నలుగురు నాయికలతో అధర్వ రొమాన్స్‌ | Regina, Aishwarya ,Pranitha and Anandhi to act in Atharvaa's next | Sakshi
Sakshi News home page

నలుగురు నాయికలతో అధర్వ రొమాన్స్‌

Published Tue, May 16 2017 3:29 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

నలుగురు నాయికలతో అధర్వ రొమాన్స్‌

నలుగురు నాయికలతో అధర్వ రొమాన్స్‌

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు కథానాయికలతో రొమాన్స్‌ చేస్తూ వస్తున్నారు యువ నటుడు అధర్వ. ఈటీ, కణిదన్‌ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత అధర్వ కథా నాయకుడిగా నటిస్తున్న చిత్రం జెమినీగణేశనుం సురుళిరాజానుం. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అమ్మాక్రియేషన్స్‌ టీ. శివ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈయన సంస్థకు ఇది జూబ్లీ చిత్రం అవుతుంది. ఇందులో అధర్వకు జంటగా నటి ఐశ్వర్యారాజేశ్, రెజీనా, ప్రణీత, అతిథి ఇలా నలుగురు బ్యూటీస్‌ నటిస్తున్నారు.

 కథ డిమాండ్‌ మేరకే నలుగురు కథానాయికలను ఎంచుకున్నామన్నారు దర్శకుడు ఓడం ఇళవరసు. చిత్రంలో ఈయనే హీరో, వీళ్లే హీరోయిన్లు, వీళ్లే కమెడియన్లు అన్నదేమీ ఉండదని.. వారి వారి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. రొమాం టిక్‌ కామెడీ కథా చిత్రంలో నటించాలన్న అధర్వ కోరిక ఈ చిత్రంతో తీరనుందని చెప్పారు. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తునట్లు తెలిపారు. ఈ చిత్రానికి డీ.ఇమాన్‌ సంగీతం, శ్రీసరవణన్‌ ఛాయాగ్రాహణం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement