే వారు. అలాంటిది ఇప్పటి హీరోయిన్లు అంగాంగ ప్రదర్శనలు దాటి లిప్‌లాక్ కిస్ల వరకు వచ్చేశారు. అంతేకాదు ఇప్పుడు హీరోకు ఎవరెక్కువ పెదవిపై ముద్దులు పెడతారన్న విషయంలో పోటీ నెలకొనడం విశేషం. గ్లామరస్ అనేది పాత దయిపోయింది. లిప్‌లాక్ కిస్‌లు లేటెస్ట్ ఎట్రాక్షన్‌గా మారింది. తమిళంలో ఇంతకు ముందు అళగియ అసురా, కేడీ బిల్లా కిల్లాడి రంగా చిత్రాల్లో నటించిన రెజీనా అప్పట్లో అరకొర దుస్తులు ధరించేది లేదంటూ షరతులు పెట్టింది. దీంతో లాభం లేదనుకుందో ఏమో తాను అందాలారబోతకు రెడీ అంటూ గ్లామరస్ గోదాలోకి దిగింది. మరో నటి రకుల్ ప్రీతి అయితే ఆరంభంలోనే పొదుపు దుస్తులతో నటించడానికి సిద్ధం అయిపోయింది. తడయర తాక్క, ఎన్నమో ఏదో చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి, రెజినాకు మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరూ అవకాశాలను రాబట్టుకోవడానికి లిప్‌లాక్ సన్నివేశాలలో నటించడానికి రెడీ అంటూ బహిరంగంగానే ప్రకటించేస్తున్నారు. దీంతో ఈ భామలకు అవకాశాలు క్యూకడుతున్నాయి. తమిళంతోపాటు తెలుగులోనూ రకుల్‌ప్రీతి, రెజీనాలు బిజీ హీరోయిన్లుగా మారిపోయారు. వీళ్ల తెగింపు నటి ప్రణీతకు ముప్పుగా మారిందట. తమిళంలో శకుని చిత్రంలో కార్తీకి జంటగా నటించిన ప్రణీత ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో అమ్మడు టాలీవుడ్‌పై దృష్టిసారించింది. అక్కడ అత్తారింటికి దారేది లాంటి ఒకటి రెండు చిత్రాలు విజయం సాధించడంతో మంచి పేరు వచ్చింది. అయితే కాస్త సంసారపక్షంగా నటిస్తున్న ప్రణీతకు రకుల్‌ప్రీతి, రెజీనాల ఎక్స్పోజింగ్ నటన భయం పుట్టిస్తుందట. ఇక ప్రణీత కూడా మనసు మార్చుకోక తప్పదేమో అంటున్నాయి సినీ వర్గాలు. -
సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు: ప్రణీత
అసలు తాను సినిమాల్లో నిలబడగలనని ఏమాత్రం అనుకోలేదని సోగకళ్ల సుందరి ప్రణీత చెప్పింది. డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చిన తాను బాగా చదువుకుని ఏదో ఒక రంగంలో స్థిరపడాలనే అనుకున్నాను గానీ, అసలు తాను గానీ తన త్లలిదండ్రులు గానీ అసలు తాను హీరోయిన్ అవుతానని, విజయాలు సాధిస్తానని అనుకోలేదని తెలిపింది. 2010లో 'పోర్కి' అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రణీత.. ఇప్పటికి దాదాపు 12 సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్‌తో కలిసి చేసిన 'అత్తారింటికి దారేది'తో టాలీవుడ్లో ఆమె దశ తిరిగింది. తన కెరీర్ సాగుతున్న తీరుపట్ల చాలా సంతృప్తిగా ఉందని, కన్నడ అమ్మాయినైన తాను.. అసలు సినిమాల్లోకి వస్తాననే భావించలేదంది. నాలుగేళ్ల క్రితం అయితే అసలు తాను ఇక్కడకు వస్తానని కూడా ఎవరూఊహించలేదని ప్రణీత తెలిపింది. ఇక్కడన్నీ ప్రయోగాలు చేయడం, అలా వెళ్లిపోవడమేనని వివరించింది. ఎన్టీఆర్ సరసన ఆమె నటించిన రభస చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ పాత్రలో మాస్ ప్రేక్షకులకు కావల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు ఉంటాయని చెప్పింది. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని, ఆయన డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాల్సిందేనని ప్రణీత చెప్పింది. -
రభస మూవీ న్యూ స్టిల్స్
-
సంతోషం 12వ వార్షికోత్సవంలో ప్రణిత, హంసానందిని
-
ఆ ఘనత మాదే: సురేష్ కొండేటి
30న ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక సాక్షి, సిటీబ్యూరో: గత పదకొండేళ్లుగా ‘సంతోషం’ ఫిల్డ్ అవార్ట్స్ వేడుకను వైభవంగా నిర్వహిస్తున్న తాము 12వ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డు వేడుక మరింత ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని ‘సంతోషం’ సినీ వార పత్రిక అధినేత సురేష్ కొండేటి తెలిపారు. ఈ నెల 30న జరగనున్న ఈ వేడుక కర్టన్రైజ్ కార్యక్రామం ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలో సినీ తారలు ప్రణీత, హంసా నందిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్..‘దక్షిణాది ప్రాంతీయ భాషల్లో ఏ భాషలోనూ ఇంత సుదీర్ఘ కాలంగా ఫిల్మ్ అవార్డులు నిర్వహించిన పత్రిక లేదు. ఆ ఘనత మా పత్రికకే చెందుతుంది. ఇన్నేళ్లుగా చలన చిత్ర పరిశ్రమ పెద్దల ఆదరాభిమానాలతో అవార్డులు అందజేస్తూ వచ్చాను. ఈ ఏడాది జేఆర్సీ కన్వెషన్లో జరపనున్న వేడుకలో పలువురు చిత్రరంగ ప్రముఖులు పాల్గొంటారు’ అని చెప్పారు. గత ఏడాది ఓ కన్నడ చిత్రానికిగాను ‘సంతోషం’ అవార్డు అందుకున్నానని, తాను నటించిన ‘అత్తారింటికి దారేది’ ఈ ఏడాది నామినీగా నిలవడం ఆనందంగా ఉందనీ ప్రణీత తెలిపారు. నాలుగు భాషల వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం అనీ, నేను నటించిన రెండు చిత్రాలు పోటీలో ఉన్నాయని హంసా నందిని అన్నారు. -
కర్నూలు కళానికేతన్ అదుర్స్
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్ : నగరంలోని పార్కురోడ్డులో ఉన్న మహిళల ప్రత్యేక షోరూం కళానికేతన్లో ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత గురువారం సందడి చేశారు. షోరూం రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె భారీ కేక్‌ను కట్ చేశారు. రెండు, మూడు ఫ్లోర్లలో కలియ తిరిగి పట్టు చీరెలను పరిశీలించారు. అక్కడే విలేకరులతో మాట్లాడుతూ కర్నూలుకు మొదటి సారి వచ్చానని, నగరం ఎంతో బాగుందని అన్నారు. సినీ పరిశ్రమలో తనను ఆదరిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కళానికేతన్ షోరూం రెండవ వార్షికోత్సవంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చి వ్యయ ప్రయాసలతో చీరెలు కొనుగోలు చేసే అవసరం లేదన్నారు. కళానికేతన్లో నాణ్యమైన, ఆధునిక వస్త్రాలను అందుబాటులో పెట్టారని పేర్కొన్నారు. కళానికేతన్ షోరూం నిర్వాహకులు నీలా కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రారంభించిన అనతి కాలంలోనే మహిళలు ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రెండో వార్షికోత్సవం సందర్భంగా మహిళామణుల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామన్నారు. శారీస్, గాగ్రాస్, సల్వార్స్, వెస్ట్రన్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లపై భారీగా తగ్గింపు ధరలతో అన్ని వస్త్రాలు అందిస్తున్నామన్నారు. చీరెల నుండి కిడ్స్ వేర్ వరకు 50 నుండి 30 శాతం ప్లాట్ ధరలు తగ్గించామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. -
సమంతకు చెమటలు పట్టిస్తున్న ప్రణీత
-
నాకు అంత సీన్ లేదు!
ప్రణీత అంటే ఐరన్ లెగ్!... ‘అత్తారింటికి దారేది’ ముందు వరకూ ఆమెకు అదే ఇమేజ్. ఆ సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్డమ్ వచ్చేసిందామెకు. కన్నడ అమ్మాయి అయినా కూడా అచ్చం బాపు బొమ్మలాగానే ఉంటుంది. స్మయిలిష్‌గా... స్టయిలిష్‌గా కనబడే ప్రణీతతో మాట్లాడుతూ ఉంటే కాలం ఘనీభవించినట్టే అనిపిస్తుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారట..? ప్రణీత: అవును. మా అమ్మానాన్నలిద్దరూ డాక్టర్సే. మాకు బెంగళూరులో ఆస్పత్రి ఉంది. ‘నువ్వు డాక్టర్ అవాలి’ అంటూ చిన్నప్పట్నుంచీ చెబుతూ పెంచారు నన్ను. నాకైతే ఆ మాట విన్నప్పుడల్లా చాలా ఒత్తిడిగా అనిపించేది. మార్కులైతే వందకు వంద రావాలనేవారు. అందుకని ఎప్పుడూ పుస్తకాలతో బిజీగా ఉండేదాన్ని. మరి.. హీరోయిన్ అవుతానంటే ఏమన్నారు? ప్రణీత: చాలామంది పేరంట్స్‌లానే కుదరదంటే కుదరదన్నారు. నేను ఏమాత్రం ట్రై చేయకుండానే నాకు అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. దాంతో అమ్మ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆలోచనలో పడింది. ఒకవేళ సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని రాసి పెట్టి ఉందేమో అనుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ విధంగా ‘పోకిరి’ కన్నడ రీమేక్ ‘పొర్కి’ ద్వారా హీరోయిన్ అయ్యాను. అందమైన అమ్మాయిలకు ప్రేమలేఖలు రావడం సర్వసాధారణం. మరి మీరెన్ని అందుకున్నారు? ప్రణీత: ఒక్కటి కూడా అందుకోలేదు. పోనీ.. మీరెవరికైనా రాశారా? ప్రణీత: పుస్తకాల్లో పాఠాలు రాసుకోవడం తప్ప ప్రేమలేఖలు రాసేంత సీన్ నాకు లేదు. అసలు ఆ యాంగిల్లో ఇప్పటివరకు నేను ఏ అబ్బాయినీ చూడలేదు. మీలా సన్నగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రణీత: నూనె లేకుండా చేసిన వంటకాలు తినాలి. హోటల్‌కెళ్లినప్పుడు, నాకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసేసి, ఇవన్నీ నూనె లేకుండా తయారు చేయాలని చెబుతుంటాను. అప్పుడు ‘కొంచెం కూడా నూనె లేకుండా ఎలా వండమంటారు?’ అని కుక్స్ అడిగితే, ఎలాగోలా వండండి. నాకు మాత్రం ఆయిల్ ఫ్రీ ఫుడ్డే కావాలని చెప్పేస్తాను. మనం ఎప్పుడైతే ఆహారం విషయంలో హద్దులు పెట్టుకుంటామో అప్పుడు ఆరోగ్యంగానూ ఉండగలుగుతాం. అలాగే వ్యాయామాలు చేయాలి. సినిమాల్లో పాత్రకు అనుగుణంగా కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. విడిగా మీ అభిరుచి ఏంటి? ప్రణీత: సినిమా తారలు సమ్మర్లో స్వెటర్ వేసుకుని బయటికెళ్లినా, ‘ఇప్పుడీ ట్రెండ్ నడుస్తుందేమో’ అనుకుని అది ఫాలో అవుతారు చాలామంది. అందుకే, నేను దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. వీలైనంత స్టయిలిష్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. డాక్టర్ అవకుండా యాక్టర్ అయ్యామని ఎప్పుడైనా ఫీలయ్యారా? ప్రణీత: అస్సలు లేదు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నేను పశ్చాత్తాపపడను. ఎన్నో రకాల జీవితాలను తెరపై జీవించే అవకాశం ఒక్క కళాకారులకే ఉంటుంది. ఒక్కో పాత్ర మాకు ఒక్కో పాఠం. ఆ పాత్ర తాలూకు అనుభవాలు ఒక్కోసారి మా జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే షూటింగ్లో భాగంగా మేం విదేశాలకూ వెళుతుంటాం. అక్కడి వేష, భాషలు సంప్రదాయాలు తెలుస్తుంటాయి. మన దేశంలోనే పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలు తెలుస్తాయి. వాటిలో ఆచరించదగ్గ మంచి విషయాలుంటాయి. మీకు డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? ప్రణీత: ఒక్క పౌరాణిక పాత్రైనా చేయాలని ఉంది. ఆ పాత్రలకు వేసే కాస్ట్యూమ్స్ అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఆ సినిమాల్లో వచ్చే గ్రాఫిక్స్‌కి థ్రిల్ అయిపోతుంటాను. అరుంధతి, మగధీర చిత్రాలను ఎగ్జయిట్‌మెంట్‌తో చూశాను. సేవా కార్యక్రమల సంగతేంటి? ప్రణీత: కచ్చితంగా చేస్తాను. దానికోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టాను. ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి నాకు కుదిరినంతవరకూ సేవా కార్యక్రమాలు చేయాలని ఉంది. -
ఇలాగైతే ఎలా పాసవుతారు..!
భీమిని, న్యూస్‌లైన్ : బోధన తీరు ఇలా ఉంటే విద్యార్థులు ఎలా పాస్ అవుతారని ఉపాధ్యాయుల వైఖరిపై జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇద్దరు ఉపాధ్యాయులు సెలవులో ఉండగా విధులకు హాజరైన ఉపాధ్యాయులు శ్రీనివాస్, ప్రణీతలు సిలబస్ పూర్తి చేయకపోవడంపై డీఈవో మండిపడ్డారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఈ నెలాఖరులోగా పాఠ్యంశాలు పూర్తి చేయాలని సూచించారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ప్రమోద్ రెండు రోజుల నుంచి పాఠశాలకు రాకపోవడంతో అతడి రెండు రోజుల వేతనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పదో తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడగగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల ఆవరణలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ఆర్వీఎం అధికారులతో మాట్లాడి పనులు వెంటనే పునఃప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మార్సీలోని రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంఈవో శంకర్ ఉన్నారు. -
విదేశీ భామలా..
నటి ప్రణీత మోడ్రన్ భామనే. అయితే పాశ్చాత్య దేశాల భామలంత స్టైలిష్ అమ్మాయి కాదట. ప్రస్తుతం అలా మారే ప్రయత్నం చేసిందట. టాలీవుడ్లో అత్తారింటికి దారేది చిత్రంతో మంచి పాపులారిటీని పొందిన ఈ అమ్మడు తమిళంలోను శకుని లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. అయినా అంతగా పేరు పొందలేదు. అత్తారింటికి దారేది చిత్రం ఈమెకోదారి చూపిస్తుందని ఆశించింది. అయితే ఈ బ్యూటీ ఆశ ఫలించలేదు. దీంతో మళ్లీ మాతృ భాష కన్నడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం అక్క డ ఉపేంద్ర సరసన బ్రహ్మ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ మలేషియాలో నివశించే కన్నడ భామ పాత్రను పోషిస్తోందట. ప్రణీత మాట్లాడుతూ తన తల్లిదండ్రులు వైద్యులని చెప్పింది. తనను డాక్టర్ గానో, ఇంజనీర్‌గానో చూడాలని ఆశపడ్డారని చెప్పింది. అయితే విధి తనను నటిని చేసిందని పేర్కొంది. పొరికి చిత్ర యూనిట్ తనను నటిగా పరిచయం చేయడానికి తన తల్లిదండ్రుల అనుమతి కోరిందని చెప్పింది. అలా నటిగా మారినట్లు చెప్పింది. ప్రస్తుతం కన్నడంలో ఉపేంద్ర సరసన విదేశాల్లో పెరిగిన భారతీయ యువతిగా నటిస్తున్నానని తెలిపింది. ఈ పాత్ర కోసం షూటింగ్‌కు ముందే మలేషియా వెళ్లి వారి నడవడికలను గమనించి బ్రహ్మ చిత్రంలో విదేశీ వనితగా జీవిస్తున్నట్లు పేర్కొంది. -
భీమవరంలో సందడి చేసిన ప్రణిత