
మంచు హీరోకి అక్కినేని వారసుడి గిఫ్ట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కనపెట్టి కలిసిపోతున్నారు. స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలు, ఫ్యూచర్లో తమకు పోటీ వస్తారన్న ఆలోచన ఉన్నవారితో కూడా ఎంతో స్నేహంగా ఉంటున్నారు. అదే బాటలో యంగ్ హీరో అఖిల్, మంచు వారబ్బాయికి గిఫ్ట్ ఇచ్చాడు. మంచు హీరో మనోజ్, ప్రణీత దంపతుల తొలి మ్యారేజ్ యానివర్సరీకి కానుకగా ఈ గిఫ్ట్ ఇచ్చాడు.
ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ప్రకటించిన మనోజ్, అఖిల్కు థ్యాంక్స్ చెపుతూ గిఫ్ట్ ఫోటోను పోస్ట్ చేశాడు. అమల నటనకే కాదు జంతు ప్రేమకు కూడా వారసుడిగా పెరిగిన అఖిల్ దగ్గర ఎన్నో అరుదైన జాతుల పెట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటైన అలస్కన్ మాలామ్యూట్ను మనోజ్ దంపతులకు ప్రెజెంట్ చేశాడు. నీలి కళ్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ బుజ్జి కుక్కపిల్లను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపిన మనోజ్ దానికి జోయా అని పేరు పెట్టుకున్నాడు.
New addition to our family :) pl welcome Zoya:) I thank @AkhilAkkineni8 for gifting us 'Zoya' for our anniversary:) pic.twitter.com/EoUcFtEBt1
— Manchu Manoj (@HeroManoj1) 5 June 2016
Zoya is Blue eyed Alaskan Malamute pic.twitter.com/agTTJGbe6d
— Manchu Manoj (@HeroManoj1) 5 June 2016