
బ్యాట్ పట్టిన ‘బాపూ బొమ్మ’....
బొంగరాళ్లాంటి కళ్లు తిప్పడమే కాదు సుతిమెత్తని చేతులతో బ్యాట్ పట్టగలనంటోంది ఈ బాపూ బొమ్మ. తన అందచందాలతో టాలీవుడ్, శాండల్‌వుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న అందాల నటి ప్రణీత సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. జర్నలిస్ట్‌లు, ట్రాఫిక్ పోలీసుల నడుమ ఏర్పాటు చేసిన ఎస్.సుబ్బరాయలు నాయుడు మెమోరియల్ క్రికెట్ మ్యాచ్‌ను ఆదివారమిక్కడి కాక్స్‌టౌన్‌లోని మైదానంలో నటి ప్రణీత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణీత కాసేపు క్రికెట్ ఆడి అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమంలో నటి తార, సమాజ సేవకులు ఎన్.ఎస్.రవి పాల్గొన్నారు.
- సాక్షి, బెంగళూరు